నిన్న శాసనమండలిలో జరిగిన రణరంగం అందరికీ తెలిసిందే. మండలి చైర్మన్ ను, మతం పేరుతొ, వైసీపీ మంత్రులు బెదిరించారని, బూతులు తిట్టారని, నిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్సీలు బయటకు వచ్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దాని పై చర్చ జరుగుతూ ఉన్న సందర్భంలోనే, ఇప్పుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. టిడిపి నేతలతో, ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకంగా వైసిపి మంత్రులే, కౌన్సిల్ ఛైర్ పర్సన్ షరీఫ్ పై దాడి చేశారని చంద్రబాబు అన్నారు. ముస్లిం సమాజాన్ని అవమానపర్చేలా ఛైర్ పర్సన్ షరీఫ్ పై దుర్భాషలాడారని చంద్రబాబు అన్నారు. అసభ్య పదజాలంతో సభాపతిని అవమానించారని చంద్రబాబు అన్నారు. సాయంత్రం వేళ, నమాజు చేయనీకుండా వైసిపి మంత్రులు అడ్డం పడ్డారని చంద్రబాబు అన్నారు. ముందు మాట్లాడాలి, ఆ తర్వాతే నమాజు గిమాజు అని మంత్రి బొత్స అవహేళన చేశారని చంద్రబాబు ఆరోపించారు. మీకూ పిల్లలు, మనవళ్లు ఉన్నారని గుర్తుంచుకోండని బెదిరించారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు.

tele conf 23012020 2

ఇక అలాగే నిన్న కౌన్సిల్ లో టిడిపి ఎమ్మెల్సీలు అసాధారణంగా పోరాడారని చంద్రబాబు అభినందించారు. ధర్మాన్ని కాపాడారు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు, ప్రజాస్వామ్యాన్ని బతికించారు అంటూ కితాబు ఇచ్చారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారని అన్నారు. యనమల అనుభవం- పరిజ్ఞానంతో ప్రజాస్వామ్యానికి జీవం పోశారని, అన్నారు. టిడిపి యువ కౌన్సిలర్ల ధైర్యం, తెగువ ప్రశంసనీయం అని చంద్రబాబు మెచ్చుకున్నారు. ముగ్గురు మంత్రులు లోకేష్ పై దౌర్జన్యం చేశారని, ఉన్మాదంతో, రాక్షసత్వంతో పోరాడటానికి సర్వశక్తులూ ఒడ్డాల్సిందేనని అన్నారు. భోజనం లేకున్నా, అనారోగ్యంతో ఉన్నా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారని, ఫరూక్, శత్రుచర్ల అనారోగ్యాన్ని కూడా లేక్క చేయలేదని చంద్రబాబు అన్నారు. ఇక అలాగే అసెంబ్లీలో జరిగిన పరిణామాల పై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. శాంతియుతంగా చేస్తున్న టిడిపి ఎమ్మెల్యేల ఆందోళనను అడ్డుకున్నారని, రింగుదాటి వస్తే బైట పడేయండని సీఎం జగన్ మార్షల్స్ ను ఆదేశించారని, మరి అదే వైసిపి మంత్రులు కౌన్సిల్ లో చేసిందేమిటి..? పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను, వైసిపి ఎమ్మెల్సీలను ఏం చేయాలి..? ప్రజాస్వామ్యాన్ని చెరపట్టాలని వైసిపి చూసిందని చంద్రబాబు అన్నారు.

tele conf 23012020 3

సంఖ్య కాదు ముఖ్యం, స్పూర్తి ముఖ్యం అని రుజువు చేశారని చంద్రబాబు అన్నారు. సభలో వైసిపి ఎన్నో దురాగతాలకు పాల్పడింది. కరెంట్ కట్ చేశారు, ఇంటర్నెట్ బంద్ చేశారు..25మంది మంత్రులు కౌన్సిల్ లోనే తిష్ట వేసి వీరంగం చేశారు, అయినా నిలబడ్డారని చంద్రబాబు అన్నారు. 1984ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చారు, అప్పుడూ ఇలాగే సభలోపల, బయటా పోరాటం చేశాం అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గల్లా జయదేవ్ ను శారీరకంగా మానసికంగా హింసించారు, ఎంపిని 15గంటలు పోలీస్ స్టేషన్లన్నీ తిప్పారు, గోళ్లతో రక్కారు, చొక్కా చించారు,జైలుకు పంపించారు, అర్ధరాత్రి గంటల తరబడి నన్ను, ఎమ్మెల్యేలను పోలీసు వాహనంలో తిప్పారని చంద్రబాబు అన్నారు. "ఉద్యమకారులుగా ఉన్నతాశయంతో పోరాడుతున్నారు. చరిత్రలో మీ పోరాటం మిగిలిపోతుంది, మీ త్యాగాలు వృధా కావు. మీ స్ఫూర్తి కలకాలం చరిత్రలో నిలిచిపోతుంది. చట్ట సభ పోరాటంలో ప్రజా ఆకాంక్షలను టిడిపి నిలబెట్టింది. ఇక ఇప్పుడు అంతా ప్రజల చేతుల్లోనే ఉంది. జెఏసి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. అంబేద్కర్ సాక్షిగా నేడు జరిగే ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. దీనిని ఒక ప్రజావిజయంగా గ్రామగ్రామానా జరపాలి." అని చంద్రబాబు అన్నారు.

