ఫణి పెను తుపాను తీరాన్ని గడగడలాడిస్తోంది. బంగాళాఖాతంలో అలజడి నెలకొంది. సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. తుపాను తీరంవైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం ప్రారంభమైన సమీక్ష సాయంత్రం వరకూ జరుగుతూనే ఉంది. ఈ రోజు రాత్రంతా చంద్రబాబు సచివాలయంలోనే ఉంటారనే సంకేతాలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి సచివాలయంలోనే చంద్రబాబు ఉన్నారు. ‘ఫణి’ తుపాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు బాబు ఆరా తీస్తున్నారు. ప్రతి గంటకు తుపాన్ పరిస్థితిని ఆర్టీజీఎస్ సీఈవో బాబు, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్ సీఎంకు వివరిస్తున్నారు.

cbnreview 02052019

విశాఖ‌ప‌ట్నంకు 159 కిలోమీట‌ర్ల దూరంలో.. తూర్పు ఆగ్నేయ దిశ‌గా ‘ఫణి’ సైక్లోన్ కేంద్రీకృతమైనట్టుగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందస్తు జాగ్రత్త చర్యలను చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పూరి వద్ద తుపాన్ తీరాన్ని దాటనున్నది. తుపాన్ తీరం దాటే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంతాల్లో గంటకు 130 నుంచి 140 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంత మండలాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల వరకు తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

cbnreview 02052019

తుపాను కాస్తా సూపర్ సైక్లోన్‌గా మారటంతో శ్రీకాకుళం జిల్లాపై పెను ప్రభావమే చూపించబోతోంది. ఉత్తర శ్రీకాకుళం మండలాల్లో 130 నుంచి 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో 200 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. మరోవైపు విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. వజ్రపు కొత్తూరు ,పలాస, మందస మండలాల్లో గాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈదురు గాలుల కారణంగా కొన్ని మండలాల్లో ముందుస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో కొన్ని గ్రామాల్లో అంధకారం నెలకొంది. మరోవైపు ఈ తుపాను ప్రభావం ఒడిశాపై కూడా పడటంతో గురువారం రాత్రి నుంచే భువనేశ్వర్, కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులను అధికారులు మూసివేశారు.

తుఫానుతో ప్రభావితమయ్యే జిల్లాల ప్రజలకు సత్వర సేవలందించేందుకు ఎన్నికల కోడ్‌కు మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ)ని కోరారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ఆ నాలుగు జిల్లాలకు ఎన్నికల కోడ్‌ నుంచి వెసులుబాటు ఇవ్వాలన్నారు. తద్వారా ప్రజలకు వేగంగా సమాచారం అందించడం, అవసరమైన సరుకుల తరలింపు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వంటివి సాధ్యపడతాయని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ముగిసినందున.. ఫణి తుఫాను నేపథ్యంలో నియమావళికి సడలింపు ఇవ్వాలని కోరారు.

naveen 020512019

ఈమేరకు ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాకు సీఎం బుధవారం లేఖ రాశారు. ‘పెనుతుఫాను నాలుగు జిల్లాలపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా. 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతోంది. కోడ్‌కు మినహాయింపు ఇస్తే మంత్రులు, అధికారులు వేగంగా స్పందించి ప్రజలకు ఉపశమనం ఇచ్చే సహాయక చర్యలు చేపట్టగలుగుతారు. తుఫాను సమయంలో వేగంగా స్పందించేందుకు కోడ్‌కు మినహాయింపు ఇవ్వండి’ అని కోరారు. అయితే చంద్రబాబు ఉత్తరం రాసి, రెండు రోజులు అవుతున్నా , ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరో పక్క ప్రధాని మోడీ సమీక్ష చేస్తున్నారు. మరి ఒక ముఖ్యమంత్రికి లేని అధికారం, ప్రధాన మంత్రికి ఎక్కడ నుంచి వచ్చిందో ఈసీనే చెప్పాలి.

