రాష్ట్రంలో అమరావతి చుట్టూ రాజకీయం నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళే ముందు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ని కలిసి, అమరావతికి నిధులు ఇవ్వక పోయినా పరవాలేదు , అమరావతిని కొన్నాళ్ళు పక్కన పెట్టి, ఆ నిధులు మిగతా వాటికి ఇవ్వండి అంటూ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి అమరావతి పై మొదలైన రగడ, మంత్రి బొత్సా వ్యాఖ్యలతో, తారా స్థాయికి చేరింది. అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా అని ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, అమరావతి నిర్మాణానికి ఎక్కువ డబ్బులు అవుతాయని, ప్రజా ధనం వృధా చెయ్యటం మాకు ఇష్టం లేదని, అందుకే రాజధాని అమరావతి పై, రాష్ట్ర ప్రభుత్వం తరుపున త్వరలోనే పూర్తీ ప్రకటన చేస్తామని బొత్సా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వం పై విమర్శలు ఎక్కు పెట్టాయి.

uma 27082019 2

ఒక పక్క బొత్సా చేసిన వ్యాఖ్యలు, హాట్ టాపిక్ గా మారితే, మరో పక్క ఇదే అంశం పై దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా, అంతకు మించిన హాట్ గా మారాయి. అమరావతి పై జగన్ ఎదో కుట్ర చేస్తున్నారని, దేవినేని ఉమా, నెల రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే అమెరికా వెళ్ళే ముందు ప్రధాని మోడీ, అమిత్ షా ని కలిసి, అమరావతి పై ఒక వినతి పత్రం ఇచ్చారని, అది ఏమిటో బయట పెట్టాలని దేవినేని ఉమా డిమాండ్ చేసారు. ప్రధాని మోడీ, అమిత్ షా లను కలిసిన సమయంలో అమరావతి గురించి ఏమి మాట్లాడుకున్నారు ? జగన్ ఇచ్చిన లేఖలో ఏముందో ప్రజలకు చెప్పాలి అంటూ దేవినేని ఉమా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో, బొత్సా చేసిన వ్యాఖ్యలతో, దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలు నిజం అయ్యాయి.

uma 27082019 3

దీంతో దేవినేని ఉమా, బొత్సా వ్యాఖ్యల తరువాత, మరో బాంబు పేల్చారు. దీంతో వైసిపీలో దేవినేని ఉమా వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్ళే ముందే, కడప జిల్లాకు చెందిన ఒక కీలక వైసిపీ నేతను తన వద్దకు పిలిపించుకుని, దోనకొండలో భూములు కొనుక్కోవాలని సూచించారని, దేవినేని ఉమా ఆరోపించారు. ఆ నేతకు టికెట్ ఇవ్వని కారణంగా, ఈ విధంగా అయినా ఆయనకు ఆర్ధికంగా లబ్ది చేకూర్చటానికి, జగన్ ప్లాన్ చేసారని, ఇది అబద్ధమని జగన్ చెప్పగలరా అని దేవినేని ఉమా ఛాలెంజ్ చేసారు. దీంతో, ఆ నేత ఎవరు అనే విషయం అటు టిడిపి పార్టీలోనూ, అటు వైసీపీలోను ఆసక్తి నెలకొంది. నిజంగానే జగన్ చెప్పరా, నిజం అయితే చెప్పండి, మేము కూడా అక్కడ భూములు కొనుక్కుంటాం అంటూ, కొంత మంది వైసిపీ నేతలు కూడా దేవినేని ఉమాకు ఫోన్ చేసి వాకబు చేస్తున్నారు అంట. మొత్తానికి, అమరావతి పై గందరగోళ పరిస్థితి పెట్టి, దొనకొండ చుట్టూ రియల్ భూం తేవటంలో మాత్రం వైసీపీ సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పై జగన్ ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రెండు రోజులు నుంచి అమరావతి రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగుతునే ఉన్నారు. ఈ రోజు రాజధాని ప్రాంతానికి చెందిన మంగళగిరి మండలం ఎర్రబాలెంలో రైతులు జగన్ ప్రభుత్వానికి నిరసనగా ఆందోళన బాట పట్టారు. అమరావతి రాజధాని పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులు రోడ్డు పై భైఠాయించారు. అమరావతిని ఇక్కడే రాజధానిగా కొనసాగించాలని, మంత్రి బొత్స, రైతులు కౌలు డబ్బులు కోసమే ఆందోళన చేస్తున్నారు అంటూ చసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అమరావతిలోని గ్రామాలు కానీ, కొండవీటి వాగు ఎప్పుడూ మునగలేదని, రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చెయ్యొద్దని రైతులు మండిపడ్డారు.

