చంద్రబాబు నాయుడు గత మూడు రోజులుగా విజయనగరం జిల్లాలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు రాజాం, రెండో రోజు బొబ్బిలి, ఈ రోజు విజయనగరంలో పర్యటన చేస్తున్నారు. అయితే చంద్రబాబు సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ స్పందన తెలుగుదేశం పార్టీ కూడా ఊహించ లేదు. చంద్రబాబుని కదలనివ్వనంత ఇదిగా జనాలు వచ్చేసారు. ఆకాశానికి చిల్లు పడిందా అనే డైలాగ్ గుర్తుకు వచ్చేలా చేసారు. అయితే ఈ రోజు చంద్రబాబు విజయనగరం పర్యటన ముగించుకుని అమరావతి వెళ్ళాల్సి ఉంది. ఈ రోజు చంద్రబాబు గజపతి నగరం నుంచి విజయనగరం చేరుకోవాల్సి ఉండగా, గజపతి నగరంలో మీటింగ్ లేకపోయినా అనూహ్యంగా ప్రజలు వచ్చేయటంతో, చంద్రబాబు పర్యటన ఆలస్యం అయిపొయింది. ఇక విజయనగరంలో కూడా నిన్న బొబ్బిలికి మించి ప్రజలు ఉన్నారని సమాచారం రావటంతో, ఈ రోజుకి వెళ్ళటం కుదరదని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ రోజు ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో రాత్రిక చంద్రబాబు బస చేస్తారు. రేపు ఉదయం తిరిగి వెళ్లనున్నారు.

జ‌గ‌న్ రాముడిలాగే ఒక‌టే బాణం, ఒక‌టే భార్య అని త‌న సోష‌ల్మీడియా ద్వారా ప్ర‌చారం చేసుకుంటూనే ఉంటారు. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త అంటూ పెద్ద‌పెద్ద మాటలని కూడా జ‌గ‌న్ కి అన్వ‌యిస్తూ ఐప్యాక్ క్యాంపెయిన్లు ర‌న్ చేస్తుంది. ఒక‌టే బాణాన్ని వ‌దిలేశాడ‌ని, భార్య మాత్ర‌మే ఒక్క‌టేన‌ని, విలువ‌లు లేవు, విశ్వ‌స‌నీయ‌త‌కి అర్థ‌మే తెలియ‌దు అంటూ జ‌న‌సైనికులు ఎదురుదాడి చేస్తుంటారు. జ‌న‌సేన‌కి ఉన్న ఒక్క ఎమ్మెల్యేనీ తన ఫ్యాన్‌గా మార్చుకున్న జ‌గ‌న్ జ‌న‌సేనాని మాత్రం సంద‌ర్భం ఏదైనా టార్గెట్ చేస్తూనే వుంటారు. త‌న వెంట్రుక ఎవ్వ‌రూ పీక‌లేరంటూనే ద‌త్త‌పుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంటారు వైసీపీ అధినేత‌. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా వున్నప్పుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంద‌ర్భం కాకపోయినా టార్గెటెడ్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెళ్లిళ్లు విష‌యం బ‌హిరంగ‌స‌భ‌ల‌లో ప్ర‌స్తావించేవారు. కొంద‌రిలా నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేద‌ని ప‌రోక్షంగా ప‌వ‌న్ ని ఎద్దేవ చేశారు. ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక కూడా ప‌వ‌న్ పెళ్లిళ్లు జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు ఆయుధంగా మారింది.

మూడు రాజ‌ధానుల వ‌ల్ల రాష్ట్రానికి మేలు అని మ‌నం అంటుంటే మూడు పెళ్లిళ్ల వ‌ల్లే మేలు అని, మీరూ చేసుకోండి అని ఒకాయ‌న పిలుపునిస్తున్నార‌ని ప‌వ‌న్ పై ఆరోప‌ణ‌లు గుప్పించారు జ‌గన్. ఆయ‌న‌ని ఆద‌ర్శంగా తీసుకుని విడాకులు ఇచ్చి మ‌రో పెళ్లి చేసుకుంటే మ‌న ఇంట్లో ఆడ‌వాళ్లు, చెల్లెళ్లు, కూతుర్ల ప‌రిస్థితి ఏంటి? అని జ‌గ‌న్ అవ‌నిగ‌డ్డ స‌భ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా త‌న సొంత జిల్లా ప‌ర్య‌ట‌న‌కి వెళ్లిన సీఎం జ‌గ‌న్ రెడ్డి..ఈ భార్య కాక‌పోతే మ‌రో భార్య అని నేను కొంద‌రిలా అన‌డంలేదు అంటూ ప‌వ‌న్ పెళ్లిళ్ల‌పై సెటైర్లు వేశారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి విడాకులు ఇచ్చిన భార్య‌లు హాయిగా వున్నారు. కొత్త‌గా పెళ్లి చేసుకున్నామె సంతోషంగా ఉంది. వారి పెళ్లిళ్లు, విడాకులు గురించి జ‌గ‌న్ రెడ్డి ఎందుకంత బాధ‌ప‌డిపోతున్నారోన‌ని జ‌న‌సైనికులు కౌంట‌ర్లు వేస్తున్నారు.

