ఈ రోజు విజయవాడలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, A1 కన్వెన్షన్ హల లో జరుగుతుంది. ఈ సమావేశంలో, పార్టీ ఓటమితో పాటు, ప్రభుత్వ విధానాల పై చర్చించారు. ఈ సందర్భంలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ముందే కుండ బద్దులు కొట్టి చాలా అంశాలు మాట్లాడారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు శభాష్ అంటున్నాయి. ఇలాంటి నిజమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చే వాళ్ళు కావలని, భజన చేసే వాళ్ళు కాదని, తెలుగుదేశం కార్యకర్తలు అత్నున్నారు. గోరంట్ల మాట్లాడుతూ, మన పార్టీలో స్వార్ధ పరులు, ఎందుకు పనికాని తెల్ల ఏనుగులకు అందలం ఎక్కించారు, పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇచ్చారు అంటూ, ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుండ బద్దలు కొట్టారు.
నిజమైన కార్యకర్త త్యాగాలు చేస్తుంటే, ఇలాంటి స్వార్ధపరులు, పదవులు పొంది, హోదా తెచ్చుకుని, డబ్బులు సంపాదించుకుని, పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నారని, గోరంట్ల అన్నారు. ఇలాంటి వారిని పక్కన పడేసి, పార్టీలోకి యువతను, మహిళలను తీసుకువచ్చి, వారికి అవకాశాలు ఇచ్చి, నాయకత్వాన్ని తయారు చెయ్యాలని, గోరంట్ల అన్నారు. అంతే కాదు, టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆ పదవి బీసీ నేతకు ఇవ్వాలని చంద్రబాబుని కోరారు. నాలుగు సార్లు, అయిదు సార్లు ఓడిపోయిన వారికి ఎందుకు మీరు ఇంకా ప్రాముఖ్యత ఇస్తున్నారు, తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని మరోసారి చంద్రబాబుకు స్పష్టం చేసారు. దీంతో ఒక్కసారిగా హాల్ అంతా చప్పట్లతో మారు మోగింది.
ఇక మరో సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేసారు. ప్రాతిపక్షంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎలా ఉండాలి అంటూ అయ్యన్న మాట్లాడుతూ, మనం అధికారంలో ఉండగా ఎంతో చేసాం, అయినా ప్రజలు మనల్ని వద్దు అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంగా మనల్ని వద్దు అంటున్న ప్రజల కోసం, ఇప్పటికిప్పుడు తాపత్రయ పడాల్సిన అవసరం లేదు. ప్రజలకు మనం ఎప్పుడూ అవసరం అనుకుంటే, మనం వారికి ఎప్పుడు కావలి అనుకుంటే అప్పుడే వెళ్దాం, అప్పటి వరకు ప్రజల గురించి ఆలోచించవద్దు ఆకలి వేసినప్పుడే అన్నం పెట్టాలి, అప్పుడే అన్నం విలువ తెలుస్తుంది. అప్పటి వరకు, పార్టీని పటిష్టం చేసుకుంటే, పార్టీ వ్యవహారాలు చూసుకుందాం అంటూ, అయ్యన్న చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి.