ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు, ఇంగ్లీష్ మీడియం పై, చర్చ జరిగింది. ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం నడించింది. చంద్రబాబు మాట్లాడుతూ, మేము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని, మేము ఇంగ్లీష్ మీడియంతో పాటుగా, తెలుగు మీడియం కూడా ఉండాలని చెప్పామని, రెండు ఆప్షన్స్ ఇస్తే, ఎవరికి కావాల్సింది వాళ్ళు, తీసుకుంటారని చెప్పమని అన్నారు. గతంలో మేము కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన విషయన్ని గుర్తు పెట్టుకోవాలని, అన్నారు. కాని మేము తెలుగు మీడియం ఆప్షన్ గా ఇచ్చి, ఎవరికి కావల్సింది వారికి ఎంచుకునే స్వెఛ్ ఇచ్చామని అన్నారు. అయితే ఆ సమయంలో తమ పై ఒంటి కాలుతో, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ లెగిసిన విషయాన్ని వారు గుర్తు చేసారు. వైసీపీ నేతలు కాని, యార్లగడ్డ లాంటి వారు కాను, తమ పై ఎగబడ్డారని చెప్పారు. అలాగే జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పేపర్ లో ఇష్టం వచ్చినట్టు రాసారని చెప్పారు.
ఈ సందర్భంగా, చంద్రబాబు సాక్షిలో కధనాలు చదివి వినిపించే ప్రయత్నం చేసారు. మాతృ భాషకు మంగళం అంటూ కధనాలు రాసారని, ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నారని అన్నారు. ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అడుగుతున్నారు, మరి 2017లో మీ పిల్లలు ఎక్కడ చదివారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగు భాషను కూడా పెట్టండి అని మేము అడుగుతుంటే, మీకు ఎంత మంది భార్యలు అంటూ ఎదురు దాడి చేస్తున్నారాని అన్నారు. సాక్షిలో అప్పుడు నారయణ కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటూ చెప్పుకోచ్చారని, మరి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని అన్నారు. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుంది, మీరు, అప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా మాట్లాడింది మీరు అంటూ, విరుచుకు పడ్డారు.
అయితే ఈ సమయంలో పదే పదే సాక్షి ప్రస్తావన తీసుకురావటంతో జగన్ అసహనానికి లోనయ్యారు. సాక్షి రాస్తే దానికి నాకు ఏంటి, నేను ఎక్కడైనా చెప్పానా చెప్పండి అంటూ ఛాలెంజ్ చేసారు. చంద్రబాబుకి సిగ్గు లేదు అంటూ, ఏమి ఏమి ఏమి, కళ్ళు పెద్దవి చేస్తే భయపడటం అనుకున్నావా, కూర్చో కూర్చో అంటూ, ఊగిపోయారు. సాక్షి ఏదో రాస్తే నాకెందుకు, మీ ఈనాడు రాస్తే మీరు బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇస్తూ, సాక్షి మీ అవినీతి పత్రిక, మీరు అవినీతి డబ్బులతో పెట్టారు, కాని ఈనాడు, మేము రాజకీయల్లోకి రాక ముందే ఉంది, టిడిపి పెట్టక ముందే ఉంది, మీ అవినీతి పత్రిక గురించి అడుగుతుంటే ఎందుకు అంట కోపం ? అంటే ఇందులో రాసేది అంతా చెత్త, ఇది ఒక చెత్త పేపర్ అని ఒప్పుకుంటారా ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.