ఈ రోజు అసెంబ్లీలో సున్నా వడ్డీ పై చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, నేను చెప్పాల్సింది చెప్పేసా, ఇక ఈ అంశం పై చర్చ వద్దు, చంద్రబాబుకి మళ్ళీ అవకాసం అవసరం లేదు అని చెప్పగానే, స్పీకర్ కూడా ఈ చర్చ ముగించి, చంద్రబాబుకి అవకాసం ఇవ్వకుండా చేసారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యలు తాము చెప్పాలనుకుంది, మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు జగన్ వైఖరిని తప్పు పట్టారు. జగన్ మోహన్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించి, అవాస్తవాలు చెప్పి, ఛాలెంజ్, ఛాలెంజ్ అని చెప్పి, ఈ రోజు నేను మాట వరుసకి అన్నాను, మీరు తక్కువ కేటాయించారు అని చెప్తున్నారని, నిన్న ఛాలెంజ్ అని పది సార్లు అని, ఈ రోజు ఇలా పారిపోయారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఒక్క విషయం పై కూడా అవగాహన లేదని, అతనికి సభలో ఏమి జరుగుతుందో కూడా తెలియదని అన్నారు. మేము అన్ని లెక్కలతో, ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చామో చెప్పమని, జగన్ సున్నా వడ్డీ రుణాల పై అవాస్తవాలు చెప్పారని అచ్చెంనాయుడు అన్నారు.

జగన్, నేను మడం తిప్పను అంటాడు, మాట మీద నిలబడే వాడివి అయితే 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి, పౌరుషం ఉంటే రాజీనామా చెయ్యండి అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మేం తలచుకుంటే మీరు ఉండరని జగన్‌ అనడం అతని నైజాన్ని తెలియచేస్తుందని అన్నారు. ఈ సమయంలో, తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ఓ మీడియా ప్రతినిధి వాగ్వాదానికి దిగారు. అచ్చెన్నాయుడు మాటలకు ఆ మీడియా ప్రతినిధి అడ్డుతగిలారు. దీంతో బుచ్చయ్య చౌదరి కల్పించుకుని విలేఖరులు కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఇదేమి పధ్ధతి అని అన్నారు. ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి రాజీనామాను మేం కోరుకోవడం లేదని, వారు చాలెంజ్‌ చేశారు కాబట్టే ఈ ప్రస్తావన తెస్తున్నామని అన్నారు. మమల్ని రౌడీలు అని జగన్ అంటున్నారు, రికార్డులు తిరగేస్తే ఎవరు రౌడీలో, ఎవరు హంతకులో తెలుస్తుందని బుచ్చయ్య చౌదరి అన్నారు.

ప్రతిపక్షంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, మేము అగ్లీ సీన్స్ చూపిస్తాం అని చెప్పి, రోజా, కొడాలి నాని, చెవిరెడ్డి లాంటి వాళ్లతో ఎలాంటి రచ్చ చేసారో, అందరూ చూసారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. 151 మందితో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ మొదటి రోజు మాట్లాడుతూ, ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చేస్తామని, చంద్రబాబు లాగే చెయ్యమని, అసెంబ్లీని ఎంతో హుందాగా నడుపుతాం అంటూ చెప్పుకొచ్చారు. జగన్ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు అందరూ, జగన్ మారారు అని, సియంగా జగన్ ఇలా ఉండటం, రాష్ట్రానికి ఎంతో మచిందని అన్నారు. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, అసెంబ్లీలో తన సహజ శైలిని చూపించారు. ఏయ్ ఏయ్ అంటూ ఆరుస్తూ, మేము 151 మంది ఉన్నాం, మేము తలుచుకుంటే మీ 23 మంది ఇక్కడ ఉండలేరు, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఎదో ఒకసారి చెప్పారు అంటే ఆవేశంలో అన్నారు అనుకోవచ్చు. కాని ఈ మాట అన్న తరువాత, మళ్ళీ ఒక 15 నిమిషాలకు లెగిసి, నేను మళ్ళీ చెప్తున్నా అంటూ అదే బెదిరింపులు.

"ఒక్కసారి మేం డిసైడ్ చేస్తే, మీరు ఇక్కడ ఉండరు. మేం 151 ఎమ్మెల్యేలు ఉన్నాం, మీ వాళ్లు 23 మంది మాత్రమే ఉన్నారని గుర్తు ఉంచుకోండి. మేం తలుచుకుంటే మీలో ఒక్కరు కూడా అసెంబ్లీలో కనిపించరు. ముఖ్యమంత్రిగా నేను మాట్లాడుతుంటే నాకు అడ్డు తగులుతారా..?. ఏం ఏం ఏం ఇదేం పశువుల సంత అనుకున్నారా లేకుంటే శాసనసభ అనుకుంటున్నారా..?. ఎలాంటోళ్లను తయారు చేశారయ్యా.. మీరు.. మొత్తం రౌడీలను, గూండాలను తీసుకొచ్చారు. మీకు బాడీలు పెరిగాయి కాని, బుద్ధి పెరగలేదు.ఒక్కరికైనా బుద్ధుందా? అసెంబ్లీ ప్రొసీజర్ తెలుసా మీకు? ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? బుద్ధీ, జ్ఞానం లేకుండా ఉన్నారు మీరంతా. అవును... ఇలా కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతారా? ఎవరూ భయపడరు. కూర్చో కూర్చోవయ్యా... అచ్చెన్నాయుడూ... కూర్చో... కూర్చో... కూర్చో అంటూ తెలుగుదేశం సభ్యుల పై తీవ్ర విమర్శలు చేసారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

నిన్న అసెంబ్లీలో జగన్ చెప్పిన సత్య దూరం అయిన వ్యాఖ్యల పై, తెలుగుదేశం పార్టీ, జగన్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. రైతులకు ఇచ్చే సున్నా వడ్డీ రుణాల విషయంలో సభను జగన్ తప్పుదోవ పట్టించారని తెలుగుదేశం పార్టీ చెప్పింది. నిన్న అసెంబ్లీలో కరవు పై జరిగిన చర్చ సందర్భంగా అసెంబ్లీని జగన్ తప్పుదోవ పట్టించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత క్వషన్ హవర్ సమయంలో నిమ్మల మాట్లాడారు. ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుని హేళన చేస్తూ జగన్ సభలో మాట్లాడారని అన్నారు. అసెంబ్లీలో ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ, మీరు రాజీనామా చేస్తారా అని సవాల్‌ చేశారని జగన అన్నారని చెప్పారు. వడ్డీలేని రుణాలు ఎంతమొత్తం ఇచ్చామన్నది రికార్డులతో సహా మీకు ఇస్తున్నాం అని స్పెకర్ కు తెలిపారు. రైతులకు వడ్డీ లేని రుణాలు రద్దు చేశారని అసత్యాలు మాట్లాడటం మంచిది కాదని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం వడ్డీలేని రుణాల కింద 2013-14లో రూ.349 కోట్లు చెల్లించారని, 2014-15లో రూ.44 కోట్లు చెల్లించారని, 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.570 కోట్లు పెండింగ్‌లో ఉందని అన్నారు. ఇటీవల జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఈ నిధులను విడుదల చేయాలని జగన్‌ను కోరితే ఆయన నిరాకరించిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. వడ్డీలేని రుణాల పథకం రద్దుచేశారని, రూపాయి కూడా ఇవ్వలేదని జగన్ అసత్యాలు మాట్లాడారని టిడిల్పీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో రూపాయి ఇవ్వలేదని, ఎంత మొత్తం ఇచ్చామో లెక్కలతో సహా చూపిస్తామన్నామని అచ్చెం నాయుడు అన్నారు. మరి ఈ ఆధారాలు అన్నీ ఇచ్చిన దాని పై స్పీకెర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

నిన్న జగన్ చెప్పిన అబద్ధాల పై, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా సభకు వచ్చింది. స్పీకర్ ను రిక్వస్ట్ చేసి, నిన్న జరిగిన చర్చ ఈ రోజు కూడా కొనసాగించాలని కోరారు. జగన్ కూడా ఒకే అనటంతో, చర్చ మొదలైంది. ఈ సందర్భంగా, చంద్రబాబు అన్ని రికార్డులతో సభ ముందుకు వచ్చి, నిన్న జగన్ చెప్పిన అబద్ధాలుకు కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి రూపాయి కూడా ఇవ్వలేదని, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ తనను రాజీనామా చేయాలని సవాల్ చేసరాని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే, సిగ్గు లేకుండా నవ్వుతున్నారన్నారు. 2013లో సున్నా వడ్డీ పధకం అమల్లోకి వచ్చిందని అన్నారు. తరువాత మా ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ కొనసాగించిందని చెప్పారు. కిరణ్‌ కుమార్ రెడ్డి ప్రభుత్వ బకాయిలు 43.70 లక్షల మంది రైతుల రుణాలకు రూ.979.45 కోట్ల వడ్డీని తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించిందన్నారు.

అలాగే తెలుగుదేశం హయంలో రుణాలు రీషెడ్యూల్‌ చేయలేదని అంటున్నారని అన్నారు. ఈయనకు అసలు రూల్స్ కూడా తెలియవని అన్నారు. కరువు మండలాలను ప్రకటించాక రుణాలు ఆటోమాటిక్ గా రీషెడ్యూల్‌ అవుతాయనే విషయాన్ని తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్‌ చేశామని, డాక్యుమెంట్లు స్పీకర్ కు ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, జగన్ అసలు రూపాయి కూడా ఇవ్వలేదని, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ సీఎం ఎందుకు అంత పరుషంగా మాట్లాడారని చంద్రబాబు ప్రశ్నించారు. నన్ను రాజీనామా చేసి వెళ్లిపోతారా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చలో గాడిదలు కాశారా అని అన్నారు. సున్నా వడ్డీ పథకం పై అన్ని వివరాలు సభ ముందు ఉంచాం, మరి ఇప్పుడు జగన్‌ రాజీనామా చేస్తారా ? లేకపోతె 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Advertisements

Latest Articles

Most Read