ఎన్నికల్లో ఓడిపోగానే, చంద్రబాబు పై మిత్రపక్షాలు అయిన బీజేపీ, వైసీపీ ఎలా కక్ష తీర్చుకుంటున్నాయో ప్రతి రోజు చూస్తున్నాం. జగన్ ఒక విధంగా దెబ్బ కొడుతూ, అవమానాలు చేస్తుంటే, బీజేపీ మరో రకంగా చంద్రబాబుని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరిపోయినా, దేశంలో ఒక్క మీడియాకు ఈ చర్య పై స్పందించలేదు. ఎక్కడ మా మీద పడతారో అని, ఏ రాజకీయ పార్టీ కూడా ఇది తప్పు అని మాట్లాడ లేదు. అయితే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఈ సమయంలో చంద్రబాబుకు బాసటగా నిలిచారు. మోడీ చేస్తున్న విధానాల పై మండిపడ్డారు. బీజేపీ బ్రాండ్ తో చేసే రాజకీయాల్లో అన్నీ సరైనవై అయిపోతాయాని మాయావతి అన్నారు. నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను, బీజేపీ తమ పార్టీలో విలీనం చేసుకోవడం పై శుక్రవారం ఆమె ట్విటర్‌లో తీవ్రంగా స్పందించారు. బీజేపీ వ్యవస్థలను ఎలా దిగజారుస్తుందో, ఇదే నిదర్శనం అని అన్నారు.
ఆమె స్పందిస్తూ, ‘గురువారమే రాష్ట్రపతి ప్రసంగం జరిగింది. ప్రభుత్వం చెయ్యబోయే పనులు, ప్రాధాన్యతలు చెప్పి, రాష్ట్రపతి చేత ఎన్నో హామీలిచ్చారు. కానీ అదే రోజు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను ఫిరాయింపు చేసేలా ప్లాన్ చేసింది. ఆ నలుగురు ఎంపీలలో, ఇద్దరిని అవినీతిపరులు అంటూ గతంలో ఆరోపణలు చేసారు. ఇప్పుడు వారు కూడా ఆ పార్టీలో చేరారు. చేరగానే వారు పాల కంటే స్వచ్ఛంగా మారిపోయారు’ అని ట్విట్టర్ ద్వారా ఎద్దేవాచేశారు. తమదైన స్టైల్ లో చేస్తున్న రాజకీయాల్లో బీజేపీ పార్టీకి జరుగుతున్న అన్ని విషయాలు ఎంతో నుకూలంగానే కనపడుతున్నాయని అన్నారు. ఇది ఇలా ఉంటే, తెలుగుదేశం పార్టీ ఎంపీలు నలుగురు బీజేపీ పార్టీలో చేరటమే కాకుండా తమ పార్టీని విలీనం చేస్తున్నట్లుగా ఇచ్చిన తీర్మాన లేఖను ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆమోదించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పడుతుంది.