అసెంబ్లీ సమావేశాలు మొదలైన దగ్గర నుంచి, అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అందరూ, లోకేష్ భజన చేస్తున్నారు. సభలో లేని లోకేష్ పై, అనేక ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ శాసనమండలిలో ఉంటే, అక్కడ మాత్రం, ఎవరూ ఏమి మాట్లాడటం లేదు. దీంతో అసెంబ్లీలో తన పై ఇష్టం వచ్చినట్టు ఎగతాళిగా మాట్లాడుతున్న వారికి, ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, అందరికీ సమాధానం చెప్పాలి. ముందుగా, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన అనేక తప్పుల వీడియోని, ప్లే చేసారు. లోకేష్ మాటల్లో "జ‌గ‌న్ త‌ప్పుడు మాట‌లు, లెక్క‌లు అంద‌రూ చూశారు క‌దా! తెలుగులో ఎన్ని త‌ప్పులు ప‌లికారో మ‌నం చూశాం. మేథ‌మెటిక్స్‌లో కూడా వీక్‌గా ఉన్న‌ట్టున్నారు. ఇంగ్లీష్‌లో కూడా అనేక త‌ప్పులు ప‌లుకుతున్నారు. న‌న్ను ప‌ప్పు ప‌ప్పు అని ప‌దిసార్లు అంటున్నారు. ఈ వీడియో చూస్తే జ‌గ‌నే గ‌న్నేరు ప‌ప్పు అని తేలిపోయింది. వైసీపీ పేటీఎం బ్యాచులూ మీ గ‌న్నేరు ప‌ప్పుపై స్పంద‌నేంటి? వైకాపా ప్ర‌జాప్ర‌తినిదులారా మీ నాయ‌కుడే ప‌ప్పుగా నిలిచాడు. స‌భ్యుడిని కాక‌పోయినా శాస‌న‌స‌భ‌లో న‌న్ను టార్గెట్ చేస్తున్నారు. స‌భ‌లో మంత్రులు, ఎమ్మెల్యేలంతా నా పేరు ప్ర‌స్తావించారు. చంద్ర‌బాబు త‌రువాత న‌న్ను ఎక్కువగా విమ‌ర్శించారు. స‌భ‌లో లేని వ్య‌క్తి గురించి మాట్లాడ‌టం స‌భా సంప్ర‌దాయాలకు విరుద్ధం. స్పీక‌ర్ కూడా దీనిపై ఏమీ మాట్లాడ‌క‌పోవ‌డం విచార‌క‌రం. నేను పై చ‌దువుల‌కు అమెరికా వెళ్లాను. వ‌ర‌ల్డ్ బ్యాంక్‌లో రెండేళ్లు ప‌నిచేశాను. స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేశాను. దాదాపు ఎనిమిదేళ్లు నేను అమెరికాలో ఉన్నాను. దీని వ‌ల్ల నేను తెలుగు మాట్లాడేట‌ప్పుడు ఒక ప‌దం అటూ ఇటూ వేసి ఉండొచ్చు. దీన్నే ప‌ట్టుకుని తెలుగు మాట్లాడ‌ట‌మే రాద‌ని అస‌త్య ప్ర‌చారం చేశారు. నేను జ‌యంతిని వ‌ర్థంతి అని ప‌ల‌క‌వ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఏమైనా అన్యాయం జ‌రిగిందా? దీనివ‌ల్ల పెట్టుబ‌డులు వెన‌క్కి వెళ్లిపోయాయా? "

