‘ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల(ఈవీఎంలు) వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది’. బీజేపీ ఎంపీగా ఉన్న జీవీఎల్‌ నరసింహారావు గతంలో వ్యక్తం చేసిన అభిప్రాయం. దీనిపై ఒక పుస్తకం కూడా ఆయన రాశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లకు ఈవీఎంలు చుక్కలు చూపించిన తరుణంలో జీవీఎల్‌ రాసిన పుస్తకంపై విస్తృత చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల తర్వాత దేశ, విదేశాల్లోని ఘటనలను ఉదహరిస్తూ ఆయన రాసిన 230 పేజీల పుస్తకం ‘డెమోక్రసీ ఎట్‌ రిస్క్‌ డ్యూ టూ ఈవీఎం్‌స’లో వీటి పనితీరును ఎండగట్టారు. అప్పటి బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ ఆ పుస్తకానికి ముందుమాట రాయగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈవీఎం పద్ధతిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు అదే మాటపై ఉండగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ మాత్రం అదే ఈవీఎంలను నేడు సూపర్‌ అనడం విడ్డూరంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఏకిపారేస్తున్నారు. ఒడిసా ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా బీజేడీకి పోలయ్యాయని, పోలింగ్‌ ముగియగానే 52.6% అని పీవో ప్రకటిస్తే కౌంటింగ్‌ నాటికి అది 65.9శాతానికి చేరిందని తన పుస్తకంలో ప్రస్తావించారు.

gvl 19042019 2

‘ఈవీఎంల పనితీరును నిరసిస్తూ తమిళనాడులో జయలలిత ఐదు అసెంబ్లీ ఉప ఎన్నికలను బహిష్కరించారు. ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ఒక పోలింగ్‌ బూత్‌లో 417 ఓట్లు పోలయితే 415 ఒక స్వతంత్ర అభ్యర్థికి వచ్చాయి. ఆ అభ్యర్థికి వచ్చిన మొత్తం ఓట్లు 998 మాత్రమే’ అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రెల్లివలస, పెదకూరపాడు నియోజకవర్గంలోని నాగిరెడ్డిపాలెం, ఉరవకొండ నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ బూత్‌, తమిళనాడులోని తిరుచిరాపల్లి, మహారాష్ట్రలోని బండారా.. ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల లోపాలపై పుస్తకంలో జీవీఎల్‌ ప్రస్తావించారు. వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలను జోడించారు. సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడాన్ని గుర్తు చేశారు.

gvl 19042019 3

‘అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో ఈవీఎంలను తప్పుపట్టారు. అరబ్‌ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈవీఎంలలో లోపాలపై వివిధ పత్రికలు కోడై కూశాయి’ అని వాటి గురించి పుస్తకంలో వివరించారు. అయితే బీజేపీ విపక్షంలో ఉండగా ఒక రేంజ్‌లో ఈవీఎంలపై విరుచుకుపడిన జీవీఎల్‌ ఇప్పుడు సమర్థిస్తూ మాట్లాడటంపై ఆ పార్టీలోని నేతలే నోరెళ్లబెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అర్ధరాత్రి వరకూ నిల్చోబెట్టిన పాపం ఎవరిది? దేశచరిత్రలో తెల్లవారుజాము వరకూ ఓటింగ్‌ ఎక్కడైనా, ఎప్పుడైనా జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుపై కోపం ఉంటే ఆయన్ను విమర్శించుకోవచ్చునని, ప్రజలను పగలు ఎండలో, అర్ధరాత్రి చీకల్లో నిల్చోబెట్టిన ఈసీని, మొరాయించిన ఈవీఎంలను సమర్ధించడం ఏంటని మండిపడుతున్నారు.

