గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయం, ప్రతి రోజు ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూనే ఉంది. వంశీ అసెంబ్లీలో మాట్లాడుతూ, తాను టిడిపితో కలిసి ఉండలేక పోతున్నానని, తనకు వేరే స్థానం ఇవ్వాలని కోరటం, వెంటనే స్పీకర్ కూడా దానికి అంగీకరించటం, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అయితే స్పీకర్ నిర్ణయం పై తెలుగుదేశం పార్టీ అసంతృప్తిలో ఉంది. వంశీ, తమ అధినాయకుడు పై చేసిన పరుష పదజాలానికి, అతనకి షోకాజ్ నోటీస్ ఇచ్చామని, అప్పటి వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్తున్నారు. అంతే కాని వంశీని, పార్టీ నుంచి బహిష్కరణ వేటు వెయ్యలేదని అంటున్నారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు ప్రత్యేక స్థానం ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఒక వేళ, పూర్తి బహిష్కరణ వేటు పడితే ఎమ్మెల్యేగా కూడా అనర్హుడేనని చంద్రబాబు చెప్పారు. అయితే ఈ రోజు మీడియా అణిచివేతకు నిరసనగా చంద్రబాబు, గవర్నర్ ని కలవనున్నారు. ఈ సందర్భంలోనే, వంశీని ప్రత్యెక సభ్యుడిగా స్పీకర్ గుర్తించటం పై కూడా, చంద్రబాబు ఫిర్యాదు చెయ్యనున్నారు.

spekaer 12122019 2

అయితే ఇదే విషయం పై, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ స్పీకర్ కూడా ఒక లేఖ రాసింది. ఇది ఆ లేఖ "గౌ. శ్రీ తమ్మినేని సీతారామ్‌ గారికి, అసాధారణ పరిస్థితుల్లోగాని, ఏదైనా విపత్కర పరిస్థితి కలిగినప్పుడుగాని ప్రశ్నోత్తరాలను వాయిదావేసి సదరు అంశాన్ని ముందుగా సభలో చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రానికి లబ్ది, విస్త త ప్రజా ప్రయోజనాలు ఉన్న అంశం ఏదైనావస్తే అలాంటి సందర్భాల్లో క్వశ్చన్‌ అవర్‌ వాయిదా వేయడం కద్దు. అలాంటిది మంగళవారం(10.12.2019) ఏ అసాధారణ పరిణామం జరగకుండానే, ఏ విపత్కర పరిస్థితి ఏర్పడకుండానే, ఏ ప్రజా ప్రయోజనం లేకుండానే, ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి మరీ శ్రీ వల్లభనేని వంశీమోహన్‌ కి సభలో మాట్లాడే అవకాశం కల్పించడం తద్భిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ సింబల్‌ సైకిల్‌ గుర్తుపై గన్నవరం నియోజకవర్గం నుంచి ఎన్నికైన శాసన సభ్యుడు శ్రీ వల్లభనేని వంశీమోహన్‌. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీని సస్పెండ్‌ చేశామేగాని పార్టీనుంచి బహిష్కరించలేదు. సస్పెన్షన్‌లోనే ఉన్నాడంటే ఆయన ఇంకా పార్టీ సభ్యుడేననేది మీకు తెలియందికాదు. ఇంకా టిడిపి సభ్యుడిగానే ఉన్నశ్రీ వల్లభనేని వంశీమోహన్‌ కి మీరు ప్రత్యేకంగా సీటు ఎలా కేటాయిస్తారు..? అసెంబ్లీ రికార్డులలో శ్రీ వల్లభనేని వంశీమోహన్‌ ఇంకా టిడిపి సభ్యుడే..ఒకవేళ మారిస్తే ఆ విషయం మీరే స్పష్టంగా ప్రకటించాలి. "

