గత రెండు రోజులుగా లేని సమస్యని సృష్టించి, కుల గొడవలు రేపాలని చూసిన బులుగు బ్యాచ్ సిగ్గు పడేలా  ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులు స్పందించారు. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి మనవళ్లు చిన్న, బాబాజీ మాట్లాడుతూ, "నందమూరి బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు, మా కుటుంబ సభ్యులకు, నందమూరి వంశానికి, నందమూరి వారసులకు వుండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను, ప్రజలను కోరుకుంటున్నాం." అని అన్నారు.

బాల‌య్య అక్కినేనిని అగౌర‌వ‌ప‌రిచారంటూ సాగుతున్న కాంట్ర‌వ‌ర్సీ పూర్తిగా బులుగు బ్యాచ్ సృష్టి అని స్ప‌ష్ట‌మైంది. అక్కినేనిని తొక్కినేని అన్నార‌నుకుందాం. అక్కినేని కుటుంబం స్పందించాలి. కానీ విచిత్రంగా కాపునాడు నేత‌లు సీనులోకి వ‌చ్చారు. బులుగు బ్యాచ్ సృష్టించిన ఈ కాంట్ర‌వ‌ర్శీని చూస్తుంటే నువ్వునేను సినిమాలో కామెడీ సీను గుర్తొస్తుంది. సునీల్ ని క్లాసురూములో ఓ అమ్మాయి మూసుక్కూర్చోరా పూల‌చొక్కా అంటుంది. సునీల్ బెంచ్ పైకి ఎక్కి ఇక్క‌డెవ‌రో న‌న్ను పూల‌చొక్కా మూసుక్కూర్చోరా అన్నారు. లెక్చ‌ర‌ర్ వ‌చ్చి క్ష‌మాప‌ణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తాడు. సేమ్ ఇదే సీన్ క్రియేట్ చేసిబులుగు బ్యాచ్ న‌వ్వుల పాల‌వుతోంది. మామూలు సంభాష‌ణ‌లో ప్రాస కోసం ప్ర‌య‌త్నించిన బాల‌య్య ఆ రంగారావు అక్కినేని, తొక్కినేని గురించి మాట్లాడుకున్నామ‌నే సంభాష‌ణలో ఎవ్వ‌రికీ ఏ త‌ప్పూ క‌న‌ప‌డ‌టంలేదు. ఒక‌వేళ అక్కినేని కుటుంబం నాగేశ్వ‌ర‌రావుని అక్కినేని గారు అనలేద‌ని, ఆయ‌న పేరు త‌రువాత తొక్కినేని ఎవ‌రంటూ ప్ర‌శ్నించినా అర్థం ఉంది. అస‌లు సంబంధమేలేని కాపునాడు పేరుతో బులుగు బ్యాచ్ చేసిన క‌న్నింగ్ పాలిటిక్స్ న‌వ్వుల‌పాల‌య్యాయి. బాల‌య్య రంగారావు అన్నందుకు లోకేష్ పాద‌యాత్ర ఆపేయాల‌ట‌. ఇంకా న‌యం..బాల‌య్య‌కి పిల్ల‌నిచ్చిన ఎస్ఆర్ఎంటీ వాహ‌నాలు ఆపేయాల‌ని డిమాండ్ చేయ‌లేదు.

వైఎస్ వివేకానంద‌రెడ్డిని అత్యంత దారుణంగా చంపిన కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే బాబాయ్ ని చంపింది అబ్బాయ్‌లేన‌ని ఇన్నాళ్లు వ‌స్తున్న వార్త‌లు వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్ట‌మైపోతుంది. ఈ నేప‌థ్యంలో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్కి మారుపేర‌యిన బులుగు బ్యాచ్ క్యాంప్ అక్కినేని..గిక్కినేని వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌కు తెచ్చింది. వాస్త‌వంగా బాల‌య్య ఓ రైట‌ర్ గురించి చెబుతూ ``ఎప్పుడూ శాస్త్రాలు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని గురించి తొక్కినేని గురించి మాట్లాడుకుంటాం`` అని అన్నారు. ఇందులో త‌ప్పేముంది. డ‌బ్బూ గిబ్బూ, నేరం గీరం, అంటూ మాట్లాడేట‌ప్పుడు ప్రాస‌లు వాడుతాం అదే విధంగా అక్కినేని గిక్కినేని అన్నారు. ఆ రంగారావు గారు అన్నారు. ఇందులో ఎవ‌రిని ఏం అస‌భ్యంగా మాట్లాడార‌ని...నిన్న‌టి నుంచీ బులుగు బ్యాచ్ పెయిడ్ మేథావులు, తెలుగు-సంస్కృతాన్ని పేకాట ఆడేపే ప‌తివ్ర‌త‌లు మీడియా ముందుకి వ‌చ్చి ఒకటే రోదిస్తున్నారు. ఈ వివాదాన్ని చూశాక‌, బాల‌య్య నోట త‌ప్పు మాట రాకుండా వివాదం ఎలా అని చూస్తే...ఇదంతా వైసీపీ శ‌కుని వ్యూహాల్లోంచి సృష్టించిన కాంట్ర‌వ‌ర్సీ అని తేలిపోయింది.

తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త రాష్ట్ర స‌మితిగా కేసీఆర్ ఎందుకు మార్చారో తెలియ‌దు కానీ, ఈ పార్టీ ఏపీలో ప‌నిచేసేది మాత్రం జ‌గ‌న్  వైసీపీకి లాభం చేకూర్చ‌డానికేన‌న్న‌ది మాత్రం స్ప‌ష్ట‌మైందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపుల ఓట్లు కీల‌కంగా మార‌డంతో అవి టిడిపి-జ‌న‌సేనకి ప‌డ‌కుండా చూసే బాధ్య‌త‌ని బీఆర్ఎస్ తీసుకుంద‌ని నిర్ణ‌యాలు తేటతెల్లం చేస్తున్నాయి. కాపులకి టిడిపి ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ తీసేయ‌డం, కాపు కార్పొరేష‌న్ కి నిధులు ఇవ్వ‌క‌పోవ‌డంతో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప‌నిచేసిన కాపులు కూడా దూరం అయ్యారు. ఈ ఓట్లు టిడిపికి వెళ్లినా, జ‌న‌సేన‌కి ప‌డినా చాలా సీట్లు వైసీపీ కోల్పోతుంది. ఈ ప‌రిస్థితి నుంచి వైసీపీని గ‌ట్టెక్కించ‌డానికి కేసీఆర్ బీఆర్ఎస్ ని రంగంలోకి దింపార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. వైసీపీపై కోపంగా వున్న కాపునేత‌లు, ఓట‌ర్లు ఎవ‌రూ టిడిపి, జ‌న‌సేన వైపు వెళ్ల‌కుండా బీఆర్ఎస్లోకి ఆక‌ర్షించ‌డ‌మే కేసీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది. తాజాగా ఏపీ అధ్య‌క్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కాపు నేత‌లు హైదరాబాద్‌లో స‌మావేశం అయ్యారు. టిడిపిలోనే కొన‌సాగుతాన‌ని మొన్న‌నే చంద్ర‌బాబుని క‌లిసొచ్చిన గంటా శ్రీనివాసరావు, బీజేపీ అధిష్టానం తీరుతో గుర్రుగా ఉన్న‌ కన్నా లక్ష్మీనారాయణలు ఈ భేటీలో ఉన్నారు. మ‌రోవైపు కాపు జాతి ప్ర‌ముఖులైన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వంటి వారు ఎలాగూ వైసీపీ కోసం ప‌నిచేసేవారే. మ‌రికొంద‌రిని కూడా బీఆర్ఎస్లో చేర్చాల‌ని కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ మేర‌కు తోట చంద్ర‌శేఖ‌ర్ ఏపీలో కాపు నేత‌ల‌తో మంత‌నాలు సాగిస్తున్నార‌ని స‌మాచారం.

వైఎస్ వివేక కేసు, రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి విచారణ మారగానే, ఒక్కసారిగా స్పీడ్ పెరిగింది. గత కొంత కాలంగా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తుంది అనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రాగానే, ఏపిలో విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల పైన అనేక రకాల ఒత్తిడులు పెట్టారు. అయితే కోర్టు ఆదేశాలు ప్రకారం, ఈ కేసు తెలంగాణాకు బదిలీ అయ్యింది. అప్పటి నుంచి సిబిఐ స్పీడ్ పెంచింది. వెంటనే అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే అవినాష్ రెడ్డి మాత్రం, తనకు సమయం లేదని, అయుదు రోజుల తరువాత వస్తానని చెప్పారు. దీంతో సిబిఐ మళ్ళీ రెండో నోటీసు ఇచ్చింది. అవినాష్ రెడ్డి ఈ నెల 28న విచారణకు కావాలని రెండో నోటీసు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండి సిబిఐ అధికారులు పులివెందుల బయలు దేరి వెళ్లారు. రెండు వాహనాల్లో అవినాష్ రెడ్డి ఇంటికి సిబిఐ అధికారులు వెళ్లారు. అవినాష్ రెడ్డి అక్కడ లేకపోవటంతో, ఎక్కడికి వెళ్ళారో ఆరా తీసారు. అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలు పరిశీలించారు. ఇంకా ఆధికారులు అక్కడే ఉన్నారు. ఏమి జరుగుతుందా అని టెన్షన్ నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read