అమరావతిలో 18 రోజులుగా రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించవద్దు అంటూ, ఆందోళన చేస్తున్న రైతులు, నిన్నటి నుంచి సకల జనుల సమ్మెకు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మందడం గ్రామంలో, మహిళలు రోడ్డుకు అడ్డంగా వచ్చారనే నెపంతో, పోలీసులు, అక్కడ ఉన్న మహిళా రైతులను అరెస్ట్ చేసి, బస్సు ఎక్కించే సందర్భంలో, మహిళల పై పోలీసులు ప్రవర్తించిన తీరుతో, ప్రభుత్వం విమర్శల పాలు అయ్యింది. ప్రశాంతంగా నిరసనలు తెలియచేస్తున్నా, పోలీసులు తమను అరెస్ట్ చెయ్యటం పై, రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. నిన్న పోలీసుల పై, తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో, మహిళలు కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా మందడం లో ఉదయం నుంచి బంద్ వాతావరణం కొనసాగింది. మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి వచ్చిన రైతులు నిరసనలు చేపట్టారు. అయితే నిన్న తమ పై పోలీసులు చేసిన దౌర్జన్యానికి నిరసనగా, ఈ రోజు పోలీసులకు గ్రామస్థుల సహాయ నిరాకరణ చేపట్టారు.

rajadhani 04012020 2

తమ గ్రామంలో మంచినీళ్లు సహా పోలీసులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించరాదని నిర్ణయం తీసుకున్నారు. తమ దుకాణాల ముందు కూర్చొటానికి కూడా వీల్లేదని రైతులు స్పష్టం చేసారు. పోలీసు వాహనాలను అడ్డుకుని తమ గ్రామం మీదుగా వెళ్ళటానికి వీల్లేదని రైతులు వెనక్కి పంపించారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు కూడా రైతులు కాళ్ళ మీద పడి, తమ పనిని తాము చేసుకోనివ్వాలని కోరారు. దుకాణాలు తెరవనీయకుండా సంపూర్ణ బంద్ ను రైతులు పాటిస్తున్నారు. రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలను పూర్తిగా స్థంభింపచేసారు రైతులు. మీరు మాకు సహకరించాలంటే..., మీరు మాకు సహకరించాలంటూ పరస్పరం రైతులు, పోలీసులు కాళ్ళు పట్టుకునే పరిస్థతి వచ్చింది.

rajadhani 04012020 3

ఇది ఇలా ఉంటే, వెలగపూడి గ్రామంలో గత రాత్రి పోలీసుల హల్చల్ చేసారు. 4 జీపుల్లో వచ్చి మమ్మల్ని భయబ్రాంతులకు గురిచేశారని రైతులు వాపోయారు. అర్ధరాత్రి తలుపులు కొట్టి మహిళల్ని భయపెట్టారని, ఇళ్లంతా బూటు కాళ్లతో తొక్కి నానా రచ్ఛా చేశారని రైతులు వాపోయారు. ఒక గ్రామస్థుడ్ని పోలీసులు ఎక్కడికో తీసుకెళ్లారని రైతులు వాపోయారు. ఇంతవరకు అతని ఆచూకీ తెలియటం లేదని రైతులు అన్నారు. పోలీసుల అరాచకాలపై ఫోటోలు, వీడియోలు చూపి కన్నీళ్ల పర్యంతమైయ్యారు రైతులు. మరో పక్క భారీ ర్యాలీ చేపట్టి సీడ్ యాక్సిస్ రహదారిపై బైఠాయించారు మందడం రైతులు. అటు మందడం వైపు, ఇటు సీడ్ యాక్సిస్ వైపు 2రహదారులు దిగ్బంధించారు రైతులు. భారీగా పోలీసులు మోహరించటంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రశాంతంగా సాగుతున్న జీవితాల్లో, ఉన్నట్టు ఉండి అనిశ్చితి నెలకొంది. విభజనకు ముందు ఉన్న, సమ్మెలు, ధర్నాలు, బంద్ లు, అరెస్ట్ లు, ఇప్పుడు మళ్ళీ ప్రతి రోజు చూస్తున్నాం. 2014 ముందు వరకు, ఇలా సాగిన జీవితాలు, మన బ్రతుకు మనం బ్రతుకుతూ, సొంత రాష్ట్రంలో ప్రశాంతంగా బ్రతుకు సాగిస్తున్నాం. అయితే 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, ముందు నుంచి అమరావతి పై ఉన్న అనాసక్తిని, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చూపిస్తున్నారు. 18 రోజుల క్రితం అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ రాజధానికి మూడు రాజధానులు ఉంటే తప్పు ఏమిటి అంటూ, చెప్పుకొచ్చారు. అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుందని, పరిపాలన మొత్తం విశాఖ నుంచి చేస్తామని, హైకోర్ట్ కర్నూల్ లో పెడతామని చెప్పారు. దీంతో అమరావతి కోసం, 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. దీనికి తోడు, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ కూడా, మూడు రాజధానులకు అనుకూలంగా తమ రిపోర్ట్ ఇచ్చారు.

