గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. తెలుగుదేశం నేత రావి వెంకటేశ్వరరావుకు గడ్డం గ్యాంగ్ బహిరంగంగా బెదిరింపులు దిగింది. రావివెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి చంపేస్తామంటూ గడ్డం గ్యాంగ్ నేత బెదిరింపులు దిగింది. ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా దూషించారు గడ్డం గ్యాంగ్ నేతలు, టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతుండగానే పెట్రోల్ కవర్లతో టీడీపీ నేతలపై దాడికి ప్రయత్నించింది గడ్డం గ్యాంగ్. ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపైనా గడ్డం గ్యాంగ్ దా-డికి దిగింది. మీడియా ప్రతినిధుల సెల్ఫోన్లను గడ్డం గ్యాంగ్ నేలకేసి కొట్టి నాశనం చేసారు. రావి అనుచరులు, గడ్డంగ్యాంగ్ మధ్య వాగ్వాదం జరగటంతో పోలీసుల మోహరించారు.గడ్డం గ్యాంగ్ నేత కాళీ ఇంటికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులను యత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేసారు. పోలీసులతో టీడీపీ నేతల వాగ్వాదం జరగటంతో, గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రేపు రావి రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉండటంతో, టీడీపీ ఆ కార్యక్రమం నిర్వహించొద్దని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు.
news
ముద్రగడ నిద్రపోయారా? జగన్ కోసం నిద్ర నటిస్తున్నారా?
కాపు జాతికి సంబంధించిన అతిపెద్ద సమస్య చర్చకి వచ్చిన దశలో జాతి కోసం నా ప్రాణాలు ఇస్తానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసిన ముద్రగడ పద్మనాభం కనపడకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ముద్రగడ నిద్రపోయారా? నిద్ర నటిస్తున్నారా? అనేది కాపు రిజర్వేషన్ కోసం పోరాడిన నేతలకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి సర్కారుపై ఒంటికాలిపై లేచే ముద్రగడ...అదే జగన్ సీఎం కావడంతో దీర్ఘనిద్రలోకి వెళ్లిపోవడం సహ ఉద్యమకారులకు ఏం చేయాలో అంతుబట్టటంలేదు. కేంద్రం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది కేసులు, వివాదాలలో ఉండగానే ఏపీలో టిడిపి సర్కారు దిగిపోయి వైసీపీ సర్కారు వచ్చింది. వైఎస్ జగన్ రెడ్డి సీఎం కాగానే టిడిపి కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు ఎత్తేశారు. దీనిపై కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయని ముద్రగడ తీరుపై కాపు నేతల్లో అనుమానాలు మొదలయ్యాయి.
తాజాగా కేంద్రం కూడా కాపులకి చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చట్టబద్ధమేనని, ఇది కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని తేల్చేసింది. దీనిపై వైసీపీ ప్రభుత్వ పెద్దలు, వైసీపీలో కాపు నేతలు తేలు కుట్టిన దొంగల్లా మౌనం నటిస్తున్నారు. వీరితోపాటు ముద్రగడ కూడా నిద్ర నటించడం అనుమానాలకు తావిస్తోంది. కాపులకు టిడిపి ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ ని వైసీపీ అమలు చేసేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన పద్మనాభం.. అసలు నోరు కూడా మెదపకుండా మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ రెడ్డిని సీఎం చేయడం కోసం పనిచేసిన ప్యాకేజీ స్టార్లలో ముద్రగడ ఒకరని, జగన్ సీఎం కావడంతో తెరవెనక్కి వెళ్లారని ఆరోపణలున్నాయి. కాపుల రిజర్వేషన్లు అని పోరాడిన ముద్రగడ, జగన్ కాపుల రిజర్వేషన్లు పీకేసినా స్పందించకపోవడంతో..పద్మనాభం జగన్ వదిలిన బాణమని తేటతెల్లమవుతోంది.
