చిత్తూరు జిల్లా గుడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు టిడిపి అధినేత చంద్రబాబు బయలుదేరారు. పార్టీ కార్యాలయానికి వెళ్లనీయకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ నడిరోడ్డుపై చంద్రబాబు నిరసనకి దిగారు. గుడిపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డుపైనే ఎండలో నేలపై బాబు బైఠాయించారు. తరువాత చంద్రబాబు ఒక బస్సు తెప్పించి, స్వయంగా నుచ్చెన వేసుకుని బస్సు పైకి ఎక్కారు. ఆ వయసులో చంద్రబాబు అలా బస్సు ఎక్కి ప్రసంగిస్తారని, పోలీసులు ఊహించలేక పోయారు. తరువాత చంద్రబాబు బస్సు పై నుంచే మాట్లాడారు. గుడిపల్లికి ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటారా? అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యకర్తలు రాకుండా బారికేడ్లు పెడతారా? అని నిలదీశారు. బానిసలుగా బతకొద్దని, నన్ను పంపియాలని చూస్తే మిమ్మల్నే పంపిస్తానని హెచ్చరించారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రజలు తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దని పోలీసులకి హితవు పలికారు. వైసీపీ నేతలు రోడ్డుషోలు, సభలు పెట్టొచ్చు కానీ టిడిపి పెట్టకూడదా అని నిలదీశారు. వైసీపీ వాళ్లకు ఒక రూలు.. మాకో రూలా? ఇదేం చట్టం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
news
సీబీఐ, ఈడీ పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ వైసీపీ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై 30కి పైగా సీబీఐ, ఈడీ కేసులు నమోదైన విషయం దేశమంతటికీ తెలుసు. న్యాయశాస్త్ర పాఠాలలో జగన్ రెడ్డి పాల్పడిన క్విడ్ ప్రోకో నేరాలపై పాఠాలు కూడా ఉన్నాయి. ఈ కేసుల విచారణ ముందుకు సాగకుండా డిశ్చార్జి పిటిషన్లు, వాయిదాలు, కోర్టుకి హాజరు కాకపోవడాలు వంటి చాలా జగన్ నాటకాలు ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. జగన్ రెడ్డి పాల్పడిన నేరం విలువ పదేళ్ల క్రితం 43 వేల కోట్లు. అంటే సీబీఐ, ఈడీ గుర్తించినదే 43 వేల కోట్లంటే..అది ఇప్పటి విలువ ప్రకారం చూసుకున్నా, సీబీఐ ఈడీలకు దొరకని దోపిడీ సొమ్ము లెక్కేసుకున్నా లక్షల కోట్లు ఉంటుంది. ఇంత తీవ్రమైన కేసుల్లోనూ విచారణ నత్తనడకన ఎందుకు సాగుతోందో అందరికీ తెలుసు. ప్రజాప్రతినిదులపై కేసులు ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్న జగన్ కేసుల విచారణ ముందుకు సాగడంలేదు. ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తు ముందుకు సాగకపోవడంపై గట్టిగా నిలదీసింది. ఆర్థిక కుంభకోణాల కేసులను విచారించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడిన వారు వేలకోట్ల ప్రజాధనం దోపిడీకి పాల్పడినట్టేనని, దర్యాప్తులో ఉదాశీనత ఎందుకు అని సీబీఐ, ఈడీలను సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కేసు విషయంలో ఈ వ్యాఖ్యలు చేసినా, సీబీఐ-ఈడీ నమోదు చేసిన ఆర్థిక కుంభకోణం కేసులు వైఎస్ జగన్ రెడ్డిపై లెక్కకు మించి వుండటంతో తాడేపల్లి ప్యాలెస్లో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత...
కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో బ్రేక్ ఇచ్చిన జేసీబీ కూల్చివేతలు మళ్ళీ ప్రారంభం అయ్యాయి. ఈ రోజు మళ్ళీ విశాఖపట్నం గీతం యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంకా చీకటి కూడా పోక ముందే, వందలాది మంది పోలీసులతో, జేసీబీలు, రెవిన్యూ సిబ్బంది, కలిసి విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గరకు వచ్చారు. ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏమి తెలియదు. కనీసం ముందస్తుగా, గీతం యూనివర్సిటీకి ఉద అనధికారులు కానీ, పోలీసులు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రుషికొండ నుంచి యూనివర్సిటీ వెళ్ళే మార్గం మొత్తం పోలీసులు సెక్యూరిటీ పెట్టి, అటు వైపు ఎవరినీ వెళ్ళనివ్వటం లేదు. కనీసం ఆ రోడ్డులోకి మీడియాని కూడా అనుమతి ఇవ్వటం లేదు. అయితే గతంలో అక్కడ ప్రభుత్వం భూమి ఆక్రమించారు అంటూ, గతంలో కొంత మేర కూల్చిన విషయం తెలిసిందే. తరువాత కోర్ట్ కి వెళ్లి ఆపారు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన నిర్మాణాలు కూడా కూల్చి వేయటానికి మళ్ళీ జేసీబీలు వందల మంది పోలీసులతో వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీస్ బలగాల మోహరింపు...
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మూడో రోజు కూడా కొనసాగుతుంది. ఈ రోజు మూడో రోజు, కుప్పంలో తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు ముందుగా ఆర్‍అండ్‍బీ గెస్ట్ హౌస్‍లో వినతులు స్వీకరిస్తారు. ఆ తరువాత గ్రామాల్లో పాదయాత్రగా వెళ్లి, ఇంటింటికీ తిరగనున్నారు. ఆ తరువాత గుడిపల్లి మండలంలో చంద్రబాబు రోడ్ షో చేయటానికి సిద్ధం అయ్యారు. గుడిపల్లి రైల్వేష్టేషన్ క్రాస్ మీదుగా, పెద్దగొల్లపల్లి క్రాస్ చేరుకొని, అక్కడ నుంచి చిన్న గొల్లపల్లి క్రాస్ కి వెళ్లి, సంగనపల్లి, మాలవానికొత్తూరు, పెద్దపార్తీకుంట మీదుగా చంద్రబాబు రోడ్ షో సాగనుంది. అయితే చంద్రబాబు రోడ్ షో కి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. చంద్రబాబు మాత్రం, రోడ్ షో చేసి తీరుతాం అని అంటున్నారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఇంకా చంద్రబాబు చైతన్య రధం, స్పీకర్ రధం ఉంది. అయితే తమ వాహనాలు తమకు అప్పగించాలని, చంద్రబాబు నిరసన చేసే అవకాశం ఉందని, పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు తరలి వస్తున్నారు. దీంతో చిత్తూరు జిల్లా టిడిపి శ్రేణులు భారీగా కుప్పం వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, పోలీసులు అదనపు బలగాలు రప్పిస్తాయి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.