ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తిమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. రెండు రోజుల క్రితం, స్పీకర్ స్థానంలో ఉంటూ, ఒక పార్టీని టార్గెట్ చేసుకుంటూ, తెలుగుదేశం కోన్‌కిస్కాగాళ్లు అంటూ స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీని పై చంద్రబాబు స్పందిస్తూ, ఒక స్పీకర్ అనే వ్యక్తి హుందాగా ఉండాలి. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఉండాలి. ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ, మరో పార్టీని టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తే, రాజ్యాంగబద్ధ పదవులో ఉన్న వ్యక్తికి, ఇంకా విలువ ఏమి ఉంటుంది ? తమ్మినేని పధ్ధతి మార్చుకోవాలి. స్పీకర్ స్థానంలో ఉంటూనే, వాలంటీర్లు మన వాళ్ళు అనే విధంగా స్పీకర్ మాట్లడుతున్నారని చంద్రబాబు తప్పుబట్టారు.
రెండు రోజుల క్రితం స్పీకర్ తమ్మినేని, శ్రీకాకుళంలో పర్యటిస్తూ, గ్రామ వాలంటీర్లకు ఎంపిక అయిన వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, వారు ఎదో వైసిపీ కార్యకర్తలు అన్నట్టు మాట్లాడారు. నిజానికి గ్రామ వాలంటీర్లు అనేది, ప్రభుత్వ వ్యవస్థ, అయితే ఇది వైసీపీ కార్యకర్తల పునరావాసంగా మారిపోయింది. ఈ సమావేశంలో గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలుగుదేశం కౌన్కిస్కా గొట్టం గాళ్ళు, గ్రామ వాలంటీర్ల పై కోర్ట్ కు వెళ్తారు, మీరేమే ఆ గొట్టంగాళ్ళని పట్టించుకొకండి, వారి సంగతి మేము చూసుకుంటాం అంటూ, వివాద్సపద వ్యాఖ్యలు చేసారు. నిజానకి, ఒక మాములు నాయకుడు మాట్లాడితేనే ఇది సంచలనం అవుతుంది, అలాంటిది ఒక స్పీకర్ ఇలా మాట్లాడటంతో అందరూ అవాక్కయ్యారు.
అయితే స్పీకర్ ఇలా మాట్లాడటం పై చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. ఒకటి ఆయన, ఒక పార్టీని టార్గెట్ చెయ్యటం. అలాగే రెండోది, ప్రభుత్వ వ్యవస్థ అయిన గ్రామ వాలంటీర్లని, పార్టీ కార్యకర్తలు లాగా చెప్పటం. దీని పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అలాగే, నిన్న విజయసాయి రెడ్డి కూడా, సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశంలో మాట్లాడుతూ, మీ కోసం ఏమి చెయ్యలేదు అంటున్నారు, డైరెక్ట్ గా మేము ఏమి చెయ్యలేం, ఎందుకంటే ఇది ప్రభుత్వం, కోర్ట్ లు ఊరుకోవు, అందుకే మీకు 4 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చాం, ఈ పని సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేసాం అని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యల పై కూడా చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. దీని పై ఎలా పోరాడాలో ఆలోచిస్తున్నామని అన్నారు.