ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆడపిల్లల పై అమానుషంగా పడుతున్న మృగాలకు ఎలాంటి శిక్ష పడాలి. ఎంత త్వరగా పడాలి. చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి. వెంటనే న్యాయం ఎలా జరగాలి. ఇలా చర్చలు అన్నీ గత వారం రోజులుగా, దీని చుట్టూ తిరుగుతున్నాయి. హైదరాబాద్  కేసులో, నలుగురినీ పోలీసులు ఎన్కౌం-టర్ చెయ్యటంతో, ఇది కరెక్ట్ అని కొంత మంది, ఏదైనా చట్టం ద్వారా చెయ్యాలని, అందుకు అనుగుణంగా, సత్వర న్యాయం జరిగేలా చూడాలని, కొంత మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే, ఏ టీవీ ఛానల్ పెట్టినా ఇదే చర్చ జరుగుతుంది. చనిపోయినా ఆ నలుగురుకీ ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి, ఎన్కౌం-టర్ చేసారని, మరి మిగతా కేసుల్లో ఉన్న వారిని కూడా అలా ఎప్పుడు చేస్తారు అంటూ, నేషనల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే కోవలో, వారు ముందుగా, ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసారు. ఎంపీలుగా ఉన్న వారి పై కూడా, రే-ప్ కేసులు ఉన్నాయని, వారిని ఎప్పుడు హ్యంగ్ చేస్తున్నారు అంటూ, ట్రెండ్ చేస్తున్నారు.

madhav 08122019 2

ఈ సందర్భంగా, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ పేరు కూడా వచ్చింది. ఆయన పై కూడా ఒక రే-ప్ కేసు ఉండటంతో, ఆయణ ఫోటో చూపిస్తూ, వీళ్ళా మన ప్రజా ప్రతినిధులు, వీరి సంగతి ఏంటి అంటూ, నేషనల్ మీడియా ప్రశ్నిస్తుంది. గోరంట్ల మాధవ్, పోలీస్ గా పని చేస్తూ, రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పై, నాలుగు వరకు వివిధ కేసులు ఉన్నాయి. అందులో ఒకటి, ఐపిసి-376, రే-ప్ కేసు. మరొకటి ఐపీసీ - 302 మర్డ-ర్ చేసారని అభియోగం. అలాగే ఐపిసి - 506 తో రెండు కేసులు ఉన్నాయి. రే-ప్ కేసుకు సంబంధించి, ఇది ఆయన పై, 2012లోనే నమోదు అయ్యింది. ఇది ఒక యువ జంటని అదుపులోకి తీసుకున్న సమయంలో జరిగిన ఘటనగా తెలుస్తుంది.

madhav 08122019 3

ఓ కేసులో ఓ యువజంటను అదుపులోకి తీసుకున్న గోరంట్ల మాధవ్, ఆ జంటలోని మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. అత్యా-చారం చేయబోయారని ఆ మహిళ కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో ఉంది. అలాగే ఆయాన నోట్ల రద్దు సమయంలో, ఒక వ్యక్తీని గొడ్డుని బాదినట్టు బాదిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దాని పై కూడా ఆయన మీద కేసు నమోదు అయ్యింది. ఇలా రే-ప్ కేసు ఉన్న మాధవ్ పై ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు, అంటూ నేషనల్ మీడియా ప్రశ్నిస్తుంది. అయితే మాధవ్ మాత్రం, ఈ కేసు ఇంకా విచారణలో ఉందని చెప్తున్నారు. విచారణలో ఉండగానే, ఇలా ఎలా మాట్లాడుతారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న చర్చే అది. రే-ప్ కేసుల్లో సత్వర న్యాయం ఉండాలని.

