ఇప్పటికే మండలిలో జరిగిన పరిణామాల పై, వైసీపీ ప్రభుత్వం కిందా మీదా పడుతుంది. తన మాట వినని మండలిని రద్దు చేస్తాను అంటూ, జగన్ ఇప్పటికే చెప్పారు కూడా. మూడు రాజధానుల బిల్లు, సెలెక్ట్ కమిటీకి వెళ్ళటంతో, ఈ ప్రక్రియ మూడు నెలలు అవుతుందని, అయితే అంతకంటే ముందుగానే, ఈ రిపోర్ట్ తెప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. అయితే, ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాసం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు కమిటీకి పంపటం కూడా పూర్తీ కాలేదు. అక్కడ నుంచి కమిటీ వెయ్యాలి. అక్కడ నుంచి మూడు నెలలు పట్టే అవకాసం ఉంది. దీని పై నిన్న మండలి చైర్మెన్ మాట్లాడారు. మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపడం సాంకేతికంగా పూర్తి కాలేదని మండలి చైర్మన్‌షరీఫ్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ మధ్యలోనే నిల్చిపోయిందన్నారు. ప్రక్రియ పూర్తయితేనే బిల్లులు సెలక్ట్ కమిటీకి చేరతాయన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో షరీఫ్ పర్యటించారు. తణుకులో తనను కలసిన విలేకరులతో మాట్లాడారు.

chairman 2401220 2

మండలి రద్దు దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వ్యాఖ్యానించేందుకు షరీఫ్ నిరాకరించారు. అది ప్రభుత్వ ఇష్టమంటూ పేర్కొన్నారు. అలాగే బుధవారం మండలిలో చర్చ సందర్భంగా కొందరు మంత్రులు తనపై దుర్భాషలాడారంటూ వస్తున్న వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. ఎవరెవరో ఏదేదో అన్నారు.. అయితే ఎవరేం అన్నారో తనకు తెలీదన్నారు. సహజంగా ఉద్రేకపడ్డ సమయంలో కోపమొస్తుంది.. అలాంటి సమయంలో కొన్ని పదాలు నోటినుండి వెలువడతాయి. అంతమాత్రాన వాటిని ఉద్దేశపూర్వకంగా వినియోగించినట్లు కాదంటూ పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై తాను వ్యాఖ్యానించేది లేదన్నారు. బిల్లుల్లో కొన్ని పొరపాట్లున్నందున పరిశీలించాల్సిందిగా కోరేందుకే సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

chairman 2401220 3

ఇందుకు తన విచక్షణాధికారాన్ని వినియోగించానన్నారు. అయితే సాంకేతికంగా ప్రక్రియ పూర్తికాలేదన్నారు. నరసాపురంలో సత్కారం.. ఓ ప్రవేటు కార్యక్ర మంలో పాల్గొనేందుకు గురువారం నరసాపురం పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ను అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు సత్కరించారు. స్థానిక మున్సిపల్ అతిథిగృహంలో మండలి చైర్మన్ షరీఫ్ ను నాయకులు పూలమాలలతో ముంచెత్తారు. ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల అభీష్టానికి ఆశలకు విలువ నివ్వడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మండలి చైర్మన్ షరీఫ్ ధర్మానికి బాసటగా నిలిచారని కొని యాడారు. కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు కొప్పాడ రవి, ఆరేటి మృత్యుంజయ, నెక్కంటి క్రాంతికుమార్, బొమ్మిడి రవిశ్రీనివాస్, పొన్నాల నాగబాబు, కొల్లు పెద్దిరాజు, కాగిత వెంకటేశ్వరరావు, భూపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

