నూతన సంవత్సరం తొలిరోజైన బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాలలో పర్యటించారు. గత 15రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలు, అన్నివర్గాల ప్రజలకు సంఘీభావం తెలిపారు. యర్రబాలెంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ అందరికీ ఆనందంగా ఉండాల్సిన సందర్భం నూతన సంవత్సరం(2020). 29గ్రామాలే కాదు మొత్తం రాష్ట్రంలో అందరూ మనోవేదనలో ఉండటం బాధాకరం. 5కోట్ల ప్రజలు ఆలోచించాల్సిన సందర్భం ఇది. భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. 25ఏళ్ల క్రితం హైదరాబాద్ అభివృద్దికి నాంది పలికాం. అప్పుడే ‘‘విజన్ 2020’’ రూపొందించి అభివృద్ది పనులు చేపట్టాం. హైదరాబాద్ అభివృద్ది చేసినందుకు నన్ను బ్లేమ్ చేసినవాళ్లు కూడా ఉన్నారు. నా కోసమో, నా కుటుంబం కోసమో, టిడిపి కార్యకర్తల కోసమో అభివృద్ది చేయలేదు. ఆంధ్రప్రదేశ్ కోసం,తెలుగు జాతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చేశాం. విభజన తరువాత ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం బెంచీలు, కుర్చీలు కూడా లేవు. రోషంతో ఈ ప్రాంతంలో అభివృద్ది చేశాం. నన్ను నమ్మి 33వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూములు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.

cbn 01012020 2

నా కులం, మనుషులు ఉన్నారని హైదరాబాద్ లో అభివృద్ది చేశానా..? జనం కోసం, రాష్ట్రం కోసం, జాతి కోసమే ఆలోచించాను. ఉద్యోగాలు చేయాలంటే మన బిడ్డలు చెన్నై, బెంగళూరు పోవాల్నా..? పాచిపనుల కోసం, మట్టిపని, కాపలా పనుల కోసం హైదరాబాద్ వెళ్లాల్నా..? అందుకే రోషంతో, పౌరుషంతో అమరావతి అభివృద్దికి నాంది పలికాం. అమరావతితో పాటు 13జిల్లాల సమగ్రాభివృద్ది చేపట్టాం. ఇప్పుడు ఒక కులం కోసమే చేశానని నాపై నిందలు వేస్తున్నారు. ఎర్రబాలెంలో కాపులు 8వేల మంది ఉన్నారు. బ్రాహ్మణులు 1500, యాదవులు 1400, గౌడ 600, పద్మశాలి 1400, ఎస్సీ ఎస్టీ 2వేలమంది పైగా ఉంటే కమ్మ 100మందే ఉన్నారు. అలాంటిది నాపై ఒక సామాజిక వర్గం ముద్ర వేస్తారా..? కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్ర వేసినట్లు అమరావతికి కూడా కులం ముద్రవేసి చంపేయాలని చూస్తారా..? ఈ ప్రాంతం అభివృద్ది చెందితే, ఇక్కడి భూమి విలువ పెరిగితే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత కడుపు మంట..? ఎందుకంత కడుపు ఉబ్బరం..? 18కిమీ సీడ్ యాక్సిస్ రోడ్డు, 30పైగా రోడ్లు గ్రాఫిక్సా..? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, జడ్జిల బంగ్లాలు, ఐఏఎస్ ల నివాసాలు, పేదల హవుసింగ్ కాంప్లెక్స్ గ్రాఫిక్సా..? రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తే, వీళ్లు డబ్బులు ఏమీ ఖర్చు చేయలేదని అంటారు..