"పోల‌వ‌రం ప్రాజెక్టు ఆగిపోయిందా? అమ‌రావ‌తి ప‌నులు ఆగిపోయాయా? నేను సూటిగా ప్ర‌శ్నిస్తున్నాను. 11 కేసుల్లో ఉన్న వ్య‌క్తి జ‌గ‌న్‌. 43 వేల కోట్లు జ‌గ‌న్ దోచుకున్నార‌ని సీబీఐ ఈడీ చెప్పింది. ఈ కేసుల్లో 16 నెల‌లు జైలులో ఉన్నారు జ‌గ‌న్‌. ఇటువంటి జ‌గ‌న్ ఈ రోజు నీతులు చెబుతున్నారు. పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ ఎల‌క్ర్టానిక్స్ శాఖ‌ల మంత్రిగా ఏపీకి సేవ‌ చేశా. ఇది నేను గ‌ర్వంగా ప్ర‌క‌టించ‌గ‌ల‌ను. ఉపాధి హామీ నిధులు గ‌రిష్టంగా ఏపీకి తీసుకొచ్చా. 25 వేల కిలోమీట‌ర్లు సీసీ రోడ్లు వేయించాను. మ‌రుగుదొడ్లు, శ్మ‌శానాల‌కు ప్ర‌హారీ గోడ‌లు క‌ట్టాం. ఎప్పుడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చేశాం. ఎల్ఈడీ వీధి దీపాలు వేశాం. 53 అవార్డులు సాధించాం. మంత్రిగా ఏపీ అభివృద్ధిలో భాగ‌స్వామిన‌య్యాను. మ‌రోవైపు టీడీపీ కార్య‌ద‌ర్శిగా క్రియాశీల‌కంగా ప‌నిచేశాను. 2014 మ‌హానాడులో కార్య‌క‌ర్త‌ల సంక్షేమ విభాగం ఏర్పాటుకు ప్ర‌తిపాదించాను. భార‌త‌దేశంలో ఏ పార్టీకి లేని విభాగాన్ని టీడీపీలో ఏర్పాటు చేశాం. టీడీపీ స‌భ్య‌త్వం తీసుకున్న వారికి ప్ర‌మాద‌బీమా క‌ల్పించాం. 4200 కుటుంబాల‌కు 84 కోట్ల రూపాయ‌లు ప్ర‌మాద‌బీమా అందించాం. కార్య‌క‌ర్త‌ల విద్య‌, వైద్య అవ‌స‌రాల‌కు సాయం అంద‌జేశాం. చంద్ర‌బాబు సొంత కొడుకుని గెలిపించుకోలేక‌పోయార‌ని ఆరోపిస్తున్నారు. నేను చెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్ముకునే బ్యాచ్ కాదు. నాన్న గెలిచిన చోటు నుంచే గెలిచి కాలర్ ఎగరేసే బ్యాచ్ కాదు నేను. టీడీపీ ఎక్క‌డ గెల‌వ‌లేదో అక్క‌డ్నించి గెల‌వాల‌నేది నా ల‌క్ష్యం. 1985 నుంచి టీడీపీ జెండా ఎగర‌ని నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరి. ఈ చ‌రిత్ర తిర‌గ‌రాయాల‌నే ఇక్క‌డ్నించి పోటీ చేసి ఓడిపోయాను. ఓడిపోయినా నియోజ‌క‌వ‌ర్గ‌ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నాను. వారానికి ఓ సారి జ‌గ‌న్ కోర్టుకెళ‌తారు. త‌న సెక్యూరిటీ వాళ్ల‌ను చూసి అరెస్ట్ చేయ‌డానికొచ్చారేమోన‌ని జ‌గ‌న్‌ భ‌య‌ప‌డ‌తారు. బెయిల్ ర‌ద్ద‌వుతుందేమోన‌నే భ‌యం. "

