మాజీ మంత్రి నారా లోకేష్ ని, ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసారు. ముందుగా లోకేష్ గద్దె రామ్మోహన్ చేసిన దీక్ష వద్దకు వెళ్లి, తిరిగి వస్తూ ఉండగా, బెంజ్ సర్కిల్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నేను గుంటూరు పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్పగా, పోలీసులు అటు వెళ్ళటానికి వీలు లేదని చెప్పారు. అయితే తాను ఉండవల్లిలో ఉన్న తన నివాసానికి వెళ్ళిపోతానని చెప్పగా, అటు కూడా వెళ్ళటానికి వీలు లేదని పోలీసులు చెప్పారు. మిమ్మల్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పగా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని లోకేష్ కోరారు. అయినా పోలీసులు వినిపించుకోకుండా, లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ తో పాటుగా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. వీరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే వీరిని ఎటు వైపు తీసుకు వెళ్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. యనమలకుదురు కట్ట మీదుగా, తరలిస్తూ ఉండటంతో, యనమలకుదురు పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారని అందరూ అనుకున్నారు.

totlavallauru 07012020 2

అయితే, అక్కడ కూడా ఆగకుండా పోలీసులు ముందుకు వెళ్ళటంతో, అవనిగడ్డ తీసుకు వెళ్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే, మధ్యలోనే తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు, లోకేష్ తో పాటుగా, రవీంద్రని, రామానాయుడుని తరలించారు. లోకేష్ ని అరెస్ట్ చేసారని తెలుసుకుని, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఇదే సందర్భంలో, వైవీబీ, అనురాధ వచ్చి, స్టేషన్ ముందు ధర్నా చేసారు. దాదపుగా నాలుగు గంటల పాటు, వీరిని పోలీస్ స్టేషన్ లో నే ఉంచారు. మరో పక్క, చుట్టు పక్కల మొత్తం, పల్లెటూరులు కావటంతో, ప్రజలు గంటగంటకు పెరిగి పోతూ ఉండటంతో, అక్కడ పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి వచ్చింది.

totlavallauru 07012020 3

ఇదే సందర్భంలో, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అటు వైపు రావటంతో, ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. ట్రాఫిక్, క్లియర్ చేసి రాక పొకలకు, ఇబ్బంది లేకుండా చూడాలని, పోలీస్ లను పామర్రు ఎమ్మెల్యే అనిల్ ఆదేశించారు. అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉన్న సమయంలో, ఎమ్మెల్యే కావాలనే వచ్చి ఇక్కడ రెచ్చగొడుతున్నారు అంటూ, టిడిపి కార్యకర్తలు నినాదాలు చేసారు. రోడ్డుపై ట్రాక్టర్ టైర్ తగులు పెట్టి, జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు వచ్చిన అనుచరులు, అడ్డుకోబోతో, వైసిపి కార్యకర్తలకు, టిడిపి కార్యకర్తలకు మధ్య బాహా బాహీ జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేసారు. తరువాత పోలీసులు ఎమ్మేల్యేను పంపించేసి, తొట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ నుండి నారా లోకేష్,టిడిపి నాయకులు విడుదల చేసారు. ఎమ్మల్యేలను పంపించి, కావలని వైసీపీ గొడవలకు ప్లాన్ చేస్తుందని, టిటిపి ఆరోపిస్తుంది.

జనవరి ఒకటి రోజున, కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గునకుండా, అమరావతి రైతుల మధ్య, చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి, గడిపిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా, అక్కడ ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకు వచ్చి పోరాడటం చూసిన, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, ఆమె చేతికి ఉన్న గాజుని తీసి, ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. ఇదే స్పూర్తితో, అనేక మంది ఆడవారు, తమ గొలుసులు, చెవి పోగులు, ఉంగరాలు, ఇలా ఒంటి మీద ఉన్న బంగారాన్ని, రాజధాని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారు. అయితే భువనేశ్వరి పై, వైసీపీ నేతలు, అనేక విధాలుగా విమర్శలు చేసారు. ముఖ్యంగా నగిరి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు జుబుక్సాకరంగా ఉన్నాయి కూడా. అయితే భువనేశ్వరి పై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. ఈ రోజు, రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్ష ముగింపు కార్యక్రమానికి వచ్చిన లోకేష్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన తల్లి పై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు.

lokesh 07012020 2

రైతులకు, ముఖ్యంగా మహిళలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చెయ్యటం, మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు, ఇది చూసి, మా తల్లి గారు, ఆ మహిళలు చేస్తున్న ఆందోళనకు, మద్దతుగా, తన చేతి గాజుని విరాళంగా ఇచ్చారు. అయితే, తన తల్లి పై కూడా విమర్శలు చేస్తున్నారని, తన తల్లి రైతులకు సంఘీభావం తెలపటం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. ఏనాడు నా తల్లి రాజకీయాల్లో జోక్యం చేసుకోరని, అలాంటిది నా తల్లిని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని, లోకేష్ అన్నారు. మీ తల్లి గారు విజయలక్ష్మి గురించి, మీ భార్య భారతి గారి గురించి మేము మాట్లాడ లేమా ? మాకు నోరుంది. మేము మాట్లాడగలం. కాని మాకు సంస్కారం అడ్డు వస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళను బయటకు లాగే సంస్కారం మాకు లేదు అంటూ లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

lokesh 07012020 3

ఇక మరో పక్క ఈ రోజు లోకేష్ , ఈ నిరాహార దీక్ష ముగిసిన తరువాత, గుంటూరు పార్టీ ఆఫీస్ కు బయలు దేరగా, బెంజ్ సర్కిల్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. మీరు గుంటూరుకు వెళ్ళటానికి వీలు లేదు, అని చెప్పగా, సరే మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పగా, అలా కూడా కుదరదు, మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం అని పోలీసులు చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి అని అడగగా, ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి, యనమలకుదరు కట్ట మీదుగా, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి లోకేష్ ని, ఎమ్మల్యే నిమ్మల రామానాయుడుని, మాజీ మంత్రి కోల్లు రవీంద్రని అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టరు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సహజంగా మనం రాజకీయ నాయకులు చేసే, నిరసనలు, ఆందోళనలు చూస్తూ ఉంటాం. వారు ఒక అరగంట హడావిడి చేసి, పోలీసులు అరెస్ట్ చెయ్యటంతో, ఆందోళన అక్కడితో అయిపోతుంది. రాజకీయ నాయకులు చేసే ఉద్యమాలు ఇలా ఉంటాయి. అయితే ఈ రోజు అమరావతి రైతులు రహదారి దిగ్బంధం పిలుపిచ్చారు. ఉదయం నుంచి పోలీసులు ఒక వ్యూహం ప్రకారం వ్యవహరించారు. విజయవాడ, గుంటూరులో ఉన్న తెలుగుదేశం నాయకులను బయటకు రాకుండా అరెస్ట్ చేసారు. ఎక్కడికక్కడ వారిని హౌస్ అరెస్ట్ చేసారు. వారిని బయటకు వచ్చే అవకాశమే ఇవ్వలేదు. తెలుగుదేశం నేతలతో పాటుగా, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసారు. అయితే రాజకీయ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తే చాలు, ఉద్యమం ఏమి ఉండదు, రహదారి దిగ్బంధం ఉండదు అని పోలీసులు భావించారు. అయితే, ఇక్కడ జరుగుతుంది మాత్రం, ప్రజా ఉద్యమం. అమరావతి రైతులు, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు, ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.

highway 070120202

రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తే చాలు అనుకున్న పోలీసుల వ్యూహం బెడిసికొట్టింది. 9 గంటలకు ప్రారంభం అయిన రహదారి దిగ్బంధం, చినకాకాని దగ్గర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాదపుగా నాలుగు గంటలుగా కొనసాగుతూనే ఉంది. ఎంత మంది పోలీసులు వచ్చినా, వారిని కొట్టినా, అరెస్ట్ చేసినా, ఇంకా ఇంకా రైతులు వస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే, ఒక వేళ రాజకీయ నాయకులు వచ్చి ఉంటేనే, ఇది చప్ప బడిపోయేది. రాజకీయ ఉద్యమంగా చూసే వారు. ఇప్పుడు ప్రజలు స్వచ్చందంగా రావటం, ఆడవాళ్ళు, పిల్లలు వచ్చి రోడ్డు మీద కూర్చోవటంతో, నాలుగు గంటలుగా కొనసాగుతూనే ఉంది. నాయకులను అరెస్టు చేసి ఇంట్లో ఉంచితే ఉద్యమం ఆగదు అనే భ్రమ లో కనుక ప్రభుత్వం ఉంటే, అది కాదు ఇది ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం అని నిరూపించింది ఈ రోజు జాతీయ రహదారి దిగ్బంధం.

