దేశ వ్యాప్తంగా పోలింగ్‌ ముగిసిన తరువాత, మోడీ, అమిత్ షా తమ మార్కు రాజకీయాలకు పదును పెట్టారు. గత కొన్నిరోజులుగా నాన్‌ బిజెపి పార్టీలను ఒక దగ్గరకు తేవడానికి టిడిపి అధినేత చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాలతో బెంబేలెత్తిన మోడీ బ్యాచ్, ఎన్నికలు ముగిసిన వెంటనే తమ టాలెంట్ చూపించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే జాతీయ మీడియాలో అన్ని సర్వేలు తమకు అనుకూలంగా చెప్పుకుని, ఎన్‌డిఎకు గతంలో కన్నా..ఎక్కువ సీట్లు వస్తాయని ఢంకా బజాయించడంతో, అప్పటి వరకు చంద్రబాబు వెంట ఉన్న పార్టీలు అవాక్కు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి నాన్‌ బిజెపి పార్టీలను ఒక గూటి కిందకు తెచ్చి..బిజెపికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోన్న చంద్రబాబుకు 'గ్జిట్‌పోల్స్‌తో మోడీ దెబ్బ కొట్టారా అంటే, అవును అనే చెప్పాలి.

exitpolls 21052019

జాతీయ మీడియా సంస్థలు వెలవరించిన ఎగ్జిట్‌పోల్స్‌ నిజం అవుతాయని భావించకపోయినా, మోడీ,బిజెపికి గెలిచే పార్టీగా ముద్ర వేయడం, యుపిఎ, చంద్రబాబుల స్థైర్యాన్ని దెబ్బతీశాయని చెప్పవచ్చు. అయితే మోడీ అండ్‌ కో ఇలా చేస్తారని, ఎగ్జిట్‌పోల్స్‌ గురించి బెంబేలెత్తాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ ఎగ్జిట్‌పోల్స్‌ ప్రభావం ప్రజల్లో పెద్దగా లేకపోయినా, పార్టీలు మాత్రం కంగారు పడేలా చేసాయి. మోడీ అండ్‌ కో వేసిన ఎగ్జిట్‌పోల్స్‌ ఎత్తుగడ పనిచేసిందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు బిజెపికి దూరంగా, కాంగ్రెస్‌ లేక కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన పార్టీలు, ..ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూడడానికి భయపడుతున్నాయి. ఇప్పుడే కాంగ్రెస్ వద్దకు చేరితే, ఒక వేళ మోడీ మళ్ళీ వస్తే, తమ అంతు చూస్తారని, అందుకే ఇప్పుడే బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు.

exitpolls 21052019

బీఎస్పీ అధినేత మాయావతి నిన్న సోనియాగాంధీ'ని కలవాల్సింది. కానీ ఆమె తన పోగ్రామ్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమె ఢిల్లీకి వెళ్లడం లేదని తెలుస్తోంది. అయితే ఎగ్జిట్‌పోల్స్‌ వల్లే ఆమె సోనియాతో సమావేశం కావడం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలానే మరి కొన్ని పార్టీలకు ఎగ్జిట్‌పోల్‌ భయం పట్టుకుంది. మొత్తం మీద..నిన్నటి వరకు కొద్దిగా యుపిఎకు అనుకూలంగా ఉందనుకున్న పరిస్థితిని మోడీ రాత్రికి రాత్రి మార్చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో మోడీ వ్యతిరేకులను కూడగడుతున్న చంద్రబాబును దెబ్బ కొట్టారు. అయితే ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇటువంటి వాటికి జంకే ప్రసక్తేలేదు. ఎగ్జిట్స్‌పోల్స్‌ మొదటి నుంచి తాను చెప్పినట్లే వచ్చాయని, దీనిలో కొత్తేమీ లేదని, తాను ఈవిఎంలపై తలపెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. మొత్తం మీద, ఈ సంవత్సరన్నర కాలంలో, మొదటి సారి, మోడీ చంద్రబాబు పై, ఫేక్ ఎగ్జిట్ పోల్స్ చూపించి, పై చేయి సాదించారు.

తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలు ఉన్నాయా?. లేవా?. ఉంటే సురక్షితంగా ఉన్నాయా? అనే విషయాలపై అధికారుల నుంచి సమాచారం లేదు. దీంతో స్థానిక నేతల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. కాగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తిరుపతిలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కాలేజిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తుండగా మంటలు చెలరేగాయి.

tirupati 20052019 1

ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఎండ వేడిమి కారణంగానే ఏసీలో ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రంగప్రవేశం చేసి మంటలను ఆర్పేశారు. టిడిపి వర్గాలు తెలుసుకొని, అక్కడికి వచ్చేసరికి,ఓ కర్ణాటకా రిజిస్ట్రేషన్ కారు, వేగంగా బయటకు వచ్చి దూసుకుపోయింది. అక్కడి ఎస్ ఐ అని అడిగితే తడబాటుతో ఇప్పుడే విధులకు వచ్చానని చెప్పిన్నట్టు, టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

