గత మూడు రోజుల నుంచి రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, గురువారం, ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రోజు, పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లె టొమాట మార్కెట్ వెళ్లి, అక్కడ పరిస్థితిని, రెట్లు పెరుగుదల పై క్షేత్ర స్థాయిలో పర్యటన చేయ్యదలిచారు. అయితే, ఈ పర్యటనకు, పవన్ కళ్యాణ్ కు అనుమతి నిరాకరించారు. పవన్ పర్యటనకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. అయితే, జనసేన పార్టీ మాత్రం, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతోనే, పవన్ అంటే భయపడి, ఆయనకు మార్కెట్ సందర్శించే అవకాసం ఇవ్వటం లేదని జనసేన ఆరోపిస్తుంది. మరో పక్క విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ కూడా, ఈ విషయం పై తీవ్రంగా స్పందించారు. మార్కెట్ కు వెళ్లి రైతులతో మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రైతులను కలిసి, వారి కష్టాలు తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వకపోతే, చేతులు ముడుచుకుని కూర్చోమని, ఏమి చెయ్యాలో అదే చేస్తామని పవన్ అన్నారు.
తాను మార్కెట్ కు వచ్చి తీరుతానని, ఎవరు తనని ఆపుతారో చూస్తానని, పవన్ అన్నారు. మార్కెట్ ముందే కూర్చుని రైతులతో మాట్లాడతానని, రైతుల కష్టాలు తెలుసుకుంటానని, ఆపుకుంటే ఆపుకోండి అంటూ పవన్ సవాల్ విసిరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావాలను పునికి పుచ్చుకున్నవాళ్లమని, ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను మార్కెట్కు వచ్చి తీరుతానని, పోలీసులు వస్తారో,ఏ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి అడ్డుకుంటాడో చూస్తానని సవాల్ విసిరారు. ఇందుకోసం జనసైనికులు అంతా సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే పవన్ పర్యటన ఏ టర్న్ తీసుకుంటుంది, ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీస్తుందో, అని పోలీసులు టెన్షన్ పడుతున్నారు.
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తిరుపతి రైతు బజారు కు వెళ్లి, అక్కడ ఉల్లిపాయలు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయన్ని, క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. అయితే పవన్ పై మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వ్యక్తిగతంగా విమర్శలు చేసారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా ప్రతి విమర్శలు చెయ్యటంతో, మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న రాయలసీమ పర్యటన, ప్రతి నిమిషం ఉత్కంఠను రేపుతోంది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, బీజేపీతో తాను కేవలం హోదా విషయంలోనే విభేదించానని, తాను ఎప్పుడు బీజేపీతో కలిసే ఉన్నాని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న భారీ మత మార్పిడులు, ఎవరి అనుమతితో జరుగుతున్నాయో అందరికీ తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు.