అక్రమాస్తుల కేసులో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో వారిద్దరికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ములాయం, అఖిలేష్ యాదవ్ అక్రమాస్తుల కేసులో సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వారిపై సాధారణ కేసు నమోదు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ తన అఫిడవిట్ లో తెలిపింది. తమ విచారణలో వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదంది. 2013లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు నివేదిక ఇచ్చామని సీబీఐ అధికారులు తెలిపారు. దాంతో కేసు క్లోజ్ అయిందన్నారు.

mulayam 21052019

తమ విచారణలో ఎలాంటి ఎవిడెన్స్ దొరకని కారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదని సీబీఐ అధికారులు చెప్పారు. 2013 ఆగస్టు తర్వాత అక్రమాస్తుల కేసులో ఎలాంటి విచారణ జరపలేదన్నారు. 2007లో ములాయం, అఖిలేష్ పై అక్రమాస్తుల కేసు నమోదైంది. 2005లో విశ్వనాథ్ ఛటర్జీ అనే రాజకీయవేత్త.. ములాయం, అఖిలేష్.. అక్రమాస్తులు సంపాదించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సీబీఐతో దర్యాఫ్తు చేయించాలని కోరారు. ములాయం, అఖిలేష్ వారి కుటుంబసభ్యులు అక్రమాస్తులు సంపాదించారని ఆరోపించారు. 2005లో ఆయన పిటిషన్ వేశారు.

mulayam 21052019

007లో.. అక్రమాస్తుల ఆరోపణలపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో అప్పటి నుంచి ఇప్పటివరకు సీబీఐ ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది. ఆస్తుల కేసులో పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని 2019 ఏప్రిల్ 11న సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై వివరణ ఇచ్చిన సీబీఐ.. 2013లోనే కేసుని క్లోజ్ చేశామని సుప్రీంకోర్టుకి చెప్పింది. అక్రమాస్తులకు సంబంధించి వారిద్దరిపై కేసులు నమోదు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ చెప్పడం ద్వారా.. వారిద్దరికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు అయ్యింది.

ఈ నెల 23న ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తరపున బరిలో నిలిచిన నేతలల్లో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓటమి పాలవుతారోనన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల బీపీ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయేమోనని భావించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిని మీడియా కలిసింది. గెలుపుపై ధీమాతో ఉన్న కేశినేని నాని బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఆరా తీసింది. బీపీ మిషన్ తో చెక్ చేసింది. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉన్న నాని బీపీ నార్మల్ గానే ఉంది. అదే విధంగా, తన గెలుపుపై ధీమాతో ఉన్న మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా బీపీ లెవెల్స్ చెక్ చేయగా నార్మల్ గానే ఉన్నాయి.

nani 21052019

ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, విజయవాడ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి, కనీవినీ ఎరుగని మెజార్టీతో, తాను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్ల కాలాన్ని ఒక్క నిమిషం కూడా వృథా కానీయకుండా ప్రజల కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కష్టపడ్డానని చెప్పారు. తన జీవిత చరిత్ర తెరిచిన పుస్తకమని అందులో ప్రజాసేవ తప్ప ఎలాంటి మోసాలు గానీ నేరాలు గానీ ఉండవన్నారు. 2014 ఎన్నికల్లో ఎలా అయితే ఓటమి పాలయ్యారు రాబోయే ఎన్నికల్లో కూడా తన చేతిలో వైసీపీ అభ్యర్థి పీవీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.

nani 21052019

గత ఎన్నికల్లో తనపై ఎమ్మార్ కేసులో కోర్టులో జైలుకెళ్లిన వ్యక్తిని తనపై నిలబెట్టారని అతనిని విజయవాడ ప్రజలు తరిమితరిమికొట్టారని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా పీవీపీని అలాగే తరిమికొడతారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో 3లక్షల ఓట్లతో గెలవబోతున్నానని గెలిచి చరిత్ర సృష్టించబోతున్నట్లు స్పష్టం చేశారు కేశినేని నాని. పీవీపీ అంతర్జాతీయ స్థాయిలో స్కాములు చేసిన వ్యక్తి అని ఆరోపించారు. సెబీ కేసుల్లో ఇరుక్కుని దాక్కుంటున్న వ్యక్తి అంటూ ఆరోపించారు. జగన్ డబ్బును హవాలా చేసింది కూడా ఆయనేనంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ నైజం, పీవీపీ నైజం ఒక్కటేనని ఆరోపించారు.

కౌంటింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించింది. లెక్కింపు కేంద్రాల్లోని కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం 17సీ ఇవ్వడంతో పాటు, వారికి వేళకు తగిన ఆహారం అందించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన సూచనల పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఫారం 17సీ తప్పకుండా అందిస్తామని చెప్పారు. లెక్కింపు కేంద్రం లోపల ఎన్ని టేబుళ్లు ఉంటే అంతమంది కౌంటింగ్ ఏజెంట్లను అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తామని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు.

dwivedi 21052019

దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసే వ‌ర‌కూ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంటుంద‌ని ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ద్వివేదీ స్ప‌ష్టం చేసారు. త‌ప్ప‌ద‌నుకుంటే కౌంటింగ్ త‌రువాత కూడా రీపోలింగ్ నిర్వ‌హించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. మ‌రి కొద్ది గంట‌ల్లో దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల సంఘం కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌స్తుతం కొన్ని ప్రాంతాల్లో రాజ‌కీయంగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న ప‌రిస్థితుల్లో ఈ నెల 27వ తేదీ అర్ద‌రాత్రి వ‌ర‌కూ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంటుంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వీవీప్యాట్‌ లెక్కలో తేడా వచ్చినా, మిగతా లెక్కింపులో పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువగా ఉంటే రీపోలింగ్‌కు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఫలితం ఎటూ తేలకపోతే ఈసీకి విచక్షణాధికారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి స్ప‌ష్టం చేసారు.

dwivedi 21052019

ఏపీలో టీడీపీ..వైసీపీ మ‌ధ్య కౌంటింగ్ స‌మ‌యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు పార్టీలు త‌మ కౌంటింగ్ ఏజెంట్ల‌కు శిక్ష‌ణ పూర్తి చేసారు. అయితే, ఓట్లు త‌క్కువ వ‌చ్చినా..ఓడిపోయే ప‌రిస్థితి క‌నిపించినా వెంట‌నే రీ పోలింగ్‌కు డిమాండ్ చేయాల‌ని టీడీపీ త‌మ ఏజెంట్ల‌కు స్ప‌ష్టం చేసింది. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి కౌంటింగ్ స‌మ‌యానికి ఏపీకీ కేంద్ర బ‌ల‌గాల‌ను త‌ర‌లించాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు. టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ ఎన్నిక‌ల సంఘానికి వైసీపీ మీద ఫిర్యాదు చేసార‌దు. కౌంటింగ్ స‌మ‌యంలో వైసీపీ అల్ల‌ర్ల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని..చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఇక‌, కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు ఏపీకి ప‌ది కంపెనీల కేంద్ర బ‌ల‌గాలు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) జాతీయ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి భేటీ అయ్యారు. ఈయనతో పాటు పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ కైలాస్ విజయవర్గీస్ సైతం గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని గడ్కరీకి సంబంధించివారు చెబుతున్నారు. రానున్న ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర ఏమిటనే విషయంపై చర్చించారని తెలిపారు. గడ్కరీకి కీలకమైన పదవిని అప్పజెప్పే అవకాశముందని చెప్పారు. కైలాష్ విజయ వర్గీస్ భేటీ ముగించుకొని వెళ్లిపోగానే ఆరెస్సెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి గడ్కరీ ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీయేనే విజయం సాధిస్తుందని తేల్చి చెప్పడంతో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే వీరిరువురూ ఏఏ అంశాలను చర్చించుకున్నారనేది మాత్రం వెల్లడికాలేదు.

rss 21052019

మరో పక్క గడ్కరీ వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీసాయి. ‘‘ఎగ్జిట్‌ పోల్స్‌ ‘అంతిమ తీర్పు’ కాదు కానీ ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధితో బీజేపీ తిరిగి అధికా రంలోకి వస్తుందని అవి సూచిస్తున్నాయి’’ అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. వచ్చే శుక్రవారం విడుదల కానున్న బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోదీ’ పోస్టర్‌ను గడ్కరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేక రులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మొత్తం మీద ఎగ్జిట్‌ పోల్స్‌ ఏం చెప్పాయో అవే తుది ఫలితాల్లో ప్రతిబింబిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాను పీఎం పదవి రేసులో లేనని ఇప్పటికి 20 నుంచి 50 సార్లు స్పష్టం చేశానని ఒక ప్రశ్నకు బదులుగా గడ్కరీ చెప్పారు.

rss 21052019

మోదీనే మళ్లీ ప్రధాని అవుతారన్నారు. మహారాష్ట్రలో 2014లో మాదిరిగానే 23 సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ‘ఎగ్జిట్‌ పోల్స్‌ సందేశం’ పేరిట బ్లాగ్‌పోస్టులో రాశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ కచ్చితత్వంపై మనం వాదులాడుకుంటూనే ఉండవచ్చు. కానీ, నిజం ఏమిటంటే.. అనేక ఎగ్జిట్‌ పోల్స్‌ ఒకే విషయం చెబుతున్నప్పుడు ఫలితాలు వాటికి అనుగుణంగానే ఉంటాయి’’ అని పేర్కొన్నారు. 2014 ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో గెలిచినట్లు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ విజయం సాధించి రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు మించి బీజేపీ సీట్లు సాధిస్తుందని గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read