cbn 01012020 3

3రాజధానులు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా..? ఎప్పుడో జరిగిన సౌతాఫ్రికా వీళ్లకు ఆదర్శమా..? తెలిసో తెలియకో కుంపటిని మీరంతా నెత్తిమీద పెట్టుకున్నారు. అగ్నిగుండాన్ని నెత్తికెత్తుకున్నారు. దానిని తీయలేరు, అది తీయకపోతే కాలిపోతుంది. పాదయాత్రలో ఊరూరా తిరిగి ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. నూతన సంవత్సరం ప్రజలందరిలో మంచి మార్పుకు నాంది కావాలి. ఎంతో బాధతో ఆవేదనతో 5కోట్ల ప్రజలకు చెబుతున్నాను. మార్పు రాకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. అభివృద్ది ద్వారా సంపద సృష్టించాలి. ఆ సంపదతో రాష్ట్రం ఆదాయం పెరగాలి. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందాలి. అప్పుడే పేదలకు సంక్షేమం చేయగలం. ఇదొక(అమరావతి) దివ్యక్షేత్రం..దీనికి ఎవరైనా చెడు తలపెడితే వాళ్లే దెబ్బతింటారు తప్ప ఈ ప్రాంతానికి ఏమీకాదు. అన్ని గ్రామాలు, వార్డుల నుంచి తెచ్చిన పుట్టమట్టి, పవిత్ర జలంతో మరింత శక్తివంతం చేశాం. ప్రజలే నాకు పోలీసులు..ప్రజలే నాకున్న బలం..పోలీసులను అడ్డం పెట్టుకుని, డమ్మీ కాన్వాయ్ లు తిప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సిన పరిస్థితి..దేవుడి కంటె తానే గొప్ప అని దేవుడి ఊరేగింపు ఆపి సీఎం కాన్వాయ్ లో వెళ్తారు. ప్రజలే రక్షణగా ఉండి మందడం గ్రామానికి పవన్ కళ్యాణ్ ను తీసుకెళ్లారంటే అదీ నిజమైన అభిమానం. ఇక్కడికి వచ్చినప్పుడు, నేను చెట్టుకింద కూర్చున్నాను. నువ్వు కూర్చోలేదు, నేను కట్టిన ఏసి సెక్రటేరియట్ లో కూర్చున్నావు. నేను కట్టిన అసెంబ్లీలో కూర్చుని నన్ను తిట్టారు. నేను కట్టిన అసెంబ్లీలోనే నాకు మైకు ఇవ్వలేదు. అయినా ఏం బాధ లేదు. రాష్ట్రానికి చెడ్డపేరు తేకండి, వచ్చే పెట్టుబడులను అడ్డుకోకండి, పరిశ్రమలను వేరే ప్రాంతాలకు తరిమేసి యువత ఉపాధికి గండికొట్టకండి. రాజధాని మార్చం, ఇక్కడే కొనసాగిస్తామని రేపే మీరు చెబితే అభినందిస్తాం. తరలించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని’’ చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్రభుత్వాలు పరిపాలనకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరే, జీవోల రూపంలో విడుదల చేసి, పారదర్సాకంగా ఉండేలా పరిపాలన చెస్తూ ఉంటాయి. గత కొన్నేళ్ళుగా ఇదే పరిస్థితి. అయితే ఈ జీవోల్లో, కొన్ని కొన్ని రహస్య జీవోలు ఉంటాయి. ఇవి బహిరంగంగా ఉండకూడదు, ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు కాని, ఇతర అంశాల పరంగా కాని, ఇబ్బంది అనుకుంటే, అప్పుడు రహస్య జీవోలు ప్రజలు విడుదల చేస్తూ ఉంటాయి. అన్ని ప్రభుత్వాలు లాగే, గతంలో చంద్రబాబు హయంలో కూడా అప్పుడప్పుడు రహస్య జీవోలు విడుదల చేస్తూ ఉండే వారు. అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉండే జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ అయిన వైసీపీ, ఆయన పేపర్, ఆయన ఛానల్ కూడా, ఈ కొద్ది పాటి రహస్య జీవోల పై కూడా, చంద్రబాబుని ప్రశ్నించే వారు. ఆ రహస్య జీవోల్లో అవినీతికి సంబంధించిన అనేక ఆరోపణలు ఉన్నాయి అంటూ విమర్శలు చేసారు వారు. నిజానికి అది ఎంత సున్నితమైన అంశం అయినా, ప్రజల ముందు ఉంచాలి.

