కేంద్ర ఎన్నికల సంఘంపైనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు అన్ని రాష్ట్రాల్లో సీఎస్‌లు వెళ్లి ముఖ్యమంత్రికి పరిస్థితులు వివరిస్తుంటే... మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎందుకు రావడం లేదని మండిపడ్డారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘నేను వెళ్లి అడుక్కోవాలా? ఆయనకు తెలియదా? చదువుకోలేదా? రాజ్యంగంలో ఎవరి పరిధులేంటో? ఎన్నికల విధులేంటో, ఎన్నికేతర పాలనా విధులేంటో తెలియవా? ఇక్కడ వ్యక్తులు ముఖ్యంకాదు. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కారు. అనుభవం కలిగిన వ్యక్తిగా వ్యవస్థల్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తాం, సమీక్షలు, సమావేశాలకు రామంటే కుదరదు. రోజువారీ పాలనా వ్యవహారాల్ని, పరిణామాల్ని కూడా ఈసీకే రిపోర్టు చేస్తారా?’’ అని మండిపడ్డారు.

cbn 04052019

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తప్ప... మిగతా అధికారులంతా బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం రోజువారీ పాలనా వ్యవహారాల్లో తనకే నేరుగా రిపోర్టు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సమీక్షలకు అనుమతివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి రాసిన లేఖపై ఈసీ ఇంతవరకు స్పందించకపోవడం గురించి ప్రస్తావించగా... ‘‘వాళ్లు అనుమతి ఇవ్వరు కదా? అయినా వాళ్లిచ్చేదేంటి? రోజువారీ పాలనతో వాళ్లకేం సంబంధం? ప్రధాని మోదీ కేబినెట్‌ సమావేశాలు పెట్టడం లేదా? ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షలు చేయకూడదని, అధికారులు ఈసీకే రిపోర్టు చేయాలన్న రూల్‌ ఎక్కడుందో చూపించండి’’ అని సీఎం అన్నారు. ‘‘నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నది నేనొక్కడినే. నవ్యాంధ్రకు మొదటి సీఎంని. వాళ్ల సర్వీసంతా నా అనుభవం అంత ఉండదు. వాళ్లెవరు నాకు పాఠాలు చెప్పడానికి?’’ అని మండిపడ్డారు.

cbn 04052019

‘‘మోదీ 2002లో ముఖ్యమంత్రి అయ్యారు. 2014 వరకు అమిత్‌షా అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు వాళ్లిద్దరూ మమ్మల్ని మించిన నాయకులు లేరంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తానని పేర్కొన్నారు. వచ్చేవారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించి పరిస్థితులు సమీక్షిస్తామని, అధికారుల్లో ఎవరు బిజినెస్‌ రూల్స్‌ని, ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, రాష్ట్ర అధికారులూ వింతగా ప్రవర్తిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రధాని మోదీ నిర్వాకాలకు వ్యతిరేకంగా... దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పోరాడుతున్నాను. మోదీ ఏదో చేస్తారనో, ఐటీ, ఈడీలను పంపిస్తారనో భయపడను. ఆ విషయాన్ని ఈసీ కూడా గుర్తు పెట్టుకోవాలి. ’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్రంలో కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని రాబోతున్నారని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పాలనలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. సీబీఐ, ఈడీ, విజిలెన్స్‌ కమిషన్‌, ఆర్‌బీఐ తదితర సంస్థలన్నింటినీ మోదీ తన చెప్పుచేతుల్లో పెట్టుకుని... ప్రత్యర్థులను వేధించేందుకు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి- దేశాన్ని కాపాడాలి’’ నినాదంతో వివిధ రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయని అన్నారు. రాజకీయంగా కొన్ని విభిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత అందరం కలుస్తామని, ఎన్నికల తర్వాత అంతా కలిసి ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని చెప్పారు. దిల్లీలో శుక్రవారం న్యూస్‌ ఎక్స్‌ ఆధ్వర్యంలో ‘‘ఇండియా నెక్ట్స్‌-2019 మెగా కాన్‌క్లేవ్‌’’లో అమరావతి నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా చంద్రబాబు మాట్లాడారు.

