తెలుగునాట సంచలనం సృష్టించిన అయేషామీరా కేసు, 12 ఏళ్ళ తరువాత మళ్ళీ వార్తల్లో నిలిచింది. వైఎస్ఆర్ ముఖ్యంత్రిగా ఉన్న సమయంలో, ఈ కేసు పెను సంచలనం అయ్యింది. అప్పటి వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మనవుడు, అయేషామీరాను రే-ప్ చేసి, చంపేసారని, కాని అప్పటి ప్రభుత్వం దోషులను వదిలేసిందని అయేషామీరా తల్లి ఆరోపణ. అయితే 12 ఏళ్ళ తరువాత, ఈ కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. సిబిఐకి కొన్ని అనుమానాలు రావటంతో, ఈ కేసు పై విచారణలో భాగంగా, ఈ రోజు అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో, ఈ రోజు రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 2007 డిసెంబర్ 27న, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో అయేషా మీరా ఉదంతం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపాధ్యంలో ఈ రోజు అయేషామీరా మృతదేహానికి రీ పోస్టు మార్టం చేస్తున్న నేపధ్యంలో, అయేషామీరా తల్లి, షంషాద్‌ బేగం, వైసీపీ ఎమ్మెల్యే రోజా పై సంచలన ఆరోపణలు చేసారు.

roja 14122019 2

అప్పట్లో రోజా మా పక్షాన నిలిచి హడావిడి చేసారని, మా అమ్మాయి హత్య నిందితులు ఎవరో తమకు తెలుసని, అప్పుడు తమ వాదనకు మద్దుగా నిలిచి రోజా, గత 10 ఏళ్ళుగా మా వైపు కూడా చూడటం లేదని అన్నారు. ఆమె మా పై ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో, చెప్పాలని నిలదీశారు. ఒక వర్గం పై దాడి చేస్తేనే స్పందిస్తారా, మా లాంటి వారిని పట్టించుకోరా అంటూ రోజాని నిలదీశారు. తన కూతురిని చంపిందెవరో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తెలుసని ఏమే తల్లి అన్నారు. అన్ని విషయాల్లో హడావిడి చేసే రోజా, మా గురించి అసెంబ్లీలో రోజా ఎందుకు మాట్లాడటం లేదని, ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మధ్యతరగతి వారికి, పేదలకు ఎప్పుడూ న్యాయం జరగదని చెప్పారు.

roja 14122019 3

ఆంధ్రప్రదేశ్ లో ఆయేషా చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేసారు. న్యాయం కోసం 12 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తాన్నామని అన్నారు. రీపోస్టుమార్టం అనేది తమ మత ఆచారాలకు విరుద్ధమని, అయనా నిజం బయటకు వస్తుంది, దోషులు ఎవరో సిబిఐ గుర్తిస్తుంది అనే నమ్మకంతోనే, ఒప్పుకున్నామని అన్నారు. దోషులు గురించి మేము మాట్లాడుతుంటే, తమ పై, కోటి రూపాయలకు దావా వేస్తాం అని బెదిరిస్తున్నారని, తమ వద్ద కోటి పైసలు కూడా లేవని, ఏమి చేస్తారో చేసుకోండి అంటూ ఆమె వ్యాఖ్యలు చేసారు. గతంలో తమకు 25 లక్షలు ఇస్తాం, కేసు మాఫీ చెయ్యాలని, అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసారు. ఇప్పటికైనా తమ కూతురుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.

సోమవారం నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటమే పనిగా వైసీపీ పెట్టుకుందని, ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబుని పర్సనల్ గా టార్గెట్ చేసి, ఆయన్ను కించపరచటమే పనిగా పెట్టుకున్నారు. దీని వెనుక వైసీపీ వ్యూహం ఏమిటో కాని, చంద్రబాబు మాత్రం, వైసీపీకి లొంగటం లేదు. అసెంబ్లీలోనే ఉంటూ, అధికార పక్షాన్ని నిలదీస్తూనే ఉన్నారు. అధికార పక్షం ఎంత కించపరిచినా, చంద్రబాబు మాత్రం, ఎక్కడా వెనకడుగు వెయ్యటం లేదు. ఇదే కోవలో, నిన్న మార్షల్స్ చంద్రబాబుని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా చంద్రబాబునే, గేట్లు మూసేసి ఆపేయటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అనూహ్యంగా వైసీపీ, ఇది కూడా తమకు అనుకూలంగా మలుచుకుంది. చంద్రబాబే మార్షల్స్ పై దాడి చేసారు అంటూ, కొన్ని క్లిప్పింగ్స్ అసెంబ్లీలో ప్లే చేసారు. అందులో చంద్రబాబుతో పాటుగా, ఇతర టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మేల్సీలు వస్తూ ఉండగా, అక్కడ అసెంబ్లీ గేట్లు మూసేసారు.