kishanreddy 04012020 2

అయితే గత 18 రోజులుగా, రైతులతో పాటు అన్ని వర్గాల వారు, వారికి సపోర్ట్ గా ఆందోళన చేస్తున్నారు. వివిధ రాజాకీయ పార్టీలు కూడా వారికి సపోర్ట్ గా ఆందోళన చేస్తున్నాయి. అయితే అందరి చూపు బీజేపీ వైపు ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే, ఈ ప్రక్రియ ఆగిపోతుందని అందరి అభిప్రాయం. అయితే కేంద్రం మాత్రం ఇంత వరకు స్పందించలేదు. ఇక్కడ ఏపిలో బీజేపీ నేతలు తలా ఒక మాట చెప్తున్నారు. కన్నా, సుజనా, సహా వివిధ నేతలు అమరావతికి అనుకూలంగా మాట్లాడుతుంటే, జీవీఎల్ వచ్చి నా మాట బీజేపీ అధికారిక మాట అంటూ, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో, కేంద్ర హెం శాఖ సహాయ మంత్రి, కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆసక్తిగా మారాయి. అమిత్ షా కింద, సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి స్పందించటంతో, ఇదేనా కేంద్రం వైఖరి అనే అభిప్రాయం కలుగుతుంది.

kishanreddy 04012020 3

నిన్న కిషన్ రెడ్డి, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, మూడు రాజధానుల పై స్పందించారు. రాజధాని ఎంపిక అనేది, రాష్ట్రం అంశం అయినప్పటికీ, మూడు రాజధానులు కరెక్ట్ కాదని అన్నారు. రాజధానిగా రాష్ట్రం ఏదైనా ఎంపిక చేసుకోవచ్చని, కాని తమ నిర్ణయాన్ని కేంద్రానికి చెప్పిన తరువాత, దాని పై కేంద్రం తమ వైఖరిని చెప్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా చెప్పలేదని, చెప్పిన తరువాత, కేంద్రం దీని పై స్పందిస్తుందని అన్నారు. అలాగే ఏపి బీజేపీలో నేతలు చేస్తున్న భిన్న ప్రకటనలు సరి కవాని కిషన్ రెడ్డి అన్నారు. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని భారత చిత్ర పటంలో తానే పెట్టించినట్లు గుర్తుచేశారు. అలాగే రాజధాని రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కోర్ట్ లు చెప్పాయి, ట్రిబ్యునల్ చెప్పింది, కేంద్రం చెప్పింది, చివరకు జపాన్ లాంటి దేశాలు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మీ దేశంలో కూడా పెట్టుబడి పెట్టం అంటూ కేంద్రానికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా సరే ఏపి ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. చంద్రబాబు హయంలో కుదుర్చుకున్న విధ్యుత్ ఒప్పందాల సమీక్ష పై, ఈ రంగంలోని పెట్టుబడుల పై తీవ్ర ప్రభావం చూపింది. సోలార్, విండ్ ఎనర్జీ పవర్ కోసం, చంద్రబాబు అధిక ధరలతో, వారితో ఒప్పందం కుదుర్చుకున్నారని, దీని వెనుక అవినీతి ఉంది అంటూ, జగన్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దీంతో హైకోర్ట్ కూడా, ఆయా సంస్థలకు, బాకీ పడ్డ సొమ్ము కట్టాలని చెప్పటంతో, ప్రభుత్వం మూడు రోజుల క్రిందట 1200 కోట్లు కట్టింది. ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి, ఆ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు, చెల్లింపులు కూడా ప్రభుత్వం ఆపేయటంతో, ఈ వివాదం కోర్ట్ ల దగ్గరకు వెళ్ళింది. దీంతో కోర్ట్ ఆ కంపెనీలకు అనుకూలంగా చెప్తూ, కేసు వాయిదా వేసింది.

