అమరావతి కోసం 24 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ రోజు అమరావతిలో యుద్ధ వాతవరణం నెలకొంది. ఉద్దండరాయిని పాలెం నుంచి విజయవాడ కనకదుర్గ గుడి వరకు చేపట్టిన మహిళా పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయిని పాలెంలో పూజలు నిర్వహించి పొంగళ్లను నైవేద్యంగా అమ్మవారి గుడికి తీసుకెళ్లాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతు నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు , పాదయాత్రగా వస్తున్న మహిళలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. గ్రామాల ప్రధాన కూడళ్ళలో మూళ్ళ కంచెలు ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతులు బయటకు రాకుండా భారీగా బలగాలు మొహరించారు. దేవుని సెంటిమెంట్ ను పోలీసులు నియంత్రిస్తున్నారంటూ రైతుల మండిపాడ్డారు. అమరావతిలో ఇంత హంగామా జరుగుతుంటే, మరో పక్క అమరావతి జేఏసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గునటానికి, చంద్రబాబు రాజమండ్రి వెళ్లారు.

mahesh 10012020 2

అమరావతి కోసం భూములు ఇచ్చిన, 29 వేల మంది రైతులు ఇంత ఆందోళన చేస్తుంటే, సినీ వర్గానికి చెందిన వారు సపోర్ట్ లేకపోవటం వల్ల, సినీ ఇండస్ట్రీ స్పందించాలి అంటూ, రైతులు కోరుతున్నారు. జేఏసీ కూడా, హీరోలు అందరూ ఉద్యమానికి బలం ఇవ్వాలని కోరారు. అలా ఇవ్వకపోతే, మీ సినిమాలు చూడం అంటూ హుకుం జారీ చేసారు. అయితే ఈ రోజు, జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు, హైదరాబాద్ లోని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఈ ఉద్యమానికి తెలుగుసినీ పరిశ్రమ మొత్తం, మద్దతు ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. అయతే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు.

mahesh 10012020 3

అక్కడ ధర్నా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. మరో పక్క, ఆంధ్రప్రదేశ్ కోసం తెలుగుసినీ పరిశ్రమ కలిసి రావాలని, ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి పిలుపిచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ పై ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ చిన్న చూపు కొనసాగుతూనే ఉంది. గతంలో ప్రత్యెక హోదా సమయంలో కాని, ఇప్పుడు అమరావతి పోరాటంలో కాని, ఎక్కడా వారు మద్దతు ఇవ్వటం లేదు. అదే తెలంగాణాలో అయితే చిన్న సమస్యకు కూడా వారు స్పందిస్తూ ఉంటారు. ఎక్కువ కలెక్షన్ లు వచ్చేది, మన ఆంధ్రప్రదేశ్ నుంచే అయినా, మనలను మాత్రం, పట్టించుకోరు.

జగన్ మోహన్ రెడ్డి పై, యనమల రామకృష్ణుడు ధవజమెత్తారు. "కోర్టుబోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రి ఘనత జగన్మోహన్ రెడ్డిదే. 63ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వల్ల ఏపికి ఇంత చెడ్డపేరు రాలేదు. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న సీఎం కావడం వల్లే ప్రజలకు ఈ కష్టాలు. తనతో పాటు మళ్లీ వైసిపి నేతలను, అధికారులను జైలుకు తీసుకెళ్లడం ఖాయం. వీడియో గేముల్లో ముఖ్యమంత్రి, కోడిపందేలలో మంత్రులు సంబరాలు. ఒకవైపు ఆందోళనలతో రాష్ట్రం మండిపోతోంది. సీఎం, మంత్రులు నీరో చక్రవర్తిని మించిపోయారు. ఆందోళనల్లో ముంచి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. అన్నివర్గాల ప్రజలను నడిరోడ్ల పైకి నెట్టారు. పేదల నోటికాడ ముద్ద లాగేశారు. అన్నా కేంటిన్లు, పండుగ కానుకలు, ఫుడ్ బాస్కెట్ అన్నీ రద్దు చేశారు. కోటి పైగా పేద కుటుంబాలకు ‘‘సంక్రాంతి కానుక’’లు ఎగ్గొట్టారు. క్రైస్తవుడిగా చెప్పుకుంటూ క్రైస్తవుల నోటివద్ద కూడు లాగేశారు. క్రిస్మస్ కానుకలు ఎగ్గొట్టడం క్రైస్తవుడు చేసే పనేనా..? ముస్లింలపై నిజంగా ప్రేమ ఉంటే రంజాన్ తోఫా ఎగ్గొడతారా..? పండుగ కానుకలు ఎగ్గొట్టి పేదలకు రూ.600కోట్ల నష్టం చేశారు. పండుగనాడు పేదలు నెయ్యితో పప్పన్నం తినకుండా చేశారు."

