జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే, జూన్ నెలలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో, జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయి. అసెంబ్లీ మొదటి సమావేశంలో, జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, మేము మాత్రం ఇలాంటి పనులు చెయ్యమని, మాది ప్రజా ప్రభుత్వం అని, ఎవరైనా మా పార్టీలోకి రావాలి అనుకుంటే, ముందుగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి కాని, మా పార్టీలోకి రావటానికి వీలు లేదని, నా మాటంటే మాటే అంటూ, జగన్ చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన స్పీకర్ తమ్మినేని కూడా, జగన్ మాటలకు వత్తాసు పలికారు. జగన్ గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళు వస్తావం అని, ఇలాంటి అనైతిక పనులు మా దగ్గర కుదరవు అని, గతంలో స్పీకర్ కూడా దారుణంగా వ్యవహరించారని, ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యకుండా, పార్టీ మారితే, వారిని వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ విన్న ప్రజలు వాస్తవం అని నమ్మారు.

maddalagiri 31122019 2

అయితే ఇది చెప్పి ఆరు నెలలు అయ్యింది, అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తాను టిడిపి పార్టీలో కొనసాగలేక పోతున్నానాని, తనను ఇండిపెండెంట్ ఎమ్మేల్యేగా పరిగణించాలని కోరటం, దానికి స్పీకర్ కూడా ఒప్పుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం. అంతకు ముందు వంశీ జగన్ ను కలిసి, ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ను పొగిడి, చంద్రబాబుని అమ్మనా బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. అయితే దీని పై వివరణ ఇవ్వాలని, టిడిపి వంశీని సస్పెండ్ చేసి, షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే స్పీకర్ ఇలా చెయ్యటం పై, టిడిపి అభ్యంతరం చెప్పింది, తనని పార్టీ నుంచి బహిష్కరించలేదని, వంశీ క్రమశిక్షణ ఉల్లంఘించి నందుకు, తనని సస్పెండ్ చేసి, షోకాజ్ నోటీస్ మాత్రమే ఇచ్చామని అన్నారు.

maddalagiri 31122019 3

ఇప్పుడు మళ్ళీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు వంతు. ఆయన కూడా జగన్ ని కలిసి, చంద్రబాబుని విమర్శించారు. ఆయన కూడా, ఇప్పుడు డైరెక్ట్ గా వైసీపీలో చేరకుండా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటూ స్పీకర్ ని కోరతారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పై, మాత్రం వైసీపీ వ్యూహం కనిపిస్తుంది. ఇసుక దీక్ష చేస్తున్న సమయంలో వంశీ చేత ప్రెస్ మీట్ పెట్టించి తిట్టించటం, తరువాత మళ్ళీ ఇప్పుడు అమరావతి పై ఆందోళనలు చేస్తున్న సమయంలో, అదే గుంటూరు నుంచి టిడిపి ఎమ్మేల్యేను లాగి, ఉద్యమానికి మద్దతు లేదు అని చెప్పాలి అనుకునే వైసీపీ వ్యూహం కనిపిస్తుంది. అయితే, ప్రజా ఉద్యమాలు ఇలాంటి రాజకీయం వలన దెబ్బ తింటాయా ? ఇలాంటి వ్యూహాలతో ప్రజలు మారతారా ? కడుపు మండిన అమరావతి రైతుకు మద్దాలి గిరి టిడిపిలో ఉంటే ఏంటి ? ఎక్కడ ఉంటే ఏంటి ? నాలుగు నెలలు ఇసుక లేక, పనులు లేక, ఇబ్బంది పడుతున్న కూలీలకు, వంశీ చంద్రబాబుని తిడితే ఏంటి ? జగన్ ను పొగిడితే ఏంటి ? ఇవేమీ రాజకీయ వ్యూహాలు ?

