పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు అవినీతి చేసారని చెప్తూ, ఇప్పటికి అయుదు నెలలు దాటినా, ఇప్పటి వరకు రూపాయి కూడా అవినీతిని బయట పెట్టలేదు. అయితే, అవినీతి సాకుతో, పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్రం చెప్పినా వినకుండా, పోలవరం ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పటి వరకు, అద్భుతంగా పని చేసి, పోలవరం ప్రాజెక్ట్ కాంక్రీట్ విషయంలో కూడా, వరల్డ్ రికార్డు నెలకొల్పి, పని చేసిన నవయుగని తప్పించింది. కొత్త టెండర్ పిలవగా, కేవలం ఒక్కటంటే ఒక్క కంపెనీ మాత్రమే, రివర్స్ టెండరింగ్ లో పాల్గంది. ఆ కంపెనీ పేరే, మేఘా. మేఘా వేసిన రివర్స్ టెండర్ తో, పోలవరం సాగునీటి ప్రాజెక్టు, హైడల్ ప్రాజెక్ట్ లో, రూ.628 కోట్లు ఆదా అయ్యింది అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టింది. అయితే, ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే, రివర్స్ లోనే, రివెర్స్ వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.

polavaram 05112019 2

మేఘ సంస్థ కోట్ చేసిన మొత్తానికి, అదనంగా మరో 500 కోట్లు ఇవ్వటానికి, రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్ట్ పనులను నవంబర్ ఒకటిన ప్రారంభించింది. అయితే, ఇప్పుడు పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే, ఇలా 500 కోట్లు పెంచటం పై, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఇంకా ఎన్ని అదనపు చెల్లింపులు చేస్తారో అని, గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలవరం హెడ్‌వర్క్స్‌ ప్రాజెక్ట్ లో మిగిలిన పనులుతో పాటు, హైడల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కలిపి రూ.4,987.55 కోట్లకు ప్రభుత్వం రివర్స్‌ టెండర్లు పిలిచింది. అయితే కేవలం మేఘా సంస్థ మాత్రమే పాల్గున్న ఇక్కడ, రూ.4,359.11 కోట్లకు పనులు పూర్తీ చేస్తామని చెప్పి, రూ.628 కోట్లు ఆదా అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

polavaram 05112019 3

అయితే ఈ అదనపు చెల్లింపులకు కారణం, ఇసుక. గతంలో ఇసుక ఉచితంగా వచ్చేదని, ఇప్పుడు తన్నుకు రూ.375 చొప్పున చెల్లించాలని, దీనికి జీఎస్టీ అధికం అని, ఇది టెండర్ డాక్యుమెంట్‌ పరిధిలోకి రాని పని అని, అందుకే అదనంగా 500 కోట్లు ఇవ్వాలని మేఘా లేఖ రాయగా, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకరబాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే మేఘా టెండర్ వేసే సమయానికే, ఉచిత ఇసుక పాలసీ రద్దు అయ్యిందని, ఇప్పుడు ఇలా అదనపు చెల్లింపులు తీసుకోవటం దారుణమని నిపుణులు అంటున్నారు. దీని పై లోకేష్ వ్యంగ్యంగా స్పందించారు. "రివర్స్ రివర్స్ అంటూ ఈ డిప్ప గవర్నమెంట్ చివరకు చిప్ప మిగిల్చేట్టు ఉంది. ఒక పక్క 628 కోట్లు ఆదా చేసాం అని చెప్పుకుంటూ మరో పక్క ఇసుక ఖర్చు పెరిగింది అని 500 కోట్లు చెల్లించడం చూస్తుంటే డిప్ప గొరిగి విగ్గు పెట్టి మళ్ళీ గొరిగినట్టు ఉంది." అంటూ ట్వీట్ చేసారు.

పోయిన శుక్రవారం జగన్ మోహన్ రెడ్డికి, సిబిఐ కోర్ట్ లో షాక్ తగిలిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో, ప్రతి శుక్రవారం కోర్ట్ కు హాజరు కావటం కుదరదని, తాను ఇప్పుడు ముఖ్యమంత్రిని అని, ప్రతి శుక్రవారం కోర్ట్ కు రావాలి అంటే, నాతొ పాటు చాలా మంది రావాలని, ప్రతి వారం 60 లక్షలు దాకా ఖర్చు అవుతుందని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, ఇది చాలా నష్టం అంటూ, జగన్ మోహన్ రెడ్డి, కోర్ట్ మినహాయింపు పిటీషన్ దాఖలు చేసారు. అయితే దీని పై సిబిఐ వాదనలు వినిపిస్తూ, జగన్ మోహన్ రెడ్డి, ఎంపీగా ఉన్నప్పుడే, సాక్షులను ప్రభావితం చేసారని, ఇప్పుడు సియం అయ్యారని, ఆయనకు ఉన్న పవర్స్ తో ఇంకా చెయ్యొచ్చని, అదీ కాక, చట్టం ముందు, సియం అయినా, సామాన్య ప్రజలు అయినా ఒక్కటే అంటూ, వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న సిబిఐ కోర్ట్, జగన్ మోహన్ రెడ్డి వేసిన, మినహాయింపు పిటీషన్ ను తిరస్కరిస్తూ, నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు సిబిఐ కోర్ట్ చెప్పిన తీర్పు కాపీ బయటకు వచ్చింది.

