దేశ రాజధాని ఢిల్లీలోని హౌసింగ్ ప్రాజెక్టుల కోసం అమరావతిలో తరహా ల్యాండ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నల్లో ఉంది. అమరావతిలో రాజధాని కోసం 34,010 ఎకరాల భూమిని ఇవ్వడానికి సుమారు 28,074 మంది రైతులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుకి మంచి పేరు తెచ్చి, అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలించింది. ఎక్కడైనా ఒక ఎకరం భూమీ ప్రభుత్వాలు తీసుకోవాలి అనుకుంటే, నానా హంగామా చేస్తే కాని రాదు. అలాంటిది ఎక్కడా చిన్న ఆందోళన కూడా లేకుండా 33 వేల ఎకరాలు ఇవ్వటంతో, దేశ వ్యాప్తంగా ఈ విధనాననికి ప్రాచుర్యం వచ్చింది. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ కేటాయించిన ప్రాంతాల్లో సుమారు 76 లక్షల మంది జనాభాకు 17 లక్షల గృహాలను నిర్మాణం చెయ్యటానికి, ఇప్పుడు ఇలాంటి విధానాన్ని అక్కడ ప్రభుత్వం అమలు చేస్తుంది.

pooling 14092019 2

ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం నగరం యొక్క పునరాభివృద్ధిని జరుగుతుందని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా, భూమిని సమీకరించటం చాలా తేలిక అని, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన సమర్థవంతమైన విధానం అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో జరిగే ఈ కార్యక్రమం వల్ల పట్టణాభివృద్ధి వేగంగా సాగుతుందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ‘భూసమీకరణ: ఇండియా కేపిటల్‌ నిర్మాణం- రియల్‌ఎస్టేట్‌, మౌలికవసతులరంగంలో అవకాశాలు’’ అన్న అంశంపై ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

pooling 14092019 3

ల్యాండ్ పూలింగ్ విధానం కింద దిల్లీలో సమీకరించే భూమిలో 17 లక్షల నివాసాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో 5 లక్షల ఇళ్లను ఆర్థికంగా వెనకబడినవారి కోసం అందజేస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ఏదేమైనా, అమరావతిలో చంద్రబాబు నాయుడు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం కూడా భూ యజమానులకు, ఈ విధానం ద్వారా విశ్వాసం కలిగించగలదు. అయితే చంద్రబాబు ప్రవేశపెట్టిన విధానం, ఆయాన ముందు చూపును తెలియ చేస్తుంది. చంద్రబాబు ఏమి చేసినా ఒక విజన్ తో చేస్తారని చెప్పటానికి ఈ విధానం ఒక ఉదాహరణ. చంద్రబాబు చేసిందే, ఎప్పటికైనా దేశం మొత్తం పాటిస్తుంది. కాని బాధాకరమైన విషయం ఏమిటి అంటే, సొంత రాష్ట్ర ప్రజలు మాత్రం చంద్రబాబు విజన్ ని గుర్తించటంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు. తరువాత బాధపడతారు.

కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు ఫోన్‌ చేశారు. యురేనియం తవ్వకాలకు అందరం కలిసి, పోరాడదామని , దీనికి కలిసి రావాలని, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిని కోరారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 10 గంటలకు దస్పల్లా హోటల్‌లో అఖిలపక్ష సమావేశం ఎర్పాటు చేసామని, అందులో పాల్గొనాలని, రేవంత్ ను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. పవన్‌ ఆహ్వానానికి రేవంత్‌ స్పందిస్తూ, తప్పకుండా వస్తానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంతు రావు నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది. వారం రోజుల క్రిందట, వీహెచ్, పవన్ కళ్యాణ్ కలిసి, ఈ ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. వీహెచ్ పిలుపుకు స్పందించిన పవన్ కళ్యాణ్, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన కలిసి వస్తుందని చెప్పారు.

