ఇతర రాష్ట్రాల్లో తక్కువధరకు లభ్యమయ్యే నాసిరకం మద్యాన్ని, రాష్ట్రంలో విక్రయిస్తు న్నారని, అధికారపార్టీ నేతల అండతోనే కల్తీమద్యం, నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వపెద్దల కనుసన్నల్లో, అధికారుల అండదండలతోనే విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతోందన్నారు. నాన్‌డ్యూటీప్లేయిడ్ (ఎన్‌డీపీ) లిక్కర్‌ని పక్కరాష్ట్రాలనుంచి తీసుకొచ్చి మరీ రాష్ట్రంలో అమ్మడమేనా వైసీపీప్రభుత్వం అమలుచేస్తున్న మద్యనిషేధమని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా పట్టుబడుతున్న మద్యం పరిమాణం సీసాల్లో ఉంటే, అమ్ముడయ్యే ది మాత్రం పెద్దపెద్దలోడ్ల రూపంలో ఉందన్నారు. డబ్బుపిచ్చిపట్టిన ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటానికి కూడా వెనుకాడట్లేదని బొండా మండిపడ్డారు. అక్రమ మద్యంవ్యాపారంపై తమతోచర్చకు రావడానికి ప్రభుత్వం సిద్ధమేనా అని ఆయన ప్రశ్నిం చారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒడిశా నుంచి, కృష్ణాజిల్లాకు తెలంగాణ నుంచి, నెల్లూరు, రాయలసీమ ప్రాంతానికి తమిళనాడు నుంచి ఎన్‌డీపీ మద్యం దిగుమతి అవుతోందని పేర్కొన్నారు. ఈవిధంగావచ్చే చీప్‌లిక్కర్ వల్ల వైసీపీనేతల జేబులు నిండు తుంటే, పేదప్రజల జీవితాలు గుల్లవుతున్నాయన్నారు.
మాతృభాషను చంపేయడానికి కంకణం కట్టుకున్న రాష్ట్రప్రభుత్వం, ఒక కుట్రప్రకారమే ఆంగ్లమాధ్యమ అమలుకు నిర్ణయం తీసుకుందని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాజకీయాలకతీతంగా భాషా పండితులు, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రభుత్వ నిర్ణయంపై స్పందించాల న్నారు. తెలుగురాష్ట్రంలో తెలుగుభాషను నిషేధించడం వెనుక ఎవరున్నారో ప్రభుత్వం స్పష్టంచేయాలని బొండా డిమాండ్‌చేశారు. తాముపట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా మొండివిధానంతో ప్రభుత్వం ముందుకెళ్లడం మంచిదికాదన్నారు. టీటీడీలో అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం రాష్ట్రప్రభుత్వానికి తగదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా, పవిత్రమైన తిరుమల కొండపై అన్యమత ప్రచారంచేయడం, తాత్కాలిక ఉద్యోగులుగా అన్యమతస్తులను నియమించడం వంటిచర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బొండా స్పష్టంచేశారు. బాధ్యత గల మంత్రిగాఉండి, కొడాలినాని తిరుమలతిరుపతి దేవస్థానంపై చేసిన వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. తిరుమలకు ఎంతటిస్థాయివారొచ్చినా తాము ఏమతానికి చెందిన వారమో, తిరుమలశ్రీవారిపై తమకు విశ్వాసమున్నట్లు డిక్లరేషన్‌లో ప్రకటించడమనేది ఎప్పటినుంచో ఆచారంగా వస్తున్నదన్నారు.
అటువంటి ఆచార వ్యవహారాలను కించపరిచే లా మంత్రులు మాట్లాడటం, దానిపై జగన్మోహన్‌రెడ్డి స్పందించకపోవడం దారుణమ న్నారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నవారంతా ఏమయ్యారో కొడాలి నాని వంటివారు తెలుసుకోవాలని, గర్వం తలకెక్కిన వైసీపీనేతలంతా ఒక్కసారి శ్మశానం వైపుచూస్తే వారికి తత్వం బోధపడుతుందని బొండా హితవుపలికారు. ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడే తిరుమలక్షేత్రంపై ఇష్టానుసారం మాట్లాడిన కొడాలినానితో జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పించాలని టీడీపీనేత డిమాండ్‌చేశారు. ప్రజలు ఓట్లేసింది ఐదేళ్లకు మాత్రమే ననే విషయాన్ని వైసీపీప్రభుత్వం గుర్తించాలని, టీడీపీనేతలను వేధిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని బొండా హెచ్చరించారు రాష్ట్ర ఆర్థికవ్యవస్థ దివాలాతీయడంపై జాతీయమీడియా, ఆర్థికనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.ఎదురుదాడిచేస్తేనో, మంత్రులతో బూతులుమాట్లాడిస్తేనో ప్రభుత్వం చేసే తప్పులు, ఒప్పులయిపోవని ఉమామహేశ్వరరావు తేల్చిచెప్పారు.