జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాయలసీమ పర్యటనకు వెళ్లారు. ముందుగా కడప జిల్లాలోని, రైల్వేకోడూరులో జరిగిన సభలో పాల్గున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగ ప్రవర్తించటం లేదని, అందుకే జగన్ రెడ్డి అని పిలుస్తున్నానని, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ప్రవరిస్తూ, అందరినీ సమానంగా చూసే దాకా, జగన్ రెడ్డి అనే పిలుస్తానాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఒక ముఖ్యమంత్రి లాగా కాకుండా, వైఎస్ఆర్ పార్టీలోని కొంత మందికి మాత్రమే రాష్ట్రాన్ని దోచిపెట్టే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారు కాబట్టే, నేను జగన్ రెడ్డి అనే పిలుస్తాను, అంటూ పవన్ చెప్పుకొచ్చారు. నేను ఇలా పిలవటం, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందిగా ఉన్నా,బాధగా ఉన్నా, నేను మాత్రం, ఇలాగే పిలుస్తానని, ఈ మాట వెనక్కు తీసుకోను అని, ఆయన అందరినీ సమానంగా చూసినప్పుడే నేను ముఖ్యమంత్రి అని పిలుస్తానని పవన్ అనంరు.
నాకు వైసీపీ నాయకుల పై కాని, కార్యకర్తల పై కాని, ద్వేషం లేదని, మీ నాయకుడికి హుందాగా వ్యవహరించామని జగన్ రెడ్డికి చెప్పండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురమ్మని మీ జగన్ రెడ్డికి చెప్పండి అంటూ, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. సొంత జిల్లా పైన కూడా జగన కు ప్రేమ లేదని, ప్రధాని కార్యాలయానికి, వెళ్ళింది కడప స్టీల్ ప్లాంట్ కోసమే, లేక యువతకు ఉద్యోగాల కోసమో కాదని, ఇక్కడ అణుశుద్ధి కర్మాగారం నెలకొల్పి, ప్రజల జీవితాలతో ఆడుకోవటానికి కోసం వెళ్లారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నాయకులు మాత్రం బెంగళూరులోనే, హైదరాబాద్ లోనో ఉంటారు, కాని ఇక్కడ అణుశుద్ధి కర్మాగారం పక్కనే ఇళ్ళు ఉండే మీరు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాలి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే తెలుగు భాష పై మాట్లాడుతూ, తెలుగు భాషకు చెందిన శిలాశాసనాలు తొలిసారిగా కనుగొంది రాయలసీమలోనే అని, కానీ జగన్ రెడ్డి ఇంగ్లీషు మీడియం అంటూ, తెలుగు భాష ని చంపేస్తున్నారని అనంరు. ఎన్నికల్లో ఓటమిపాలైన తనకు రైల్వేకోడూరులో ఘనస్వాగతం లభించడం పట్ల పవన్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాష్టీలకు ఎవరూ భయపడవద్దని, పవన్ కళ్యాణ్ అన్నారు. చరిత్రలో ఎంతో మండి, ఫ్రెంచ్ రాజులు, బ్రిటీష్ రాజులు, జార్ చక్రవర్తులు ఎంతో మంది వచ్చారని, ప్రజల్లో ఉన్న శక్తి ముందు ఎవరూ నిలవలేకపోయారని పవన్ కల్యాణ్ వివరించారు. మరో పక్క పవన్ కడప పర్యటన కోసం, రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా, అనేక మంది రావటంతో, దొంగలు తమ పని చూపించారు.30 నుంచి 45 మంది వరకు తమ జేబులో ఉన్న నగదు, వస్తువులు గల్లంతైనట్టు గుర్తించి లబోదిబోమన్నారు. అందరూ రేణిగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.