cbi 05112019 2

జగన్ పిటీషన్ కొట్టివేస్తూ, హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు జారీచేసిన ఆదేశాల తీర్పు కాపీ, సోమవారం ఇంటర్నెట్ లో వచ్చింది. ఈ సందర్భంగా కోర్ట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. సిబిఐ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే, జగన్ తరుపు లాయర్లు, హైకోర్ట్ లో కేసు వేసరనే వార్తలు వినిపించాయి. అయితే, సిబిఐ కోర్ట్ మాత్రం, తన తీర్పులో, ఈ విషయం ప్రస్తావిస్తూ, సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 కింద, జగన్ తరుపు న్యాయవాది, ప్రతి వారం కోర్ట్ వచ్చేలా ఆదేశాలు ఇస్తూ, నిందితునికి (జగన్‌) మినహాయింపు ఇస్తూ, వేసిన పిటీషన్ పై, గతంలోనే మేము కొట్టేసామని, తరువాత, హైకోర్ట్ కూడా, మా తీర్పుని సమర్థించిందని సిబిఐ కోర్ట్ తెలిపింది. అంతే కాకుండా, మీరు మళ్ళీ సుప్రీం కోర్ట్ వద్దకే వెళ్ళాలి కాని, ఇక్కడకు రాకూడదు అని సిబిఐ కోర్ట్ పేర్కొంది.

cbi 05112019 3

గతంలోనే మేము తిరస్కరించాం, హైకోర్ట్ తిరస్కరించింది, ఇప్పుడు మీకు మళ్ళీ మినహాయింపు కావాలి అంటే, మీరు సుప్రీం కోర్ట్ కు వెళ్ళాలి కాని, మళ్ళీ ఇదే కోర్ట్ కు ఆశ్రయించడం సరికాదని, సిబిఐ కోర్ట్ తెలిపింది. అంతే కాకుండా, 2013లో జగన్మోహన్‌ రెడ్డి వేసిన బెయిలు పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను సీబీఐ కోర్టు తన ఆదేశాలలో ఉటంకించింది. ‘‘ఆర్థిక నేరాల వెనుక పెద్ద కుట్ర ఉంటుంది. వీటివల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి నేరాలవల్ల దేశ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది’’ అని సుప్రీం కోర్టు పేర్కొందని గుర్తు చేసింది. మరి జగన్ తరుపు న్యాయవాదులు, సిబిఐ కోర్ట్ చెప్పినట్టు, సుప్రీం కోర్ట్ కు వెళ్తారో, లేక హైకోర్ట్ కే మళ్ళీ వెళ్తారో, వెళ్తే హైకోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

దేశ వ్యాప్తంగా వస్తున్న నిరసనలకు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. గతంలో చంద్రబాబు, కలాం పై గౌరవంతో, ఆయన స్పూర్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో, చదువులో ప్రతిభ చూపించిన విద్యార్ధులకు, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ప్రతిభా పురస్కార్‌ అవార్డు పేరిట ఒక అవార్డు ఇచ్చే వారు. అయితే, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ప్రతిభా పురస్కార్‌ అవార్డును పేరు మార్చి, వైఎస్ఆర్ ప్రతిభా పురస్కార్‌ అవార్డుగా మార్చింది. అయితే ఒక మహోన్నత వ్యక్తి పేరు మీద ఉండే అవార్డును, ఒక రాజకీయ నాయకుడు పేరుగా మార్చటంతో, దేశ వ్యాప్తంగా, జగన్ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా, కలాంని అభిమానించే ఎంతో మంది మేధావులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు, ఈ విషయం పై మండి పడ్డారు. జగన్ ప్రభుత్వానికి, ఈ ప్రచార పిచ్చ ఏంటి అంటూ, నిలదీస్తూ, ట్విట్టర్ లో జగన్ ను ట్యాగ్ చేసి, విమర్శలు గుప్పించారు.