జగన్ మోహన్ రెడ్డికి ఒక పక్క మూడు రాజధానుల విషయంలో, అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఈ ప్రకటన చేసిన తరువాత, ప్రజల్లో పెద్దగా రెస్పాన్స్ రాక పోగా, అమరావతిలో ఎదురు తిరిగారు. ఇక శాసనమండలిలో దెబ్బ, నిన్న హైకోర్ట్ లో దెబ్బతో జగన్ చికాకుగా ఉన్న సమయంలో, ఇప్పుడు మరో టెన్షన్ పట్టుకుంది. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈడీ కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై, ఈ రోజు కీలక తీర్పు ఇవ్వనుంది కోర్ట్. ఈ కేసు పై ఈ నెల 10వ తేదీన వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు ఏమి వస్తుంది అనే దాని పై అంతటా ఉత్కంట నెలకొంది. తీర్పు పై వైసీపీ వర్గాల్లో కూడా ఉత్కంట నెలకొంది. జగన్ కు, కోర్ట్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తుందా, లేదా హాజరు కావలసిందే అని కోర్ట్ చెప్తుందా అనే దాని పై, వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే, ఈడీ సిబిఐ కేసులను రెండూ కలిపి ఒకేసారి విచారిచాలన్న జగన్ పిటీషన్ ను ఇప్పటికే సిబిఐ కోర్ట్ కొట్టివేసింది. అందుకే ఈ రోజు తీర్పు ఎలా ఉంటుందో అనే దాని పై, టెన్షన్ పడుతున్నాయి వైసీపీ శ్రేణులు.

ed 24012020 1

మరో పక్క ఈ నెల 3న తన అక్రమ ఆస్తుల కేసులో జగన్ ఆబ్సేంట్ పిటీషన్ వేసారు. దీని పై సిబిఐ కోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ఏడాది మార్చ్ నుంచి ఒక్కసారి కూడా, ఒక్క శుక్రవారం కూడా విచారణకు రాలేదని, కేసు దర్యాప్తులో పురోగతి ఎలా ఉంటుందని కోర్ట్ ప్రశ్నించింది. తదుపరి వాయిదాకు కచ్చితంగా రావాల్సిందే అని చెప్పింది. దీంతో, ఈ నెల 10న, వ్యక్తిగతంగా విచారణకు జగన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో, ఇలా కేసుల్లో కోర్ట్ కు వెళ్ళటం, ఏపిలో మొదటి సారి. ఉమ్మడి ఏపిలో కూడా ఎప్పుడూ ఇలా జరగలేదు. ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డితో కలిసి, జగన్ మోహన్ రెడ్డి, 10న కోర్ట్ కు హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు, ఆయన కోర్ట్ లోనే ఉన్నారు.