go 01012020 2

గతంలో చంద్రబాబు అప్పుడప్పుడు ఇలా రహస్య జీవోలు ఇచ్చినా, అది తప్పే. ఎందుకంటే, ప్రజలు పారదర్సకత కోరుకుంటారు. మనం ఏమైనా దాస్తున్నాం అంటే, ఏదో జరిగినట్టే అని ప్రజలు అనుకుంటారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఎక్కువగా రహస్య జీవో లు విడుదల చేస్తున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. పోర్ట్ లకు సంబంధించి ఒక రహస్య జీవో రావటంతో, బందర్ పోర్ట్ ని తెలంగాణాకు అప్పగిస్తూ, ప్రభుత్వం రహస్య జీవో ఇచ్చింది అంటూ, ప్రతిపక్షాలు ఆరోపించాయి. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మే 30 నుంచి, నిన్నటి దాకా, అంటే డిసెంబర్ 31 దాకా, ఈ ఏడు నెలల్లో, దాదాపుగా 174 రహస్య జీవోలు విడుదల అయ్యాయి. ఏడు నెలల్లోనే 174 రహస్య జీవోలు అంటే, పెద్ద మొత్తంలో విడుదల చేసినట్టే.

go 01012020 3

అయితే, ఇప్పుడు ప్రభుత్వం నిన్న ఒక్క రోజే విడుదల చేసిన రహస్య జీవోలు, అందరినీ ఆశ్చర్య పరిచాయి. నిన్న ఒక్క రోజే దాదపుగా, 80 కాన్ఫిడెన్షియల్ జీవోలను జారీ చేసి, ప్రభుత్వం రికార్డు సృష్టించింది. నిన్న రాత్రి 10గంటల వరకూ 205 జీవోలు జారీ కాగా, అందులో రహస్య జీవోల సంఖ్య 80 ఉండటం గమనార్హం. పంచాయతీరాజ్ శాఖ 40 జీవోలు జారీ చేయగా, అవి ఎన్నికలకు సంబధించి అని చెప్తున్నారు. అయితే మరో 34 జీవోలు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉండటంతో, ఇవి ఎందుకో ఎవరికీ అర్ధం కాలేదు. రాష్ట్రంలో రాజధానిని మూడు చేస్తాం అని చెప్పటం, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ అంటూ చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే, ఒకవేళ ఈ 34 జీవోలు, అమరావతికి సంబంధించి ఏమైనా విడుదల చేసారా అనే అభిప్రాయం కలుగుతుంది. ప్రభుత్వం, దీని పై వివరణ ఇస్తే, అప్పుడు ఇవి ఏమిటో తెలిసే అవకాసం ఉంది.

తిరుమల తిరుపతి దేవస్థానం, గత 2-3 ఏళ్ళ నుంచి వివాదం అవుతూనే ఉంది. ఈ వివాదానికి మూలం అప్పట్లో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా ఉంటూ చెన్నై వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి, తిరుమలలో ఏవి పధ్ధతి ప్రకారం జరగటం లేదని, చివరకు వెంకన్నకు పెటే నైవేద్యం విషయంలో కూడా ఆలస్యం జరుగుతుంది అంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే ఈ ఆరోపణలను, అప్పటి మిగత ప్రధాన అర్చకులు ఖండించారు. ఈ వివాదాల నేపధ్యంలోనే రమణ దీక్షితులను తప్పించారు. అయితే తరువాత ఆయన కోర్ట్ కు వెళ్ళటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ క్రమంలోనే రమణ దీక్షితులు, జగన్ ని కలవటంతో, ఈ అంశం రాజకీయ మలుపు తీసుకుంది. వైసీపీ పార్టీ దీన్ని అప్పట్లో రాజకీయం చేసింది. పింక్ డైమెండ్ ని చంద్రబాబు మాయం చేసారని ఆరోపించారు. విజయసాయి రెడ్డి అయితే ఒక అడుగు ముందుకు వేసి, శ్రీవారి నగలు అన్నీ చంద్రబాబు ఇంటి కింద ఉన్నాయని, అవన్నీ తవ్వితే ఎన్నో నగలు దొరుకుతాయని ఆరోపించారు.