 

 

2019 లోక్‌సభ ఎన్నికల పుణ్యమాని సమాజ్‌‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిల మధ్య దశాబ్దాల పాటు కొనసాగిన వైరానికి తెరపడింది. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒకేవేదికపై కనిపించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోట మయిన్‌పురిలో శుక్రవారం ఎస్పీ-బీస్పీ-ఆర్ఎల్‌డీ సంయుక్తంగా నిర్వహించిన ర్యాలీలో ఈ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. క్రిస్టియన్ ఫీల్డ్ మైదానంలో ఈ ర్యాలీకి జరిగింది. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడకముందు వరకు ములాయంకు చెందిన సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ), మాయావతికి చెందిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి మధ్యే పోటీ అధికంగా ఉండేది. ప్రస్తుతం ఎస్పీ బాధ్యతలు అఖిలేశ్‌ యాదవ్‌ నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న సందర్భంగా శుక్రవారం మెయిన్‌పురిలో ప్రచార సభను నిర్వహించారు. ఇందులో ఇరు పార్టీల అగ్రనేతలందరూ హాజరయ్యారు.

modi sp bsp 19042019

ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ... ‘ఎస్పీ మద్దతుదారులంతా మాయావతిని ఎల్లప్పుడూ గౌరవించాలి. మనకు ఎప్పుడు అవసరం వచ్చినా ఆమె మనకు మద్దతుగా నిలబడ్డారు. నాకు ఓటు వేయమని మిమ్మల్ని కోరడానికి ఆమె ఈ రోజు ఇక్కడకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ... ‘మెయిన్‌పురిలో అందరూ ములాయం సింగ్ యాదవ్‌కు మద్దతు తెలపండి. ఎస్పీకి ఓట్లు వేయండి. ఆయన వెనకబడిన తరగతుల వారి అభివృద్ధి కోసం కృషి చేసే నిజమైన నేత. మెయిన్‌పురిలో ఆయన చాలా కాలంగా గెలుపొందుతున్నారు.ఎస్పీ గుర్తు సైకిల్‌ను మర్చిపోకండి. ఆయనను గెలిపించండి‌’ అని వ్యాఖ్యానించారు.

modi sp bsp 19042019

1995లో స్టేట్ గెస్ట్ హౌస్‌లో మాయావతి, బీఎస్పీ కార్యకర్తలపై ఎస్పీ శ్రేణులు దాడులకు పాల్పడడంతో... ములాయం, మాయావతి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్టు చెబుతారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో మయిన్‌పురి నుంచి పోటీ చేస్తున్న ఎస్పీ కురువృద్ధుడు ములాయం... ఇంతకుముందు దేవ్‌బంద్, బదౌన్, ఆగ్రాలో జరిగిన మూడు సంయుక్త ర్యాలీలకు హాజరు కాలేదు. దీంతో బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడం ఇష్టంలేకే ఆయన దూరం జరిగారంటూ వార్తలు వచ్చాయి. వాస్తవానికి మయిన్‌పురిలో జరిగే ర్యాలీకి కూడా రాకూడదని ఆయన నిర్ణయించుకున్నారనీ... అయితే ఆయన కుమారుడు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బుజ్జగించడంతో మొత్తబడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోయినసారి అత్యధిక ఎంపీ స్థానాలు యుపి నుంచి పొందిన బీజేపీ, ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో, అత్యధిక స్థానాలు పోగొట్టుకోనుందని, విశ్లేషకులు చెప్తున్నారు.

 

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, కేంద్ర ఎన్నికల సంఘం మెతక వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్ ఫైర్ అయ్యారు. పోలింగ్ కు ముందు ఐటీ దాడులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా ప్రస్తత ఎన్నికల సంఘం పని తీరు ఉందని విమర్శించారు. ఈ మేరకు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరాకు ఫోన్ చేసి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. 1990 డిసెంబరు 12న 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శేషన్ 1996 డిసెంబరు 11వ తేదీ వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆయన హయాంలోనే ఎన్నికల సంఘానికి ఉన్న విశేష అధికారాలను ఎగ్జిక్యూట్ చేసి చూపిన అ అధికారిగా శేషన్‌కు పేరుంది. శేషన్ ఎన్నికల కమిషనర్‌గా నియమితులు అయ్యే వరకు ఎన్నికల సంఘం అధికారాలేమిటన్నది ప్రజలకు, అధికారులకు కూడా తెలియదనే చెప్పాలి. ఆయన హయాంలో ఎన్నికల కమిషన్ అంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. అటువంటి శేషన్ ప్రస్తుత ఎన్నికల సంఘం పనితీరును తప్పుపట్టారు. (Source: AndhraPrabha https://bit.ly/2Zn0l3C)