assembly 13122019 2

ఈ సందర్భంగా, టిడిపి నేతలకు, మార్షల్స్ మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఇదే సమయంలో గేటు ఎంతకీ తెరవకపోవటంతో, చంద్రబాబు ఆగ్రహంగా ముందుకు వచ్చి, గేటు తియ్యమని, చీఫ్ మార్షల్ పై అరిచారు. అయితే ఆయన బాస్టార్డ్ అంటూ తిట్టారని, వైసీపీ హడావిడి చేసింది. చంద్రబాబు ఒక ఉద్యోగిని బాస్టార్డ్ అంటూ తిట్టారని, చంద్రబాబుని క్షమాపణ చెప్పాలని, లేకపోతె అసెంబ్లీ నుంచి సస్పెండ్ చెయ్యాలని వైసీపీ కోరింది. అయితే చంద్రబాబు మాత్రం, తాను బాస్టర్డ్ అని అనలేదని, కావాలంటే రికార్డులు చూసుకోండి అంటూ చెప్పటంతో, ప్రభుత్వం చంద్రబాబు పై చర్యలు తీసుకోవాల్సిందిగా తీర్మానం ప్రవేశ పెట్టింది. ఆ అధికారాలు అన్నీ సభ స్పీకర్ కు ఇచ్చింది.

assembly 13122019 3

అయితే ఉదయం నుంచి చంద్రబాబుని, ఈ అసెంబ్లీ సెషన్ అయ్యేంత వరకు సస్పెండ్ చేస్తారని, ప్రచారం జరిగింది. మీడియా వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచారం జరగటంతో, చంద్రబాబుని సస్పెండ్ చెయ్యటం ఖాయంగా అందరూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ సస్పెన్షన్ నిర్ణయం ఆగిపోయింది. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ స్పెకర్ ను కలిసి, ఒక రిప్రజంటేషన్ ఇచ్చి, జగన్ పై చర్యలు తీసుకోవాలని, ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చింది. చంద్రబాబు అనని మాటలు, అన్నట్టుగా సభను తప్పుదోవ పట్టించారని, నిజానికి చంద్రబాబు "నో క్వశ్చన్" అని చంద్రబాబు అంటే, దాన్ని వక్రీకరించారని, కావాలంటే వీడియో చూడండి అని చెప్పటంతో, చంద్రబాబు పై సస్పెన్షన్ నిర్ణయం అమలు కాలేదు. ఆ వీడియో చూస్తే నిజంగానే, "నో క్వశ్చన్" అని చంద్రబాబు అన్నట్టు ఉంది. మరి స్పీకర్ దీని పై సోమవారం అయినా, ఏమైనా నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.

గత ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎక్కడా క్లారిటీ ఇవ్వటం లేదు. జగన్ అధికారంలోకి రాగానే, అమరావతి నిర్మాణాలు ఆన్నీ ఆపేసారు. అమరావతి అంటే తమకు ప్రాధాన్యత లేదు అంటూ ఆర్ధిక మంత్రి చెప్పారు. ఇక మునిసిపల్ శాఖా మంత్రి బొత్సా సత్యన్నారాయణ అయితే, అనేక సార్లు అమరావతి పై అపోహలు కలిగించేలా మాట్లాడారు. అమరావతి ఆమోదయోగ్యం కాదని, అక్కడ నిర్మాణాలు ఖర్చు ఎక్కవ అని, రాజధాని పై కమిటీ వేశామని, వారు ఎక్కడ అంటే అక్కడే రాజధాని ఉంటుంది అంటూ, అమరావతి పై అపోహలు సృష్టించారు. గత ఆరు నెలలుగా ప్రభుత్వ వైఖరి చూసి, అమరావతి రాజధానిగా ఉండదు అని చాలా మంది అనుకున్నారు. రాజధాని రైతులు కూడా ప్రభుత్వ వైఖరి పై ఆందోళన బాట కూడా పట్టారు. అమరావతి స్మశానం అని ఒకరు, అమరావతిలో పందులు, కుక్కలు తిరుగుతాయని ఒకరు, ఇలా మంత్రులే అమరావతిని హేళన చేస్తూ మాట్లాడారు.

