రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు మహారాణులయ్యారు. 101 నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళలు 2 లక్షల 40 వేల మంది అదనంగా ఓట్లేశారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కలు చూస్తే.. రాష్ట్రంలో మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. వీరి తీర్పు ఎవరిని అధికార పీఠం వద్దకు తీసుకెళ్తుందనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఆధ్యంతం ఆసక్తికరంగా జరిగాయి. చివరి నిమిషంలో అధికారుల బదిలీ, ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఎండవేడిమి, ఉదయం ఓటేయ్యలేనివారు తిరిగి సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం, తెల్లవారుఝాము వరకు పోలింగ్ జరగడం వంటి ఆసక్తికరమైన సంఘటనలెన్నో జరిగాయి. కానీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహిళలు పట్టుదలతో వచ్చి ఓట్లు వేశారు.

vote 21042019

రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో 3 కోట్ల 13 లక్షల 33 వేల 631 మంది అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని 79.64 శాతం ఓట్లేశారు. ఇందులో పురుషులు కోటి 55 లక్షల 45 వేల 211 మంది కాగా, స్త్రీలు కోటి 57 లక్షల 87 వేల 759 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 ఎన్నికల్లో 2 కోట్ల 87 లక్షల 91 వేల 613 మంది ఓట్లు పోల్ అవ్వగా, అప్పట్లో 78.41 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో పురుషులు కోటి 43 లక్షల 78 వేల 804 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, కోటి 44 లక్షల 12 వేల 652 మంది మహిళలు ఓట్లు వేశారు. 2014 ఎన్నికలకు, నేటికీ మహిళలు అదనంగా 2 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం స్పష్టమవుతోంది.

vote 21042019

ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో 101 నియోజకవర్గాల్లో పురుషులకంటే మహిళలు అదనంగా ఓటు హక్కును వినియోగించుకున్నారనేది స్పష్టం అవుతోంది. వెయ్యికిపైగా పురుషులకంటే అదనంగా మహిళలు ఓట్లేసిన నియోజకవర్గాలు రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళంలో 8, విజయగనగరంలో 7, విశాఖపట్నంలో 11, తూర్పు గోదావరిలో 6, పశ్చిమగోదావరిలో 8, కృష్ణాలో 9, గుంటూరులో 15, ప్రకాశంలో 6, నెల్లూరులో 8, కడపలో 9, కర్నూల్ లో 5, అనంతపురంలో 1, చిత్తూరులో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుషులకంటే అదనంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుసుపు-కుంకుమ పథకంతో డ్వాక్రా మహిళలు, అన్నదాత సుఖీభవ, రుణమాఫీతో రైతులు, పెన్షన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతవులు తమ ఓటు హక్కును తెలుగుదేశానికి అనుకూలంగా వినియోగించుకున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే తమకు 130 వరకు సీట్లొస్తాయని దేశం వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

 

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకంతో ఏ తప్పూ చేయని కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాగా చదివే వారు కూడా ఫెయిల్ కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. విచిత్రమేంటంటే మొదటి సంవత్సరంలో జిల్లా టాపర్‌గా నిలిచిన విద్యార్థులు కూడా సున్నా మార్కులు రావడంతో విద్యాశాఖ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చింతగూడెం గ్రామానికి చెందిన నవ్య అనే విద్యార్థిని గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించి, జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది.

kcrktr 21042019

తెలుగులో ఏకంగా 98 మార్కులు సాధించింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అయ్యింది. కానీ తెలుగు సబ్జెక్టులో ఆమెకు 'సున్నా' మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థితో పాటు ఆమె తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. దీనికి కారణమెంటో తెలుసుకునేందుకు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేపట్టారు. అయినా.. అధికారులు వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు తెలుగులో సున్నా మార్కులు రావడం పట్ల ఆ విద్యార్థిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఇంటర్ ఫస్టియర్ తెలుగులో 98 మార్కులు వచ్చాయని. మొత్తం 476 మార్కులతో ఫస్టియర్ జిల్లా టాపర్‌గా నిలిచినట్లు ఆమె తెలిపింది. కాని సెకండియర్‌లో ఫెయిల్ చేశారు. అసలు తనకు తెలుగులో 99 మార్కులు రావాలని ఆ విద్యార్థిని చెబుతోంది. త

