ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన కక్ష రాజకీయం, కేసులు, అరెస్ట్ లు దాకా సాగుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పై కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. ప్రజా వేదిక కూల్చేసి, అది చంద్రబాబు ఆఫీస్ గా ఇవ్వకుండా చేసారు. అయితే, అది అక్రమ భవనం అని అందుకే అలా చేసామని అన్నారు. తరువాత, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని కూల్చేస్తాం అంటూ నోటీస్ ఇచ్చి రాత్రికి రాత్రి వస్తే, కోర్ట్ నుంచి స్టే తెచ్చి ఆపారు. ఇప్పుడు గుంటూరులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఎసరు వచ్చింది. డిసెంబర్ 6 న, తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. అయితే, ఆ నిర్మాణం అక్రమంగా జరిగింది అంటూ, వైసీపీ దాని పై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసింది. నిబంధనలు విరుద్ధంగా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు స్థలం కేటాయింపు జరిగింది అని, ఆ ఉత్తర్వులు రద్దు చేసి, కార్యాలయం సంగతి చూడాలి అంటూ, ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసారు.
దీంతో గుంటూరు కలెక్టర్, రెవిన్యూ డిపార్టుమెంటు ని అలెర్ట్ చేసారు. తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన స్థలం, సంగతి తేల్చాలని, ఆ భూమి పూర్వాపరాలు, తదితర అంశాల పై, రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ కోరారు. మరో పక్క ఆ భూమి పై తనకు హక్కు ఉంది అంటూ, షేక్ భాషా అనే వ్యక్తి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల పై తగిన చర్యలు తీసుకోవాలని, విచారణ జరపాలని, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా, రెవెన్యూ శాఖను ఆదేశించింది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై, అయుదు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, ఇప్పుడు కలెక్టర్ ఏమి తేలుస్తారు ? అంతా నిబంధనలు ప్రకారమే ఉందా ? ప్రభుత్వం తదుపరి చర్య ఎలా ఉంటుంది, అనే విషయం ఆసక్తిగా ఉంది. అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం, అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని, కోర్ట్ లో తేల్చుకుంటాం అంటుంది
ఇది ఇలా కొనసాగుతూ ఉండగానే, కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయం కోసం గుణదలలో కేటాయించిన 92 సెంట్ల భూమి తమది అని, ఆ స్థలంతో మాకు అవసరం ఉందని, తిరిగి ఇచ్చేయాలని, జలవనరుల శాఖ, రెవిన్యూ శాఖను కోరింది. గతంలో అన్ని పార్టీలకు, ఇలా భూములు కేటాయించారు. అయితే అవన్నీ ఎక్కువగా నిరుపయోగంగా ఉన్న భూములు. అయితే జలవనరుల శాఖ మాత్రం, టిడిపికి కృష్ణా జిల్లాలో ఇచ్చిన భూమి, రద్దు చెయ్యాలని కోరింది. ఇప్పటికే, ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ ఆఫీసుకు కేటాయించిన భూమి, ఇలాగే జలవనరుల శాఖ వెనక్కు తీసుకుంది. అలాగే, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, కడప, విజయనగరం తదితర జిల్లాల్లో టిడిపికి ఇచ్చిన భూమిని కూడా వెనక్కు తీసుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, తెలుగుదేశం పార్టీకి అన్ని వైపుల నుంచి, ఇబ్బంది పెడుతూనే ఉంది వైసీపీ ప్రభుత్వం.