విజయవాడ బెంజ్ సర్కిల్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వేదిక ఫంక్షన్ హాల్ దగ్గర జేఏసీ మీటింగ్ లో పాల్గున్న చంద్రబాబు, అక్కడ అమరావతి పరిరక్షణ సమితి ఆఫీస్ ని ప్రారంభించారు. అన్ని పార్టీల నాయకులు అక్కడకు చేరుకున్నారు. అయితే అమరావతి పరిరక్షణ కోసం, జేఏసీ ఆధ్వర్యంలో, బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. బస్సు యాత్ర కోసం అందరూ రెడీ అవుతున్న సమయంలో, పోలీసులు వచ్చి బస్సులని ఆపేసారు. పర్మిషన్ లేదని, డీజీపీ పర్మిషన్ ఉంటేనే మేము బస్సులని వాదులుతామని, పోలీసులు చెప్పారు. ఈ రోజు సాయంత్రం నుంచి బస్సులు వదలకుండా, అక్కడ వారిని కూడా అరెస్ట్ చెయ్యటంతో, తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న జేఏసీ నాయకులు, పార్టీల నాయుకులు, బెంజ్ సర్కిల్ నుంచి, బస్సులు ఆపిన ప్రదేశానికి, పాదయాత్రగా బయలు దేరారు. పోలీసులు అక్కడ భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు సహా నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అయితే పోలీసులు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళటానికి వీలు లేదని చెప్పటంతో, చంద్రబాబు, ఇతర పార్టీల నాయకులు బెంజ్ సర్కిల్ లోనే ధర్నాకు కూర్చున్నారు. అసలు అమరావతి పరిరక్షణ సమితి బస్సులు ఎందుకు ఆపరాని ? అక్కడకు మేము పాదయాత్రకు వెళ్తుంటే, మీకు ఇబ్బంది ఏమిటి అని, ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చెయ్యండి అంటూ, చంద్రబాబుతో పాటుగా, మిగతా నేతలు అక్కడే కూర్చున్నారు. బెంజ్ సర్కిల్ కావటంతో, విషయం తెలుసుకున్న ప్రజలు, తెలుగుదేశం నేతలు భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. తమను బస్సులు ఆపిన చోటుకు పంపించాలని అప్పటి వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు అక్కడే కూర్చున్నారు..
చంద్రబాబు మెరుపు ధర్నా చెయ్యటంతో, పోలీసులు ఒక్కసారిగా అవకయ్యారు. ఎక్కవు ఫోర్సు ని తెప్పిస్తున్నారు. సమయం దాడిచే కొద్దీ ప్రజలు వస్తూ ఉండటంతో, అందరినీ ఆపేసి, అక్కడ నాయకులని అరెస్ట్ చేస్తున్నారు. వచ్చిన వారిని వాచినట్టు, అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబుని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బెంజ్ సర్కిల్ కావటంతో, పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రశాంతంగా బస్సు యాత్ర చేసుకుంటుంటే, అది కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ కూర్చోమని, ఆందోళను తీవ్రతరం చేస్తామని, ఎంత మందిని ఆరెస్ట్ చేస్తారో చేసుకోండి అంటూ చంద్రబాబు అక్కడే కూర్చున్నారు.