deekshitulu 01012019 2

ఇదే క్రమంలో ఎన్నికలు రావటం, జగన్ గెలవటం, అప్పట్లో రమణ దీక్షితులకు ఇచ్చిన మాట ప్రకారం, ఆయనను మళ్ళీ గౌరవ ప్రాధాన అర్చకుడిగా నియమించటం జరిగిపోయాయి. పోయిన వారం జరిగిన, టిటిడి బోర్డు మీటింగ్ లోనే, ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే, ఇప్పుడు రమణ దీక్షితులు చేసిన ఒక చర్య వివాదానికి కారణం అయ్యింది. నిన్న తిరుమల శ్రీవారి ఆలయంలో, ప్రధానార్చకులు, గౌరవ ప్రధానార్చకుల మధ్య జరిగిన ఒక చిన్న వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సమయంలో, జరిగిన ఈ వివాదం పై అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రమణ దీక్షితులు, బయట నుంచి తెచ్చిన నెయ్యితో ఆలయానికి వెళ్లారు.

deekshitulu 01012019 3

ఆ నెయ్యతోనే శ్రీవారి దీపం వెలిగించే ప్రయత్నం చెయ్యటంతో, ఇది ఆగమశాస్త్రానికి విరుద్ధమని ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు అభ్యంతరం చెప్పారు. అయితే రమణ దీక్షుతులు మాత్రం, ఇందులో వివాదం ఏమి ఉంది, అయినా నాకు చెప్పటానికి, నువ్వు ఎవరు ? అంటూ ఆయనకు బదులు ఇచ్చారు. సన్నిధిలో గొడవను చూసి ఇతర అర్చకులు విస్తుపోయారు, వివాదాన్ని తగ్గించే ప్రయత్నం చేసారు. వేణుగోపాల దీక్షితుల కథను అధికారుల వద్దే తేల్చుకుంటానంటూ రమణ దీక్షితులు శ్రీవారి సన్నిధి నుంచి వెళ్లిపోయారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి గర్భాలయంలో మూలమూర్తికి అభిముఖంగా ఉండే రెండు అఖండాల్లో దేవస్థానం సరఫరా చేసే స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే వాడతారని చెప్తున్నారు.

అమరావతి రైతులు రోడ్డన పడటంతో, నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసుకున్న చంద్రబాబు, ఈ రోజు అమరావతి ప్రాంత రైతుల మధ్యే గడపనున్నారు. ఈ రోజు చంద్రబాబు, ఆయన సతీమణి, నారా భువనేశ్వరితో కలిసి, రాజధాని రైతులతో కలిసి, ఆందోళన కార్యక్రమంలో పాల్గున్నారు. ఎప్పుడూ లేనిది, ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు కూడా వచ్చి ఆందోళన చెయ్యటంతో, చంద్రబాబు కూడా, ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గునని, తన సతీమణిని కూడా తీసుకువచ్చి, రైతుల తరుపున అండగా నిలిచారు. ముందుగా కనకదర్గమ్మ ఆశీస్సులు తీసుకున్న చంద్రబాబు, ఎర్రబాలెం రైతు దీక్షకు చంద్రబాబు హాజరయ్యారు. అమరావతిలో రైతులతో పాటు చంద్రబాబు గారు, భవనేశ్వరి గారు, నందమూరి రామకృష్ణ గారు, నిమ్మల రామానాయుడు గారు, కేశినేని నాని గారు, అనురాధ గారు, గల్లా అరుణ గారు, వర్ల రామయ్య గారు, గంజి చిరంజీవి గారు, శ్రవణ్ కుమార్ గారు.. స్థానిక నాయకులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంలో, రైతుల దుస్థితి చూడలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్న రామకృష్ణ.