kcrktr 21042019

నలాంటి ఎంతో మంది విద్యార్థులకు కూడా ఇలాగే చేశారని ఆమె అంటుంది. తెలుగు సబ్జెక్టు మార్కులు కాక తనకు 825 మార్కులు వచ్చాయని.. తెలుగు మార్కులు యాడ్ అయితే 900 మార్కులకు పైగా వచ్చేవని ఆ విద్యార్థిని అంటోంది. ఇది ఆ అమ్మాయి ఒక్కరి పరిస్థితే కాదు.. దాదాపు 25 వేల మంది విద్యార్థులుకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. అధికారులు ఇష్టారాజ్యంగా పేపర్లు దిద్దడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పై ఒంటి కాలు మీద లేగిసే హైదరాబాద్ మీడియా, అక్కడ మేధావులు అని చెప్పుకు తిరిగే వారు మాత్రం, పాపం కేసీఆర్ ను ప్రశ్నించాలి అంటే భయపడుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి-జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. 88 స్థానాల్లో విజయం సాధిస్తామంటూ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను విజయసాయిరెడ్డి ఎద్దేవా చేయడంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. శనివారం ఇది మరింత ముదిరింది. మూడు నెలల్లో మూడు పార్టీలు మారారంటూ తనను ఎద్దేవా చేసిన విజయసాయికి లక్ష్మీనారాయణ శనివారం మరింత ఘటుగా బదులిచ్చారు. తాను రాజకీయాల్లో చేరబోతున్నట్టు ప్రకటించగానే అనేక పార్టీలు తనను ఆహ్వానించాయని, ఈ విషయాన్ని మీడియాతో పలుమార్లు చెప్పానని పేర్కొన్న లక్ష్మీనారాయణ.. అందులో వైసీపీ కూడా ఉందన్నారు.

vsreddy 21042019

రెడ్ కార్పెట్ పరిచి మరీ తనను ఆహ్వానిస్తానని చెప్పింది మీరు కాదా? అని విజయసాయిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టని మీ తీరు చూస్తుంటే ప్రజల దగ్గర ఇంకెన్ని విషయాలు దాస్తున్నారోనని అనుమానంగా ఉందన్నారు. వైసీపీ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరించినందుకు మీ బాధను ఇలా వ్యక్తం చేస్తున్నారా? అని నిలదీశారు. అంతేకాదు, జనసేన 65 స్థానాల్లో పోటీ చేసి, 80 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపిందన్న విజయసాయి వ్యాఖ్యలకు కూడా లక్ష్మీనారాయణ బదులిచ్చారు. ‘‘మీ హైదరాబాద్, ఢిల్లీ ట్యూషన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ట్యూషన్ మాస్టార్లు కోప్పడతారు. ఓసారి లెక్కలు సరి చూసుకోండి. ఎగువ సభ ఔన్నత్యాన్ని నిలబెట్టండి. ప్రజలందరూ చూస్తున్నారు. మాది పారదర్శకమైన పార్టీ. మా జనసేన హోదాలతో పనిచేసే పార్టీ కాదు, హృదయాలతో పనిచేసే పార్టీ’’ అని ట్వీట్ చేశారు.

vsreddy 21042019

‘‘నేను ప్రస్తుతం రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న పేదరికం (Poverty) మరియు నిరుద్యోగం (Unemployment) నిర్మూలనకై పాలసీ తయారీలో నిమగ్నమైవున్నాను. దీనికి మీదగ్గర ఏమైనా ప్రత్యామ్నాయాలు వుంటే నాకు తెలియచేయగలరు. మీ అసత్య ట్వీట్లకు సమాధానమిస్తూ నా అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోలేను. ఇది మీరు గమనించగలరు. ఇకపై మీ ట్వీట్లకు మా జనసైనికులు అవసరం అనుకుంటే సమాధానమిస్తారు! ధన్యవాదాలు’ అంటూ లక్ష్మీనారాయణ ఘాటు రిప్లై ఇచ్చారు.

ఈస్టర్ పర్వదినమైన ఆదివారం ఉదయం శ్రీలంక రాజధాని కొలంబోను వరుస బాంబు పేలుళ్లు కుదిపేశాయి. మూడు చర్చిలు, రెండు హోటళ్లు లక్ష్యంగా జరిగిన బాంబు పేలుళ్లలో 20 మంది మృతి చెందారు. 160 మంది వరకూ గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆస్తినష్టం కూడా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోయ చర్చిల్లో ఈస్టర్ ప్రార్థనలు చేస్తున్న భక్తులను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు హోటల్ షాంగ్రి లా, సిన్నమాన్ గ్రాండ్ హోటల్స్‌లోనూ పేలుళ్ల చోటుచేసుకున్నాయి. ఈస్టర్ సండే ప్రార్థనలు జరుగుతుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నట్టు పోలీసు ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు.

easter 21042019 1

పోలీసు అధికారుల వివరాల ప్రకారం కొలంబోలోని కొచ్చికోడ్‌ ప్రాంతంలో ప్రముఖ సెయింట్‌ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలోనూ పేలుళ్లు సంభవించాయి. అలాగే శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఆయా చర్చిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 160 మంది గాయపడగా దాదాపు 20 వరకు మృతి చెందినట్లు సమాచారం. ఈస్టర్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వారిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాధితుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

easter 21042019 1

శ్రీలంకలోని బాంబు పేలుళ్ల ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. ఈ ఘటనపై శ్రీలంకలోని భారత హైకమిషనర్‌తో మాట్లాడామని చెప్పారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నామని తెలిపారు. మరోవైపు శ్రీలంకలోని భారత రాయభార కార్యాలయం భారత పౌరుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది. సమాచారం కోసం +94 777903082, +94112422788, +94 112422789, +94 777902082, +94772234176 నంబర్లను సంప్రదించాలని కోరింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది.

Advertisements

Latest Articles

Most Read