టిడిపి నేత, పంచుమర్తి అనురాధ, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అంటున్న శ్రీదేవి, అమరావతిలో ఆందోళన చేస్తున్న ఎవరైనా పైడ్ ఆర్టిస్ట్ లు అనే వారు ఉన్నారని నిరూపిస్తే, ఎమ్మెల్యే శ్రీదేవి కాళ్లు మొక్కుతానాని, ఆమె నిరూపించాలని, అనురాధ అన్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన, పంచుమార్తి అనురాధ ఇంకా ఏమన్నారంటే, "గత 13రోజుల నుండి రాజధాని రైతులు ఒక అనిస్థితికి గురి చేసిన వైసీపీ ప్రభుత్వం. రాజధాని రైతులకు ఏమి చేయలేని పరిస్థితిలో వారు వారి బాధలను చెప్పుకుంటే ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణను రాజధాని ప్రాంత రైతులు ఓట్లు వేసి గెలిపిస్తే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఉండవల్లి శ్రీదేవి రైతులను పట్టుకొని పెయిడ్‌ ఆర్టిస్టులని మాట్లాడుతున్నారు. మీరు గెలిపే ఒక అనిస్థితిలో ఉంది. దళితులకు ఎమ్మెల్యే సీటు రాకుండా చేసిన మీరు రైతుల గురించి మాట్లాడుతారా? కలెక్టర్‌ స్వయంగా పిలిచి మీ గెలుపుపై వివరణ కోరడం జరిగింది. మీరు అక్కడ ఎస్సీ ఎమ్మెల్యే అవునా? కాదా? అనే విషయం ఆగమగోషరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు రైతుల గురించి ఏ రకంగా మాట్లాడుతారు? మీ గెలుపు కృషి చేసిన రాయపూడి సొసైటీ ఛైర్మన్‌ ఈ రోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు అమరావతి వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలే స్వయంగా వైసీపీకి ఓటు వేసినందుకు మేము సిగ్గు పడుతున్నామని చెప్పిన మాట వాస్తవం కాదా? మాకు పార్టీలు లేవు మాకు రైతు పార్టీ ఒకటే అని చెప్పి మాట వాస్తవం కాదా?"

anuradha 31122019 2

"జగన్మోహన్‌రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లాడానికి కాన్వాయ్‌ని ట్రైల్‌రన్‌ వేసిన పరిస్థితి అందరికి తెలుసు. నక్సల్స్‌ ప్రాంతంలో ట్రెల్‌రన్‌ వేస్తారు. కానీ రైతుల నుంచి పోవడానికి ట్రైల్‌రన్‌ వేయించుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్‌రెడ్డి మాత్రమే. రాజధాని ప్రాంతం రైతుల కోసం ఉండవల్లి శ్రీదేవి జగన్మోహన్‌రెడ్డితో పోరాటం చేయాలి..అవసరమైతే రాజీనామా చేయాలి. ఆళ్ల రామకృష్ణరెడ్డి 2014నుంచి 2019 వరకు ప్రజలను పట్టించుకోకుండా 365 రోజుల సరిపడా 365కేసులు వేశారు. రాజధాని రాకుండా ఆళ్లరామకృష్ణరెడ్డి ఎన్ని కేసులు వేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఫిరంగిపురం గెస్ట్‌హౌస్‌లో మీరు చేసే అనైతిక కార్యక్రమాల గురించి గుస..గుసలాడుతున్నారు. ఫోన్‌లు మాట్లాడుకుంటూ.. నియోజకవర్గ రైతులను, నేప్రజలను గాలికి వదలివేసిన చరిత్ర ఆళ్ల రామకృష్ణరెడ్డిది. టోల్‌గేటు దగ్గర కట్టిన బిల్డింగ్‌ కట్టిన వ్యక్తుల నుంచి ఎన్ని కోట్టు దోచుకున్నారో మీ కార్యకర్తలే చెబుతున్నారు. మీ నియోజకవర్గ ప్రజలను మీరే పెయిడ్‌ ఆర్టిస్టులు అంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎమ్మెల్యేగా రాజనామా చేయాలి. మీకు దమ్ముంటే మీరు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి."

anuradha 311220193

"సెక్యూరిటీ సహయంతో జగన్మోహన్‌రెడ్డి క్యాంపు ఆఫీస్‌ వెళ్ళీ నాలుగు మాటలు మాట్లాడి తిరిగి ఇంటిలో దాగుకుంటున్నారు. అంటే పెయిడ్‌ అర్టిస్టులు మీరా?..రైతులా? రైతులను ఆరెస్టు చేసిన వారు భయపడకుండా ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ధర్మాణ ప్రసాద్‌ మాట్లాడుతూ 7 గ్రామాలు వచ్చి ధర్నాలు చేస్తే మేము సమాధానం చెప్పాలని అవమానకరంగా మాట్లాడారు. గ్రానైట్‌ కొండల కోసం, గ్రానైట్‌ తవ్వకాల కోసం, అక్కడ ఉన్న మీ భూములకు రేట్లు పెంచడం కోసం రైతులను మోసం చేసే పరిస్థితి మొదలు పెట్టారు. రైతులు అయితే మంచి మాటలు మాట్లాడాకుండాదా?..రైతులు అయితే మంచి దుస్తులు వేసుకోకుండాదా? కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వచ్చి మీ కాళ్లు పట్టుకుంటే వారు మీ దృష్టిలో రైతులా? రైతులను ఇంత దారుణంగా మాట్లాడితే బోత్సకు ఏమి వస్తుంది. గత ఏడు నెలల నుంచి మంత్రి బోత్స సత్యనారాయణ వచ్చి.. రానీ భాషతో నత్తి భాషతో రాజధాని ప్రాంతం రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. పిచ్చి..పిచ్చిగా మాట్లాడినా..రైతులను పదే..పదే పెయిడ్‌ ఆర్టిస్టులని మాట్లాడినా మర్యాద దక్కాదు." అని పంచుమర్తి అనురాధ అన్నారు.