"నేను పుట్టేస‌రికి మా తాతగారు ముఖ్య‌మంత్రి. నేను స్కూల్‌కెళ్లేస‌రికి మా నాన్నగారు ముఖ్య‌మంత్రి. ఏ రోజూ నాపై ఒక్క ఆరోప‌ణ రాలేదు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌న్ను పెంచారు. ఒక ప‌దం త‌ప్పు మాట్లాడితే మా అమ్మ కొట్టేది. మీలాగ వీధిరౌడీల్లా పెర‌గ‌లేదు. మీలాగే అస‌భ్య‌క‌రంగా మాట్లాడొచ్చు కానీ ప‌ద్ద‌తి కాదు. మీ ప్ర‌భుత్వం వ‌చ్చి ఆరు నెల‌లైంది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ అన్నారు. ఏమైంది? ఐటీ కంపెనీల‌కిచ్చిన భూముల్లో అవినీతి అన్నారు ఏమైంది? నేను త‌ప్పు చేయ‌లేదు కాబ‌ట్టే మీరు నిరూపించ‌లేక‌పోయారు. హెరిటేజ్‌పైనా ఆరోప‌ణ‌ల‌కు దిగుతున్నారు. 1992లో ప్రారంభ‌మైన హెరిటేజ్‌ అంచెలంచెలుగా ఎదిగింది. అమ్మ‌, బ్రాహ్మ‌ణి అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి కంపెనీని అభివృద్ధి చేశారు. హెరిటేజ్ ప్రెష్ అమ్మేశామ‌ని చంద్ర‌బాబు చెప్పినా విన‌డంలేదు. ఫ్యూచ‌ర్ గ్రూపులో షేర్లున్నాయి కాబ‌ట్టి ఆ కంపెనీ మీదేన‌ని బుగ్గ‌న గారు అంటున్నారు. బుగ్గ‌న గారు ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో వివిధ కంపెనీల షేర్లు త‌న‌కున్న‌ట్టు పేర్కొన్నారు. అంటే ఆ కంపెనీల‌న్నీ బుగ్గ‌న గారివేనా? ఆ కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెంచితే బుగ్గ‌న గారు బాధ్య‌త వ‌హిస్తారా? జ‌గ‌న్ సాక్షి ప్రారంభించినప్పుడు 2 రూపాయ‌లకు అమ్మేవారు. అన్ని పేప‌ర్లూ 2 రూపాయ‌ల‌కు అమ్మాలంటూ ఉద్య‌మం చేశారు. ఇప్పుడు సాక్షి పేప‌రు 7 రూపాయ‌లు చేశారు. జ‌గ‌న్ గారు పాద‌యాత్ర‌లో అన్ని పెంచుతూ పోతాన‌ని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట త‌ప్ప‌కుండా అన్నీ పెంచుకుంటూ పోతున్నారు. ఇసుక, ఉల్లి, సాక్షి పేప‌ర్‌, ఆర్టీసీ టికెట్ల ధ‌ర పెంచారు. లిక్క‌ర్ రేటు పెంచారు..విద్యుత్ చార్జీలు పెంచేస్తారు. ఆన్‌లైన్‌లో ఒక మంచి వ‌స్తువు చూసి ఆర్డ‌ర్ ఇస్తాం. తీరా అది డెలివ‌రీ వ‌చ్చాక పాడైన వ‌స్తువు వ‌చ్చిన‌ట్టే ఉంది ఏపీ ప్ర‌జ‌ల ప‌రిస్థితి. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడుతుంటే టీడీపీపై దుష్ర్ప‌చారం చేస్తున్నారు. 2012 నుంచి నాపై ఇటువంటి అస‌త్య ప్ర‌చార‌మే చేస్తూ వ‌స్తున్నారు. స‌భ‌లో నేను లేక‌పోయినా నేనంటే ఎందుకంత భ‌యం? శాస‌న‌మండ‌లికి వ‌చ్చే మంత్రులు మాత్రం ఒక్క మాట మాట్లాడ‌టంలేదు. నేను ఉన్న స‌భ‌లో మాట్లాడ‌కుండా, లేని స‌భ‌లో మాట్లాడ‌ట‌మెందుకు? రండి మీ నాయ‌కుడిపై ఉన్న‌ కేసులు చ‌ర్చిద్దాం. గెలిచాక ఆరునెల‌ల్లో మంచి ముఖ్య‌మంత్రిని అనిపించుకుంటాన్నారు జ‌గ‌న్‌ ముంచే ముఖ్య‌మంత్రిగా నిలిచారు" అని లోకేష్ అన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై, గత 5 ఏళ్ళుగా ఎలాంటి ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో లోకేష్ పై, పని గట్టుకుని, ఒక బ్రాండింగ్ చేసారు. లోకేష్ మంత్రిగా రోడ్లు వేసినా, ఐటి కంపెనీలు తెచ్చినా, ఎలెక్ట్రోనిక్ కంపెనీలు తెచ్చినా, అవి మాత్రం ప్రజలకు గుర్తు లేకుండా, కేవలం నెగటివ్ ప్రచారం మాత్రమే గుర్తుకు వచ్చేలా, వైసీపీ సోషల్ మీడియాలో, లోకేష్ పై బ్రాండింగ్ చేసింది. అయితే ఇందులో ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక, ఛానెల్ అయిన సాక్షి పాత్ర కూడా ఇందులో ఎంతో ఉంది. ప్రతి తెలుగుదేశం నాయకుల మీద అసత్యాలు, బురద జల్లినట్టే, లోకేష్ పై కూడా, ఇలాంటి అసత్య కధనాలే వేసి నమ్మించే ప్రయత్నం చేసారు. అయితే, ఇందులో తెలుగుదేశం తప్పు కూడా ఉంది. ఎప్పటికప్పుడు, ఆ ప్రచారం తిప్పి కొట్టకుండా, వాళ్ళు ప్రచారం చేసింది నిజం, అని ప్రజలు నమ్మేలా, వీళ్ళు సైలెంట్ గా ఉండి పోయారు.