yanamala 10012020 2

"అక్కలు,అమ్మలు,చెల్లెమ్మలంటూ, వాళ్లపైకి పోలీసులను ఉసిగొల్పుతారా..? తెనాలిలో మహిళలపై లాఠీచార్జ్ గర్హనీయం. పండుగనాడు కనక దుర్గమ్మకు సారె అడ్డుకంటారా..? దుర్గగుడికి వెళ్లే మహిళలను అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాం. తుళ్లూరు, మందడం మహిళలపై పోలీసుల తోపులాట గర్హనీయం. విజయవాడలో మహిళలను భయభ్రాంతులు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళా కమిషన్ సుమోటాగా కేసు కట్టినా వైసిపికి సిగ్గులేదు. కార్యకర్తలను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు..? విద్యార్ధులను బైటకు పంపవద్దని కళాశాలలకు నోటీసులు పంపారు. మానవహక్కులను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. ఎస్సీల ఆత్మహత్యలపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి చూపేది కపట ప్రేమ, కార్చేది మొసలి కన్నీళ్లు. వైసిపి ప్రభుత్వ నిర్వాకాలతో భవిష్యత్ తరాలకు విఘాతం. పరిశ్రమలు రాక, ఉపాధి లేక యువతకు తీవ్రం . యువతరమే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి."

yanamala 10012020 3

‘‘అమ్మవడి’’ పేరుతో రూ.7వేల కోట్లు దారిమళ్లించారు. బిసి,ఎస్సీ,ఎస్టీ,మైనారిటి నిధుల్లో కోత పెట్టారు. బలహీన వర్గాల నిధులను ఇతరులకు మళ్లించడం రాజ్యాంగానికే విరుద్దం. నిధుల మళ్లింపు తప్ప అమ్మవడికి కొత్తగా పైసా ఇచ్చింది లేదు. జగనన్న విద్యా వసతి, విద్యా దీవెన అన్నీ బోగస్ పథకాలే. విద్యార్ధుల పాలిట ‘‘కంసమామ’’ గా జగన్ మారారు. ఆ విద్యార్ధులే ‘‘కృష్ణావతారం ఎత్తి కంసమామ’’ భరతం పడతారు. రాజధాని గ్రామాల బిడ్డల పాలిట ‘‘కంసమామ జగన్’’. 60వేల కుటుంబాల బిడ్డల భవిష్యత్తు అంధకారం చేసేవాడు మేనమామ ఎలా అవుతాడు..? రైతులు,మహిళలు,యువతరంతో పెట్టుకున్న ఎవరూ బాగుపడలేదు. దీనికి వైసిపి తప్పకుండా మూల్యం చెల్లిస్తుంది. " అంటూ యనమల ధ్వజమెత్తారు.

మచిలీపట్నం కోనేరు సెంటర్ లో, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో, జరిగిన బహిరంగ సభలో, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. ఈ సందర్భంగా, చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా, ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చుట్టుపక్కల అంతా ఉన్న విద్యుత్, కోనేరు సెంటర్ బహిరంగ సభ ప్రదేశం లో మాత్రమే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వ కుట్రే అని సీపీఐ రామకృష్ణ తప్పుపట్టారు. అయితే చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం పై విమర్శలు చేసారు. ప్రభుత్వం అన్నిటికీ భయపడి పోతుందని అన్నారు. కరెంటు తీస్తే మేము వేల్లిపోతామా అని అన్నారు. సభకు హాజరైన అందరినీ సెల్ ఫోన్లు ఆన్ చేయాలని సూచించారు. కావాలనే కరెంటు తీసారని, మీ సెల్ ఫోన్ వెలుగు చాలని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా, కొంచెం సేపటికి కరెంటు వచ్చింది. అమరావతికి అందరి ఆశీస్సులు ఉన్నాయని, దాన్ని కదిలించే, శక్తి ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. ఇప్పటికి 10 మంది రైతులు చనిపోయినా ఒక్కరు కూడా వచ్చి పరామర్శించలేదని అన్నారు.

cbn 09012020 2

చంద్రబాబు మాట్లాడుతూ, "అమరావతి నుంచి పాలన సాగటానికి అన్ని వసతులు ఉన్నాయి. ఇవాళ ఈనాడు దీనిపై వాస్తవాలు ప్రచురించారు. ఈనాడు ని నమ్మండి కానీ మా సాక్షి నమ్మొద్దని జగనే అసెంబ్లీలో చెప్పాడు. జగన్ వి నవరత్నాలు కాదు అవి నవ గ్రహాలు. రేపే శుక్రవారం, జగన్ ఎక్కడికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ని పవన్ నాయుడు అంటున్న పేర్ని..., నాని రెడ్డి నా. ఇది మన ఉద్యమం, ప్రజా ఉద్యమం. రాజధాని అమరావతి గా కొనసాగేందుకు సాగించే ఉద్యమం. జై అమరావతి జై జై అమరావతి అంటూ గట్టిగా నినదించిన చంద్రబాబు. అమరావతి పోరాటానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలి. ఇది మీ బిడ్డల కోసం చేసే పోరాటం. తమ భవిష్యత్ పోతోందని యువత గ్రహించాలి. రాజధాని మార్పు అంశంపై దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళండి. మళ్లీ మీరు గెలిస్తే మీకు నచ్చిన చోట రాజధాని ని కట్టుకోండి. ప్రజా తీర్పును నేనూ గౌరవిస్తా" అని చంద్రబాబు అన్నారు.