ఆరు నెలల్లోనే భ్రమాస్త్రం వదిలాం, ఇక చంద్రబాబు పరిస్థితి అయిపొయింది, తెలంగాణాలో లాగా, ఎటూ కాకుండా పోతాడు, టిడిపి పార్టీ ఇక నామమాత్రమే అంటూ, మూడు రాజధానుల ప్రకటన రాగానే, వైసీపీ పార్టీలోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ఉన్న అభిప్రాయం ఇది. చంద్రబాబు ఇప్పుడు కనుక మూడు రాజధానుల ప్రకటన స్వాగితిస్తే, అమరావతి రైతులని ముంచేస్తున్నాడు అంటూ, ప్రచారం చెయ్యొచ్చు, అప్పుడు కోస్తాలో దెబ్బ పడుతుంది. ఒక వేళ అమరావతికి సపోర్ట్ గా మాట్లాడితే, చంద్రబాబు రాయలసీమ ద్రోహి, ఉత్తరాంధ్ర ద్రోహి అని ప్రచారం చెయ్యొచ్చు. చంద్రబాబు ఏ స్టాండ్ తీసుకున్నా, చంద్రబాబుని, ఒక రెండు మూడు జిల్లాలకు పరిమితం చెయ్యొచ్చు అని ప్లాన్ వేసారు జగన్ అండ్ టీం. అయితే, ఆ ప్రకటన చేసి ఇప్పటికీ, 13 రోజులు అయ్యింది, అయినా జగన్ తలుచుకున్న దాంట్లో, కొంచెం కూడా టిడిపికి డ్యామేజ్ కాక పోగా, ఇటు వైసీపీకే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీని అంతటికీ కారణం, సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు అని జగన్ భావిస్తున్నారు.

jagan 30122019 1

చంద్రబాబుని ఫిక్స్ చేసే విధంగా, ఆయా ప్రాంతాల వైసీపీ నేతలు, ప్రజల్లోకి తీసుకు వెళ్ళలేక పోయారని, జగన్ భావిస్తున్నారు. చివరకు విశాఖపట్నమే ఏపి రాజధాని అనే భావన కల్పించినా, ఎందుకో కాని విశాఖ ప్రజల్లో ఆ ఊపు కనిపించటం లేదు. విశాఖపట్నం ప్రజల్లో ఎందుకో కాని, సంతోషం కంటే, భయమే ఎక్కువ కనిపించింది. విశాఖలో పర్యటించిన జగన్ కూడా, ఎందుకో నిరాశగా కనిపించారు. చివరకు ఏమి ప్రసంగించకుండానే పర్యటన ముగించుకుని వెళ్ళిపోయారు. విశాఖ ప్రజల్లో ఈ నిర్లిప్తత ఎందుకు వచ్చిందో, ఇప్పటికీ వైసీపీకి అర్ధం కవటం లేదు. వన్ సైడ్ గా విశాఖలో ప్రజలు తమకు మద్దతు ఉంటారు అనుకుంటే, ఇలా అయ్యింది ఏమిటి అంటూ, వైసీపీలో అంతర్మదనం కొనసాగుతుంది.

jagan 30122019 1

ఇక రాయలసీమ ప్రజలు కూడా, హైకోర్ట్ తో పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు అనే భావనలో ఉన్నారు. అదీ కాక, సెక్రటేరియట్ కు వెళ్ళాలి అంటే, విశాఖకు వెళ్ళాలి అంటే 19 గంటలు పడుతుంది, ఇవన్నీ ఎలా సాధ్యం, అసలు వెనుకబడింది, రాయలసీమ కాబట్టి, రాజధాని మొత్తాన్ని రాయలసీలో పెట్టాలని, అప్పుడే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు వైజాగ్ లో కాని, ఇటు కర్నూల్ లో కాని, ఎక్కడా ప్రజలు స్వచ్చందంగా వైసీపీకి మద్దతు తెలపక పోగా, ప్రతి రోజు అమరావతి రైతుల ఆందోళన మాత్రం రాష్ట్రం అంతా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీలో అంతర్మదనం సాగుతుంది. ఈ పరిస్థితిని తమకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలి అనే ఆలోచనతోనే, మొన్న క్యాబినెట్ లో అధికారిక ప్రకటన చెయ్యకుండా వాయిదా వేసారని తెలుస్తుంది.

