ఉపాధి హామీ పనులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు పై, ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు మండిపడ్డారు. 2019 జూన్ 1 తరువాత ఇచ్చిన ఎఫ్ టివోల కే బిల్లులు చెల్లించాలని పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మెమో ఇవ్వడం గర్హనీయం అని చంద్రబాబు అన్నారు. ఒకవైపు కేంద్రమార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ, మరోవైపు ఆ మార్గదర్శకాలను పాటించి చెల్లించాలని మెమోలో పేర్కొనడం దివాలాకోరుతనం అని, చేసిన పనులకు ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు చెల్లించాల్సివుండగా ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం నరేగా చట్టానికే వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. నరేగా చట్ట స్ఫూర్తికి విరుద్దంగా వైసిపి ప్రభుత్వ ఆదేశాలు ఉండటం పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఇప్పటికే అనేక లేఖలు రాసిన విషయం గుర్తు చేశారు. నరేగా కౌన్సిల్ సభ్యులు ఇప్పటికే కేంద్రమంత్రికి, గవర్నర్ కు, ముఖ్యమంత్రికి, సదరు శాఖా కార్యదర్శి, కమిషనర్లకు అనేక వినతులు పంపడం జరిగిందని అన్నారు.

narega 06012020 2

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయమని, దీనిపై కేంద్రమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించక పోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే 12% వడ్డీతో సహా చెల్లించాలని నరేగా చట్టంలో ఉందని కేంద్రమంత్రి లేఖలో హెచ్చరించినా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బిల్లులు చెల్లించకుండా పనులు చేసినవారిని వేధించడం గతంలో లేదని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్ఫూర్తినే కాలరాసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. గ్రామాల్లో అభివృద్ది పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాని దుస్థితి తెచ్చారని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 5ఏళ్లలో రూ.32వేల కోట్ల పైబడిన నిధులతో గ్రామాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశామని, కానీ వైసిపి ప్రభుత్వం వచ్చాక గత 7నెలలుగా ఈ పనులన్నీ స్థంభించాయిని చంద్రబాబు అన్నారు.

narega 060120203

ఏడాదికి రూ.7వేల కోట్ల చొప్పున గత 5ఏళ్లలో పనులు జరగ్గా ఈ ఏడాది అందులో సగం కూడా వ్యయం చేయక పోవడం వైసిపి ప్రభుత్వ చేతగానితనమే అని, జాతిపిత మహాత్మాగాంధీ పేరుతో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకానికి ఈ విధంగా తూట్లు పొడవడం వైసిపి నేతలకు జాతిపిత పట్ల ఏపాటి గౌరవం ఉందో విదితం అవుతోందని చంద్రబాబు అన్నారు. గ్రామీణాభివృద్ది కన్నా రాజకీయ కక్ష సాధింపే వైసిపి నేతలకు ప్రాధాన్యంశంగా రుజువు అవుతోందిని చంద్రబాబు అన్నారు. ‘‘ముందు చేసిన పనులకు ముందుగా చెల్లింపులు జరపాలన్నదే’’ నరేగా చట్ట స్ఫూర్తి, నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడితే వాళ్లకు 12% వడ్డితో సహా బకాయిలు చెల్లించాల్సి వుంది, కాబట్టి జరిగిన పనులకు జరిగినట్లుగా చెల్లింపులు జరపాలని, ఉద్దేశ పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన జాప్యానికిగాను 12% వడ్డీతో సహా ఆయా పనులు చేసినవారికి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి తల్లి, వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు అయిన, వైఎస్ విజయమ్మకు, అలాగే జగన్ సోదరి అయిన షర్మిలకు, ప్రత్యెక కోర్ట్ సామన్లు జారీ చేసింది. 2012 ఉప ఎన్నికల సమయంలో, జరిగిన ఎన్నికల ప్రచారంలో, ఎలాంటి అనుమతి తీసుకోకుండ, రోడ్డు పై ఎన్నికల సభ పెట్టటంతో, విజయమ్మ, షర్మిల, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ, 2012లో పోలీసులు కేసు నమోదు చేసారు. 2012 ఎన్నికల సమయంలో, తెలంగాణాలోని పరకాలలో అప్పట్లో, ఈ సంఘటన జరిగింది. అయితే, ఇదే సందర్భంలో, విజయమ్మ, షర్మిలతో పాటుగా, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా, కోర్ట్ నోటీసులు ఇచ్చింది. 2012లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి, కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యకుండా, జగన్ పార్టీలో చేరారు. దీంతో వారి పై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యకుండా, జగన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్పించుకోవటంతో, కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదుతో, ఈ ఎమ్మేల్యేల పై అనర్హత వేటు పడింది.