tirupati 20052019 1

ఇవిఎంలకు ఏమీ కాలేదని చెబుతున్నారు. అయినా ఇవిఎంల మీద ఇంత రచ్చ జరుగుతున్నా, ఏదో జరుగుతోందని గుబులుగా వున్న సమయంలో, ఇలాంటి నిర్లక్ష్యం ఏమిటో... కాగా, ఇదే కాలేజీలో పోలింగ్ కు ముందురోజు కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో మానిటరింగ్ రూమ్ లోని ల్యాప్ టాప్ లు అగ్నికి ఆహుతయ్యాయి. మళ్లీ అదే కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిన్న దేశంలో ఎగ్జిట్‌పోల్స్‌ చూసి ప్రజలు ఛీ కొడుతున్న విషయం తెలిసిందే. మమతా, నవీన్, మాయవతి, అఖిలేష్,స్టాలిన్, ఇలా ఎవరూ గెలవరని, మొత్తం మోడీనే గెలుస్తున్నారని ఎగ్జిట్‌పోల్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇదంతా మోడీ, షా ఎత్తుగడ అనే విషయం రాజకీయం తెలిసిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ప్రతిపక్ష పార్టీలు ఏకంగా కాకుండా, వాళ్ళు ఒక్కటి అవ్వకుండా, మోడీ, షా ఆడిన ఆట ఈ ఎగ్జిట్‌పోల్స్‌. అయితే ఇప్పుడు ఈ ఎగ్జిట్‌పోల్స్‌ అడ్డం పెట్టుకుని, ఏకంగా ఒక రాష్ట్రాన్నే పడగొట్టే వికృత క్రీడకు తెర లేపింది బీజేపీ.. మధ్యప్రదేశ్‌లోని 29 పార్లమెంట్‌ స్థానాల్లో 26 నుంచి 28 చోట్ల భాజపాయే విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా నేతలు పాలకపక్షంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

exitpolls 20052019

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలు విముఖతతో ఉన్నట్లు తెలుస్తోందని, అందువల్ల వెంటనే అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, అధికార పక్షం బలనిరూపణ చేసుకోవాలని భాజపాకు చెందిన ప్రతిపక్ష నేత గోపాల్‌ భార్గవ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకుగానూ కాంగ్రెస్‌ 114, భాజపా 107, బీఎస్పీ 2 స్థానాల్లో గెలుపొందాయి. బీఎస్పీతోపాటు మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

exitpolls 20052019

ఇక్కడ ప్రమాణస్వీకారం చేసి 5 నెలలు కాలేదు. ఇంతలో అక్కడి బిజెపి ప్రతిపక్ష నాయకుడు, తమ మాజీ గుజరాతీ బిజెపి సిఎం ఆనందీ బెన్ గర్వర్నర్ గా వుంది కాబట్టి, కాంగ్రెస్స్ కి బలం లేదని మళ్లీ నిరూపించుకోవాల్సిందే అని లేఖ వ్రాసారు. అందులో ఒక హాస్యాస్పద కారణం ఏమంటే, నిన్న చెప్పిన ఎగ్జిట్ పోల్ లో, కాంగ్రెస్స్ కి ఎంపీ సీట్లు రావడం లేదని చెప్పారు కనుక, ప్రజల విశ్వాసం కోల్పోయింది అంట. ఎగ్జిట్ పోల్స్ వచ్చి 24 గంటలు గడవక ముందే, ఈ రకాల కుట్రలకు, బిజెపికి ఏమి పోగాళం అని అనుకోవచ్చు. ఒకటి ప్రాంతీయ పార్టీలు ఏవి మరో కూటమిలోకి వెళ్లినా, ఇలా చేస్తాం అనే అహంకార అధికార దుర్వినియోగ దర్పంతో దడిపించడం. రెండు ఎంపీలో కౌంటింగ్ దగ్గర, కొంచం కమల్ నాథ్ పట్టు సడలిస్తాడనే ఒత్తిడి. అందుకే ఈ నియంతృత్వం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అనేది.

ఎన్నికల సమరం ముగిసింది . పలు జాతీయ సర్వేల సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా, వాస్తవానికి దూరంగా ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, 2014 కంటే భారీగా ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌ లో వండి వార్తచారు. మరో పక్క రేపు ఎన్డీఏ పార్టీలని డిన్నర్ కి పిలిచారు అమిత్ షా. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ఏ మాత్రం వెనుకంజ వెయ్యకుండా ఏపీ సీఎం చంద్రబాబు సమరానికి సై అంటున్నారు.

mindgame 20052019

సోమవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎంత మమత బెనర్జీతో భేటీ అయ్యారు.. ఎగ్జిట్ పోల్స్ నేపధ్యంలో భవిష్యత్ ప్రణాళికపై ఆమెతో చర్చించేందుకు అమరావతి నుండి చంద్రబాబునాయుడు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగాల్ వెళ్లారు. మంగళవారం నాడు విపక్ష పార్టీలతో భేటీ కానున్నారు. హస్తిన వేదికగా ఎన్నికల సంఘంపై , కేంద్ర సర్కార్ పై పోరుకు సిద్ధం కావాలని, అందరూ కలిసి రావాలని చంద్రబాబు విపక్ష పార్టీలను కోరతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మరోసారి ధర్నా చెయ్యాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు.

mindgame 20052019

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరు, ఈవీఎంల పనితీరు, వీవీ ప్యాట్ల లెక్కింపు వంటి అంశాలపై నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదాస్పదం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ తో మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నా, చంద్రబాబు ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా పోరుబాట పట్టారు.

Advertisements

Latest Articles

Most Read