naveen 020512019

ఇది ఇలా ఉంటే, తుఫాన్‌ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు, చురుగ్గా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా కోస్తా ప్రాంత జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. వెంటనే ఒరిస్సాలో కోడ్ ఎత్తేసారు. మరి అదే ప్రభావం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పై ఉంటుంది, మినహియింపు ఇవ్వండి అని చంద్రబాబు కోరినా, ఈసీ పట్టించుకోకపోవటం వెనుక రాజకీయం కోణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నవీన్ పట్నాయక్ ప్రస్తుతం ఎవరి ఫ్రంట్ లోనూ లేరు. తటస్థంగా ఉన్నారు. సీట్లు తగ్గితే, ఆయన్ను మంచి చేసుకువచ్చు అనే ఉద్దేశంతోనే, నవీన్ కు దగ్గర కావటానికి, మోడీ వేసిన ఎత్తుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ అయితే, చంద్రబాబుతో ఎలాంటి లాభం ఉండదు కాబట్టి, ఇక్కడ చంద్రబాబుని, ఏపి ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు.

ఓట్ల లెక్కింపు సమయంలో వీవీప్యాట్‌ స్లిప్పుల ఫలితాలే అంతిమమని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఈవీఎంల ఫలితాలు, వీవీప్యాట్‌ ఫలితాల్లో తేడాలు వస్తే.. వీవీప్యాట్‌ ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాయని బుధవారం విలేకరులకు తెలిపారు. ప్రతి అసెంబ్లీకి ఐదు చొప్పున వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని, అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో వేర్వేరుగా స్లిప్పులను లెక్కిస్తామని చెప్పారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాకే ఈ స్లిప్పులు లెక్కిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక దాని తర్వాత మరో వీవీప్యాట్‌లో లెక్కింపు జరుగుతుందన్నారు.

game 27032019

‘నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌స్టేషన్‌కు ఒక్కో గుర్తింపు కార్డు ఉంటుంది. కార్డుపై వివరాలు కనిపించకుండా లాటరీ ద్వారా వీవీప్యాట్ల ఎంపిక చేపడతాం. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో కంటైనర్‌ ద్వారా వీవీప్యాట్‌ కార్డుల ఎంపిక ఉంటుంది. ఆర్వో, అబ్జర్వర్ల సమక్షంలోనే వీవీప్యాట్‌ స్లిప్లుల కౌంటింగ్‌ జరుగుతుంది. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడా వస్తే మరో 2-3 సార్లు ఈవీఎంలను, వీవీప్యాట్‌ స్లిప్పులను రీ కౌంటింగ్‌ చేస్తాం. లెక్కలు సరిపోలకపోతే వీవీప్యాట్‌లో వచ్చిన ఓట్లే పరిగణనలోకి తీసుకుంటాం. 23వ తేదీ ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఇది మొదలైన అరగంటకే ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతాం. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే పరిస్థితులు ఉంటే.. పోస్టల్‌ బ్యాలెట్లను మరోసారి లెక్కిస్తాం’ అని ద్వివేది వెల్లడించారు.

 

game 27032019

అయితే ప్రజలు మాత్రం, ద్వివేది చెప్పిన విషయంతో ఆశ్చర్యపోతున్నారు. వీవీప్యాట్‌- ఈవీఎంల మధ్య తేడా వస్తే, వీవీప్యాట్‌ లను పరిగణలోకి తీసుకోవటం ఎంతో అర్ధం కావటం లేదని అంటున్నారు. వీవీప్యాట్‌-ఈవీఎం మధ్య తేడా ఉంది అంటే, అక్కడ ఎన్నికల ప్రక్రియ తేడా జరిగినట్టే కదా అని, ఇప్పుడు చంద్రబాబు, దేశంలో 21 పార్టీలు చేసే పోరాటం ఇదే కదా అంటూ, ఈసీ పై మండి పడుతున్నారు. ఎదో ఒకటి పరిగణలోకి తీసుకుంటామంటూ, ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ అపహాస్యం చేస్తుందని అంటున్నారు. రెండిటి మధ్య తేడా ఉంటే, అక్కడ ఎన్నికల ప్రక్రియ ట్యాంపరింగ్ జరిగినట్టు అనే ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకుర్చినట్టే కదా, దీని పై సమగ్రమైన విధానం ఎన్నికల కమిషన్ తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