sharmila 06012020 2

దీంతో అప్పట్లో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆ ఉప ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం, తెలంగాణాలోని పరకాలలో కొండా సురేఖ వైసీపీ అభ్యర్ధిగా పోటీలో నిలబడ్డారు. ఆవిడ తరుపున ప్రచారం చెయ్యటానికి, వచ్చారు విజయమ్మ, షర్మిల. ఆ సమయంలో జగన్ సిబిఐ కేసులో జైలులో ఉండటంతో, ఆయన తరుపున విజయమ్మ, షర్మిల వచ్చారు. అయితే వారు సభ పెట్టిన చోట పర్మిషన్ లేకపోవటం, ముందస్తు అనుమతి తీసుకోక పోవటంతో, వారి పై, పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు. అయితే, అక్రమాస్తుల కేసులో అదే రోజు కోర్టుకు సీఎం జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇక, 2012 లో జగన్ కు మద్దతుగా కాంగ్రెస్..టీడీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో తెలంగాణలోని పరకాల నుండి కొండా సురేఖ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ ప్రచార సమయంలో జరిగిన వ్యవహారం పైన ఇప్పుడు కోర్టు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో సురేఖ..టీఆర్ యస్ అభ్యర్ధి బిక్ష్మయ్య మధ్య హోరా హోరీ పోటీ సాగింది. అయితే అప్పటి నుంచి ఆ కేసు వరంగల్ లో జరిగింది.

sharmila 06012020 3

కొన్నేళ్ళు క్రిందట, ఈ కేసు వరంగల్ నుంచి, హైదరాబాద్ లోని, ప్రత్యేక కోర్ట్ కు ఈ కేసు బదిలీ అయ్యింది. అయితే ఈ విషయం పైనే, ప్రత్యేక కోర్ట్, వారికి సమన్లు జరీ చేసింది. ఈ నెల 10న షర్మిలతో పాటుగా, విజయమ్మను కూడా కోర్ట్ కు రావాలి అంటూ సమన్లు జారీ అయ్యాయి. అయితే అదే జనవరి 10న, జగన్ కూడా సిబిఐ కోర్ట్ కు హాజరు కావలి అంటూ, సిబిఐ కోర్ట్ కూడా, రెండు రోజుల క్రిందట ఆదేశాలు జారీ చేసింది. ఆయన గత ఏడు నెలలుగా, ఆయన ప్రతి శుక్రవారం కోర్ట్ కు వెళ్ళకుండా, వస్తున్నారు. అయితే ఈ విషయం పై, మొన్న శుక్రవారం ఈ విషయం పై సీరియస్ అయ్యింది. ఇక ప్రతి శుక్రవారం జగన్, విజయసాయి రెడ్డి రావాల్సిందే అని, ఈ నెల 10న తప్పుకుండా రావాలని కోరింది. అయితే, ఇప్పుడు విజయమ్మ, షర్మిలను కూడా హైదరాబాద్ లోని ప్రత్యెక కోర్ట్ కూడా, అదే రోజున కోర్ట్ కు రమ్మని నోటీసులు ఇవ్వటం, యాదృచ్చికమే అనుకోవాలి.

మూడు రోజుల క్రితం, మందడంలో మహిళలను పోలీసులు అరెస్ట్ చెయ్యటంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. మహిళలను అరెస్ట్ చెయ్యటంతో పాటుగా, వారిని లాగి పడేయటం, బూతులు తిట్టటం కూడా చేసారు అంటూ, కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ రోజు పోలీసులు స్పందిస్తూ, మహిళలు రోడ్డుకు అడ్డుగా ఉండటంతో, వారిని తప్పించే క్రమంలో, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సందర్భంగా మహిళలకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని, మేము కావాలని వారి పై దురుసుగా ప్రవర్తించలేదు అని చెప్పారు. అయితే, ఈ రోజు ఉదయం, పోలీసులు మొన్న జరిగిన సంఘటన పై ప్రెస్ మీట్ పెట్టరు. మందడంలో పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, వారు మాట్లాడుతూ, మహిళలే పోలీసుల పై ఎదురు తిరిగారని, మహిళా కానిస్టేబుళ్ల పై వారే, దాడి చేశారని తుళ్లూరు డీఎస్పీ వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేసారు.

police 06012020 2

అయితే ఈ సందర్భంగా మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. కానిస్టేబుళ్ల పై దాడి జరిగితే ఆ రోజే, ఎందుకు చెప్పలేదని, మూడు రోజుల తరువాత ఎందుకు చెప్తున్నారు అంటూ పోలీసులని ప్రశ్నించగా, మీడియా ప్రశ్నలకు పోలీసులు సమాధానం దాటవేశారు. పోలీసుల స్పందన పై, రాజధాని రైతులు స్పందిస్తూ, పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని, ఆ రోజు ఏమి జరిగిందో, మీడియాలో మొత్తం, రాష్ట్ర ప్రజలు అందరూ చూసారని వాపోయారు. మేము కొడితే, దాడి చేస్తే, పోలీసులు మమ్మల్ని వదిలి పెట్టే వారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మాత్రం, ఏదో తోపులాటలో గాయాలు అయ్యాయని చెప్పి, ఇప్పుడు ఎదురు మేమే దాడి చేసాం అని చెప్తున్నారని, ఈ వంకతో, మా ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