lokesh 10122019 2

అయితే, ఈ పరంపర, ఎన్నికల తరువాత కూడా జరుగుతుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించినా, ఇంకా అసత్య కధనాలతో, నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం సాక్షిలో ఒక కధనం వచ్చింది. "చినబాబు చిరు తిండి ఖర్చు 25 లక్షలు" అంటూ ఒక కధనం సాక్షి పేపర్ లో ప్రసారం అయ్యింది. అందులో కేవలం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ లో, లోకేష్ చిరు తిళ్ళు కోసం, 25 లక్షలు ఖర్చు అయ్యింది అంటూ అర్ధం వచ్చేలా ఒక బొమ్మ వేసి, వార్తా రాసారు. అందులో అనేక డేట్లు వేసి, ఈ రోజు ఇంత, ఈ రోజు ఇంతా అంటూ ఖర్చు చూపించారు. అయితే, నిజానికి, ఆ తేదీల్లో, లోకేష్ అక్కడ లేనే లేరు. అయినా, లోకేష్ ఉన్నట్టుగా ప్రచారం చేసి, ఒక కధనం అల్లారు. దీని పై లోకేష్ అప్పుడే అన్ని ఆధారాలతో, సోషల్ మీడియాలో స్పందించారు.

lokesh 10122019 3

ఇదే కధనాన్ని, డెక్కన్ క్రానికల్, ది వీక్ అనే పత్రికలు కూడా, సాక్షి న్యూస్ చూసి రాసాయి. అయితే, సాక్షి, డెక్కన్ క్రానికల్, ది వీక్ పత్రికలకు, నారా లోకేష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ కధనాల పై వాస్తవం ఇది అని, దీని పై మీరు సవరించుకోక పొతే, పరువు నష్టం దావా వేస్తానని ఆ నోటీస్ పంపించారు. ఈ నోటీస్ కు రియాక్ట్ అయిన, ది వీక్ , ఆ రోజు వేసిన కధనం తప్పు అని మా దృష్టికి వచ్చిందని, దీనికి క్షమాపణ చెప్తున్నామని, rejoinder ఇచ్చారు. అయితే సాక్షి, డెక్కన్ క్రానికల్ మాత్రం ఇంకా స్పందించలేదు. వారికి వంద కోట్ల దాకా, దావా పంపించే ఆలోచనలో లోకేష్ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు తప్పుడు కధనాలు రాస్తే, చూస్తూ ఊరుకోం అని, అంటున్నారు. మరో పక్క తెలుగుదేశం క్యాడర్ ఈ విషయం పై సంతోషంగా ఉన్నా, ఇలా అధికారంలో ఉన్నప్పుడే ఉండి ఉంటే, వ్యవహారం ఇంత వరకు వచ్చేది కాదని బాధ పడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ చేసిన ఆందోళనతో, తన సొంత పేపర్ తప్పు చేసింది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాట తప్పి, మడం తిప్పి, చివరకు తన సొంత పేపర్ పైనే తప్పు నేట్టేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇంతకీ ఏమి జరిగింది అంటే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీలో సన్నబియ్యం పై ప్రశ్న అడిగింది. ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తాం అని చెప్పి, ఇప్పుడు నాణ్యమైన బియ్యం ఇస్తాం అంటుంది, ఇది కరెక్ట్ ఏనా అంటూ, ప్రశ్న వేసారు. దీనికి పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ప్రభుత్వం ఎక్కడా సన్నబియ్యం అని చెప్పలేదని, మేము నాణ్యమైన బియ్యం మాత్రమే ఇస్తామని చెప్పమని, సమాధానం చెప్పారు. దీని పై అచ్చెంనాయుడు మాట్లాడుతూ, సన్న బియ్యం ఇస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన వీడియో మా దగ్గర ఉందని, అది అసెంబ్లీలో ప్లే చెయ్యాలని స్పీకర్ ని కోరారు. అయితే స్పీకర్ మాత్రం, ఆ విషయంలో ఏమి మాట్లాడటలేదు.

jagan 10122019 2

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక చోట్ల తిరిగి, సన్న బియ్యం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు మాట మారుస్తున్నారని, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అలాగే జూన్ నెలలో చేసిన రివ్యూ లో కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారని చెప్పారు. దానికి సంబంధించి సాక్షిలో వచ్చిన ఒక వార్తా చూపిస్తూ, సాక్షిలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారని, ఇది మీ గజెట్ ఏ కదా అని చెప్పారు. దీనికి సమాధానం ఏమి చెప్తారు అంటూ ప్రశ్నించారు. దీనికి స్పందించిన జగన్ మోహన్ రెడ్డి, అసలు సన్న బియ్యం అని నేను ఎక్కడా చెప్పలేదని, అసలు సన్న బియ్యం అనే మాటే ఎక్కడా లేదని, కావాలంటే తెలిసిన వారి దగ్గర నాలెడ్జ్ పెంచుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు.