indianext 04052019

ఈ సందర్భంగా నిర్వాహకులు, ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తామే గెలుస్తామని చెప్పారు. అవినీతిని ప్రోత్సహించారు.. పెద్ద నోట్లు రద్దు చేయమంటే వెయ్యి నోట్లు రద్దు చేసి రూ.2 వేలు నోట్లు ప్రవేశపెట్టి అవినీతిని ప్రోత్సహించారు. దీనికి పూర్తి బాధ్యత మోదీదే. అప్పట్లోనే కేంద్రం సరైన చర్యలు తీసుకునుంటే ఈ ఎన్నికల్లో ఇంత పెద్దఎత్తున డబ్బులు కుమ్మరించే పరిస్థితులుండేవి కావు. ఈ అయిదేళ్లలో దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టారు. ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక హామీల అమలు విషయంలో మోదీ మమ్మల్ని మోసం చేశారు. ఏపీ ప్రజలనే కాదు...దేశ ప్రజలను కూడా మోదీ మోసం చేశారు.

indianext 04052019

రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం... నాకు ఒక దార్శనికతతో కూడిన ప్రణాళిక ఉంది. నదులు అనుసంధానం చేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. అమరావతి నిర్మాణానికి ఒక రూపు రావాలి. కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చేయాల్సింది చాలా ఉంది. జాతీయ స్థాయిలో పలువురు సీనియర్‌ నాయకులతో కలిసి పనిచేస్తా. కాలం కంటే ముందు పరిగెత్తటం నా నైజం. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళతా. ఈ జాతి నిర్మాణంలో నా వంతు బాధ్యత పోషిస్తా. భారత్‌ లాంటి గొప్ప దేశానికి మంచి నాయకత్వం కావాలి. రాబోయే సంకీర్ణ ప్రభుత్వం ఆ నాయకత్వాన్ని అందిస్తుంది.

పర్యావరణం ప్రాణం తీసేస్తున్న అతి పెద్ద కారకం ప్లాస్టిక్‌. జీవనది కృష్ణమ్మ, దానికి అనుసంధాన కాల్వలను ఉసూరుమని పిస్తున్నది అదే. నీరు లేని నదీ గర్భంలో చూసినా, నీరున్న కాల్వలను తలదించి చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. ఈ అంశమే ఇప్పుడు పర్యావరణ ప్రేమికులను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు కాల్వల్లో అటూఇటూ తేలుతున్న చెత్తను ఎత్తడానికి చేపట్టిన ‘నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో...’ కళ్లు తేలేసే వాస్తవాలు కనిపిస్తున్నాయి. తొలిరోజున 300 టన్నుల వ్యర్థాలు బయటకు వస్తే, రెండో రోజు శుక్రవారం 800 టన్నుల వ్యర్థాలను బయటకు తీశారు. రెండు రోజుల్లో 1100 టన్నులు వ్యర్థాలను టిప్పర్లలో డంపింగ్‌ యార్డులకు తరలించారు. గాంధీనగర్‌లోని అలంకార్‌ సెంటర్‌ నుంచి కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కృతికా శుక్లా, బాబూరావు, మున్సిపల్‌ కమిషనర్‌ రామారావు తదితరులు ర్యాలీ నిర్వహించి, ప్రజలకు కాల్వల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఏలూరు లాకు వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.

krishnariver 04052019 1

రెండు రోజుల్లోనే 1100 టన్నుల చెత్తచెదారం బయటకు వస్తే, దీన్ని నిరంతరం చేపడితే ఇంకెన్ని టన్నుల వ్యర్థాల కృష్ణమ్మ కడుపులో నుంచి బయటకొస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రక్షాళనకు ముందు నుంచి ‘అవార’ (అమరావతి వాకర్స్‌, అడ్వంచర్స్‌, అండ్‌ రన్నర్స్‌ అసోసియేషన్‌) నది శుభ్రతను భుజాన వేసుకుంది. 2012 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యంత్రాలను ఉపయోగించకుండా 200 టన్నుల వ్యర్థాలను ఎత్తిపోసింది కొద్దిరోజులుగా ప్లాస్టిక్‌ నిషేధంపై విజయవాడలో సమరశంఖం పూరించారు. అయినా దాని వాడకాన్ని ప్రజలు ఆపిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. బందరు, ఏలూరు, రైవస్‌ కాల్వల్లో బయటకు తీసిన వ్యర్థాల్లో అధికర శాతం ప్లాస్టిక్‌ కనిపించింది.

