ఏపీలో చాలా పార్టీలు మారారు. ఇంకా మార‌డానికి పార్టీలు లేవు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం తాము ఉన్నామ‌ని రాజ‌కీయ పార్టీల‌కైనా సంకేతాలు ఇచ్చేందుకు ఓ పార్టీ కావాలి. ఇలా చ‌కోర ప‌క్షుల్లా ఎదురుచూస్తున్న కొంద‌రు రాజ‌కీయ నిరుద్యోగుల‌కు బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ఎడారిలో ఒయాసిస్సులా క‌నిపించింది. వీరే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధిలు. వీరంతా ఏపీలో లేని బీఆర్ఎస్లో చేర‌బోతున్నారు. ప్ర‌త్తిపాడు నుంచి 2014 లో రావెల కిషోర్ బాబు   ఎమ్మెల్యే గా గెలిచి మంత్రిగా భాద్యతలు స్వీక‌రించారు. మంత్రివ‌ర్గం నుంచి తీసేయ‌డంతో ఆ త‌రువాత ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన‌లో చేరారు. కొద్ది కాలానికే బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గూటికి చేర‌నున్నారు. మ‌రో రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్ 2009 లో పీఆర్పీ నుంచి గుంటూరు పార్లమెంట్ కు పోటీ చేశారు. 2014 లో వైసీపీ ఏలూరు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు పోటీచేశారు. 2019 లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్య‌ర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పోటీచేసిన ఏ పార్టీ నుంచి ఏ స్థానం నుంచి గెల‌వ‌ని తోట చంద్ర‌శేఖ‌ర్ ఇప్పుడు బీఆర్ఎస్లో చేర‌బోతున్నారు. పార్టీలు, కండువాలు మార్చ‌డ‌మే త‌ప్పించి ఎన్నిక‌ల‌కు ప‌నికొచ్చే నేత‌లు కాద‌ని తేలిపోవ‌డంతో ఏపీలో ఏ పార్టీ నుంచి వీరికి పిలుపు రాలేదు. బీఆర్ఎస్లోనూ ఎవ‌రూ ఏపీ నుంచి చేర‌డంలేదు. ఇరువురూ ఎదురుచూస్తున్న‌ది ఒక‌టే కావ‌డంతో వీరి చేరిక‌కు మార్గం సుగ‌మం అయ్యింది.

తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టే మొత్తం జరుగుతున్నాయి. కందుకూరు, గుంటూరు ఘటనలు జగన్ స్కెచ్ అని, అవి సాకుగా చూపి, చంద్రబాబు పర్యటనలు రద్దు చేసే కుట్ర పన్నారని టిడిపి ఆరోపించింది. ఆ ఆరోపణలకు తగ్గట్టే, నిన్న సభలు, ర్యాలీలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ రోజు నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన ఉండటంతో, మొత్తం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చంద్రబాబు బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో దిగి కుప్పం రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబు కుప్పం రానున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదు అంటూ, పోలీసులు ఓవర్ ఆక్షన్ చేస్తున్నారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచారరథం, ఇతర వాహనాలను పోలీసులు ఆపేసారు. చిత్తూరు జిల్లా 121 పెద్దూరు గ్రామం వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున టిడిపి నేతలు చంద్రబాబుకి స్వాగతం పలికేందుకు వెళ్తున్నారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాత్రం, ఆంక్షలు పాటించకపోతే కేసులు పెడతాం అని వార్నింగ్ ఇస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు చెందిన ఓట్లు ఇష్టా రాజ్యంగా తీసేస్తున్న వైసిపీ ప్రభుత్వం కుట్ర ఢిల్లీ వరకు వెళ్ళటమే కాదు, ఇక్కడ జరిగింది చూసి, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా షాక్ తింది. నేరుగా రంగంలోకి దిగింది. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీ నుంచి అనంతరపురం రానుంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు టీడీపీకి చెందిన వారి ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది. దీని పై గ్రౌండ్ లో విచారణ చేయటానికి, ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ వస్తున్నారు. విడపనకల్లు మండలం చీకలగురికిలో టీడీపీ ఓట్ల తొలగింపులో కుట్ర జారిగిందని. ఫోర్జరీ నోటీసుల తయారీ చేసి ఇచ్చారని, దీని పై అధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వాలంటీర్లను అడ్డు పెట్టుకుని, ఓట్లు తొలగించారని తెలుగుదేశం ఆరోపణ. ఈ అంశం పై కేంద్రానికి ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వస్తుందని తెలుసుకుని, తమ గుట్టు బయట పడకుండా, కింద స్థాయి ఉద్యోగులు పై వేటు మొదలు పెట్టారు.  బీఎల్వోలు గోపి, మధును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏమి చేస్తుందో చూడాలి మరి.

గుంటూరు తోక్కిసాలట ఘటనలో ప్రభుత్వం చేస్తున్న ఓవర్ ఆక్షన్ పై, సొంత పార్టీలోనే నిరసన వ్యక్తం అవుతుంది. బయట నుంచి చూసే ప్రజలు కూడా, ఒక ప్రమాదంలో వైసీపీ చేసిన ఓవర్ ఆక్షన్ పై చీదరించుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీలోనే నిరసన వ్యక్తం అవుతుంది. గుంటూరు తొక్కిసలాట ఘటనలో వైసీపీ స్పందించిన తీరు పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గుంటూరు తొక్కిసలాట అనేది ఒక ప్రమాదం అని, ఎవరూ అనుకోని దురదృష్టకర ఘటన అని అన్నారు. గతంలో కూడా అనేక మంది సేవా కార్యక్రమాలు చేసారని, కానీ ఈ సారి అనుకోని ఘటన జరిగిందని అన్నారు. అయితే ప్రజలకు సేవ చేయటానికి వచ్చిన వారిని, ఎన్ఆర్ఐలని వేధిస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ చాల మంచి వ్యక్తి అని, వాళ్ళని భయపెడితే ఎలా అని అన్నారు. ఇలా చేయకూడదని అన్నారు. ఇలాంటి చర్యలు చేస్తే అభివృద్ధిని అడ్డుకోవటమే అవుతుందని అన్నారు. శ్రీనివస్ మంచి వ్యక్తి అని, రాజకీయ వేదికల పై పని చేసాడని, వేధించటం కరెక్ట్ కాదని, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Advertisements

Latest Articles

Most Read