revanth 14092019 2

తెలంగాణా భూభాగంలో, నల్లమల అడవులలోని అమ్రాబాద్‌ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి యురేనియం తవ్వకాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీని పై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రభావం కలుగుతుందని, మేధావులు, సామాన్య ప్రజలు నిరసన తెలుపుతున్నారు. దీని పై సినీ ప్రముఖులు కూడా తమ నిరసన తెలిపారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, విజయ్‌ దేవరకొండ, సాయి ధరమ్‌ తేజ్‌, అనసూయ వంటి సినీ సెలబ్రిటీలు నల్లమల అడవులను కాపాడాలని, యురేనియం తవ్వకాలకు ఉద్యమించాలని ప్రజలకు పిలుపిచ్చారు. తాజాగా సినీ హీరోయిన్ సమంత కూడా యురేనియం తవ్వకాల నుండి నల్లమల అడవిని కాపాడండి అని ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాని కోరింది.

revanth 14092019 3

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి నష్టం కలుగుతుందని, యావత్తు జీవ రాసుల, జీవవైవిధ్యం నాశనమవుతుందని అనేక మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలతో కృష్ణా జలాలు కలుషితమయితే, ప్రజలు క్యాన్సర్‌, మూత్రపిండ వ్యాధుల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలతో తెలంగాణా ప్రాంతమే కాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ముప్పు ఉంటుందని మేధావులు చెబుతున్నారు. నల్లమల అడువుల్లో జీవవైవిధ్యం దెబ్బతిని వేలాది సంఖ్యలో జంతువులు మృత్యువాత పడతాయని, అక్కడ నివసించే గిరిజనులుకు కూడా ప్రమాదం అని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయం పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది.

హిమాలయాల్లో ఘోర తపస్సులో ఉండే అఘోరాలు ఉన్నట్టు ఉండి, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షం అయ్యారు. సహజంగా వీళ్ళు జనావాసాల మధ్యకు రారు. అయితే వీరు ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతూ ఉండటం, అందునా రాజకీయ ప్రముఖల నివాసాల్లో కనిపించటం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ అఘోరాలు వచ్చింది టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి. ఈ అఘోరాలతో కలిసి సుబ్బారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆశీర్వాదం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి సేవలో మాత్రమే ఉండాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్, ఇలా అఘోరాలకు మొక్కటం పై, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న స్వరూపానందని కలిసిన సమయంలో, శ్రీవారి ప్రసాదం ఆయన కాళ్ళ దగ్గర పెట్టిన ఫోటోలు వైరల్ అవ్వటంతో, అప్పుడు కూడా భక్తులు ఆగ్రహించిన విషయం తెలిసిందే.

aghora 14092019 2

ఈ విధంగా, టిటిడి చైర్మెన్ గా ఉంటూ, అఘోరాలకు మొక్కిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవ్వటంతో, ఈ విషయం చర్చనీయంసం అయ్యింది. అలాగే సుబ్బారెడ్డి తో పాటుగా బీజేపీ మాజీ ఎంపి గోకరాజు గంగరాజు నివాసంలోనూ అఘోరాలు ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అఘోరాలను తమ నివాసానికి తీసుకొచ్చి, గంగరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అయితే ఈ ఫోటోల పై ఇప్పటి వరకు ఇరువురు స్పందించలేదు. ఈ అఘోరాలు ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏమైనా పూజలు చేసారా, అనేది తెలియాల్సి ఉంది. అయితే, వారిని హిమాలయాల నుండి ప్రత్యేక ఖర్చులతో తమ నివాసాలకు తీసుకొచ్చారనే ప్రచారం సాగుతోంది.