గత రెండ్రోజులుగా ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలకు అధికారులు, కమిషనర్లు రాకపోవడంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు ఎవరు రాలేదు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ఎన్నికల కమిషన్ స్పందించింది. రాష్ట్రంలో తుపాను ప్రభావంతో పంటనష్టం, అకాల వర్షాలు, కరవు లాంటి ప్రకృతి వైపరీత్యాలపై సోమిరెడ్డి నిర్వహించాల్సిన సమీక్షకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు సాయంత్రం (శుక్రవారం సాయంత్రం) సచివాలయంలో మంత్రి సోమిరెడ్డి ఛాంబర్‌లోనే సమీక్షా సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, ఉద్యావన శాఖ ప్రత్యేక కమిషనర్లు అధికారులు హాజరయ్యేందుకు ఈసీ అనుమతించింది.

somireddy 0202019

రెండు రోజులుగా సోమిరెడ్డి సమీక్షకు వచ్చి వెనుతిరిగారు. సోమిరెడ్డికి మంగ‌ళ‌వారం ఎదురైన ప‌రిస్థితి మ‌రోసారి బుధ‌వారం కూడా ఎదురైంది. మంగ‌ళ‌వారం వ్య‌వ‌సాయ శాఖ పైన మంత్రి స‌మీక్ష ఏర్పాటు చేసారు. అయితే, ఉన్న‌తాధికారులు ఎవ‌రూ ఈ స‌మీక్ష‌కు హాజ‌రు కాలేదు. దీంతో.. రెండు గంట‌ల పాటు ఎదురు చూసిన మంత్రి సోమిరెడ్డి చివ‌ర‌కు స‌మీక్ష ర‌ద్దు చేసుకొని వెళ్లిపోయారు. అదే విధంగా బుధ‌వారం ఉద్యాన‌వ‌న శాఖ పైన మంత్రి స‌మీక్ష ఏర్పాటు చేసారు. అయితే, అధికారులు రావ‌టం లేద‌ని తెలుసుకున్న మంత్రి స‌మీక్ష‌ను ర‌ద్దు చేసారు. అస‌హ‌నానికి గురైన మంత్రి త‌న‌కు మంత్రి ప‌ద‌వి కొత్త కాద‌ని.. ఎన్నిక‌ల సంఘంతో తేల్చుకోవ‌టానికి సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు.

somireddy 0202019

ఏపీలో క‌రువు..తుఫాను వంటి ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రి స‌మీక్ష చేస్తే ఎలా త‌ప్ప‌వుతుంద‌ని మంత్రి సోమిరెడ్డి ప్ర‌శ్నించారు. సాధార‌ణ ప‌రిపాల‌న‌కు ఆటంకం క‌లిగిస్తారా అని నిల‌దీసారు. ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌లు చేయ‌వ‌ద్ద‌ని చ‌ట్టంలో ఎక్క‌డైనా ఉందా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేఉసారు. తెలంగాణాకో న్యాయం..ఏపీకో న్యాయం అనే విధంగా వ్య‌వ‌హ‌రించ‌టం స‌రి కాద‌న్నారు. క‌రువు..ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలో స‌మీక్ష‌లు చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. ఇటువంటి ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి ఇవ్వాల‌ని సూచించారు. ఇక‌, ఎన్నిక‌ల సంఘం..ప్ర‌భుత్వం మ‌ధ్య అధికారులు ఎవ‌రి మాట వినాలో..ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి రాష్ట్రంలో ఏర్ప‌డింద‌ని సోమిరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేసారు. అయితే మొత్తానికి, ఎలక్షన్ కమిషన్ పై పోరాడి, సమీక్షకు ఒప్పుకునేలా సోమిరెడ్డి చేసారు.

Advertisements

Latest Articles

Most Read