ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల తీసివేత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తుంది. రాజకీయం మొత్తం దీని చుట్టూనే నడుస్తుంది. ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆయన వివరణ ఇవ్వలేదు కానీ, ఎదురు దాడి అయితే చేసేసారు. పెన్షన్ల తీసి వేత పై , ఏకంగా కలెక్టర్లనే ప్రతిపక్షాల పై తిట్టమని చెప్పారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో జగన్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అంటుంది. ముందుగా జగన్ చెప్తుంది, టిడిపి హయాంలో కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చారంట. రాష్ట్రంలో అందరికీ తెలుసు, రూ.200 పెన్షన్ ని, రూ.2000 చేసి, పది రెట్లు చంద్రబాబు పెంచారని. కానీ జగన్ మాత్రం అవలీలగా అబద్ధం చెప్పేసారు. ఇక మరో అంశం, అప్పట్లో కేవలం 39 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే వారానికి. నిజానికి గతంలో ఒక సందర్భంలో జగన్ గారే, 44 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే వారని ఆయనే చెప్పారు. అంటే ఆయనకు ఆయనే మాట మార్చేసారు. నిజానికి అప్పట్లో చంద్రబాబు పెన్షన్ ఇచింది 54 లక్షల మందికి. ఇలా ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి, పచ్చి అబద్ధాలు ఆడటంతో, ఆధారాలు చూపించి మరీ, సోషల్ మీడియాలో జగన్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెల, అంటే జనవరి  27 నుంచి లోకేష్ పాదయాత్రకు సన్నాహకాలు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు, దాదాపుగా ఏడాది పాటు ఈ పాదయత్ర సాగునుంది. అయితే ఈ పాదయాత్ర మొదలు కావటానికి, సరిగ్గా మరో నెల రోజులు గడువు ఉంది. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి, లోకేష్ పాదయాత్ర విశేషాలు అధికారికంగా చెప్పనున్నారు. లోకేష్ పాదయాత్ర పై ఒక ప్రోమో విడుదల చేసి, తేదీతో పాటు సమయం కూడా చెప్పనున్నారు. ఇక రోడ్ మ్యాప్ తో పాటుగా, పాదయాత్ర గురించి ఇతర వివరాలు కూడా టిడిపి నేతలు చెప్పనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో అచ్చెన్నాయుడు, చినరాజప్ప, ఆనంద్‍బాబు, వంగలపూడి అనిత, షరీఫ్, ఇతర నేతలు పాల్గుంటారు. పాదయాత్రలో ఎక్కడా హంగామా లేకుండా, కేవలం ప్రజలను కలవటం, వారి సమస్యలు తెలుసుకోవటం పైనే, ఎక్కువ ఫోకస్ పెట్టాలని లోకేష్ ఆదేశాలు ఇవ్వటంతో, దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుంలదరికి జగన్ ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. ఉద్యోగుంలదరికి ఫేస్ రికగ్నిషన్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇది ఏపి సచివాలయం, హెచ్వోడీలు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులకు అందరికి వర్తిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని క్యాడర్ల ఎంప్లాయీస్ కు ఫేస్ రికగ్నిషన్ హాజరు తప్పకుండా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇది జనవరి నెల నుంచి అమలవుతుందని , దీన్ని సెక్రటేరియట్ , అన్ని శాఖల హెచ్ ఓడీలు పాటించాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు. ఇక జిల్లా స్థాయి కంటే తక్కువ క్యాడర్ ఉన్న ఆఫీసులకు అలాగే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి 16 నుంచి ఈ ఫేస్ రికగ్నైజేషన్ వర్తిస్తుంది. గతంలో చంద్రబాబు బయోమెట్రిక్ తెస్తేనే నానా రభసా చేసిన ఉద్యోగులు, ఇప్పుడు ఏమి అంటారో మరి.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన ఖరారు అయ్యింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం నేతలు పర్యవేక్షించారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా గుంటూరు నగరంలో జరిగే పేదలకు అన్నగారి జనతా వస్త్రాలు పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబునాయుడు పాల్గొనున్నారు. అధినేత పర్యటన సందర్భంగా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రవణ్ కుమార్, పశ్చిమా నియోజకవర్గ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర ( నాని ), నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ( బుజ్జి ) స్థలన్నీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, రాజా మాస్టరు, తదితరులు హాజరయ్యారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా సంక్రాంతి కానుకలు ఇచ్చేది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తనకు వీలైన సహాయం చేస్తుంది.

Advertisements

Latest Articles

Most Read