amareavati 01012019 2

ఈ సందర్భంగా, భువనేశ్వరి రైతులని ఉద్దేశించి మాట్లాడారు. "అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వొమ్ము చేయరు. భోజనం చేసినా, పడుకున్నా అమరావతి, పోలవరం అనే తపించారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు. రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండ ఉంటుంది. నాతోటి మహిళల బాధలు నేను అర్ధం చేసుకోగలను. ఆరోగ్యం గురించి మేము ఆందోళన చెందినా....చంద్రబాబు రాష్ట్రం గురించే ఆలోచన చేసేవారం. ప్రజల తరువాతనే నన్ను, కుటుంబాన్ని పట్టించుకునే వారు. అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వొమ్ము చేయరు. భోజనం చేసినా, పడుకున్నా అమరావతి, పోలవరం అనే తపించారు. ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసమే కష్టపడ్డారు. రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండ ఉంటుంది." అని భువనేశ్వరి అన్నారు.

amareavati 01012019 3

ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ, ఆవేదన వ్యక్తం చేసారు. "రాజధాని తరలి పోతే మాకు‌ చావే శరణ్యం. కారుణ్య మరణాలకు మాకు అనుమతి ఇవ్వాలి. పదిహేను రోజులుగా కంటి మీద కునుకు లేదు. రాజధాని అమరావతి అంటే ఐదు కోట్ల ఆంధ్రులది. రాష్ట్రం కోసమే నాడు మేము మా భూములు ఇచ్చాం. నూతన సంవత్సరం రోజు కన్నీటితో రోడ్ల పై కూర్చున్నాం. 1300పులివెందులకు కేటాయించిన‌ జగన్.. అమరావతి లో నిర్మాణాలు వదిలేశారు. ఒక సామాజిక వర్గం అని చెబుతున్న జగన్... వారు నీకు ఏవిధంగా అన్యాయం చేశారు. అన్ని కులాలు, మతాల వారు రాజధాని గ్రామాల లో ఉన్నారు. నేడు మా మధ్య కూడా చిచ్చు పెట్టావు. ఎవడు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్ట్ లు.. మీరు నిరూపిస్తారా. బొత్స స్మశానం అంటారు..‌ స్పీకర్ ఎడారి అంటారు. మీరు ఎక్కడ కూర్చుని పాలన చేస్తున్నారు. చంద్రబాబు తో గొడవ ఉంటే ఆయనతో తేల్చుకోండి. మా రాజధానిని మాత్రం ఇక్కడ నుంచి తరలించ వద్దు. జగన్ పోలీసుల అండతో సచివాలయం కు వస్తున్నారు. మేము మా పుట్టింటికి రావాలన్నా ముళ్ల‌ కంచెలు వేస్తున్నారు. మూడు జిల్లాల రాజధానుల పేరు చెప్పి.. మూడు ప్రాంతాలలో ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారు. అయ్యా జగన్...‌నిన్ను రాజధాని కావాలని విశాఖ ప్రజలు అడిగారా. అమ్మా విజయ లక్ష్మమ్మా... మా అబ్బాయి కి ఒక్క ఛాన్స్ అన్నావు. ఇప్పుడు నీ కొడుక్కి ఎందుకు‌ చెప్పడం లేదు. మా ఆడ వాళ్ల ను రోడ్డెక్కించి ఏడిపిస్తున్నాడు." అంటూ రైతులు వాపోయారు.

Advertisements

Latest Articles

Most Read