తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు, కైకాల సత్యనారాయణ కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. ఆయన వయసు 87 ఏళ్ళు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల, ఈ రోజు తెల్లవారుజామున  నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు. 1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జన్మించిన ఆయన, మొత్తం 777 సినిమాల్లో నటించారు. అయితే చాలా మందికి తెలియని విషయం, 1996లో మచిలీపట్నం నుంచి టీడీపీ అభ్యర్థిగా లోక్‍సభకు ఎన్నిక అయ్యారు. తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేసారు. అన్న ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబసభ్యులకుచంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క క్రీడాకారుడికి కూడా క్రీడల్లో శిక్షణ ఇవ్వలేదని కేంద్ర యువజన, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ చెప్పారు. ఖేలో ఇండియా పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో ఒక్క అథ్లెట్‍కు కూడా ట్రైనింగ్ ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. - దేశవ్యాప్తంగా అయితే 1,709 మంది క్రీడాకారులకు ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తే, తెలంగాణలో 74 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారాని, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వలేదని కేంద్రం తేల్చి చెప్పింది. అయితే గత నెల రోజులుగా మంత్రి రోజా గారు, వివధ రకాల ఆటలు ఆడుతూ, చేస్తున్న హడావిడి చూసి, శిక్షణ ఎందుకు ఇవ్వటం లేదని, అడిగే వారికి ఏమి సమాధానం చెప్తారో మరి ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మూడు రోజుల విజయనగరం పర్యటన కోసం విశాఖ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో దిగిన చంద్రబాబుకి స్వాగతం పలకటానికి, టీడిపీ నేతలు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, చినరాజప్ప, బుద్దా వెంకన్న, వెలగపూడి రామకృష్ణ, వంగలపూడి అనిత, ప్రణవ్ గోపాల్ తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా టిడిపి శ్రేణులు చేరుకున్నాయి. అక్కడ నుంచి బయలుదేరి చంద్రబాబు భారీ కాన్వాయ్ తో విజయనగరం వెళ్లారు. నాతవలస టోల్‍గేట్ దగ్గర చంద్రబాబుకు టీడీపీ నేతల ఘనస్వాగతం పలికారు. విజయనగరం జిల్లాలోకి అడుగుపెట్టిన చంద్రబాకు, పూసపాటిరేగ మండలం నాతవలస టోల్‍గేట్‍ వద్ద పార్టీ శ్రేణుల ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబుకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు, ఇతర టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. నాతవలస నుంచి రాజాం బయల్దేరి వెళ్లారు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు సంచలన ఆదేశాలు జారీ చేసింది. చెప్పినా వినకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్మించిన ఆర్బీకేలు, పంచాయతీ భవనాలను వెంటనే ప్రభుత్వ విద్యాశాఖకు అప్పగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత వరం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ఈ రోజు హైకోర్టుకు చీఫ్ సెక్రెటరీతో పాటుగా పంచాయతీరాజ్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు కోర్టుకు వచ్చారు. కోర్టు ఆదేశాలకు విరుద్దంగా భవనాల నిర్మాణంపై, ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వ స్కూల్స్ ఆవరణలో కట్టిన భవనాలను వెంటనే విద్యాశాఖకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం అవాక్కయింది. పేరెంట్స్ కమిటీతో మాట్లాడాలని పిటిషన్ తరపు లాయర్ లక్ష్మీనారాయణకుహైకోర్టుకు తెలిపారు. లాయర్ లక్ష్మీనారాయణ సూచలనతో ఏకీభవించిన హైకోర్టు ఆ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశం ఇస్తూ విచారణ జనవరి 20కి వాయిదా వేసింది హైకోర్టు.

Advertisements

Latest Articles

Most Read