ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే, అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఆమెకు వైద్యులు చికిత్స్ చేస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు. ఈ రోజు జగన్, మోడిని కలిసిన కొద్ది సేపటికి ఈ వార్త వచ్చింది. దీంతో ప్రధాని మోడీ అహ్మదాబాద్ వెళ్తారని తెలుస్తుంది. దీంతో గుజరాత్ పోలీసులు కూడా సెక్యూరిటీ అలెర్ట్ పెట్టారు. నగరం మొత్తం, పోలీసులు సెక్యూరిటీని అలెర్ట్ చేసారు. ఈ మధ్య గుజరాత్ ఎన్నికల సమయంలో, ప్రధాని మోడీ, తల్లిని కలిసి ఆశీసులు తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ లోనే, ఆమె వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇక మరో పక్క నిన్న మోడీ సోదరుడి కారు కర్ణాటకలో ప్రమాదానికి గురయింది. ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీతో పాటు ఆయన కుటుంబసభ్యులకు కారు ప్రమాదంలో గాయాలు అయ్యాయి.
news
యువగళం... లోకేష్ పాదయాత్ర వివరాలు ఇవే...
నారా లోకేశ్ మహా పాదయాత్రపై ఎన్టీఆర్ భవన్లో టీడీపీ సీనియర్ నేతలు అధికారిక ప్రకటన చేసారు. ‘యువగళం’ పేరిట జనవరి 27 నుంచి నారా లోకేశ్ మహాపాదయాత్ర చేయనున్నారు. యువగళం లోగోను టీడీపీ నేతలు ఆవిష్కరించారు. జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం చేయన్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ముఖ్యంగా యువత ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి, లోకేష్ ఈ పాదయాత్రలో అడ్రెస్ చేయనున్నారు. రాష్ట్రంలో రాని పెట్టుబడులు, తిరిగి వెళ్ళిపోతున్న కంపెనీలు, లేని ఉద్యోగాలు, అడ్డ్రెస్ లేని జాబ్ క్యాలండర్, ఇలా అనేక ఇబ్బందులు గురించి నారా లోకేష్ తన పాదయాత్రలో అడ్డ్రెస్ చేసి, వీటికి ఏమి చేయాలి అనే విషయం పై చర్చించి, మ్యానిఫెస్టోలో చేర్చనున్నారు. 400 రోజుల పాటు, ఈ మహాపాదయాత్ర సాగనుంది.
జనాలు ఛీ కొట్టటంతో, అక్రమ సంబంధాల కూపీ నుంచి వెనక్కు తగ్గిన ప్రభుత్వం..
ఆంద్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న దిగజారుడు నిర్ణయాలను ప్రజలు రోజురోజుకి ఛీ కొడుతున్నారు. వైసిపి మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి బూతులు తిట్టడం రేంజ్ దాటేసి ,ఇప్పుడు కలక్టర్లను తిట్టమంటున్నారు. ఉన్నత హోదాలో ఉన్న నేతలే ఇలా ప్రవర్తిస్తున్నారు, వీరు సామాన్య జనానికి ఏం చెప్తారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, పోలీసులు చేత చేయిస్తున్న ఒక సర్వే చాలా వివాదాస్పదం అయ్యింది. ఈ సర్వే చేయాల్సిన బాధ్యతలను మహిళా పోలీసులకు అప్పచెప్పారు. ఈ సర్వే కోసం స్పెషల్ యాప్ కూడా ఫిక్స్ చేసారు. దీని కోసం మహిళా పోలీసుల చేత అడిగించే ప్రశ్నల కోసం అడ్డదిడ్డమైన, అర్ధం లేని ఒక ప్రశ్నాపత్రం తయారు చేసారు. దాంట్లో నీ మొగుడికి ఎందరు భార్యలు? సీక్రెట్ ఎఫైర్స్ ఏమైనా నడుపుతున్నాడా? మీ ఆయన మిమ్మల్ని బాగా కొడతాడా? మీ ఆయనపై గృహహింస కేసులున్నాయా ? అంటూ సామాన్య మహిళను ప్రశ్నలతో వేదిస్తున్నారు మహిళా పోలీసులు. దాంతో మా పర్సనల్ లైఫ్ గురించి నిలదీయడానికి మీరెవరు అంటూ జనం తిరగబడ్డారు. మేము చెప్పకుండా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నరంటూ మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. వీళ్ళు ఇచ్చిన ఈ సమాచారాన్ని వైసిపి ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటారని అనుమానాలు వ్యక్తం చేసారు. కాని వీళ్ళ ప్లాన్ బెడిసి కొట్టింది. మహిళలు నుంచి ఈయాప్ పై తీవ్ర వ్యతిరేఖత రావడంతో ప్రస్తుతానికి దీన్ని వెనక్కు తీసుకున్నారు.
జగన్ ఢిల్లీ పర్యటన పై, వైసీపీ తల బాదుకునే ట్వీట్ చేసిన లోకేష్
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేసారు. ఈరోజు జగన్ ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం వెనుక స్టొరీ ఏంటో చెప్పాలని లోకేష్ ట్వీట్ చేసారు. ఎన్నోకేసుల్లో A1 గా ఉన్న రెడ్డి మళ్ళీ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు ? బాబాయ్‌ని హ-త్య చేసిన తమ్ముడిని రక్షించడానికా ? లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏ2 అయిన విజయసాయిరెడ్డి కుటుంబాన్ని కాపాడటానికా? అంటూ ఎద్దేవా చేసారు. ఇవేమీ కాకపోతే కేంద్రం దగ్గర అప్పు తీసుకోవడానికి పర్మిషన్ కోసమా ? అంటూ జగన్ పై నారా లోకేశ్ ఒపీనియన్ పోల్ పెట్టారు. దీని పై నెటిజెన్ లు రకరకాలుగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ఇక్కడ కొస మెరుపు ఏంటి అంటే, వైసీపీ మాత్రం, పోలవరం, స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీ వెళ్ళారని చెప్పటం. నమ్మే వాళ్ళు ఉంటే, ఎన్నైనా చెప్తారు మరి.