ఎన్నికల ముందు వరకు, అటు కేసీఆర్ కి, ఇటు జగన్ కు, అలాగే పైన ఉన్న బీజేపీకి, ఉమ్మడి టార్గెట్ చంద్రబాబు. అందుకే అందరూ లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకుని, వాళ్ళు అనుకున్నది సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా పరవాలేదు, మాకు రాజకీయం ముఖ్యం అనుకుని సాధించారు. అయితే ఎన్నికల ముందు ఉన్న స్నేహం, ఇప్పుడు ఈ మూడు పార్టీలకు లేదు. ఎన్నికల తరువాత, అటు తెలంగాణాలో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు రావటంతో, బీజేపీ తమకు ఎర్త్ పెడుతుందని, కేసీఆర్ గ్రహించారు. అలాగే ఎన్నికల ముందు, కేసీఆర్ - జగన్, కన్న కలలు వేరుగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ రావటం కష్టమని, ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ, ఎన్నికల ముందే తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారని, ఇద్దరం జట్టుగా ఉండి, బీజేపీని వదిలించుకుందామని, వేసిన ఎత్తులు, బీజేపీ అధిష్టానానికి తెలియటంతో, ఎన్నికల తరువాత నుంచే, ఇద్దరినీ పక్కన పెట్టటం మొదలు పెట్టరు.

jagan 08122019 2

మోడీ మళ్ళీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి రావటంతో, విధేయత నటిస్తూ వస్తున్నారు. కాని బీజేపీ ఏ చిన్న సూచన ఇచ్చినా, జగన్ మాత్రం పట్టించుకోవటం లేదు అనేది కూడా బీజేపీ ఆగ్రహానికి గురి చేసింది. పీపీఏల విషయంలో కాని, పోలవరంలో రివర్స్ టెండరింగ్ లో కాని, ఎక్కడా జగన్ తమ చెప్పిన మాట వినటం లేదని, కాని విన్నట్టే నటిస్తూ, వినయం నటిస్తున్నారని, బీజేపీ అధిష్టానం గ్రహించింది. అదీ కాక, రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతున్న మత మార్పిడులు పై కూడా బీజేపీ ఆగ్రహంగా ఉందని చెప్తున్నారు. అందుకే అమిత్ షా, ఎప్పటికప్పుడు జగన్ ని దగ్గరకు రానివ్వటం లేదని తెలుస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్ళినా, ఒకటికి రెండు సార్లు వెయిట్ చేపించి, వెనక్కు పంపించి వేస్తున్నారు అంటే, అదే జగన్ కు ఎంతో అవమానం. అదీ కాక, సామాన్య ఎంపీలకు, అదే సమయంలో అపాయింట్మెంట్ ఇస్తున్నారు.

jagan 08122019 3

అయితే తాజాగా, మరో సంఘటన కూడా బీజేపీ అధిష్టానికి ఆగ్రహం తెప్పించిందని, ఈ రోజు ఒక ప్రాముఖ పత్రికలో వార్తా కధనం వచ్చింది. జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమికి జగన్‌ ఆర్థిక సహాయం చేస్తున్నారనే, సమాచారం బీజేపీ వద్ద ఉందని, ఆ కధనం సారంశం. దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుని, పరపతి పెంచకునే పనిలో జగన్ ఉన్నారని సమాచారం. అయితే, ఈ ప్రయత్నాలు అన్నీ బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. అందుకే అటు అపాయింట్మెంట్ లు ఇవ్వకుండా, ఇటు తగినన్ని నిధులు కూడా విడుదల చెయ్యకుండా, అటు కేసీఆర్ ని , ఇటు జగన్ ను కూడా ఇబ్బంది పెడుతున్నారని, ఢిల్లీ టాక్. అయితే ఈ క్రమంలో, జగన్, కేసీఆర్ మధ్య దూరం పెంచటంలో, బీజేపీ సక్సెస్ అయ్యింది. అన్ని వైపుల నుంచి ఇబ్బంది పెట్టి, తమ జగన్ ని, కేసీఆర్ ని, తమ దారికి తెచ్చుకునే వ్యూహంలో భాగంగానే, బీజేపీ ఇలా చేస్తుందా అనే సందేహం కూడా కలుగుతుంది. మరి, ఈ గేమ్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు ఎడాపెడా చార్జీలు పెంచేసి, సామాన్యుల నడ్డి విరగ్గోడుతున్నారు అంటూ, అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, పాదయాత్రలో ఊరు ఊరు తిరుగుతూ, చెప్పిన మాట ఇది. నిజానికి చంద్రబాబు, 5 ఏళ్ళ కాలంలో, కేవలం 2015లో, 5 పైసల వరకు ఆర్టీసీ చార్జీలు పెంచారు, అలాగే కరెంటు చార్జీలు అసలు పెంచనే లేదు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, కేవలం ఆరు నెలల్లోనే, ఆర్టీసీ చార్జీలు పెంచేసి, ప్రజలకు షాక్ ఇచ్చారు. ఆరు నెలల సందర్భంగా, ప్రజలకు గిఫ్ట్ ఇస్తున్నాం అన్నట్టు, చార్జీలు పెంచేసారు. పల్లె వెలుగు, సిటీ సర్వీసులకు కిలోమీటర్‌కు 10 పైసలు చొప్పున, మిగతా అన్ని సర్వీసులకు కిలోమీటర్‌కు రూ. 20 పైసలు చొప్పున పెంచుతున్నట్లు మంత్రి పెర్ని నాని ప్రకటించారు. అయితే ఈ చార్జీలు ఎప్పటి నుంచి అమలు లోకి వస్తాయి అనేది త్వరలోనే చెప్తాం అని, ఆర్టీసీ ఎండీ, త్వరలోనే ముందుకు వచ్చి, వివరాలు చేప్తరాని చెప్పారు.

jagan 07122019 1 1 2

ఆర్టీసీ నష్టాల్లో ఉందని, అందుకే ఛార్జీలు పెంచక తప్పట్లేదని మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. అయితే, ఆర్టీసి ఛార్జీల పెంపు పైటిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడు పత్రికా ప్రకటనలో వైసిపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. " పల్లెవెలుగు, సిటి సర్వీసులు కిమీ కు 10పైసలు, మిగిలిన వాటిపై కిమీ కు 20పైసలు పెంచడాన్ని ఖండించిన అచ్చెన్నాయుడు. సీఎం ఆమోదించారని మంత్రి పేర్ని నాని చెప్పడం ప్రజలను వంచించడమే. ప్రజలపై పైసా భారం వేయనని పాదయాత్రలో జగన్ చెప్పారు. పన్నులు, ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలను నమ్మించారు. 6నెలల్లోనే ఆర్టీసి ఛార్జీలు పెంచడం ప్రజలను మోసగించడమే. జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మరోసారి రుజువైంది. ఆర్టీసి ఛార్జీల పెంపు నిర్ణయం జగన్ చేతగానితనానికి నిదర్శనం. ఆర్టీసి రూ.1200కోట్ల నష్టాలలో ఉందని చెప్పడం హాస్యాస్పదం. టిడిపి 5ఏళ్ల పాలనలో పేదలపై భారం మోపలేదు. భారాలు వేయకుండానే ఆర్టీసిని బలోపేతానికి చర్యలు చేపట్టాం. బస్సులు కొనడానికి భారీగా నిధులు ఇచ్చాం. ఆర్టీసి కార్మికులకు 42% ఫిట్ మెంట్ ఇచ్చినా ప్రజలపై భారం వేయలేదు."

jagan 07122019 1 1 3

"రూ.16వేల కోట్ల ఆర్ధికలోటులో కూడా ప్రజలపై భారాలు వేయని ఘనత టిడిపిదే. కరెంటు ఛార్జీలు,ఆర్టీసి ఛార్జీలు పెంచేది లేదని చెప్పాం, ఆచరించి చూపించాం. అలాంటిది వైసిపి ప్రభుత్వం పేదలను దారుణంగా మోసగించింది. వైసిపి పాలనలో పవర్ ఉండదు, పవర్ ఛార్జీలు పెంచుతాం అంటారు. ఆర్టీసిలో వసతులు పెంచరు, ఛార్జీలు పెంచుతాం అంటారు. ఒకవైపు ఉల్లి ధరలు విపరీతంగా పెంచేశారు. మరోవైపు ఆర్టీసి ఛార్జీలు పెంచుతున్నారు. సామాన్యుడి నడ్డి విరగ్గొట్టడమే వైసిపి ధ్యేయంగా పెట్టుకుంది. ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం. టిడిపి వెల్ఫేర్ స్కీమ్ లు అనేకం రద్దు చేసింది. ఆదరణ 2, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, ఫుడ్ బాస్కెట్ అన్నీ రద్దు చేసింది. వైసిపి తెచ్చిన పథకాల్లో అన్నీ ఆంక్షలు, కోతలు పెట్టింది. పేదల సంక్షేమాన్ని కాలరాయడమే ధ్యేయంగా సీఎం జగన్ వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. సంక్షేమం ముసుగులో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. రాష్ట్రాన్నే ఏకంగా అమ్మేయాలని చూస్తున్నారు. వీటన్నింటికి తగిన మూల్యం చెల్లించక తప్పదు" అంటూ అచ్చెన్నాయుడు అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఒకసారి అనుకున్నారు అంటే, మొండిగా వెళ్ళిపోతారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరి మాట వినరు. విద్యుత్ పీపీఏల విషయంలో, వివిధ దేశాలు,కేంద్రానికి ఉత్తరం రాసినా, కేంద్రం అనేక సార్లు అభ్యంతరం చెప్పినా, విద్యుత్ ఒప్పందాల సమీక్ష్ చేసి తీరుతాం అంటూ, దాదపుగా 5 నెలలు అలా మొండిగా ఉన్నారు. తరువాత, అన్నీ కాదు, మాకు అనుమానం ఉన్న వాటి మీదే సమీక్ష చేస్తాం అన్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాగే, జగన్ ఈ ఆరు నెలల్లో తీసుకున్న అనేక నిర్ణయం పై, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలోను, అనేక విమర్శలు వచ్చాయి. అయితే, జగన్ మాత్రం, ఎక్కడా వెనక్కు తగ్గేది లేదు అనే విధంగా, సంకేతాలు ఇచ్చే వారు. అయితే అనూహ్యంగా సోషల్ మీడియాలో వచ్చిన ఒత్తిడికి, జగన్ వెనక్కు తగ్గారు. సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో వచ్చిన ఒత్తిడికి వెనక్కు తగ్గి, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.