highway 07012020 3

అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి మీద జరిగిన ఘటన, కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే దీని పై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, అదే టైంలో ఒక అరగంట ముందు, మంత్రి ఆదిమూలం సురేష్ అటుగా వచ్చి ఇరుక్కు పోయారు. అయితే, అక్కడ ఉన్న రైతులు, ఆయనకు హెల్మెట్ ఇచ్చి, బైక్ పై పంపించారు. అలాంటి రైతులు, ఎమ్మెల్యే పిన్నెల్లి మీద ఎందుకు దాడి చేస్తారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒక వేల ఇది ఏమన్నా ప్లాన్ ప్రకారం, రాజధాని వ్యతిరేకులు చేసారా అనే అనుమానం కూడా, అక్కడ వారు వ్యక్తం చేస్తున్నారు. వాహాన్ని అడ్డుకుంటం, నిరసన తెలపటం వరకు సరే కాని, కారు పగలు గొట్టింది ఎవరు ? అనే చర్చ స్థానికుల్లో జరుగుతుంది. ఏం జరుగుతోందంటూ అమరావతి జేఏసీ వర్గాల ఆరా తీస్తుంది.

రాజధాని అమరావతి నుంచి తరలిస్తే, అక్కడ భూములు ఇచ్చిన తరువాత, ఇబ్బంది పడితే, సచివాలయ ఉద్యోగులు. ఎందుకంటే, వారు 2014 దాకా హైదరాబాద్ సచివయంలో పని చేసే వారు. రాష్ట్ర విభజన తరువాత, మనం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసుకోవటం, అలాగే సచివాలయం కట్టుకోవటంతో, 2017లో హైదరాబాద్ నుంచి సచివాలయ ఉద్యోగులు అందరూ ఇక్కడకు వచ్చారు. కొంత మంది మాత్రం, ప్రతి రోజు హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. వీరి కోసం స్పెషల్ ట్రైన్ కూడా ఉంది. అదీ కాక, వారి కోరిక మేరకు, 5 రోజులు పని దినాలు కు చంద్రబాబు ఒప్పుకున్నారు. నెమ్మదిగా హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చి, ఇక్కడ ఇళ్ళు కొనుక్కుని, ఇక్కడ పిల్లలను స్కూల్స్ , కాలేజీల్లో చేర్పించి, సచివాలయ ఉద్యోగులు ఇక్కడ అలవాటు పడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో, వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంకు సచివాలయం తరలిపోతుందని, జనవరి 20 నుంచే తరలింపు ప్రక్రియ మొదలు అవుతుందని, నిన్న ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వచ్చాయి.

employees 0712020 2

విడతల వారీగా, విశాఖకు సచివాలయం తరలింపు ఉంటుందని చెప్పారు. అయితే ఈ వార్తలతో, సచివాలయం ఉద్యోగులు అలెర్ట్ అయ్యారు. ఇన్నాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెయ్యటం లేదు, వారికి విశాఖకు వెళ్ళటం ఇష్టమా, లేక ప్రభుత్వానికి భయపడి రావటం లేదా అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇదే విషయన్ని చంద్రబాబు కూడా అన్నారు. ఉద్యోగులు, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, పోరాడాలని అన్నారు. అయితే, నిన్న సచివాలయం తరలింపు పై లీకులు రావటంతో, ఈ రోజు సచివాలయ ఉద్యోగులు అత్యవసర సమావేశం అయ్యారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ లో హాజరు అయ్యి, ఈ సచివాలయ తరలింపు పై చర్చించారు. వీరు కూడా అమరావతి తరలింపు పై మదన పడుతున్నట్టు తెలుస్తుంది.

employees 07120203

సచివాలయంలో ఉద్యోగుల సమావేశం పై, ఉద్యొగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామి రెడ్డి, మీడియాతో మాట్లాడారు. అమరావతి తరలింపు విషయమై, ఉగ్యోగులు కూడా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. రెండేళ్ళ క్రితమే హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చామని, ఇప్పుడు మళ్ళీ విశాఖ అని ప్రభుత్వం చెప్పటంతో, తమకు ఏమి చెయ్యాలో తోచటం లేదని అన్నారు. ఇప్పటికే ఇక్కడ ఇళ్ళు కొనుక్కొని, ఈఎంఐలు కట్టుకుంటున్నామని, పిల్లలను ఇక్కడ స్కూల్స్ లో వేశామని, ఇక్కడ అంతా సెట్ అవుతున్నాం అనుకున్న టైంలో, ఈ వార్తతో తమకు ఏమి అర్ధం కావటం లేదని అన్నారు. ఈ విషయాలు అన్నిటి పై చర్చిస్తున్నామని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాగానే, ఏమి చెయ్యాలి అనే దాని పై అలోచించి, కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read