ed 24012020 1

ఇక నుంచి తాను కోర్ట్ కి రాలేనని, తన స్థానంలో సహా నిందితుడు కోర్ట్ కు హాజరవుతారని, పిటీషన్ దాఖలు చేసారు. తన హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మరో రెండు పిటీషన్లు దాఖలు చేసారు. అన్ని చార్జ్ షీట్లు కలిపి విచారించాలని ఒకటి, ఈడీ, సిబిఐ కేసులు రెండూ కలిపి ఒకేసారి విచారించాలని. అయితే ఈ రెండు పిటీషన్లను కోర్ట్ గత వారం కొట్టేసింది. మరో వైపు ఈడీ కేసుల్లో, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, ఈ నెల 10న వేసిన పిటీషన్ పై, ఈ రోజు తీర్పు రానుంది. ఒక వేళ, తీర్పు జగన్ కు వ్యతిరేకంగా వస్తే, ఈడీ కేసులో కూడా, జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో, కోర్ట్ కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే, ముఖ్యమంత్రి హోదాలో, అక్రమ ఆస్తుల కేసులో, సిబిఐ కోర్ట్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం. దేవాల‌యంలాంటి శాస‌న‌మండ‌లిలో ప్ర‌జాస్వామ్యానికే మాయ‌నిమ‌చ్చ‌లా వ్య‌వ‌హ‌రించిన వైకాపా ప్ర‌భుత్వం తీరు, గూండాల్లా దాడి చేసిన మంత్రుల వ్య‌వ‌హార‌శైలిని ప్ర‌పంచం ముందుకుతెచ్చేందుకు ఒక బాధ్య‌త‌ కలిగిన శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా ఈ బ‌హిరంగ‌లేఖ విడుద‌ల చేస్తున్నాను. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిలో వైకాపా వ్యవహరిస్తున్న తీరు మీరు చూసే ఉంటారు. 2014 రాష్ట్ర విభ‌జ‌న‌ను ఎంత అప్ర‌జాస్వామికంగా, నిరంకుశంగా పార్ల‌మెంటు త‌లుపులు మూసి,లైవ్ టెలికాస్ట్ ఆపివేసి,ఏపీ ఎంపీల‌పై దాడిచేసి మూక‌బ‌లంతో బిల్లు తెచ్చారో! అదేవిధ‌మైన దారుణ ప‌రిస్థితులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో చోటుచేసుకున్నాయి. ఇటువంటి దౌర్జ‌న్య‌క‌ర సంఘ‌ట‌న‌ల‌కు పాల‌క‌ప‌క్షం పాల్ప‌డ‌టం ప్ర‌జాస్వామ్యానికి చీక‌టిరోజు. మండ‌లిలో స‌భ్యులు కాని మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల‌పై దాడుల‌కు దిగారు. మండ‌లి ప్ర‌త్య‌క్ష ప్రసారాలు నిలిపేశారు. ఇంట‌ర్‌నెట్ సేవ‌లు ఆపేశారు. క‌రెంటు క‌ట్ చేశారు. ఇటువంటి స‌మ‌యంలో గౌర‌వ అధ్య‌క్ష‌స్థానంలో ఉన్న ష‌రీఫ్ గారి వైపు ఒక్క‌సారిగా వైకాపాకి చెందిన మంత్రులు,ఎమ్మెల్సీలు దూసుకొచ్చారు. చైర్‌ని చుట్టుముట్టారు. చైర్మ‌న్ ని అంతుచూస్తామ‌ని బెదిరించారు. ఇతర టీడీపీ స‌భ్యుల‌పైనా మూకుమ్మ‌డిగా దాడి చేస్తున్నారు. మండ‌లి స‌భ్యుడిగా ఫోన్‌లో ఎటువంటి వీడియోలు చిత్రీక‌రించ‌కూడ‌దు. కానీ వైకాపా మంత్రులు త‌మ పంతం నెగ్గించుకునేందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్తాం అంటూ హెచ్చ‌రిస్తుండ‌టంతో చైర్మ‌న్‌ గారు, ఇతర ఎమ్మెల్సీల భ‌ద్ర‌త కోసం త‌ప్ప‌నిస‌రై వీడియో తీశాను. విలువ‌లు,విశ్వ‌స‌నీయ‌త అంటూ లెక్చ‌ర్లు దంచే సీఎం జ‌గ‌న్‌, వైకాపా మంత్రులు మండ‌లిలో ఎలా ప్ర‌వ‌ర్తించారో ప్ర‌జ‌లు ముందుంచే ప్ర‌య‌త్న‌మే ఇది.

21వ తేదీన మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కాగానే రూల్ 71కింద శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. గంద‌ర‌గోళం సృష్టించింది. ఐదు సార్లు వాయిదా పడ్డ శాసనమండలి సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఆర్డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స శాసనమండలిలో ప్రవేశపెట్టారు. రూల్ 71పై చర్చ ప్రారంభ‌మైంది. మండ‌లి స‌మావేశాలు జ‌రుగుతున్నంత సేపూ వైకాపా మంత్రులు,స‌భ్యులు ప్ర‌వ‌ర్త‌న స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా ఉంది. ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు ఆపేయించారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో టీడీపీ ఎమ్మెల్సీ గిరిజ‌న మ‌హిళ అయిన గుమ్మ‌డి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ గారు డమ్మీ కాన్వాయ్ లో వెళ్లే పరిస్థితి ఎందుకొచ్చింద‌ని అడిగినందుకు 16మంది మంత్రులు ఆమెపై దాడికి ప్ర‌య‌త్నించారు. మ‌హిళ అనే క‌నిక‌రంలేకుండా వ్య‌వ‌హ‌రించారు. స‌భ‌లో మాట్లాడేందుకు య‌త్నించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుద్ధా నాగ‌జ‌గ‌దీశ్వ‌ర‌రావు, అశోక్‌బాబుల గొంతునొక్కేందుకు వైకాపా మంత్రులు, ఎమ్మెల్సీలు మూకుమ్మ‌డిగా మీద‌ప‌డ్డారు. ఇవేనా స‌భావ్య‌వ‌హారాల మంత్రి బుగ్గ‌న గారు ప్ర‌వ‌చించిన విలువ‌లు?తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఛైర్మన్ షరీఫ్ ఓటింగ్ నిర్వహించారు. రూల్ 71 తీర్మానానికి అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11,తటస్థంగా 9 ఓట్లు పడ్డాయి.