amaravati 13122019 2

ఇక కేంద్రం హోం శాఖ రేలీజ్ చేసిన ఇండియా మ్యాప్ లో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పెట్టకపోవటం, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై పట్టించుకోక పోవటంతో, అమరావతి పై ఆశలు వదులుకున్నారు. అయితే ఏ మంత్రి అయితే అమరావతి పై అవహేళనగా మాట్లాడతారో, అదే మంత్రి ఈ రోజు శాసనమండలి సాక్షిగా అమరావతి పై క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చడం లేదంటూ లిఖితపూర్వకంగా బొత్స సమాధానం ఇచ్చారు. రాజధానిగా అమరావతిని మార్చే ఉద్దేశం ఉందా, ఈ ప్రభుత్వనిక్ ఉందా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, అమరావతి రాజధానిగా మార్చే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదు అంటూ మండలిలో ఆయన స్పష్టం చేశారు.

amaravati 13122019 3

మంత్రి బొత్సా ప్రకటనతో, అమరావతి మార్పు పై, జరుగుతున్న ప్రచారానికి ఇక తెర పడినట్టే చెప్పాలి. నిజానికి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో అడగగానే, అమరావతిని మళ్ళీ మ్యాప్ లో వెంటనే కేంద్ర హోం శాఖ పెట్టటంతోనే, కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి పై స్పష్టమైన వైఖరి చెప్పింది. దీంతో ఇక జగన్ ప్రభుత్వానికి కూడా అమరావతిని కొనసాగించాల్సిన పరిస్థితి. రాజధానిని మార్చాలి అంటే, కేంద్రం అనుమతి కూడా అవసరమే. కేంద్రం స్పష్టంగా చెప్పటంతో, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తప్పని పరిస్థితి. ఏది ఏమైనా అమరావతి పై టిడిపి చేసిన పోరాటం ఫలించిందనే చెప్పాలి. చంద్రబాబు అమరావతిలో పర్యటించి, ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెంచారు. ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతిని గుర్తించినందుకు సంతోషం.

మాజీ మంత్రి వై ఎస్ వివే-క కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. గత 15-20 రోజులుగా, సిట్ విచారణ పై ఫోకస్ పెట్టింది. అందరినీ పిలుస్తూ విచారాణ చేస్తున్నారు. ఈ విచారణలో భాగంగా తెలుగుదేశం నేతలను కూడా టార్గెట్ చేసారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా విచారణకు పిలిచారు. అలాగే, టిడిపి మాజీ నేత, ఆదినారాయణ రెడ్డిని కూడా, విచారణకు పిలిచారు. అయితే వీళ్ళు మాత్రం, తమను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, రాజకీయంగా ఇబ్బంది పెట్టటం కోసం, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. అయితే, అనూహ్యంగా ఉన్నట్టు ఉండి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. వివే-క కేసుని సిట్ తో కాకుండా, సిబిఐ చేత విచారణ చేయించేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్ట్ ముందు పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ త్వరలోనే విచారణకు రానుంది.

viveka 13122019 2

అయితే ఈ ఘటన జరగగానే, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, ఇదంతా చంద్రబాబు చేపించారని, అందుకే ఈ కేసును సిబిఐ కు ఇచ్చి, వారి చేత విచారణ చేపించాలి అంటూ, చాలా రోజులు హడావిడి చేసారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయం పై గొడవ చేసారు. అయితే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా, ఇంకా ఈ విషయం పై జగన మొహన్ రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ కూడా, ఈ విషయం పై అనేక సార్లు లేవనెత్తింది. సొంత మనిషి పొతే, అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా, ఇంకా ఎవరినీ పట్టుకోలేదని, గతంలో డిమాండ్ చేసిన విధంగా ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించలేదు అంటూ, టిడిపి డిమాండ్ చేస్తుంది.

viveka 13122019 3

అయితే ఇప్పుడు కేసు విచారణ సిట్ వేగవంతం చేసిన సమయంలో, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్ట్ లో పిటీషన్ వేసి, సిబిఐ చేత విచారణ జరిపించాలి అని చెప్పటం, ఆశక్తిగా మారింది. గత రెండు నెలలుగా, టిడిపి కూడా వ్యుహ్యాత్మకంగా ఈ విషయం పై అధికార పక్షాన్ని నిలదీస్తుంది. చంద్రబాబు కూడా ఈ విషయం ఏమైంది, దోషులు ఎవరూ అంటూ డీజీపీని కూడా అనేక సార్లు ప్రశ్నించారు. ఇప్పుడు కూడా వ్యూహాత్మకంగానే, ఈ కేసు పై, సీబీఐ విచారణ కోరుతూ తెలుగుదేశం పార్టీ, తన పార్టీ నేత అయిన బీటెక్ రవి ద్వారా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయించింది. అయితే హైకోర్ట్ కూడా ఈ పిటీషన్ ను విచారణకు తీసుకోవటం, 17వ తేదీకి ఈ కేసును వాయిదా వెయ్యటంతో, ఇప్పుడు ఈ కేసు ఏ ట్విస్ట్ తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read