icra 030120203

అయితే ఇప్పుడు ప్రభుత్వ చర్యలతో, దేశానికీ కూడా నష్టం వాటిల్లింది. దేశంలోని సౌర, పవన విద్యుత్‌ రంగానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు, చర్యల వల్ల ఇబ్బంది వచ్చింది. ఈ రంగానికి రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు రేటింగ్‌ సంస్థ ఇక్రా ప్రకటన చేసింది. ఈ రంగం స్థిరంగా ఉందని, గతంలో ప్రకటించిన ఇక్రా, ఇప్పుడు నెగెటివ్‌ రేటింగ్‌ ఇచ్చింది. అయితే ఏపిలో ఉన్న పరిస్థితులు కూడా దీనికి కారణం అని ఆ సంస్థ ప్రకటించింది. రేటింగ్‌ సంస్థలుఅనేక విషయాలు పరిగణలోకి తీసుకుని రేటింగ్ ఇస్తాయి. వచ్చిన ఈ రేటింగ్ ప్రకారమే, కంపేనీలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, లోన్లు ఇచ్చే నిర్ణయం తీసుకొంటాయి. రేటింగ్‌ పడిపోవడంతో ఈ రంగానికి వచ్చే లోన్లు బాగా తగ్గుతాయని, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రంగానికి ఇది మరో ఇబ్బందని చెప్తున్నారు.

icra 03012020 3

ఈ వార్త పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్విట్టర్ లో స్పందించారు. ఇది ఆయన ట్వీట్... "AP’s mismanagement by YS Jagan Mohan Reddy is deeply impacting the country. The ICRA has downgraded the renewable energy sector to negative owing to investors being harassed and non-compliance of renewable PPAs in AP. It is going to get worse from here". జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతకాక తీసుకుంటున్న చర్యలతో, దేశం కూడా నష్టపోతుంది అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. ఇక్రా సంస్థ దేశానికి నెగటివ్ రేటింగ్ ఇవ్వటానికి, ఇది కూడా ఒక కారణం అని, చంద్రబాబు తన ట్వీట్ లో చెప్పారు. ఈ వార్తకు సంబంధించి, ఒక పేపర్ కటింగ్ కు చంద్రబాబు తన ట్వీట్ కు జత పరిచారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలనే అధికారంలోకి వచ్చాకకూడా వైసీపీ చేసిందని, ఆధారాలు లేకుండా సినిమాటిక్‌గా వీడియోలు ప్రదర్శించినంత మాత్రాన అవాస్తవాలు నిజాలుకావని టీడీపీ సీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఆత్మకూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మరోనేత తెనాలిశ్రావణ్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లా డారు. 01-06-2014నుంచి 30-12-2014వరకు కృష్ణా, గుంటూరుజిల్లాల్లో కలిపి దాదాపు 4వేల ఎకరాలు కొన్నారని, అదంతా ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అని వైసీపీచెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సెప్టెంబర్‌-2న శాసనసభలో రాజధానిపై ప్రకటన వచ్చిందని, అక్టోబర్‌-30న జరిగిన కేబినెట్‌సమావేశంలో కృష్ణానది ఒడ్డున రాజధాని వస్తుందని ప్రకటనచేయడం జరిగిందన్నారు. అక్టోబర్‌ తర్వాత జరిగిన భూలావాదేవీలు తీసుకొచ్చి ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అనడం నిరాధారమన్నారు. రాజధాని మార్చాలన్న ఆలోచన తోనే ఇదంతా చేస్తున్నారని ధూళిపాళ్ల తేల్చిచెప్పారు. 2019ఫిబ్రవరిలో జగన్‌ తాడేపల్లిలో గృహప్రవేశం చేశాడని, ఆ ఇంటిని ఎవరిదగ్గర నుంచి కొన్నారో స్పష్టంచేయాలన్నారు. కాంక్రీట్‌ అండ్‌ లైట్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా యజమాని అనిల్‌కుమార్‌రెడ్డని, ఆయననుంచి కొన్నట్లు ఆధారాలున్నాయన్నారు. ఈకంపెనీ తాడేప ల్లి ప్రాంతంలో 2016నుంచి పెద్దఎత్తున భూములు కొన్నదని నరేంద్ర తెలిపారు.

