తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లా పర్యటన ఉండటంతో, అధినేతకు స్వాగతం పలకటానికి టిడిపి నాయకులు భారీగా ఏర్పాట్లు చేసారు. ఈ ఏర్పాట్లలో భాగంగా టీడీపీ శ్రేణులు కటౌట్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫ్లెక్సీలు పెట్టటానికి వీలు లేదు అంటూ మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి అడ్డుకున్నారు. దీంతో కమిషనర్ ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించారు. వైసీపీ వాళ్లు ఫ్లెక్సీలు పెడితో తొలగించకుండా, మేము ఫ్లెక్సీలు పెడితే ఎందుకు అడ్డుకుంటారంటూ టిడిపి నేతలు కమీషనర్ పై ఫైర్ అయ్యారు. గతంలోకూడా ఇలాగే ఫ్లెక్సీల మున్సిపల్ కమిషనర్ వివాదంలో ఇరుకున్నారు. ఈ వివాదాల మధ్యే టిడిపి శ్రేణులు రేపటి చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. రేపు మధ్యానం చంద్రబాబు నెల్లూరు చేరుకోనున్నారు.
news
రాష్ట్రపతి పర్యటనలో మంత్రి రోజాకు ఘోర అవమానం...
శ్రీశైలంలో పర్యాటక శాఖా మంత్రి రోజాకి ఘోర అవమానం జరిగింది. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం దేవాలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి తయారు చేసిన వారి జాబితాలో మంత్రి రోజా పేరు లేదు. లిస్టులో రోజా పేరు లేకపోవడంతో రాష్ట్రపతితో పాటు, రోజాను దేవాలయంలోకి సెక్యూరిటీ వాళ్లు అనుమతించలేదు. దాంతో చేసేది ఏం లేక రాష్ట్రపతి కార్యాలయం వారితో మాట్లాడి, మంత్రి రోజా ప్రత్యేక అనుమతి తీసుకుంది. ఆ తరువాత రోజాను, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆలయంలోకి, కలెక్టర్ పంపించారు. ఏదేమైనా పర్యాటక శాఖా మంత్రి అయ్యుండి, ఒక రాష్ట్రపతితో పాటు వెళ్ళడానికి ఇన్ని తిప్పలు పడాల్సి రావడం ఆవిడకు అవమానమే ...
కలెక్టర్లకి జగన్ వింత ఆదేశాలు... అవాక్కయిన కలెక్టర్లు...
ఈ రోజు సియం క్యాంప్ ఆఫీస్ లో, వివిధ పధకాలు అందని లబ్దిదారులకు బటన్ నొక్కే కార్యక్రమం అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గున్నారు. బటన్ నొక్కి మిగిలిపోయిన వారికి డబ్బులు వేస్తున్నాం అని చెప్పారు. అయితే ఈ సందర్భంగా ఇచ్చిన స్పీచ్ లో, జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో కలెక్టర్లు షాక్ తిన్నారు. రాష్ట్రమంతా దాదాపుగా లక్షకు పైగా పెన్షన్లు తీసిన విషయం తెలిసిందే. వెయ్యి చదరపు అడుగులు ఇల్లు కానీ, 300 యూనిట్ల కరెంటు కానీ వస్తే తీసేయమని ప్రభుత్వం చెప్పింది. ఇదే విషయం పత్రికలు రాసాయి, ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. అయితే పత్రికల్లో వచ్చిన కధనాలు, ప్రతిపక్షాలను తిట్టాలని, కలెక్టర్లకు జగన్ ఆదేశించారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి వారిని గట్టిగా తిట్టండి అని కలెక్టర్లకు చెప్పారు జగన్. దీంతో కలెక్టర్లు షాక్ తిన్నారు. కలెక్టర్లు వివరణ ఇస్తారు , అలా ఇవ్వమంటే ఒకే కానీ, ప్రతిపక్షాలని మేము తిట్టటం ఏంటి అంటూ, కలెక్టర్లు ఖంగు తిన్నారు. వైసీపీ నేతలు తిడుతున్న తిట్లు ప్రజలకు బోర్ కొట్టాయని, ఇప్పుడు కలెక్టర్లని కూడా తిట్టమంటున్నారు ఏమో మరి.
ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డి, మంత్రి విడదల రజినీకి హైకోర్ట్ నోటీసులు...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు మంత్రి విడదల రజినీకి షాక్ ఇచ్చింది. చిలకలూరిపేటలో జరుగుతున్న అక్రమ గ్రానైడ్ తవ్వకాల విషయంలో హైకోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఉన్న అసైన్డ్ ల్యాండ్స్ లో గ్రానైడ్ తవ్వకాలు జరుపుకోవచ్చు అంటూ, ఎన్వోసీ జారీ అంశంలో మంత్రికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయం పై, హైకోర్టులో ఒక రిట్ పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ స్థలంలో గ్రానైట్ తవ్వకాలు జరుపుకోవచ్చు అంటూ పర్మిషన్ ఇవ్వటం పై, రైతులు అభ్యంతరం చెప్తూ, హైకోర్టులో ఒక రిట్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రిట్ పిటీషన్ ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు మంత్రి విడదల రజినీతో పాటుగా, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది.అక్కడ ఉన్న అసైన్డ్ రైతులను బెదిరించి మరీ అనుమతి ఇచ్చారని రైతులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ రిట్ పిటీషన్ పై నోటీసులు ఇచ్చిన హైకోర్టు, ఈ పిటీషన్ తీర్పుకి లోబడే లీజు ఉంటుందని స్పష్టం చేస్తూ, కేసుని మూడు వారాలకు వాయిదా వేసింది.