seshan 19042019 1

ఈవీఎంల పనితీరుపై ఎన్నో సందేహాలున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో పోలింగ్‌ నిర్వహించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని.. అనేక చోట్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఓటు వేయడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా దేశాల్లో ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్‌ పోలింగ్‌నే నిర్వహిస్తున్నారని.. భారత్‌లోనూ పేపర్‌ బ్యాలెట్‌ పోలింగ్‌నే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాలని కోరుతున్నట్టు తెలిపారు చంద్రబాబు. రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టి వీవీప్యాట్‌లు కొన్నారు.. అంత ఖర్చు పెట్టి కేవలం ఒక్క వీవీప్యాట్‌లో స్లిప్పులు మాత్రమే లెక్కించడం ఏంటీ? అని ప్రశ్నించారు చంద్రబాబు.

seshan 19042019 1


ఈవీఎంల పనితీరుపై చాలా సందేహాలున్నాయన్న ఆయన.. వీవీపాట్ లో గుర్తు 7 సెకండ్లు పాటు ఓటరుకు కనపడాల్సి ఉండగా, కేవలం మూడు సెకండ్లు మాత్రమే కనిపిస్తుందని.. సమయం ఎందుకు తగ్గింది అని అడిగితే ఈసీ దగ్గర సమాధానం లేదని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం తీరు సంతృప్తికరంగా లేదన్న చంద్రబాబు.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఆలోచిస్తున్నామని.. 50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయని వెల్లడించారు. 50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించటానికి, ఈసీకి ఉన్న ఇబ్బందులు ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని మాలేగావ్ బాంబు పేలుడు కేసు ఘటనలో ప్రధానంగా వినిపించిన పేరు సాధ్వి ప్రజ్ఞాసింగ్. ఈ కేసులో చాలాకాలం పాటు కారాగార శిక్షను అనుభవించిన ఆమె.. విడుదల అయ్యారు. రాజకీయ రంగప్రవేశం చేశారు. భారతీయ జనతాపార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. లోక్ సభ ఎన్నికల బరిలో నిల్చోవడానికి సిద్ధపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే భాజపాలో చేరి భోపాల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారని వ్యాఖ్యానించారు.

pragna 19042019 2

ముంబయి యాంటీ టెర్రరిస్ట్‌ విభాగాధిపతిగా పనిచేసిన హేమంత్‌ 26/11 దాడిలో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అతని సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఆయనకు అశోక్‌చక్ర అవార్డు లభించింది. ‘‘నన్ను ఆయన తీవ్రంగా వేధించారు. దీంతో నేను ఆయన్ని శపించాను. అప్పటి నుంచి ఆయనకు అశుభ ఘడియలు మొదలయ్యాయి. అనంతరం ఆయన ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు’’ అని ప్రజ్ఞా ఠాకూర్‌ అన్నారు. ఎన్నికల వేళ విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఒకరు. దీనిపై విచారణ చేపట్టిన హేమంత్‌ కర్కరే.. పేలుళ్లలో వాడిన ద్విచక్రవాహనం ప్రజ్ఞా పేరు మీదే నమోదై ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు.

pragna 19042019 3

2016లో ఆమెకు ఎన్‌ఐఏ క్లీన్‌ చిట్ ఇచ్చినప్పటికీ కేసును కొట్టి వేయడానికి కోర్టు మాత్రం అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇటీవలే భాజపాలో చేరిన ఆమె ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న భోపాల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్‌ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా.. సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ మాలేగావ్‌ పేలుళ్లలో కుమారుడిని కోల్పోయిన నిస్సార్‌ సయీద్‌ గురువారం ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన న్యాయమూర్తి ఎన్‌ఐఏ, ప్రజ్ఞాసింగ్‌లిద్దరినీ సమాధానాలు సమర్పించాల్సిందిగా కోరుతూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అయితే ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన వీరుడు, ముంబయి యాంటీ టెర్రరిస్ట్‌ విభాగాధిపతిగా పనిచేసిన హేమంత్‌ పై ఈమె చసిన వ్యాఖ్యలను మోడీ ఎలా సమర్దిస్తారో మరి. అయినా, ఇలాంటి వారందరినీ, రాజకీయాల్లోకి తెచ్చి, ఈ దేశాన్ని ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో, మోడీనే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read