ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సెక్రటరీ రావత్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను నిన్న రావత్ ని కలవటానికి వెళ్తే, ఎమ్మెల్యే అని కూడా చూడకుండా రావత్ లెక్కలేనితనంగా ప్రవర్తించారని అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో అసంపూర్తిగా ఉన్న పథకాలకు సంబంధించి ఫైనాన్షియల్ సెక్రటరీ రావత్ వద్దకు వెళ్తే లెక్కలేని విధంగా కనీసం కూర్చోమని కూడా చెప్పలేదని, ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. రావత్ ఎంతోమంది ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటాడు కానీ నాలాంటి ఎమ్మెల్యే ని చూసి ఉండడు, కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది, లేదా పరిణామాలు వేరే లెవల్ లో ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి సమీక్ష వేదిక పై నుండి ఐఎఎస్ లను బెదిరించిన తీరు చూసి విలేఖరులు ఆశ్చర్య పోయారు.
news
మాచర్లలో మళ్ళీ ఉద్రిక్తత...
తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో మాచర్ల కార్యక్రమంతో, మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాచర్లలో గాయపడిన వారిని పరామర్శించటానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజు పిలుపు ఇచ్చింది. పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారని, ముందే కొంత మంది నేతలు ఇళ్ళల్లో నుంచి తప్పించుకుని మాచర్ల వెళ్లారు. అయితే ఈ క్రమంలో, చిలకలూరిపేట వద్ద టిడిపి నేతలను పోలీసులు ఆపేసారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబుని పోలీసులు అరెస్ట్ చేసారు. మాచర్లకు వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్క అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మాచర్లలోకి ఎవరినీ రానివ్వకుండా పోలీసులు ఏర్పాట్లు చేసి, అందరినీ అడ్డుకుంటున్నారు. ఇక మరో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రని ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసారు. పొన్నూరులోని ధూళిపాళ్ల నరేంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. తప్పించుకుని మాచర్లకు వెళ్తున్న ధూళిపాళ్లను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
పల్నాడులో మళ్ళీ టెన్షన్ టెన్షన్.. వరుస పెట్టి టిడిపి నేతల ఇళ్ళ ముందు పోలీసులు...
మాచర్ల మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చాలో మాచర్ల కార్యక్రమం చేపట్టింది. వైసీపీ చేసిన మారణహోమంలో దెబ్బతిన్న ఇళ్లు, బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ డిపార్టుమెంటు వారిని అనుమతి కూడా కోరింది. అయితే అటు వైపు నుంచి ఎటూ తేల్చక పోవటంతో, ఈ రోజు చలో మాచర్ల చేసి తీరతాం అని టిడిపి నేతలు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం నేతల ఇళ్ల ముందు ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలీసులు వచ్చేసారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ లను హౌస్ అరెస్ట్ చేసారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఇంటికి వెళ్ళగా, ఆయన అప్పటికే అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈ రోజు మళ్ళీ పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది.
చంద్రబాబు ఖమ్మం దెబ్బకు, టీఆర్ఎస్, వైసీపీ ఎందుకు ఉలిక్కి పడ్డాయి ?
మంచి వ్యూహంతో వేసిన ఒక ముందడుగు వల్ల రెండు ప్రయోజనాలు కలగడం, ఇద్దరికి చెక్ పెట్టడం వంటి వాటిని ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా తెలివిగా విసిరిన ఒక పంచ్ ఇరురాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలకు గట్టిగా తగిలింది. ఇప్పటివరకూ తెలంగాణలో ఓటుకు నోటుకు భయపడి అమరావతి వచ్చారని ఒకసారి, ఏపీలో ఉండకుండా హైదరాబాద్ పారిపోతున్నారని మరోసారి రెండు నాలుకల విమర్శలకు నేరుగా కౌంటర్ ఇవ్వకుండా ఖమ్మం తెలుగుదేశం శంఖారావాన్ని వినిపించారు బాబు. మాది తెలుగుదేశం పార్టీ. తెలుగు రాష్ట్రాల క్షేమం కోరే పార్టీ. ఇక్కడా ఉంటుంది. అక్కడా ఉంటుంది అంటూ బలమైన సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి రాదు. కానీ ఎవరు అధికారంలోకి రావాలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కావడం ఖాయమని పార్టీలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ అధినేత ఖమ్మం సభ అనుకున్న దాని కంటే చాలా విజయవంతమైంది. ఇది ఎవరో ఎల్లో మీడియా చేసే ప్రచారం కాదు. ఖమ్మంలో పసుపు రెపరెపలు గులాబీ కోటలో గుబులు పుట్టించాయి. ఫ్యాన్ రెక్కలు టపటపా కొట్టుకోవడం ఆరంభించాయి. చంద్రబాబు ఎవ్వరినీ ఒక్క విమర్శ చేయకుండా, తాను చేసిన అభివృద్ధి, తెలంగాణతో తనకు గల బాండింగ్, తెలుగుదేశం తెలంగాణ బంధం వివరించారు.