చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ జరగనున్న 5పోలింగ్‌ కేంద్రాల్లో రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురం కూడా ఒకటి. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమ స్వగ్రామం.. టీడీపీకి పెట్టనికోట. శుక్రవారం అక్కడకు ప్రచారానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఊరిలోకి రావద్దంటూ గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో తాను గాజులు తొడుక్కుని లేనని.. తిరుపతిలో అడుగుపెడితే మీ కథ చూస్తానంటూ ఆయన వారిని బెదిరించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎన్‌ఆర్‌ కమ్మపల్లెలో ప్రచారానికి వెళ్లిన చెవిరెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డిని గ్రామస్థులు అడ్డుకోవడంతో చెవిరెడ్డి పెద్దఎత్తున అనుచరవర్గంతో అక్కడకు చేరుకున్నారు. 

chevireddy 17052019

టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా గ్రామస్థులకు మద్దతుగా రావడంతో ఇరువర్గాలూ ఎదురెదురుగా మోహరించాయి. డీఐజీ క్రాంతిరాణా టాటా, చిత్తూరు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ బలగాలతో చేరుకుని లాఠీచార్జి జరిపి ఇరువర్గాలనూ చెదరగొట్టారు. శుక్రవారం ఉదయం వెంకట్రామాపురానికి చెవిరెడ్డి వాహనాల కాన్వాయ్‌తో మందీ మార్బలాన్ని వెంటబెట్టుకుని మళ్లీ వచ్చారు. గ్రామస్థులు అడ్డుకున్నారు. తప్పుడు ఫిర్యాదులు చేసి రీపోలింగ్‌ పెట్టించారని మండిపడ్డారు. చెవిరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంటలో రీపోలింగ్‌ ఎందుకు పెట్టించుకోలేదని నిలదీశారు. గ్రామంలోకి రావద్దంటూ మహిళలు సహా అంతా ఆయన ముఖంమీదే చెప్పడంతో చెవిరెడ్డి రెచ్చిపోయారు.

chevireddy 17052019

‘మీరు అ డ్డుకుంటే నేనేం గాజు లు తొడుక్కుని లేను... రండి ఎవరు అడ్డుకుంటారో.. నన్ను ఇక్కడ అడ్డుకుంటే తిరుపతిలో అడుగుపెట్టలేరు’ అని హె చ్చరించారు. బలగాల రక్షణలో ఆయన గ్రామంలోకి వెళ్లారు. అయితే గ్రామస్థులు ‘దొంగ వస్తున్నాడు.. తలుపులేసుకోండి’ అని గట్టిగా అరుస్తూ ప్రతి ఇంట్లోని వారినీ అప్రమత్తం చేయడంతో చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తిరుపతిలో అడుగుపెట్టండి మీ కథ చెప్తా.. ఎలా తిరిగి వెళతారో చూస్తా’ అంటూ హెచ్చరించారు. బలగాలు సైతం ఆయనకే రక్షణ కల్పిస్తూ గ్రామస్థులను నెట్టేశాయి. ‘మేం స్వచ్ఛందంగా ఓట్లు వేశాం. మమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టింది లేదు. 1983లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినాకనే మాకు రాజకీయమంటే ఏంటో తెలిసింది. పెద్దాయన ముద్దుకృష్ణమది మా ఊరే. ఈసారి ఇంకా కసిగా ఓట్లు వేస్తాం.’ అని అక్కడి గ్రామస్థులు అంటున్నారు.

ఈనెల 23వ తేదీన ప్రజా తీర్పు బయటకు వచ్చిన తర్వాతే బీజేపీయేతర కూటమికి ఎవరు ప్రధాని అనే దానిపై కీలక నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో చివరిది, ఏడవది అయిన ఎన్నికల ప్రచారం ముగియడానికి కొద్దిసేపు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాహుల్...ఈ ఎన్నికలో కాంగ్రెస్ న్యాయపోరాటం సాగించిందని, న్యాయమే చివరకు గెలుస్తుందని అన్నారు. ప్రధాని ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు ఈ ఎన్నికల్లో తాము సమర్ధవంతంగా పోరాడమని, బీజేపీ-ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై పోరాటంలో 'ఏ గ్రేడ్' స్థాయిలో పోరాడమని చెప్పారు.

rahul 17052019

నరేంద్ర మోదీని నిలువరిస్తూ, తమకు మద్దతుగా నిలిచిన లక్షలాది ప్రజలను చూసి ఒక భారతీయుడిగా తాను గర్విస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ఆశిస్తున్న సీట్లు, ఇతర విపక్ష పార్టీలతో పొత్తుపై అడిగినప్పుడు తీర్పు రాకముందే ప్రజా నిర్ణయంపై మాట్లాడటం వారిని అగౌరవపరిచినట్టేనని సమాధానమిచ్చారు. 23న ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వంలో ప్రధాని అభ్యర్థిత్వంపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రజాతీర్పు రాకముందే తాను మాట్లాడటం బాగుందని, ప్రజలేమి నిర్ణయించుకున్నారనే దానిపై ఆధారపడి తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