చంద్రబాబు వస్తారని భయం వేసి, రుషికొండ దగ్గర పోలీసులు ఏమి చేసారో చూడండి...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మూడు రోజుల విజయనగరం పర్యటన ముగించుకుని, విశాఖ ఎయిర్ పోర్ట్ కు బయలు దేరారు. నిన్నే చంద్రబాబు వెళ్ళాల్సి ఉన్నా, జన ప్రవాహం ఎక్కువగా ఉండటంతో, ఆయన సభ లేట్ గా ముగుసింది. దీంతో షెడ్యుల్ మారింది. ఈ రోజు చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళారు. అయితే చంద్రబాబు వెళ్ళే దారిలోనే రుషికొండ ఉంది. చంద్రబాబు రుషికొండ వెళ్తారని భయం వేసిన పోలీసులు, రుషికొండ వెళ్ళే దారి మూసివేసారు. చంద్రబాబు అటు వెళ్తే మొత్తం గుట్టు బయట పడుతుందని భయం వేసి, చంద్రబాబు వచ్చే ముందే రోడ్డు మొత్తం క్లోజ్ చేసి పడేసారు. హైవే నుంచి రుషికొండ కు వెళ్ళే మార్గం మొత్తం పోలీస్ పహారా పెట్టారు. అదనపు బలగాలు, రోప్ పార్టీలతో పోలీసులు రెడీగా ఉన్నారు. చంద్రబాబు వస్తే మళ్ళీ ఇబ్బందని, పై నుంచి వచ్చిన ఆదేశాలతో, రుషికొండ విధ్వంసం చంద్రబాబు చూడకుండా, పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.
అప్పులపై అరగంటకో అబద్ధం.. బహిరంగ చర్చకు సిద్ధమా?
ఆర్థిక వ్యవస్థ అనేది అత్యంత ప్రధానమైన రంగం. ఇది ప్రతి ఒక్కరి కుటుంబంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అప్పులపై ముఖ్యమంత్రి, మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రితో బహిరంగ చర్చకు నేను సిద్ధం. 25 ఏళ్లపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్న అనుభవాన్ని బాధ్యతవున్న వ్యక్తిగా చెబుతుంటే పదే పదే తప్పుడు ప్రచారం చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా వాస్తవాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారు. ప్రభుత్వం లెక్కలు, నివేదికలు ఇవ్వడంలేదని కాగ్ చెప్పిన విషయం వాస్తవంకాదా? గతంలో కన్నా తక్కువ అప్పులు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి మరోసారి అబద్ధ ప్రచారానికి తెరలేపారు. దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి, సంక్షేమం కన్నా అప్పులు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. స్వాతంత్యం వచ్చిన తరువాత అప్పుడున్న ప్రభుత్వాలు 1956 నుంచి 2019 వరకు చేసిన అప్పులు రూ. 2 లక్షల 53వేల కోట్లు ఉండగా వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.6 లక్షల 38వేల కోట్లు అప్పు చేసింది. (అప్పులు 3.98 లక్షల కోట్లు, హఫ్ బడ్డెట్ బారోయింగ్ 93 వేల కోట్లు, కార్పొరేషన్ గ్యారెంటీలు 1.47 లక్షల కోట్లు) వీటికి అదనంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతనాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వేల కోట్లల్లో ఉంటాయి.
జగన్ రెడ్డి ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేనాటికి ఈ అప్పు రూ.11 లక్షల కోట్లకు పైగా చేరుతుంది. టీడీపీ హయాంలో చేసిన మొత్తం అప్పు 5 సంవత్సరాలలో రూ.1,63,981 కోట్లు. అనగా సంవత్సరానికి సరాసరి చేసిన అప్పు రూ.32,800 కోట్లు. వైసీపీ 3 సంవత్సరాల 8నెలల కాలంలో అప్పు రూ.1లక్షా 32వేల కోట్లు ఉంది. తెదేపా హాయంలోని 4 శాతం ద్రవ్య లోటు నుండి 9.6 శాతంకు పెరగడం జగన్ రెడ్డి ఘనత. తెదేపా హయాంలోని అప్పులలో ఎక్కువ భాగం కేపిటల్ ఎక్స్ పెండెచర్ కు కేటాయించగా వైకాపా హయాంలో అప్పులను రెవెన్యూ ఎక్సపెండేచర్ కు ఖర్చు చేశారు. 2019-20లోనే రూ.26 వేల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ను బడ్జెట్ లో చూపించలేదని ఆడిట్ తప్పు పట్టింది. 2020-21లో, 2021-22లో ఎంత మేరకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయో కాగ్ కు కూడా చూపకుండా వాస్తవాలను సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేషన్ లు, వివిధ సంస్థల ద్వారా తీసుకొస్తున్న అప్పుల లెక్కలను చూపకుండా దాచిపెడుతున్నారు. కార్పొరేషన్ ల బ్యాలెన్స్ షీట్లను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు హాజరై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని భావిస్తున్నాను.