dhulipalla 03012020 1

జగన్‌సతీమణి భారతి, సండూర్‌పవర్‌, హరీశ్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు భూములు కొనుగోలుచేశాయని, ఆరెండు కంపెనీలు సీబీఐవిచారణ ఎదుర్కొంటున్నాయని, ఆయా కంపెనీలవెనుక జగన్‌భార్య భారతి, పీ.రమేశ్‌బాబు ఉన్నారన్నారు. ఆథరైజ్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఈ రమేశ్‌బాబుని తెరపైకి తీసుకొచ్చారన్నారు. భారీఎత్తున భూములుకొన్న కాంక్రీట్‌ అండ్‌ లైట్‌స్టోన్‌ ఇన్‌ఫ్రానుంచి, భారతి, సండూర్‌పవర్‌, హరీశ్‌ఇన్‌ఫ్రా కంపెనీ లు 2016లోనే భూములు కొనుగోలుచేశాయని ధూళిపాళ్ల పేర్కొన్నారు. 2016లోనే వారుకొన్న భూములడాక్కుమెంట్లు 1187,-12896-13,109,-13100-13,35 3,-12,915,-9385 నంబర్లతో ఉన్నాయని, ఇంతకన్నా రుజువేం కావాలని మాజీ ఎమ్మెల్యే నిలదీశారు. ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ బూచినిచూపుతూ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న జగన్‌, ఇతరవైసీపీనేతలు, 2016లోనే రాజధాని ప్రాంతంలో పెద్దఎత్తునభూములు కొన్నారని, అది ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ కిందకు రాదా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ ఉంటున్న ఇల్లు అసెంబ్లీకి కూతవేటుదూరంలోనే ఉందని, ఆఇల్లుఉన్న మూడుఎకరాలు ప్రత్యేకించి జగన్‌కోసమే కొనుగోలుచేసి, భారీభవంతిని నిర్మించి ఆయనకు కానుకగా ఇచ్చారన్నారు.

dhulipalla 03012020 1

భూములుకొని, ఇల్లుకట్టి జగన్‌కు ఇచ్చారంటే, వారుకచ్చితంగా ఆయన బినామీలేనన్నారు. వైసీపీనేతలు చెప్పినట్లు ఈ తతంగమంతా ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ పరిధిలోకి రాదా అన్నారు. తాముకొంటే ఇన్‌సైడ్‌ట్రేడింగ్‌ అంటున్నవారు, తమబినామీలతో పెద్దఎత్తున భూములు కొనడం, భారతి, సండూర్‌పవర్‌, హరీశ్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేర్లతో బదలాయించడం దేనికిందకు వస్తుందన్నారు. వై.ఎస్‌.భారతి ఫిబ్రవరి 8-2019లో భూములుకొన్నదని, మూడేళ్ల క్రితమే జగన్‌కోసం ఇంటినిర్మాణం మొదలైందని, అప్పుడు జరిగిందంతా ఇన్‌సైడ్‌, అవుట్‌సైడో అంబటి, ప్రకాశ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డే స్పష్టంచేయాలన్నారు. ఫిబ్రవరిలో భూమికొని, ఫిబ్రవరిలోనే గృహప్రవేశం చేయడం ఎలా సాధ్యమైందో వారేచెప్పాలన్నారు. టీడీపీనేతలను చూపించి రైతుల్ని బలిపశువుల్ని చేయకుండా, ఏవిచారణకు ఆదేశిస్తారో, దానిపరిధిలోకి భారతిని, సండూర్‌, హరీశ్‌ఇన్‌ఫ్రా కంపెనీల ను చేరుస్తారో లేదో ప్రభుత్వపెద్దలు చెప్పాలని నరేంద్ర డిమాండ్‌ చేశారు. ఇన్‌సైడ్‌ ్‌ట్రేడింగ్‌ అనేది జగన్‌కే సాధ్యమవుతుందన్నారు. కంపెనీలు పెట్టకుండానే రూ.10ల షేరు రూ.350వలకు అమ్మినవ్యక్తిగా ఆయనకే ఆఘనత దక్కుతుందన్నారు. టీడీపీనేతలు నిజంగా తప్పుచేస్తే చట్టప్రకారం చర్యలుతీసుకోవాలని, అదేసమయంలో వైసీపీనేతలు, జగన్‌ బినామీలనుకూడా శిక్షించాలని నరేంద్ర తేల్చిచెప్పారు.

Advertisements

Latest Articles

Most Read