rahul 17052019

ఇతర విపక్ష పార్టీల నుంచి ప్రధాని పదవిని ఆశిస్తున్న వారున్నారనే విషయంపై స్పందిస్తూ, 'మాయావతి లేదా ఇతర నాయకుల గురించి నేను కామెంట్ చేయదలచుకోవాలి. సైద్ధాంతిక పరంగా చూసినప్పటికీ అన్నీ విస్తృత ప్రాతిపదికపై కలుస్తాయి. చంద్రబాబునాయుడు బీజేపీకి మద్దతిస్తారని నేను అనుకోవడం లేదు. అలాగే మమతా, మాయావతి, ములాయం సింగ్‌లు కూడా బీజేపీ వైపు వెళ్తారనుకోవటం లేదు' అని రాహుల్ నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల్లో ఈసీ పారదర్శకంగా వ్యవహరిస్తోందని, మోదీ షెడ్యూల్‌ ప్రకారమే ఉత్తర్వులు ఇస్తోందని రాహుల్‌ దుయ్యబట్టారు. మోదీ, షా సిద్ధాంతాలు గాంధీ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి మోదీ మరోసారి ప్రయత్నిస్తున్నారని, అయితే అది జరగదని ఎద్దేవాచేశారు.

 

ఏపీలో రిపోలింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించడంపై రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. వైసీపీ చెప్పినట్లుగా ఈసీ నడుచుకుంటోందని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రీపోలింగ్ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఫిర్యాదుచేశారు. ఈసీ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీలో రీపోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో చంద్రగిరిలోని ఆ 2 పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని ద్వివేది తెలిపారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, వీడియో సాక్ష్యం ఉండటంతోనే రీపోలింగ్‌కు ఆదేశించామని స్పష్టంచేశారు.

dwivedi 17052019

ఆ వీడియో చూస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. రెండోసారి రీపోలింగ్ జరపకూడదని ఎక్కడా లేదన్న ద్వివేది.. ఘటన ఆలస్యంగా తమ దృష్టికి రావడం వల్లే ఆదివారం రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ రోజున విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తుది విడత ఎన్నికల్లో భాగంగా చంద్రగిరిలో మే 19న పోలింగ్ నిర్వహించనున్నారు. కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318), కమ్మపల్లి (బూత్ నెం.321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

dwivedi 17052019

రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలనకు 200 మంది కేంద్ర పరిశీలకులు వస్తారని ద్వివేది తెలిపారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడి చొప్పున నియమించినట్టు వెల్లడించారు. దేశంలో అత్యంత సున్నితమైన ఎన్నికల రాష్ట్రం ఏపీ అని, ఒడిశాలో ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక పరిశీలకుడు ఉంటారని ద్వివేది వివరించారు. దేశంలో ప్రతి పార్లమెంట్‌ స్థానానికి ఒక పరిశీలకుడుని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిందన్నారు. చంద్రగిరిలో రీపోలింగ్‌ నేపథ్యంలో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 250 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తామని ద్వివేది వెల్లడించారు.

దేశవ్యాప్తంగా పర్యటనలతో తెలుగు రాష్ట్రాల సీఎంలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి రాజకీయాల్లో మార్పు కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 23న ఫలితాల నేపథ్యంలో అంతటా ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే సీఈసీతో సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ కలిసి వచ్చినా పనిచేస్తారా అంటే ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. మరీ ఊహాత్మక ప్రశ్నలు వద్దని మీడియాకు సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలుస్తాం. ఒక పార్టీపై వివక్ష చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిసి చంద్రగిరి రీపోలింగ్ అంశంపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

cbnquestion 17052019

ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించారు. తొలుత చంద్రగిరిలో రీపోలింగ్‌ వ్యవహారంపై రాసిన లేఖను సీఈసీకి అందజేశారు. తొమ్మిది కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ గతంలో తామిచ్చిన ఫిర్యాదును ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా, వివాదాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ పని తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాల్సి రావడం చాలా దురదృష్టకరమని సీఎం వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలు ఎలా జారీ చేస్తారని నిలదీసినట్టు సీఎం మీడియాకు వివరించారు.

cbnquestion 17052019

సాధారణంగా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ జరుపుతారని.. కానీ సుమారు నెల రోజులు దాటినప్పటికీ ఏపీలో వైకాపా ఫిర్యాదు మేరకు ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా చెప్పిన ప్రకారమే ఈసీ నడుచుకుంటోందన్నారు. 24 ఏళ్లుగా తాను తెదేపా అధ్యక్షుడిగా ఉన్నానని, జాతీయ రాజకీయాలను చూశానన్న ఆయన ఈ విధమైన ఎన్నికల సంఘాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైకాపా ఫారం -7 పత్రాలు ఇష్టానుసారంగా దాఖలు చేస్తే నిందితుల ఐపీ అడ్రస్‌లు ఇవ్వాలని కోరినా ఇప్పటికీ స్పందించలేదని మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచేలా భోపాల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలు చేస్తే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read