cbn 09012020 3

అంతకు ముందు చంద్రబాబు, విజయవాడ నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం వెళ్లారు. అడుగడుగునా, చంద్రబాబుకి ఘన స్వాగతం లభించింది. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాలతో నిర్మించిన అమరావతి పరిరక్షణ కోసం, కష్టాల్లో వున్న ఆ రైతులు, మహిళలు, కార్మికులు,రైతుకూలీలకు అండగా ఉండేందుకు మచిలీపట్నం వీధుల్లో జోలెపట్టి విరాళాలు సేకరిస్తూ, చంద్రబాబు..జేఏసీ నాయకులు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, ఇతర పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు వీధుల్లో తిరిగారు. భారీ ఎత్తున తరలివచ్చి జేఏసీ పోరాటంలో భాగస్వాములైన అన్నివర్గాల ప్రజలు, వయోభేదం మరిచి వెన్నంటి నిలిచిన చిన్నారులు, వృద్దులు,విద్యార్థులు,మహిళలు.

అమరావతిని, అమరావతికి భూములు ఇచ్చిన రైతులని, వైసీపీ పార్టీ నేతలు ఎలా హేళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అమరావతిని భ్రమరావతి అంటూ జగన్ మోహన్ రెడ్డి అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, అమరావతిని హైమావతి అని ఒకరు, అమరావతిని స్మశానం అని ఒకరు, అమరావతిలో పందులు తిరుగుతాయని ఒకరు, అమరావతి ఎడారి అని ఒకరు, ఇలా ఇష్టం వచ్చినట్టు హేళన చేసారు.ఇక అలాగే, అమరావతి రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అని, ఆడవాళ్ళని ముందు పెట్టి ఉద్యమాలు చేస్తున్నారని, కాస్ట్లీ రైతులు అని, వాళ్ళ చేతిలో ఫోన్ లు ఉన్నాయి, చేతికి వాచీలు ఉన్నాయి, వీళ్ళు రైతులా అని, ఇలా ఇష్టం వచ్చినట్టు హేళన చేస్తున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అయితే, రైతులు బురదలో దొరికేది తినాలి అంటూ, నాలుగు రోజులు కిందట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నా, ఒక్కరు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఇలా చెయ్యకూడదు అని చెప్పగపోగా, ఎదురు రెచ్చగొడుతున్నారు.

posani 09012020 2

ఈ నేపధ్యంలోనే, ఎప్పుడో నాలురు రోజుల క్రిందట పృధ్వీ చేసిన వ్యాఖ్యలను, ఈ రోజు పోసాని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. అది కూడా హడావిడిగా, సాయంత్రం 8 గంటలు దాటిన తరువాత వచ్చి, ఖండించారు. ఇంత హడావిడిగా రాత్రి పూట ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ప్రెస్ మీట్ మొదలు పెట్టటంతోనే, పృధ్వీ రైతులని ఇలా మాట్లాడటం చాలా తప్పు అని, 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం వదులుకున్నారని, రైతులు చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? అని ప్రశ్నించారు. పృధ్వీ వెంటనే రైతులకి క్షమాపణ చెప్పాలని, పోసాని డిమాండ్ చేసారు. పృథ్వీలాంటి వాళ్ల వల్లే, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డిని, గాడు అంటూ అమరావతిలో బూతులు తిడుతున్నారని అన్నారు.

posani 09012020 3

అంతే కాదు, రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అని చెప్తున్న మంత్రుల్ని , ఇతరుల పై కూడా పోసాని ఫైర్ అయ్యారు. మహిళలు రెండు బంగారు గాజులు వేసుకొనేందుకు కూడా అర్హులు కాదా? రైతులంటే అడుక్కుతినే వాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తారా అని అన్నారు. 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఆవేదన అర్ధం చేసుకోకుండా, అక్కడ అంతా ఒకే కులం అంటూ, ఇంకో ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండి పోసాని ఎందుకు ఇలా మాట్లాడారు. 8 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, ఎప్పుడో నాలుగు రోజులు క్రిందట పృధ్వీ చెప్పిన దాన్ని ఖండించటం ఏమిటి ? అంతకు ముందు నెల రోజులు నుంచి, మంత్రులు ఇలా మాట్లాడుతుంటే, పోసాని ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్నలు మాత్రం, వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నిమిషానికి, అమరావతి రైతుల పక్షాన ఎవరు నుంచున్నా అభినందించాల్సిందే.

Advertisements

Latest Articles

Most Read