jagan 27082019 2

ఈ రోజు రాజధాని అమరావతి మార్పు అంశం పై రైతుల ఆందోళన సెగ ఒక్కసారిగా జగన్ మోహన్ రెడ్డికి తగిలింది. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సెక్రటేరియట్ కు వెళ్తూ ఉండగా, మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం వద్ద రాజధాని రైతులు జగన్ కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రైతుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాడ్లు చేసారు. అమరావతి ఇక్కడే కొనసాగించాలని, నినదించారు. అయితే ఈ పరిణామంతో, పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఎక్కడ వారు జగన్ కాన్వాయ్ ని ఆపుతారో అని ఫుల్ పోలీస్ ఫోర్సు పెట్టారు. వారిని జగన్ కాన్వాయ్ ని అడ్డుకోకుండా, పోలీసులు నియంత్రించారు. అయినప్పటికీ, జగన్ కారుని చూడగానే, జగన్ కు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు సెహ్సారు.

jagan 27082019 3

పోలీసులు ఈ పరిణామంతో ఒక్కసారిగా వారిని అడ్డుకుని, పక్కకు తరలించారు. అయితే మొదటి సారి, తాను ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, ప్రజా వ్యతిరేకత డైరెక్ట్ గా చూడటంతో, ఈ సంఘటన పై జగన్ ఒక్కసారిగా నివ్వెరపోయారు. అక్కడ ఆందోళన చేస్తున్న రైతులకు అభివాదం చేస్తూ, జగన్ వెళ్ళిపోయారు. మరో పక్క, ఈ రోజు బీజేపీ నేతలు అమరావతి ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. బీజేపీ ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారయణ, అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే అది బయట పెట్టి, వారికి శిక్ష పడేలా చెయ్యచ్చు కాని, ఇలా రాజకీయం కోసం, ఒక ప్రాంతాన్ని, ఇక్కడ రైతులను ఇబ్బంది పెట్టటం కరెక్ట్ కాదని వారు అభిప్రాయ పడ్డారు.

అమరావతి తరలింపు పై జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక పోవటంతో, ప్రతి రోజు అమరావతిలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మరో పక్క బొత్సా సత్యన్నారాయణ మాత్రం, ప్రతి రోజు ఎదో ఒక ప్రకటన చేసి, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలు పక్కకి పోయి, అన్ని పార్టీలు రాజధాని మార్పు పైనే మాట్లాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో, ఎక్కువుగా స్పందించకుండా, రోజు వారీ ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు పై పోరాడుతుంటే, బీజేపీ మాత్రం, క్షేత్రస్థాయిలోకి దిగి, అమరావతి ప్రజల తరుపున మాట్లాడుతున్నారు. ఈ రోజు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయాణ, అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ప్రభుత్వం చేస్తున్న గందరగోళ ప్రకటనల పై స్పందించారు. రైతులకు అండగా నిలబడుతాం అని హామీ ఇచ్చారు.

botsa 27082019 2

ఇక్కడ ఒక సామాన్య మహిళ మాట్లాడుతూ, మంత్రి బొత్సా ప్రకటనల పై విరుచుకు పడ్డారు. రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తే, బొత్సా మాత్రం, మేము రాజధాని కోసం కాకుండా, మేము కౌలు కోసం ఆందోళన చేస్తున్నామని హేళన చేస్తున్నారని అన్నారు. అలాగే బొత్సా మాట్లాడుతూ, అమరావతి ప్రాంతం, వరదల్లో మునిపోతుంది అని, అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు అంటూ చేసిన వ్యాఖ్యల పై, ఆ మహిళ తీవ్రంగా స్పందించారు. నేను బొత్సా గారికి ఛాలెంజ్ చేస్తున్నా, రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక్క సెంట్ అయినా మునుగుతుందని బొత్సా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేసారు. కట్ట కింద ముంపు ఉంటుంది కాని, కట్ట పైన, ఎప్పుడూ మునగలేదని, మొన్న వరదలకు ఒక్క సెంట్ కూడా వరదల్లో లేదని అన్నారు.