jagan 10122019 3

అంతే కాదు, తాను రెండు నెలల క్రితం మాట్లాడిన వీడియో ప్లే చేసారు. తెలుగుదేశం పార్టీ పాదయాత్రలో ఇచ్చిన దాని గురించి అడుగుతుంటే, జగన్ మాత్రం రెండు నెలలు క్రితం మాట్లాడిన దాని పై వీడియో చూపించారు. అయితే టిడిపి మా వీడియో కూడా ప్లే చెయ్యండి అంటే మాత్రం చెయ్యలేదు. ఈ సమయంలో సాక్షి గురించి చెప్తూ, సాక్షి వారికి కూడా సన్న బియ్యం, నాణ్యమైన బియ్యం గురించి తేడా తెలియదు అని, సాక్షి తప్పుగా రాసింది అంటూ, తన సొంత పత్రిక పైనే జగన్ మోహన్ రెడ్డి తప్పు నెట్టేశారు. అయితే తెలుగుదేశం పార్టీ, అలాగే అయితే తప్పుడు రాతాలు రాసినందుకు, జీవో 2430 ద్వారా, సాక్షి పై కేసు పెట్టండి అంటూ, వ్యాఖ్యానించింది. మొత్తానికి, జగన్ చేతే, సాక్షిలో తప్పు రాతలు రాసారు అని తెలుగుదేశం పార్టీ చెప్పించింది.

రాష్ట్రంలో ప్రజలు ఉల్లిపాయల కోసం అల్లాడిపోతున్నారు. ఉల్లి కోయ్యకుండా, ఆ రేట్ చూస్తూనే, కన్నీళ్లు వచ్చే పరిస్థితి. రాష్ట్రం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం, రైతు బజార్ల ముందు బారులు తీరి, ఉదయం నుంచి సాయంత్రం దాకా నుంచుని, కేజీ ఉల్లిపాయలు ఇంటికి తీసుకువెళ్ళే పరిస్థితి. అయితే ఈ సమస్య పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీలో ప్రజల తరుపున పోరాడుతుంటే, అధికార వైసీపీ మాత్రం, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, కేవలం ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నిన్న అసెంబ్లీలో రోజా మాట్లాడుతూ, ఉల్లిపాయలు లేకపోతే చచ్చిపోతారు అనేలా మాట్లాడుతున్నారు అంటూ, వ్యాఖ్యలు చేసారు. అలాగే, ఈ రోజు వ్యవసాయ మంత్రి కన్న బాబు మాట్లాడుతూ, ఉల్లిపాయ నిత్యావసర వస్తువు కాదని చెప్పారు. ఇక జగన్ మోహన్ రెడ్డి అయితే, చంద్రబాబు హెరిటేజ్ లో, కిలో ఉల్లిపాయలు 200 కి అమ్ముతున్నారు అంటూ, ఎదురు దాడి ప్రారంభించారు.

bhuvanesari 10122019 2

అయితే దీని పై చంద్రబాబు నిన్న అసెంబ్లీ వేదికగానే, హెరిటేజ్ ఫ్రెష్ కు మాకు సంబంధం లేదు, హెరిటేజ్ ఫ్రెష్ ని, 2016 లోనే, ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళకు అమ్మేసాం అని చెప్పారు. అయినా సరే పదే పదే, హెరిటేజ్ ఫ్రెష్ లో చంద్రబాబు 200 కి అమ్ముతున్నారు అంటూ అసెంబ్లీలో చెప్తున్నారు. అయితే ఈ రోజు చంద్రబాబు జగన్ కి ఈ విషయంలో ఛాలెంజ్ కూడా చేసారు. హెరిటేజ్ ఫ్రెష్ నాదని నిరూపిస్తే, రాజీనామా చేస్తానని, లెగిసి ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నా అని చెప్పాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో గొడవ ఇలా ఉంటే, హెరిటేజ్ ఫ్రెష్ లో 200 లకు ఉల్లిపాయలను అమ్ముతున్నారంటూ అసెంబ్లీలో జగన్ చేసిన ఆరోపణల పై చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి స్పందించారు.

bhuvanesari 10122019 3

ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, "అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను అసెంబ్లీ సమావేశాలను చూడను. హెరిటేజ్ ఫ్రెష్ ఇప్పుడు మాకింద లేదు. హెరిటేజ్ ఫ్రెష్ ఫ్యూచర్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తోంది" అని వ్యాఖ్యానించారు. కాగా, ఉల్లి ధరల పెరుగుదలపై నారా భువనేశ్వరి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని అనంరు. కిలో ఉల్లిపాయలు రూ.150 లకు అమ్మడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉల్లి ధరలతో గృహిణిగా తాను కడా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ఇంత ఎక్కువ ధరకు ఉల్లి ధరలను తాను ఇంత వరకు చూడలేదన్నారు. ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read