spekaer 12122019 3

"టిడిఎల్‌పి శాసనసభా పక్షం సభ్యుడిగా ఉన్న వ్యక్తికి ప్రత్యేక సీటు ఎలా కేటాయిస్తారు..? సభలో ఆయనను ప్రత్యేకంగా ఎలా గుర్తిస్తారు..? శ్రీ వల్లభనేని వంశీమోహన్‌ మాట్లాడే సమయం కూడా టిడిఎల్‌పి సమయంలో భాగంగానే ఉంటుంది, మాట్లాడే సభ్యుల జాబితాను టిడిఎల్‌ పి అందజేస్తుంది. టిడిఎల్‌పి జాబితాలోనే ఆయన పేరు ఉన్నప్పుడు, 09.12.2019న వక్తల జాబితాలో ఆయన పేరును టిడిఎల్‌ పి పంపనప్పుడు ఏ విధంగా ఆయనకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చారు..? సీటు ఎలా సెపరేట్‌ గా కేటాయించారు..? పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొమ్ముకాసేలా వ్యవహరించడం గర్హనీయం. ఒకవైపు కొత్త ఒరవడి సష్టిస్తానని చెబుతూ, మరోవైపు నిబంధనలను ఉల్లంఘించడం, సాంప్రదాయాలను కాలరాయడం దురదష్టకరం. రానున్న కాలంలో అయినా ఇటువంటి వివాదాస్పద చర్యలను పునరావతం చేయరాదని, ది 10.12.2019న తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవాలని, వల్లభనేని వంశీమోహన్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నాం." అంటూ టిడిపి లెటర్ రాసింది.

అసెంబ్లీలో చంద్రబాబు పై వ్యక్తిగత దాడి చేసి, పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోలోపల మాత్రం, వైసీపీ పార్టీలో ఏదో అబధ్రతా భావం కనిపిస్తుంది. ఒక పక్క ఢిల్లీలో తమ పార్టీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు షాకులు మీద షాకులు ఇస్తుంటే, ఇక్కడ ఏపిలో నెల్లూరు పెద్దా రెడ్డి అయిన, ఆనం రాంనారాయణ రెడ్డి, నెల్లూరు మొత్తం మాఫియాలే అంటూ, సొంత ప్రభుత్వం పైనే సంచలన వ్యాఖ్యలు చేసి, సస్పెన్షన్ దాకా వెళ్ళేలా చేసారు. అయితే, ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ మాత్రం, ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులకు ఇస్తున్న విందు. అది కూడా బీజేపీ ఎంపీలను, కేంద్ర మంత్రులను టార్గెట్ చేస్తూ ఇస్తున్న విందు. వైసీపీ ఎంపీ హోదాలో కాకుండా, సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో పార్లమెంట్ సభ్యులకు రఘరామ కృష్ణంరాజు ఈ విందు ఇస్తున్నారు. ఢిల్లీలోని జన్‌పథ్, లాన్స్ ఆఫ్ వెస్టర్న్ కోర్టులోని ఆయన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో, ఈ పొలిటికల్ డిన్నర్ జరగనుంది. అయితే కేవీపీ ఇంట్లో పెట్టటానికి కారణం కూడా చెప్పారు.

raghu 11122019 2

తనకు ఇంకా నివాసం కేటాయించక పోవటంతోనే, తన వియ్యంకుడు అయిన కేవీపీ రామచంద్రరావు నివాసంలో, ఈ విందు ఇస్తున్నట్టు రఘరామ కృష్ణంరాజు చెప్పారు. ఈ ఈ కార్యక్రమానికి మొత్తం 300 మంది ఎంపీలు హాజరవుతారని రఘురామకృష్ణంరాజు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ విందుకు వస్తారని ప్రచారం జరుగుతున్నా, వాళ్ళు వచ్చే అవకాసం లేదని, కొంత మంది కేంద్ర మంత్రులు, మాత్రం వస్తారాని చెప్తున్నారు. అయితే ఈ విందుకు సొంత పార్టీ ఎంపీలు వస్తారా ? మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి హాజరు అవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. జరుగుతున్న పరిణామాలు అన్నీ వైసీపీ అధిష్టానం గమనిస్తుంది.