మొన్నటి దాకా, అమరావతి, పోలవరం రెండు కళ్ళుగా పరిపాలన సాగేది. అమరావతి పూర్తయితే, రాష్ట్రానికి సరిపడా ఆదాయం, ఈ నగరం నుంచే వచ్చేలా ప్రణాలికలు రూపొందించారు. అలాగే పోలవరం పూర్తయితే, రాష్ట్రంలో ప్రతి భూమిలో నీరు పారించే అవకాసం వచ్చేది. అయితే ప్రభుత్వాలు మారటంతో, ప్రయారిటీలు మారాయి. ఇప్పటి ప్రభుత్వం అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసింది, అయితే పోలవరం పై మాత్రం, పక్కన పెడుతున్నాం అని చెప్పకపోయినా, మా ప్రాధాన్యం పోలవరం అని చెప్తున్నా, పనులు మాత్రం జరగటం లేదు. చంద్రబాబు ఉండగా, ప్రతి సోమవారం పోలవరం పై సమీక్షలు చేసే వారు. 18 శాతం నుంచి 73 శాతానికి తీసుకు వెళ్లారు. అసలు పోలవరం పూర్తి అవుతుందా అనే దగ్గర నుంచి, పోలవరం పునాదులు దాటి, 73 శాతానికి చేరుకుంది. అయితే, దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతొ బ్రేకులు వేసారు. చంద్రబాబు పోలవరంలో నవయుగతో కలిసి, అవినీతి చేసారని, అందుకే నవయుగని తప్పించి, రివర్స్ టెండరింగ్ పేరుతో, కొత్త టెండర్ వేసి, మేఘా కంపెనీకి అప్పచెప్పారు.

polavaram 31122019 2

గత ఆరు నెలలుగా పనులు ఏమి చెయ్యలేదు. వరదలు సాకుగా చెప్పారు. నవంబర్ 1 నుంచి, పనులు పరిగెత్తిస్తున్నాం అన్నారు. అయితే, పనులు మాత్రం ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు. ఐదు వారాల్లో 3000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మాత్రమే వేశారు. గతంలో చంద్రబాబు ఉండగా, 24 గంటల్లో 32000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. అంటే అప్పట్లో మూడు గంటల్లో చేసిన పని ఇప్పుడు 5 వారాల్లో చేశారు అన్నమాట. పోలవరం పనులు ఎంత మందగమనంలో సాగుతున్నాయి అని చెప్పటానికి ఇదే ఉదాహరణ. అయితే ఇదే సమయంలో, నిన్న కేంద్ర జలసంఘం సభ్యుడు ఎస్‌.కే.హాల్దర్‌ నేతృత్వంలోని కమిటీ పోలవరం సందర్శించింది. అక్కడ అధికారులతో సమావేశం అయ్యి, పోలవరంలో జరుగతున్న పనులు పై ఆరా తీసింది.

polavaram 31122019 3

అయితే పనులు జరుగుతున్న తీరు పై, కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మీరు కోరినట్టే రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు, అయినా పనులు ఇలా నత్తనడకన ఎందుకు సాగుతున్నయి అంటూ ప్రశ్నించారు. లక్ష్యం ఘనంగా ఉందని, ప్రగతి మాత్రం, ఏ మాత్రం ముందుకు వెళ్ళటం లేదని, కేంద్రం అభిప్రాయ పడింది. ప్రాజెక్టు డిజైన్లు, ప్రణాళికపై చర్చించేందుకు వచ్చేవారం ఢిల్లీలో సమావేశమవుదామని వెల్లడించింది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర అధికారులు నిధులు గురించి ప్రస్తావించగా, అవి తమకు సంబంధం లేదని, మేము కేవలం జెక్టు డిజైన్లు, ప్రణాళిక పై మాత్రమే మేము చెప్పగలమని అన్నారు. అలాగే పోలవరం పై, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన, నిపుణుల కమిటీ వెల్లడించిన అభిప్రాయాలతో తమకెలాంటి సంబంధమూలేదని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read