22వ తేదీన మండ‌లి స‌మావేశం ప్రారంభం కావ‌డంతోనే సిఆర్డిఏ,మూడు ముక్కల రాజ‌ధానుల బిల్లులు చ‌ర్చ‌ ప్రారంభమైంది. స‌భ‌లోకి 22 మంది మంత్రులు ప్ర‌వేశించి స‌భ్యులపై బెదిరింపుల‌కు దిగారు. ఈ ద‌శ‌లో మండ‌లి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు ఆపేశారు. మండలిలోని ఛాంబర్లలో ఉన్న టీవీల్లో సైతం ప్రసారాలు రాకుండా చేసారు.చైర్మ‌న్ పున‌రుద్ధ‌రించాల‌ని ఆదేశించినా ప్రసారాలు పునరుద్ధరించలేదు.మండ‌లి స‌భ్యుల్ని ప్ర‌లోభ‌పెట్టేందుకు స‌భ్యులు కాక‌పోయినా విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిలు గ్యాల‌రీల్లో ఉండి మంత‌నాలు ప్రారంభించారు. చైర్మ‌న్ రూమ్‌కి చేరిన మంత్రులు ఆయ‌న‌ను బెదిరించేందుకు ప్ర‌య‌త్నించారు. అక్ర‌మాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి మండ‌లిలో స‌భ్యుడు కాక‌పోయినా గ్యాల‌రీలోకి చేరి ప్ర‌లోభాల‌కు గురి చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం నేరం కాదా?ఎవ‌రినీ ప్ర‌లోభాల‌కు గురిచేయ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ల‌కు లోబ‌డి విజయసాయి రెడ్డి కి బెయిల్ ఇచ్చారు,ఆయ‌న మండ‌లిలో బేర‌సారాలు సాగించ‌డం ప్ర‌జాస్వామ్య‌మా? ధ‌నస్వామ్య‌మా?మూడు ముక్కల రాజధాని పై చర్చ పూర్తయిన తరువాత బిల్లు ని సెలెక్ట్ కమిటీకి పంపాలని మేము డిమాండ్ చేసాం.దానికి వైకాపా మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసారు.చైర్మ‌న్ ఇరు పక్షాలను పిలిచి త‌న చాంబ‌ర్‌లో మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి క్లారిఫికేష‌న్ ఇస్తుండ‌గా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆయ‌న‌పై దాడి చేశారు. ఆ త‌రువాత మండలి చైర్మ‌న్ రోజంతా జరిగిన పరిణామాలు వివరిస్తున్న సందర్భంలో వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి కాగితాలు చించేసి విసిరేశారు. చైర్మ‌న్ ముందున్న టేబుల్‌పైకి ఎక్కిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అక్క‌డ్నించే వేలు చూపిస్తూ చైర్మ‌న్ ష‌రీఫ్‌ని బెదిరించారు .చైర్మ‌న్ సీటు ముందున్న ఓ కుర్చీ ఎక్కిన మంత్రి కొడాలి నాని నేరుగా చైర్మ‌న్‌నే దుర్భాష‌లాడారు.