గత మూడు రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు, ఎంత ఉత్కంటకు దారి తీసాయో చూసాం. ముందు రోజు అసెంబ్లీలో, రెండు బిల్లు ప్రవేసిన పెట్టి, ఆమోదించిన ప్రభుత్వం, తరువాత రోజు శాసనమండలిలో అక్కడ బిల్ నెగ్గదు అని, మళ్ళీ మూడో రోజు అసెంబ్లీ సమావేశంలో, వెనక్కు వచ్చిన బిల్ ని మళ్ళీ అసెంబ్లీల ఆమోదిస్తే, శాసనమండలితో ఇక పని లేదని వ్యూహం పన్నారు. అయితే మొదటి రోజు సక్సెస్ అయిన ప్రభుత్వం, రెండో రోజు, మూడో రోజు, బోల్తా పడింది. దీని వెనుక చంద్రబాబుకి సహాయం చేసిన వ్యక్తి న్యాయవాది జంధ్యాల రవిశంకర్. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో, చర్చ సందర్భంగా, చంద్రబాబుకి ఇంకా అవకాసం ఇవ్వాలని, ఆయన స్పీచ్ అవ్వలేదు అని చెప్తున్నా, స్పీకర్ మైక్ కట్ చెయ్యటంతో, టిడిపి సభ్యులు ఆందోళన చెయ్యటంతో, వారిని సభ నుంచి సస్పెండ్ చేసారు. అయితే బయటకు వచ్చిన టిడిపి సభ్యులు, అసెంబ్లీ ముట్టడిలో గాయపడిన వారిని పరామర్శించటానికి, మందడం బయలుదేరితే, పోలీసులు వారిని అరెస్ట్ చేసారు.

cbn 23012020 2

అక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేసి, రాత్రి 10 గంటల నుంచి, 12 దాటిన తరువాత కూడా, పోలీస్ వ్యాన్ లో తిప్పుతూనే ఉన్నారు. సరిగ్గా ఇక్కడే చంద్రబాబుకు టైం దొరికింది. తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కు ఫోన్ చేసారు. మండలిలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దాని పై చర్చించారు. వైఎస్ఆర్ హయంలో, ఉమ్మడి శాసనసభకు ఈ లాయర్ న్యాయసలహాదారు. ఇదే అనుభవం ఉపయోగించి, రవి శంకర్, రూల్ 71 గురించి చంద్రబాబుతో చర్చించారు. ఆ రోజు రాత్రి అంతా, ఆ రెండు గంటల పాటు, చంద్రబాబు ఫోన్ లో నుంచి, అందరితో మంతనాలు జరిపి, ఈ రూల్ 71 పై ఒక క్లారిటీకి వచ్చారు. రూల్ 71 తోనే, ఈ ప్రభుత్వానికి బ్రేక్ వెయ్యవచ్చనే అంచనాకు వచ్చారు.

cbn 23012020 3

జంధ్యాల రవిశంకర్ తో ఆ రోజు రాత్రి 30 సార్లుకు పైగా ఫోన్ చేసారని, చివరి ఫోన్ రాత్రి 1:30 కు వచ్చిందని, మళ్ళీ ఉదయం 6 గంటలకే ఫోన్ చేసి, దీని పై ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అయినా అమరావతిని, అక్కడ రైతులని కాపాడాలనే, చంద్రబాబు తపన చూసి, ఆశ్చర్యపోయానని, సాక్షాత్తు జంధ్యాల రవిశంకర్, ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. రూల్ 71 అనేది ఒక చిన్న అస్త్రం మాత్రమే అని, దీని తరువాత ఎలాంటి అస్త్రాలు మేము బయటకు తీస్తామో మీరు చూస్తారని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జంధ్యాల రవిశంకర్ చెప్పిన ఐడియా రూల్ 71 గురించి చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించటం, వ్యూహం పన్నటం, అనూహ్యంగా ఈ దెబ్బతో, ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటం, చివరకు ఇది బ్రేక్ పడటం, వెంట వెంటనే జరిగిపోయాయి.

