వారం క్రితం, కృష్ణా నదికి వచ్చిన వరదలతో, గుంటూరు, కృష్ణా లంక గ్రామాలు మునిగిన సంగతి తెలిసిందే. అనేక ఎకరాల్లో పంటకి కూడా నష్టం జరిగింది. అయితే, వరద కష్టాల పై, అక్కడ స్థానికలు అనేక వీడియోలు తీసి వారి బాధని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంత చిన్న పాటి వరదకు కూడా, ఇళ్ళు, పొలాలు మునగటంతో, ప్రభుత్వ చేతకాని తనాన్ని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని, నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, ప్రతి విషయంలోనూ రాజకీయం చేసే రాజకీయ పార్టీలు, వరద బాధితులు ఇబ్బందులు పడుతూ, తిట్టిన తిట్లలో కూడా, కులం చూస్తూ, రాజకీయం చేసారు. గుంటూరు జిల్లా, కొల్లూరు మండలం, తిప్పలకట్ట గ్రామానికి చెందిన సోమశేఖర్ చౌదరి అనే రైతు, వరద దుస్థితి పై ఒక వీడియో పెట్టారు.
అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మా ఈ పరిస్థితికి ప్రభుత్వమే కారణం అని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్లకు ఏమి తెలియదని, వాళ్ళని తీసుకువచ్చి మినిస్టర్లను చేస్తే ప్రజలు ఇలాగే ఇబ్బందులు పడతారని అన్నారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ ని, గేదలు కాచుకునేవాడు అంటూ సంబోధించారు. అంతే వైసిపీ ఈ పాయింట్ పట్టుకుని రచ్చ రచ్చ చేసింది. కడుపు మండి మాట్లాడిన వ్యక్తి కమ్మ కులం కవటం, అనిల్ కుమార్, యాదవ్ కులం కావటంతో, మంట రేపారు. అందునా ఈ సోమశేఖర్ రైతు మాత్రమే కాకుండా, పొలం పనులు లేనప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా వేషాలు కూడా వేస్తూ ఉండటం వైసిపీకి కలిసి వచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్ లకు తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి, ఒక కులాన్ని తిట్టిస్తుంది అంటూ, సమస్యను పూర్తిగా తప్పుదోవ పట్టించారు.
టిడిపి ఎన్నికల ప్రచారంలో ఒక యాడ్ లో ఉన్న వ్యక్తి, ఇతనే అంటూ ప్రచారం చేసారు. అలాగే మరో మహిళను కూడా ఇలాగే యాడ్ లో ఉన్న వ్యక్తి అంటూ ప్రచారం చేసారు. అయితే ఆ మహిళ, వెంటనే ఖండించింది. నేను విజయవాడ రామలింగేశ్వర నగర్ కు చెందిన వ్యక్తిని అని, కూలి పనులు చేసుకునే వాళ్ళం అని, వరదల్లో ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని ప్రశ్నిస్తే, పైడ్ ఆర్టిస్ట్ అంటారా అంటూ మండి పడింది. ఇదే విషయం పై టిడిపి రెండు వీడియోలను పెట్టి వైసిపీని ఎండగట్టింది. అయితే ఇప్పుడు సోమశేఖర్ కూడా ఈ ప్రచారం పై మండి పడుతున్నారు. నేను ఆర్టిస్ట్ నే కాని, ఎప్పుడు కూడా టిడిపి యాడ్ లో నటించాలేదని అన్నారు. అసలు ఆ వ్యక్తికి నాకు , పోలికలు ఎక్కడ ఉన్నాయని అన్నారు. ఇలాంటి దిగజారుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు.
మా పంట మునిగిందని అనే ఆవేదనలో, అనిల్ కుమార్ యాదవ్ పై మండి పడ్డామని, దీంట్లో కూడా కులం చూస్తున్నారని అన్నారు. అయినా, నా మాటలు బాధించి ఉంటే, యదావ కులానికి క్షమాపణలు చెప్తున్నా అని అన్నారు. మా పొలాలు అన్నీ మునిపోయాయని, దీని పై వైసిపీ ఏమి చెప్తుందని అన్నారు. నేను పొలం పనులు లేనప్పుడు, హైదరాబాద్ వెళ్లి పొట్ట కూటి కోసం, సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తానని, ఎప్పుడూ టిడిపి యాడ్ లో నటించాలేదని అన్నారు. నా పై, వీడియోలో నా వెనుక ఉన్న వాళ్ల పై కూడా కేసులు పెట్టారని, ఇప్పటికే వారిని అరెస్ట్ చేసారని, విజయవాడలో వేదిస్తున్నారని, నా కోసం వెతుకుతున్నారని, పంటలు చనిపోతే మనిషి పోయినంత బాధ ఉంటుందని, అలాంటిది నా పంటను, ప్రభుత్వం చేతకాని తనంతో చంపేస్తే, కడుపు మండి వాళ్ళని ప్రశ్నిస్తే, కేసులు పెట్టి వేదిస్తున్నారని, ఏవో వీడియోలు పెట్టి, నేనే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.