త‌న విచ‌క్ష‌ణాధికారం ఉప‌యోగించి బిల్లుల‌ను సెలెక్ట్ క‌మిటీకి పంపిస్తున్నట్టు ప్ర‌క‌టించి స‌భ‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించిన‌ చైర్మ‌న్ త‌న చాంబ‌ర్కు వెళ్లిపోతుండ‌గా అస‌భ్య‌ప‌ద‌జాలంతో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ష‌రీఫ్ గారిని దూషించారు. మ‌తం పేరును ఉచ్ఛ‌రిస్తూ..ఆయ‌న‌ని కించ‌ప‌రచ‌డం రాజ్యాంగాన్ని అగౌర‌వ‌ప‌ర‌చ‌డ‌మే. ముస్లిం మైనారిటీ వ‌ర్గానికి చెందిన ష‌రీఫ్ మ‌చ్చ‌లేని మ‌నిషి. ఇన్నేళ్ల త‌న రాజ‌కీయ జీవితంలోనూ,మండ‌లి చైర్మ‌న్ గానూ ప‌రుషంగా మాట్లాడిన సంద‌ర్భం లేదు. అటువంటి స‌మున్న‌తమైన వ్య‌క్తిని ప‌ట్టుకుని దుర్భాష‌లాడ‌టం న‌న్ను తీవ్రంగా బాధించింది. మూడేళ్లుగా శాస‌న‌మండ‌లిలో ఉన్నాను. ఏ ఒక్క‌రోజు చైర్మ‌న్‌ని, స‌భ్యుల్ని ఎవ్వ‌రూ దూషించ‌డం జ‌ర‌గ‌లేదు. వైకాపా రౌడీ రాజ‌కీయాలు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ మండ‌లి చ‌రిత్ర‌లో చీక‌టి అధ్యాయంగా నిలిచాయి. వైకాపా వాళ్ల చిన్న‌బుద్ధితో పెద్ద‌ల స‌భ అయిన మండ‌లి గౌరవాన్ని మంట‌గ‌లిపేశారు. మార్ష‌ల్స్ ర‌క్ష‌ణ‌గా నిలవ‌క‌పోతే చైర్మ‌న్ గారికి ర‌క్ష‌ణ కూడా ప్ర‌శ్నార్థ‌క‌మైన ప‌రిస్థితి. త‌న నిరంకుశ నిర్ణ‌యాలు ఒప్పుకోని మండ‌లి చైర్మ‌న్‌పై దాడి చేయ‌డానికి వెనుకాడ‌ని జ‌గ‌న్‌, మూడుముక్క‌ల రాజ‌ధాని బిల్లుని సెలెక్ట్ క‌మిటీకి పంప‌డాన్ని జీర్ణించుకోలేక శాస‌న‌మండ‌లి ర‌ద్దుకు తెగ‌బ‌డ‌టం రాజ్యాంగాన్ని ఖూనీ చేయ‌డ‌మే.రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ పేరుతో విద్వేషాలు రెచ్చ‌గొడుతున్న జ‌గ‌న్..బిల్లు ప్ర‌జాభిప్రాయానికి వెళితే ఎందుకు ఉలికి ప‌డుతున్నారో ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాలి.కులం,మ‌తం,ప్రాంతం పేరుతో విభ‌జించి పాలించే ఎత్తుగ‌డే త‌ప్పించి..ఇందులో ఎటువంటి అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ లేద‌ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి. రాష్ట్రాన్ని ముక్క‌లు చేస్తూ, ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్న వైకాపా ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రిపై ప్ర‌జ‌లంతా ఐక‌మ‌త్య‌మై ఉద్య‌మించాలి. ఇట్లు, మీ నారా లోకేష్, ఎమ్మెల్సీ

వైసీపీనేతలు, మంత్రులు నిజంగా వారి తల్లిదండ్రులకే పుట్టిఉంటే, ఎలాంటి ఆంక్షలు, పోలీసుబందోబస్తు, కర్ఫ్యూలులేకుండా, మీడియాను అనుమతించి రాజధాని తరలింపు, సీఆర్డీఏ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిపితే వారి సత్తా ఏంటో తెలిసేదని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ మండిపడ్డారు. గురువారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్పీకర్‌గా తమ్మినేని పనికిరాడని, కోపంతో లేచివెళ్లిపోయే వ్యక్తికి ఆస్థానంలో కూర్చునే అర్హత లేదన్నారు. పదిమంది ఎమ్మెల్యేలు తనవద్దకు వస్తే, తట్టుకోలేకపోతున్నాడని, 22మంది మంత్రులు తనను చుట్టుముట్టినా మండలిఛైర్మన్‌ షరీఫ్‌ ఎక్కడా తొణకలేదన్నారు. 5 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్పప్పుడు సౌతాఫ్రికా వెళ్తాము.. సిలోన్‌ వెళ్తామని చెప్పకుండా, ఇప్పుడు అమరావతిలో తమకు అవసరమైన మేతలేనందున విశాఖకు వెళ్లడానికి సిద్ధమయ్యారని జలీల్‌ఖాన్‌ ఎద్దేవాచేశారు. స్టీల్‌ప్లాంట్‌, పోర్టు, విమానాశ్రయం, ఇతర సంస్థలు, కేంద్రప్రభుత్వ సంస్థలు ఉన్న విశాఖను జగన్‌ కొత్తగా అభివృద్ధి చేసేదేమీలేదన్నారు. విశాఖపట్నంలో రెండేరోడ్లున్నాయని, అక్కడంతా ఉప్పునీరుని, రైల్వేలైన్లు కూడా రెండే ఉన్నాయన్నారు.