botsa 27082019 3

బొత్సా సత్యన్నారాయణ, అమరావతికి వరదలు వస్తాయని నిరూపిస్తే, మా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన, మూడున్నర ఎకరాల స్థలాన్ని బొత్స సత్యనారాయణకు రాసిస్తానని సవాల్ చేసారు. ఒక బాధ్యత గల మంత్రి, ఒక పార్టీ ప్రతినిధిగా, వాళ్ళ పార్టీ వైఖరి చెప్తున్నట్టు ఉందని, ఇక్కడ రైతులు కష్టాలు, అమరావతి రాజధాని పై, విశాలంగా ఆలోచన చెయ్యాలని ఆమె అన్నారు. బొత్సా గారు ముందు అవగాహన పెంచుకుని మాట్లాడండి అంటూ ఆ మహిళ అన్నారు. అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు అప్పట్లో అసెంబ్లీలో తీర్మానం చేస్తే, అప్పట్లో జగన్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేసింది అని ప్రశ్నించారు ? అప్పుడే ఇది ముంపు ప్రాంతం అని మీకు తెలియదా అని ప్రశ్నించారు.

తిరుమల పై రోజుకి ఒక సంఘటన వెలుగులోకి వస్తుంది. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన తిరుమలలో, ప్రతి విషయం వివాదాస్పదం అవుతుంది. మొన్నటికి మొన్న, తిరుమల వెళ్ళే బస్ టికెట్ల పై జేరసులాం యాత్ర ఉచితం అనే ప్రభుత్వ ప్రకటన ఉన్న టికెట్లు ఇచ్చారు. అదేమంటే చంద్రబాబు మీదకు తోసేసారు. నెల్లూరులో ఉండాల్సిన ఈ టికెట్లు, చంద్రబాబు చెప్తే తిరుమల వచ్చాయని చెప్పి, ప్రజలు ఎలా నమ్ముతారో అనికూడా లేకుండా ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ రోజు తిరుమల పై మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారం ఉంగరాలు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఏకంగా ట్రెజరీలో నుంచే, నగలు మాయం అవ్వటం పై, శ్రీవారి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

ttd 27082019 1

అయితే ఈ నగలు మాయం వెనుక, టీటీడీ ఏఈవో శ్రీనివాసులును బాధ్యత వహిస్తూ, ఆయన పై చర్యలు తీసుకుంది టిటిడి. ఆయన నిర్లక్షంగా వ్యవహరించటం వలనే, నగలు పోయాయి అని తేల్చి ఆయన్ను బాద్యుడిని చేసారు. మాయమైన ఆ మూడు ఆభరణాల విలువను అతని నెలవారీ జీతం నుంచి రికవరీ చేయాలని టిటిడి అధికారులు నిర్ణయించారు. అయితే టీటీడీ ఏఈవో శ్రీనివాసులు పై, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై టిటిడి ఉద్యోగుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క, ఆ నగలు మాయం చేసిన వాళ్ళని పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోకుండా, ఇలా కేవలం ఎవరినో బాధ్యత చూపుతూ, రికవరీ మాత్రమే చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ttd 27082019 1

ఆయన జీతం కేవలం 30 వేలు అని, ఆ ఆభరణాల విలువ, ఆయన జీతంలో ఎన్ని సంవత్సరాలు రికవరీ చేస్తారాని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు స్వామి వారికి, దాదపుగా, 290 ఆభరణాలతో అలంకరణ చేస్తారు. ఈ 290 భరణాలు తప్పితే, మిగతా బంగారం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో భద్రంగా ఉంచుతారు. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి నగలు తీసుకెళ్ళి అలంకరిస్తారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం, ట్రెజరీలో, 2012లో కూడా ఇలాగే నగలు మాయం అయ్యాయి. అప్పటి నుంచి, అక్కడ భద్రత పెంచి, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఇంత భద్రత ఉన్నా కూడా, ఇలా నగలు ఎలా మాయం అయ్యయో, ఎవరికీ అర్ధం కావటం లేదు. అసలు దీని పై విచారణ జరపకుండా, కేవలం రికవరీ మాత్రం చెయ్యటం పై కూడా విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read