police 06012020 3

మరో పక్క ఈ రోజు అమరావతిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు రాజధాని గ్రామాల్లో మహా పాదయత్రకు రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈ పాదయత్రకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని, నిరసన తెలపటంలో తప్పు లేదు కాని, ఎదుటు వారికి ఇబ్బంది కలిగిస్తే, పోలీసులు చూస్తూ కూర్చోరని, అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి అన్నారు. అయ్తీ రైతులు మాత్రం, తుళ్లూరు నుండి మందడం వరకు ర్వాలి చేస్తామంటున్నారు. శాంతియుతంగా ర్వాలీ చేస్తుంటే అడ్డుకుంటే సహించేలేదంటున్నారు రైతులు. ఇప్పటి వరకు శాంతియుతంగానే చేసామని, ఇక ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పోలీసులు సహకరించాలని కోరుతున్నారు.

రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో, ప్రభుత్వం ఉండటంతో, ఇప్పటికే 19 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ ఉద్యమం ఉదృతం అవుతుంది. ఈ రోజు రైతులు మహా పాదయత్ర చేసారు. ఒకేసారి దాదాపుగా 10 వేల మంది రైతులు మహా పాదయాత్ర చెయ్యటంతో, అమరావతి దద్దరిల్లింది. మరో పక్క రైతులకు అండగా రాజకీయ పార్టీలు కూడా నిలిచాయి. వైసీపీ తప్ప, అన్ని రాజకీయ పార్టీలు, రైతులకు మద్దతు ఇస్తున్నాయి. రాజధాని ఇక్కడే ఉండాలి అని చెప్తూ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సేవ్ ఏపి, సేవ్ అమరావతి పేరుతో, 24 గంటలు పాటు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. గద్దె చేస్తున్న దీక్షకు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. తన మీద కోపం ఉంటే, తన పై తీర్చుకోవాలని, భూములు ఇచ్చిన రైతుల పై కాదని, అమరావతిని నాశనం చెయ్యొద్దని కోరారు.

cbn 06012019 2

విజయవాడ అంటే రాజకీయ చైతన్యానికి మారు పేరు అని, అమరావతిని నాశనం చెయ్యకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. మన పిల్లలు, మన కళ్ళ ముందే ఉండాలనే ఉద్దేశంతోనే, అమరావతి నిర్మాణం ప్రారంభించామని, రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇక్కడ మంచి చదువు, ఉపాధి దొరుకుతుందని, సిటీని డిజైన్ చేసామని, ఇప్పుడు ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళిపోతే, ఇక్కడ నుంచి వెళ్ళేది కేవలం సచివాలయం కాదని, మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు అని అన్నారు. మళ్ళీ మనం వేరే రాష్ట్రాలకు చదవు కోసం, ఉపాధి కోసం వెళ్ళే పరిస్థితి అని, మన భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, భూములు ఇచ్చిన రైతుల కోసం అందరూ పోరాటాలు చెయ్యాలని చంద్రబాబు కోరారు.

cbn 06012019 3

ఈ సందర్భంగా, అనేక మంది మహిళలు, ఈ పోరాటానికి విరాళాలు ఇచ్చారు. ఒక మహిళా నాలుగు బంగారు గాజులు ఇచ్చారు. మరో మహిళ మాట్లాడుతూ, తాను, తన భర్తకు చెప్పకుండా ఎప్పుడూ బయటకు రాలేదని, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పోరాటం చూసి, ఉద్వేగంతో ఇక్కడకు వచ్చానని, అమరావతి పోరాటం కోసం, నా చేతికి ఉన్న రెండు ఉంగరాలు ఇస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుని ఒక కోరిక కోరారు. నా భర్తకు చెప్పకుండా వచ్చానని, మీరే ఫోన్ చేసి, ఆయనకు ఈ విషయం చెప్పాలని చెప్పటంతో, చంద్రబాబు మీటింగ్ లోనే, ఆమె భర్తకు ఫోన్ చేసి, మీ భార్య అందరికీ ఆదర్శంగా నిలిచారు, మీరు కూడా ఆమెను ప్రోత్సహించాలి, మిగతా మగవారికి కూడా చెప్పండి, మన పిల్లల భవిష్యత్తు కోసం, అందరూ ముందుకు రావాలని చెప్పండి అంటూ, ఆమెను, ఆమె భర్తను, ఈ మహా పోరాటానికి స్పూర్తిని ఇచ్చినందుకు, అభినంధించారు. రాష్ట్రంలో అందరూ మన రాష్ట్రం కోసం, మన రాజధాని కోసం పోరాటం చెయ్యాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read