 

krishnariver 04052019 1

ముఖ్యంగా మురుగు నేరుగా నేరుగా కాల్వల్లోకి వచ్చి చేరుతోందని అధికారులు గమనించారు. దీనికి ముందుగా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్ణయించారు. రామలింగేశ్వరనగర్‌ కట్టకు ఎడమ వైపున ఉన్న ఇళ్లు, దుకాణాల నుంచి మురుగునీరు పైపుల ద్వారా బందరు కాల్వలోకి చేరుతోంది. ఏలూరు, రైవస్‌ కాల్వలోనూ ఇదే జరుగుతోందని గమనించారు. ఈ నీటిని తొలుతగా ఎస్టీపీ (సెకండరీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)కు మళ్లించి అక్కడ శుభ్రం చేసిన తర్వాత బయటకు వదిలితేనే కాల్వల రూపురేఖలు కొంతవరకు మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

శుక్రవారం చంద్రబాబు ఉండవల్లి ప్రజా వేదికలో మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ మళ్లీ గెలవరని ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా అందరికీ అర్థమైందని చంద్రబాబు అన్నారు. దీంతో తాజాగా రెండు పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటున్నాయని చంద్రబాబు చెప్పారు. ఆ రెండు పార్టీలేంటన్నది ఇప్పుడే వెల్లడించనని... మరికొన్ని పార్టీలు కూడా వాటితో కలిసి వస్తాయని అన్నారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో జాతీయ రాజకీయాలపై ఏమైనా మాట్లాడారా? అని ప్రశ్నించగా...తుపాను సాయంపై రెండుసార్లు మాట్లాడానని బదులిచ్చారు. ఇక... మోదీ ఏం మాట్లాడినా ఈసీకి సంగీతంలాగే ఉంటుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని పశ్చిమ బెంగాల్‌లో మోదీ ప్రకటించినా పట్టించుకోలేదన్నారు.

ec 04052019

ఇక... ఫణి తుఫాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో వేగంగా స్పందించి ప్రజలకు సాయం అందించేందుకు ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని అడిగితే... తాపీగా తుఫాను తీరం దాటాక అనుమతి ఇచ్చిందని తెలిపారు. అంతకుముందే తుఫానుపై అధికారులతో సమీక్ష చేసి సమన్వయం చేశామని తెలిపారు. ‘‘మొన్నటివరకు అధికారులుగా ఉన్నవారే ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమితులయ్యారు. మోదీ వారిని నియమించినంత మాత్రాన హద్దులు దాటి ప్రవర్తించకూడదు. రాష్ట్ర సీఈవోకు కూడా ఇదే వర్తిస్తుంది’’ అని అన్నారు.

ec 04052019

జగన్‌ తాజాగా హైదరాబాద్‌లో ‘అవెంజర్స్‌... ద ఎండ్‌ గేమ్‌’ సినిమా చూశారని ఒక పాత్రికేయుడు ప్రస్తావించగా... ‘‘చూడనివ్వండి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇక్కడ సమస్యలేమీ లేకుండా సజావుగా చూసుకుంటోంది కదా! ఇక ఆయనకు ఇక్కడ ఏ పనీ లేదు. హైదరాబాద్‌లో కేసీఆర్‌తో టచ్‌లో ఉంటూ హాయిగా ఉన్నారు. ఆయనకు ఇక్కడ తుఫాన్లు, ప్రజలు ఎవరూ పట్టరు’’ అని చంద్రబాబు బదులిచ్చారు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై 23 రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంఘాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయడం సంతోషకరమని చంద్రబాబు చెప్పారు. వీవీప్యాట్‌లు లెక్కించేందుకు ఆరురోజుల సమయం పడుతుందంటూ సుప్రీంకోర్టును ఈసీ తప్పుదారి పట్టిస్తోందని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read