చట్ట సభల్లో, ఛాలెంజ్ లు విసురుకోవటం చూస్తూ ఉంటాం. ఇది నిరూపించు, అది నిరూపించు, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు ఏమి చేస్తావ్. క్షమాపణ చెప్పు, రాజీనామా చెయ్యి, ఇలా అనేక ఛాలెంజ్ లు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు, మనకు తెలిసిన దాంట్లో, ఇలా రాజకీయ ఛాలెంజ్ చేసి, నిలబడిన వ్యక్తీ ఒకే ఒక్కరు. ఆయనే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయితే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు, అలాగే ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే, ఇప్పుడు కూడా మనం ఇలాంటి ఛాలెంజ్ లు చూస్తూనే ఉన్నాం. మొన్న అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గారు, సున్నా వడ్డీ రుణాల పై ఛాలెంజ్ ఛాలెంజ్ అన్నారు, వెంటనే తెలుగుదేశం పార్టీ డేటాతో రావటంతో, సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు శాసనమండలిలో కూడా ఇలాంటి ఛాలెంజ్ ఒకటి విసిరారు, అధికార పార్టీ నేతలు.

buggana 22012020 1

శాసన మండలిలో, రాజధాని పై చర్చ సందర్భంగా, లోకేష్ మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాజధాని తరలింపు ఒక తుగ్లక్ చర్య అంటూ లోకేష్ తప్పు పట్టారు. ఇప్పటికే అమరావతిలో అనేక భవనాలు కట్టుకున్నామని అన్నారు. సచివాలయం, హైకోర్ట్, రాజ్ భవన్, అసెంబ్లీ, శాసనమండలి, సీఆర్డీఏ ఆఫీస్, డీజీపీ ఆఫీస్, టెక్ టవర్స్, విద్యుత్ సౌదా, ఆర్ అండ్ బీ బిల్డింగ్, దేవాదాయ భవనం, ఇలా అనేక భవనాలు, అనేక కోట్లు పెట్టి ఖర్చు చేసామని, ఇప్పుడు ఈ భవనాలు అన్నీ ఇక్కడ వదిలేసి, మళ్ళీ వైజాగ్ వెళ్లి కొత్త భవనాలు కడతారా అని, చెప్తూ, ఇప్పటికే, నవరత్నాలు అమలు కోసం చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని, ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, లోకేష్ అన్నారు.

buggana 22012020 1

అయితే లోకేష్ చేసిన వ్యాఖ్యల పై మంత్రి బుగ్గన అభ్యంతరం చెప్పారు. అసలు మేము అలాంటి ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదని, ఆ జీవో నెంబర్ ఏమిటో చెప్పాలని, లోకేష్ కి ఛాలెంజ్ చేస్తున్నా అని, జీవో నెంబర్ అయినా చెప్పండి, లేకపోతే క్షమాపణ చెప్పండి అంటూ ఛాలెంజ్ చేసారు. దీని పై, లోకేష్ వెంటనే స్పందించారు. జీవో కాదని, ప్రభుత్వం నుంచి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, ఒక సర్కులర్ అన్ని జిల్లాలకు ఇచ్చారని, ఇందులో, నవరత్నాల కోసం, చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు, హైకోర్ట్ అభ్యంతరం చెప్పని భూములు చెప్పాలని ఉందని, లోకేష్ చదివి విపించి బుగ్గన ఛాలెంజ్ కు సమాధానం చెప్పారు. అయితే, బుగ్గన మాత్రం, జీవో చెప్పాలని అడిగితే, ఇప్పుడు సర్కులర్ అంటున్నారని, అయినా, హైకోర్ట్ అభ్యంతరం చెప్పని భూములు అని ఉంటే, ఇంకా ఏమిటి అంటూ స్పందించారు. అయితే అటు వైపు నుంచి టిడిపి, ఏదైనా, చర్చిలు, మసీదులు, దేవాలయ భూములు అమ్ముకోవచ్చని ఉత్తర్వులు ఉన్నాయి కదా అని చెప్పారు. మొత్తానికి బుగ్గన ఛాలెంజ్ కు లోకేష్ వెంటనే సమాధానం చెప్పారు.

మండలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ,శాసనమండలి పరిసరాల్లో వైఫై ,ఇంటర్ నెట్ కనెక్షన్లు ,టివిలు నిలిపివేతతో, మండల గ్యాలరీలోకి చంద్రబాబు నాయుడు, సహా టిడిపి నేతలు వచ్చారు. శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లుల పై చర్చ జరిగిన తరువాత, బిల్లుని సెలక్ట్ కమిటీకి రిఫర్ చేయాలని టిడిపి పార్టీ పట్టు పట్టింది. అయితే, అది కుదరదు అంటూ, వైసీపీ మంత్రులు నినాదాలు చేసారు. వైసీపీ,టిడిపి సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేసారు. టీడీపీ ఎమ్మెల్సీల వైపు దూసుకెళ్లేందుకు మంత్రి కొడాలి నాని యత్నించటంతో, కొడాలి నాని వైపు దూసుకెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు యత్నించారు. పోడియం వద్దకి చేరుకుని టీడీపీ ,వైసీపీ సభ్యుల నినాదాలు చేసారు. తీవ్ర గందరగోళం మధ్య శాసన మండలి 10 నిమిషాలు వాయిదా పడింది. అయితే అసలు బయటకు లైవ్ ఇవ్వటం లేదని, అసెంబ్లీ లాబీల్లో లైవ్ వస్తుంటే, అది కూడా ఎందుకు ఆపారని ? బలవంతంగా, ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది.

twist 22012020 1

చివరకు టివిలు కూడా ఎందుకు ఆపారు అంటూ, తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకే వీళ్ళు ఏమైనా చేస్తారు అనే ఉద్దేశంతోనే, ఏకంగా చంద్రబాబు నాయుడు కూడా వెళ్లి గ్యాలరీలో కూర్చోవటంతో, వీళ్ళ కుట్రలకు బ్రేక్ పడతాయని, అంత దూకుడుగా వెళ్ళే అవకాసం లేదని, రూల్ ప్రకారమే వెళ్ళే అవకాసం ఉంటుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఉదయం నుంచి బిల్లు పై చర్చ జరిగిన తరువాత, బిల్ పై వోటింగ్ జరపాలని, వైసీపీ మంత్రులు కోరారు. అయితే, ఏకంగా 20కి పైగా మంత్రులు, మండలిలో ఉండటంతో, యనమల అభ్యంతరం చెప్పారు. ఎప్పుడు అసలు మండలికి రాని మంత్రులు, ఇప్పుడు 20 మంది వచ్చారని, వారిని ఇక్కడ నుంచి పంపించాలని, వారికి ఇక్కడ ఓటు హక్కు లేదని, చర్చ అయిపొయింది కాబట్టి, వారిని పంపించేయాలని కోరారు.

twist 22012020 1

అలాగే, ఈ బిల్లుల పై మేము సవరణలు ప్రతిపాదించామని, వీటితో పాటుగా ప్రతిపక్షం కూడా అభ్యంతరం చెబుతోంది కాబట్టి దీన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని యనమల డిమాండ్ చేశారు. అయితే, దీని పై వైసీపీ అభ్యంతరం చెప్పింది. మీరు సవరణలు ఎప్పుడు ఇచ్చారని వైసీపీ ప్రశ్నించటంతో, ఎమ్మెల్సీ అశోక్ బాబు తనకు సవరణలు ఇచ్చినట్టు చైర్మన్ షరీఫ్ వెల్లడించారు. అయితే సవరనలు సభ ముందు పెట్టలేదని, వైసీపీ అభ్యంతరం చెప్పింది. దీని పై తెలుగుదేశం స్పందిస్తూ, నిన్న అంతా 71 మీద చర్చ జరిగిందని, నిన్న సాయంత్రం చైర్మెన్ బిల్లులు పెట్టాం అని చెప్పగానే, సవరణలు ఇచ్చామని చెప్పారు. ఎప్పుడు సవరణలు ఇచ్చినా ఏముంది, అంటూ ప్రశ్నించారు. మా డిమాండ్ సెలెక్ట్ కమిటీకి పంపించాలని, కావాలంటే సభలో వోటింగ్ పెట్టాలని కోరారు. అయితే, ఈ క్రమంలో, వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవటంతో, సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. సెలెక్ట్ కమిటీకి వెళ్తే, దాదాపుగా 3 నెలల పాటు, రాజధాని ప్రక్రియ ఆగిపోనుంది.

Advertisements

Latest Articles

Most Read