raghu 11122019 3

రఘరామ కృష్ణంరాజు లైన్ దాటి, బీజేపీ దారిలోకి వెళ్తున్నారు అనే అనుమానం రావటంతోనే, దానికి కౌంటర్ గా జగన్ మోహన్ రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజును, ఆయన సోదరులు నరసింహరాజు, రామరాజులను వైసీపీలో చేర్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రఘురామకృష్ణంరాజు ఇప్పటికీ జగన్ హెచ్చరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. విజయసాయి రెడ్డి లేకుండా ఎవరినీ కలవద్దు అని చెప్తున్నా, ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రుల్ని కలుస్తుండటంతో జగన్ అసహనానికి లోనవుతున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా విందు ఏర్పాటు చెయ్యటం, అదీ కూడా, వైసీపీ ఎంపీగా కాకుండా, సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో విందు ఇవ్వటం చర్చనీయాసం అయ్యింది.

మూడు రోజు అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరుగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ మొదలు కాక ముందు, తెలుగుదేశం పార్టీ, పెంచిన ఆర్టీసీ చార్జీల పై, అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టింది. ఈ నిరసనలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణతో పాటుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని నిరసన తెలియ చేసారు. ప్రజల పై అధిక భారం మోపుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరి పై ఈ భారం పడుతుందని అన్నారు. అయితే నిరసన తరువాత అసెంబ్లీ అడుగు పెడుతున్న టిడిపి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అసెంబ్లీ మెయిన్‌ గేట్‌ దగ్గర అడ్డుకున్నారు. ఈ సమయంలో, చీఫ్‌ మార్షల్‌ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి నుంచి చీఫ్‌ మార్షల్‌ ప్లకార్డ్‌ ను లాక్కున్నారు. అలాగే మిగతా వారి నుంచి కూడా లాక్కోండి అంటూ, మార్షల్స్ ని ఆదేశించటంతో, చంద్రబాబు ఫైర్ అయ్యారు. సీఎం ఉన్మాది అయితే, అధికారులు కూడా ఉన్మాదులవుతారా? అంటూ చీఫ్‌ మార్షల్‌పై చంద్రబాబు మండిపడ్డారు.

speaker 11122019 2

అయితే చంద్రబాబు సభలోకి వచ్చిన తరువాత కూడా, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, వైసీపీ ఎదురు దాడి కొనసాగిస్తూనే ఉంది. చంద్రబాబు పై పర్సనల్ కామెంట్స్ చేస్తూ, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలు పెట్టరు. ఇంగ్లీష్ మీడియం పై ప్రశ్నకు చంద్రబాబు మాట్లాడుతూ, ఇంగ్లీష్ మీడియంతో పాటుగా, తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉండాలి అంటూ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుకి ఇంగ్లీష్ రాదని, బ్రీఫీడ్ మీ అంటూ, వచ్చీ రాని ఇంగ్లీష్ మాట్లాడతారని ఎగతాళి చేసారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇస్తూ, తనకు వచ్చిన ఇంగ్లీష్ తోనే, విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చానని, అలాగే ఎంతో మంది దేశాధినేతలు ఇక్కడకు వచ్చారని చెప్పారు.

speaker 11122019 3

దీనికి చెవిరెడ్డి వివరణ మాట్లాడుతూ, నేను పీహెచ్డీ చేసానని, చంద్రబాబు 40 ఏళ్ళ నుంచి పీహెచ్డీ చేస్తూనే ఉన్నారని అన్నారు. ఈ విషయం పై, మాట్లాడేందుకు మైక్ అడగగా, మీకు మైక్ ఇచ్చేది లేదు, ఈ టాపిక్ అయిపొయింది అంటూ, ఇదేమన్నా ఖవాలి డ్యాన్సా? ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రతిపక్ష నేత చంద్రబాబు. చైర్‌లో నుంచి లేచి మరీ స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. మర్యాదగా ఉండాలంటూ స్పీకర్‌నుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీరు మర్యాదగా ఉంటే, మేము మర్యాద ఇస్తాం అని అనటంతో, స్పీకర్ నే మర్యాదగా ఉండమంటారా అంటూ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు అంటూ తమ్మినేని అన్నారు. తరువాత వైసీపీ ఎమ్మెల్యేలకు అవకాసం ఇచ్చి, చంద్రబాబుకు పిచ్చి అని, చంద్రబాబుని హాస్పిటల్ లో చూపించాలని, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, స్పీకర్ వారికి మాట్లాడే అవకాసం ఇచ్చారు.