jagan 0511 2019 2

అయితే ఈ విషయం పై, తీవ్ర విమర్శలు రావటంతో, జగన్ వెనక్కు తగ్గారు. సియంఓ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ప్రతిభా పురస్కార్‌ అవార్డును పేరు మార్చి, వైఎస్ఆర్ ప్రతిభా పురస్కార్‌ అవార్డుగా మార్చిన సంగతి, జగన్ మోహన్ రెడ్డికి తెలియదని, ఆయనకు తెలియకుండా, ఈ జీవో విడుదల అయ్యిందని, జగన్ కు ఈ విషయం తెలియటంతో, వెంటనే, ఈ జీవోని రద్దు చెయ్యమని, ఆదేశాలు ఇచ్చారని, చెప్పారు. ఎప్పటిలాగే, ఈ అవార్డులకు, అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని సూచించారు. అంతే కాకుండా, గాంధీ, అంబేడ్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌ పేర్లతో మరికొన్ని అవార్డులకు మహనీయుల పేర్లు పెట్టాలని జగన్ ఆదేశించారని, ప్రెస్ కు తెలియ చేసారు. ఈ విషయం పై, మీడియాకు సమాచారం అందించారు.

jagan 0511 2019 3

అయితే జగన్ కు తెలియకుండా, ఇంత పెద్ద జీవో బయటకు రావటం ఆశ్చర్యాన్ని కలిగించిన మానదు. ఒకవేళ విమర్శలు రావటంతో, ఇలా బయటకు చెప్పరా అనే అనుమానం కలుగుతుంది. అయితే, అలా కాకుండా, ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా, ఒక మహానుభావుడి పేరు తొలగించారు అంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందొ అర్ధం అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వం మధ్య ఉన్న గ్యాప్ ఏంటో కనిపిస్తుంది. నిన్నటి నిన్న, ఏకంగా చీఫ్ సెక్రటరీని బదిలీ చెయ్యటం, అంతకు ముందు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీ నోటీసులు ఇవ్వటం, అలాగే చీఫ్ సెక్రటరీకి చెప్పకుండా ప్రిన్సిపాల్ సెక్రటరీ బిజినెస్ రూల్స్ మార్చేయటం, ఇవన్నీ చూస్తుంటే, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందొ అర్ధమవుతుంది. ఏది ఏమైనా, మళ్ళీ కలాం గారి పేరు పెట్టటం, హర్షించదగ్గ విషయం.

ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుభ్రమణ్యం బదిలీ పై, పలు విమర్శలు వస్తున్న వేళ, ఇప్పుడు వస్తున్న వార్తలు, మరింత ఆందోళన కరంగా ఉన్నాయి. ఎల్వీ సుభ్రమణ్యం బదిలీ పై, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ కమిటీ, హర్షం వ్యక్తం చేసింది. అంతే కాదు, ఆల్ ఇండియా, దళిత & క్రైస్తవ సంఘాల సమాఖ్య పేరుతొ మీడియాకు ఈ బదిలీని సమర్ధిస్తూ ఒక లేఖ వదిలారు. లేఖ ఒక్కటే కాదు, ఎల్వీ బదిలీ పై పండుగ చేసుకుంటూ, అందరూ కలిసి కేక్ కట్ చేసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎల్వీ సుభ్రమణ్యంను బదిలీ చేసినందుకు, జగనన్నకు థాంక్స్ అంటూ ఆ లేఖలో ఉంది. అంతే కాకుండా, గవర్నర్, ప్రవీణ్ ప్రకాష్ కు కూడా ధన్యవాదాలు చెప్తూ, ఆ లేఖలో రాసారు. ఎల్వీ బదిలీ అనేది, క్రైస్తవుల ప్రార్థనల చేసిన విజయమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖలో ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగాలు చేస్తున్న దళితులను సామూహికంగా తొలగించడం ఎల్వీ చేసిన పాపం అని పెర్కున్నారు.

lvs 05112019 2

మమ్మల్ని ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టారని, మేము నిరసన తెలిపినా లెక్క చెయ్యలేదని, ఆయన్ను ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉందని, ఎల్వీ ఒక ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏజంట్ అని , ఇలాంటి వాళ్ళని తొలగించి, దళితుల ఆత్మగౌరవం నిలబెత్తారని అన్నారు. అయితే ఇదంతా, ఒక లెటర్ హెడ్ మీద, "ఆల్ ఇండియా, దళిత & క్రైస్తవ సంఘాల సమాఖ్య పేరుతొ", ఈ లెటర్ అంతా చేతి రాతతో ఉంది. అలాగే, కేకు పైన "ఎల్వీ డమాల్ సుబ్బు, గెట్ అవుట్. క్రీస్టియన్ విక్టరీ" అంటూ రాసి ఉన్న కేకు కట్ చేస్తూ, ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎల్వీ బదిలీని సమర్ధిస్తూ, జగన్ కు థాంక్స్ చెప్తూ, వీళ్ళు సంతోషంతో, కేకు కట్ చేసారు.

lvs 05112019 3

అయితే, ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు, కూడా మాట్లాడారు "సీఎస్ ను తొలగించే అధికారం సీయమ్ గారికి ఉన్న ఈ తొలగించిన విధానం సరిగా లేదు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం.". అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. మరో పార్టీ అయిన బీజేపీ కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు వీళ్ళ సంబరాలతో, ఇది నిజమేనా అనే అనుమానం కలుగుతుందని, టిడిపి నేతలు అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read