విశాఖలో కొన్నివేల ఎకరాలున్నాయని, అమరావతిలో అమ్ముకోవడానికి ఏమీదొరక్కే అటుపరుగులు పెడుతున్నారని టీడీపీ నేత ఎద్దేవాచేశారు. పెద్దాయన అనే గౌరవంకూడా లేకుండా మండలిఛైర్మన్‌ను ఉద్దేశించి .. నువ్వు సాయిబుకే పుట్టావా...అని అంటున్న బొత్స, తానెవరికి పుట్టాడో సమాధానం చెప్పాలని జలీల్‌ఖాన్‌ మండిపడ్డారు. ముస్లింల భాషలో బొత్స అంటే అడుక్కునే చిప్ప అనిఅర్థమని, దానికి తగినట్లే బొత్స ప్రవర్తన కూడా ఉందన్నారు. చరిత్రలో, స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలకు ఒకచరిత్ర ఉందని, అలాంటివారిని పట్టుకొని సాయిబు అంటే బట్టలూడదీసి కొడతారని బొత్స గుర్తుంచుకోవాలన్నారు. షరీఫ్‌పై దాడికి యత్నిస్తుంటే తల్లిపాలుతాగినవారిగా చూస్తూ ఊరుకునేదిలేదన్నారు. ముస్లింలుగా ఉన్నవారంతా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని, రాయలసీమలోని ముస్లింలు నేటికి తిండిలేకుండా ఉన్నారంటే, అందుకు రాజశేఖర్‌రెడ్డి కుటుంబమే కారణమన్నా రు. ముస్లింలు ఆత్మాభిమానంతో బతుకుతారు కానీ, జగన్‌లా ఆత్మవంచనచేసుకుంటూ బతకరని జలీల్‌ఖాన్‌ తేల్చిచెప్పారు.

విజయమ్మను విజయ అని పిలిచిన బొత్సకు మంత్రి పదవి ఇచ్చిన జగన్‌కు సిగ్గులేదన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, తెలంగాణ ఇచ్చేయాలని చెప్పిన బొత్స, ఆనాడు తాను ముఖ్యమంత్రి కావాలని పన్నాగం పన్నాడన్నారు. బెజవాడలో, తన నియోజకవర్గంలో తిరిగే పిల్లకాకి, దేవాదాయశాఖ చేస్తూ, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. ఆపిల్లకాకి తనస్థాయికి మించి మాట్లాడితే తగిన శాస్తి చేస్తామన్నారు. గాలిలో గెలిచినవారంతా నాయకులు కాలేరని, పరిస్థితి ఎలా ఉన్నా గెలిచేవాడే నిజమైన నాయకుడన్నారు. ఒక ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, తనకున్న బలమేమిటో జగన్‌ మరోసారి తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో చీకటిరాజ్యం నడుస్తోందని, ఇక వెలుగులు ఎక్కడినుంచి వస్తాయన్నారు. చంద్రబాబు పై నమ్మకంతో 33వేలఎకరాలు ఇవ్వడాన్ని చూసి మోదీకూడా ఆశ్చర్యపోయాడన్నారు. రాష్ట్రానికి కొత్తగా ఆదాయం సమకూరాలని చంద్రబాబు అమరావతి కేంద్రంగా పాలన సాగించారని, దేశవిదేశాల వారిని ఆకర్షించడానికి ఆయన ప్రయత్నం చేశారన్నారు. లోకేశ్‌బాబుని కొట్టడానికి ప్రయత్నించిన వైసీపీమంత్రులకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎన్‌ఆర్సీకి, సీ.ఏ.ఏకి వ్యతిరేకమని చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి, కేరళమాదిరి చట్టసభల్లో ఆదిశగా ఎందుకుచట్టం చేయడంలేదన్నారు.

Advertisements

Latest Articles

Most Read