జూన్ నెలలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలో, మా పార్టీ అసలు ఫిరాయింపులు ప్రోత్సహించదు, మేము రాజీనామా చేసిన తరువాతే, పార్టీలోకి చేర్చుకుంటాం అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పటం, దానికి స్పీకర్ తమ్మినేని కూడా సమర్ధిస్తూ మాట్లాడటం చూసాం. మొన్నా మధ్య , నలుగురు టిడిపి ఎంపీలు, బీజేపీలోకి విలీనం అయితే, అలా ఎలా కుదురుతుంది, నేను అయితే సస్పెండ్ చేస్తాను అంటూ తమ్మినేని, వెంకయ్య పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఇప్పుడు జరుగుతుంది మాత్రం వేరు. తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన టిడిపి అధినేత చంద్రబాబు పై వ్యక్తిగత దూషణలకు దిగటంతో, టిడిపి షోకాజ్ నోటీస్ ఇచ్చి, సస్పెండ్ చేసింది. అయితే సస్పెండ్ మాత్రమే చేసింది, బర్తరఫ్ చెయ్యలేదు. అయితే మొన్న వంశీ అసెంబ్లీలో మాట్లాడుతూ, తనకు వేరే సీటు ఇవ్వాలని కోరటం, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరటం తెలిసిందే.

vamsi 11122019 2

దానికి స్పీకర్ కూడా అంగీకరిస్తూ, వేరే స్థానం కేటాయించారు. అయితే ఈ చర్య పై తెలుగుదేశం పార్టీ ఈ రోజు స్పీకర్ ను కలిసి ఒక లేఖ అంద చేసింది. ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేసి మరీ, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సభ్యుడితో మాట్లాడించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని తిట్టించడం గతంలో ఎప్పుడూ లేదని, సభలో మున్నెన్నడూ లేని దుష్ట సాంప్రదాయాలు ఇటీవల కాలంలో పెచ్చుమీరడం ప్రజాస్వామ్య వాదులకు ఆందోళన కలిగిస్తోందని టిడిపి ఆ లేఖలో పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీని సస్పెండ్‌ చేశామేగాని పార్టీనుంచి బహిష్కరించలేదని, సస్పెన్షన్‌లోనే ఉన్నాడంటే ఆయన ఇంకా పార్టీ సభ్యుడేననేది మీకు తెలియందికాదని,ఇంకా టిడిపి సభ్యుడిగానే ఉన్నశ్రీ వల్లభనేని వంశీమోహన్‌ కి మీరు ప్రత్యేకంగా సీటు ఎలా కేటాయిస్తారు..? అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.

vamsi 11122019 3

పార్టీనుంచి సస్పెన్షన్‌ కు గురైన సభ్యుడికి నిన్న సభలో మాట్లాడే అవకాశం కల్పించడం ఒక తప్పిదం అయితే, తనకు బి ఫామ్‌ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడినే ఆయన ద్వారా నిండుసభలో తిట్టించడం మరో తప్పిదం. ఆయన అడగగానే ప్రత్యేక సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించడం ఇంకో దుష్ట సాంప్రదాయం అంటూ టిడిపి స్పీకర్ ద్రుష్టికి తీసుకువచ్చింది. అయితే దీనికి స్పీకర్ సమాధానం ఇస్తూ, తనకున్న విచక్షణాధికారంతో వంశీకి మాట్లాడే అవకాశం ఇచ్చానని చెప్పారు. ప్రత్యేక సభ్యునిగా గుర్తించాలన్న వినతిని గౌరవిస్తున్నామని, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండని వంశీకి చెప్పానని స్పీకర్ అన్నారు. అయితే విచక్షణాధికారం వినియోగించి, పార్టీలో ఉన్న వ్యక్తికి, వేరే స్థానం ఎలా ఇస్తారని, టిడిపి ఆశ్చర్యంతో ప్రశ్నిస్తుంది. ఏది ఏమైనా స్పీకర్ విచక్షణాధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరు కాబట్టి, ఇప్పుడు టిడిపి ఏమి చేస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read