housego 08122019 2

ఒక పక్క రాష్ట్రం తీవ్ర ఆర్దిక సంక్షోభంలో ఉంటే, జగన్ మోహన్ రెడి సొంత ఇళ్ళు, క్యాంప్ ఆఫీస్, హైదరాబాద్ లోటస్ పాండ్, ఇలా అన్ని చోట్లా, ప్రభుత్వ ఖర్చులతో అదనపు సౌకర్యాలు సమకూర్చుకున్నారు. ఇప్పటి వరకు, తన ఇళ్ళ కోసం, దాదాపుగా 16.50 కోట్ల ఖర్చు అయ్యింది. ఇదంతా ప్రభుత్వ సొమ్ము అని, ప్రభుత్వ సొమ్ముతో, సొంత భవనాలకు, అదనపు హంగులు ఏమిటి అంటూ, సోషల్ మీడియాతో పాటుగా, నేషనల్ మీడియాలో కూడా జగన్ నిర్ణయాన్ని ఏకి పడేసారు. ముఖ్యంగా తన ఇంటి కిటికీల కోసం, 73 లక్షలు ఖర్చు చెయ్యటం, తీవ్ర విమర్శలు పాలు అయ్యింది. అలాగే వారం రోజుల క్రిందట కూడా, తన ఇంట్లో ఫర్నిచర్ కోసం 39 లక్షలు, లోట్‌సపాండ్‌లోని నివాసంలో అదనపు సదుపాయాలకోసం మరో రూ.24.50 లక్షలు కేటాయించారు.

housego 08122019 3

దీంతో ఈ చర్యలు తీవ్ర వివాదస్పదం అయ్యాయి. కేవలం ఏడు నెలల క్రిందట కట్టన తాడేపల్లి ఇంటికి, ఇన్ని ఖర్చులా అంటూ ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. 17 కోట్లతో, ఓక పెద్ద బంగ్లానే నిర్ణయం చెయ్యొచ్చని విమర్శలు వచ్చాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, సోషల్ మీడియా దెబ్బకు వెనక్కు తగ్గింది. జగన్ ఇంటి సదుపాయాల కోసం, ఇచ్చిన కొన్ని జీవోలు రద్దు చేసారు. రద్దయిన పనుల విలువ రూ.2.87 కోట్లుగా తేల్చారు. మొత్తం ఆరు జీవోలు, వివిధ పనులు రద్దు చేస్తూ వచ్చాయి. అయితే వీటిని ఏ కారణంగా రద్దు చేస్తున్నారు అనే విషయం మాత్రం స్పష్టత లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు మేరకే, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తుంది. మొత్తానికి, సోషల్ మీడియా దెబ్బకు, ప్రభుత్వం వెనక్కు తగ్గి, ప్రభుత్వ ఖజానాకు, రూ.2.87 కోట్లు మిగిల్చిందనే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read