గుడివాడ రాజకీయం రోజు రోజుకీ రసవత్తరంగా మారుతుంది. కొడాలి నానిని ఓడించటానికి టిడిపి అనేక పావులు కదుపుతుంది. అయితే ఇక్కడ కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో, అటు నుంచి నరుక్కువచ్చే వ్యూహం కూడా ఇందులో ఉంది. ఈ క్రమంలోనే గుడివాడలో కొడాలి నానికి మొన్నటి వరకు అండగా నిలిచిన వంగవీటి వర్గం, నెమ్మదిగా దూరం జరగటం మొదలు పెట్టింది. తాజాగా కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చారు వంగవీటి వర్గీయులు. గుడివాడ టిడిపి ఇంచార్జ్ రావితో కలిసి, రాధా-రావి యుత్ పేరుతో ముందుకు వచ్చారు. రాధా-రావి యూత్ పేరుతో గుడివాడలో అనేక కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఎక్కడ చూసినా రాధా-రావి యూత్ ఫ్లెక్సీలు వెలిచాయి. గత కొంత కాలంగా, వంగవీటి రాధా, రావి వెంకటేశ్వరరావు మధ్య చర్చలు జరిగాయి. అలాగే ఈనెల 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో, రాధా, రావి కలిసి పాల్గుననున్నారు. ఈ కలయికతో కొడాలినాని వర్గంలో కూడా టెన్షన్ మొదలైంది. కొడాలి నానికి అండగా ఉంటూ వచ్చిన వర్గం, ఇప్పుడు దూరం జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

ఉత్త‌రాంధ్ర‌లో తెలుగుదేశం ఊపు చూస్తుంటే, క్లీన్‌స్వీప్ ఖాయ‌మ‌ని స్ప‌ష్టం అవుతోంది. టిడిపి కంచుకోటలాంటి ఉత్తరాంధ్ర‌లో మ‌ళ్లీ పార్టీకి పూర్వ‌వైభ‌వం వ‌చ్చింద‌ని ప‌సుపు సైనికులు సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. నిన్న‌టి బొబ్బిలి స‌భ‌లో చంద్ర‌బాబు సైకో జ‌గ‌న్ పోవాల‌ని పిలుపుని ఇవ్వ‌బోయి, పొర‌ప‌డి సైకిల్ పోవాల‌ని అంటూనే నాలిక్క‌రుచుకున్నారు. అయితే ఉత్త‌రాంధ్ర జ‌నం ఉద్రేకం చూస్తుంటే, చంద్ర‌బాబు సైకిల్ పోవాల‌ని పిలుపునిచ్చినా..జ‌నం మాత్రం సైకో జ‌గ‌న్ రెడ్డి పోవాల‌ని ఫిక్సయ్యారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో షెడ్యూల్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చంద్ర‌బాబు స‌భ ప్రారంభం కావాలి. మ‌ధ్యాహ్నం 1 గంట‌కే ప‌రిస‌ర ప‌ల్లెల నుంచి చేరుకున్న జ‌నంతో రాజాంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు బొబ్బిలి రోడ్డు, ఇటు పాల‌కొండ రోడ్డు, మ‌రో వైపు శ్రీకాకుళం రోడ్డు, ఇంకోవైపు సార‌ధి రోడ్డు కిలోమీట‌ర్ల మేర‌కు జ‌నంతో నిండిపోయింది. విశాఖ ప‌ట్ట‌ణం నుంచి తోవ పొడ‌వునా చంద్ర‌బాబు రాక కోసం త‌ర‌లివ‌చ్చినా జ‌నాన్ని విజ‌య‌సంకేతం చూపుతూ రాజాం స‌భ‌ని చేరేస‌రికి 5 గంట‌లకి పైగా ఆల‌స్య‌మైంది. వృద్ధులు సైతం స‌భాస్థ‌లి నుంచి వెళ్ల‌కుండా బాబుగారి రాక‌కోసం చ‌లిలోనూ, మంచులోనూ నిలుచునే ఉన్నారు.

రాజాం తెలుగుదేశం మూడు గ్రూపులైపోయింద‌ని, వారి అనైక్య‌తే త‌మ బ‌ల‌మ‌ని లోలోప‌ల సంతోషిస్తున్న వైసీపీ లీడ‌ర్ల‌కి టిడిపి కేడ‌ర్ త‌మ స‌త్తా చూపించారు. మాది చంద్ర‌బాబు గ్రూపు, తెలుగుదేశం వ‌ర్గ‌మంటూ నిన‌దించారు. రాజాం నుంచి బొబ్బిలి వైపు చంద్ర‌బాబు కాన్వాయ్ సాగింది. రాజుల‌కాలంలో బొబ్బిలి సామంత రాజ్యం రాజాం. త‌మ పాల‌న‌లోని రాజాం తెలుగుదేశం వెలుగుల‌తో జిగేల్మంటే, తాము త‌క్కువ తిన్నామా అంటూ బొబ్బిలి రాజులు త‌మ నియోజ‌క‌వ‌ర్గం ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు కురిపించారు. కిలోమీట‌ర్ల మేర జ‌న‌మే పూల‌దారులై చంద్ర‌బాబుని స్వాగ‌తించారు. బొబ్బిలికోట‌లో చంద్ర‌బాబు స‌భ జ‌న‌సునామీని త‌ల‌పించింది. ఉత్త‌రాంధ్ర‌లో తెలుగుదేశం ఊపు చూస్తుంటే, చంద్ర‌బాబు పొరపాటున నోరు జారి సైకిల్ పోవాల‌ని కోరుకున్నా..జ‌నం మాత్రం సైకిల్ మాత్ర‌మే కావాలి అని కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. చంద్ర‌బాబు అడ్డుకున్నా ఫ్యాన్ పెడ‌రెక్క‌లు విరిచి శెన‌గ‌గింజ‌ల‌కి వేసేయ‌డం ఖాయం అంటున్నారు జ‌నం.

Advertisements

Latest Articles

Most Read