aghora 14092019 3

ఇప్పుడు సుబ్బారెడ్డి ఇంటికి హిమాలయాల నుంచి అఘోరాలు వీరి ఇళ్ళకు విచ్చేయడం సంచలనంగా మారింది. సుబ్బారెడ్డి, గంగరాజు ఇద్దరూ తమ నివాసాలకు ఈ అఘోరాలను ఆహ్వనించటం, పూజలు నిర్వహించటం పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. దీని పైన సోషల్ మీడియాలో చర్చ నీయాంశంగా మారింది. అయితే గంగరాజు విషయం పక్కన పెడితే, టిటిడి చైర్మెన్ గా ఉంటూ, సుబ్బారెడ్డి ఇలా చెయ్యటం కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తుంది. దీని పై సోషల్ మీడియాలో రకరకాల వాదనలు నడుస్తున్నాయి. అసలు అఘోరాలు ఎలాంటి పూజలు చేస్తారో తెలుసా ? దేని కోసమో ఈ పూజలు ? అఘోరాలతో టిటిడి చైర్మెన్ కు ఏమి పని ? ఇలా అనేక రకాల ప్రశ్నలు వేస్తూ, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డికి ప్రచారంలో తిరుగు ఉండేది కాదు. దీనికి కారణం, జగన్ వ్యూహాలు, వైసిపీ ప్రచారం కంటే, అప్పట్లో ప్రశాంత్ కిషోర్ పన్నిన వ్యూహాలు హిట్ అయ్యాయి. ప్రశాంత్ కిషోర్ తనకు ఉన్న పలుకబడితో, జాతీయ మీడియాలో సైతం జగన్ ను ఒక బాహుబలిగా చూపించే ప్రయత్నం చేసారు. అదే సమయంలో చంద్రబాబు పరిపాలన పై నెగటివ్ కధనాలు ఇప్పించటంలో సక్సెస్ అయ్యారు. అప్పట్లో చంద్రబాబు విధనాలు మెచ్చి దాదపుగా 600 పైగా అవార్డులు వచ్చినా కూడా, జాతీయ మీడియాలో ఎందుకు నెగటివ్ ప్రచారం జరుగుతుందో తెలుగుదేశం పార్టీకి అర్ధమయ్యేది కాదు. అయితే, తరువాత దానికి కారణం ప్రశాంత్ కిషోర్ అని టిడిపి నేతలకు అర్ధమైంది. అయితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేకపోవటంతో, నేషనల్ మీడియా ఉన్నది ఉన్నట్టు రిపోర్టింగ్ చేస్తుంది. వాస్తవ పరిస్థితులు చెప్తూ ఉండటంతో, జగన్ పరిపాలన పై జాతీయ మీడియాలో వ్యతిరేక కధనాలు వస్తున్నాయి.

jagan 14092019 1

నిన్న ఒక్క రోజే, ఏకంగా నాలుగు జాతీయ పత్రికల్లో జగన మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఎడిటోరియల్స్ వచ్చాయి. ఇందులో "ది ట్రిబ్యూన్" అనే పత్రిక రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద జరుగుతున్న దాడుల పై రాసారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతల పై దాడులు చేస్తూనే, ఆ దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఆందోళన చేపట్టాలని అనుకుంటే, ప్రభుత్వం నిరసన తెలిపే హక్కు కూడా చంద్రబాబుకు ఇవ్వలేదు అంటూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు రాసుకొచ్చాయి. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని, రాజకీయ హింస పెరిగిపోతుందని, మరో పత్రిక రాసింది. ఇక ఎకనామిక్ టైమ్స్ ఎడిటోరియల్ లో, జగన్ గారు, అమరావతిని చంపకండి అంటూ ఆర్టికల్ రాసారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి, అమరావతిని ఏమి చేసారు, ఎలా అన్ని పనులు ఆపి, ఈ రోజు అమరావతిని ఏ పరిస్థితికి తీసుకోవచ్చారో వివరిస్తూ రాసారు.

jagan 14092019 1

ఇక న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్ కూడా, జగన్ విధానాల పై ఆందోళన వ్యక్తం చేస్తూ, చంద్రబాబు ముద్రలను చేరిపేయాలని కాకుండా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఆలోచన జగన్ మోహన్ రెడ్డి చెయ్యలని, రాస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు వివరిస్తూ, రాసుకొచ్చారు. ఇలా అనేక విధాలుగా రాష్ట్రం ఎలా నష్టపోతుంది, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాన్ని ఎలా కిందకు పడేస్తుంది వివరిస్తూ కధనాలు రాసాయి. అలాగే గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 75 శాతం లోకల్ రిజర్వేషన్ల పై, పెద్ద ఎత్తున జాతీయంగా విమర్శలు వచ్చాయి. మరో పక్క విద్యుత్ పీపీఏల విషయంలో కూడా, అన్ని బిజినెస్ ఛానెల్స్, జగన్ విధానం పై విమర్శలు గుప్పించాయి. రోజు రోజుకీ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల పై వ్యతిరేక వార్తలు ఎక్కువ అవుతూ ఉండటం పై, ప్రభుత్వ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read