ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, సీఎం చంద్రబాబు చేసిన సమీక్షల పై వైసీపీ కంప్లైంట్ ఇవ్వటం, దాని పై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవ్వటం చక చకా జరిగిపోయాయి. కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో అధికారులు పాల్గొనడం పై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాల్సిందేనని చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తూ సీఈవో ఉత్తర్వులు పంపింది. దీనిపై చీఫ్ సెక్రటరీ చర్యల్లో భాగంగా సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులకు నోటీసులు పంపించారు. ముఖ్యంగా సీఆర్‌డీఏ, జలవనరుల శాఖ అధికారుల నుంచి వివరణ కోరుతూ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఓవైపు ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, ముఖ్యమంత్రి చేపట్టే సమీక్షల్లో పాల్గొనడంపై సంజాయిషీ కోరారు.

ec 19042019

ముఖ్యంగా సీఆర్డీఏ, జల వనరుల శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం కోరినట్టు తెలుస్తోంది. అటు, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సీఎం సమీక్షలపై వైసీపీ నేతల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ ను ఆదేశించినట్టు సమాచారం. ఆయ‌న తాగునీటి ఎద్ద‌డి..పోల‌వ‌రం పై ప్ర‌జా వేదిక‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ రెండు స‌మీక్ష‌లకు సంబంధింత అధికారులు హాజ‌ర‌య్యారు. పోల‌వ‌రం స‌మీక్ష‌కు మంత్రి దేవినేని ఉమాతో పాటుగా జల‌వ‌న‌రుల శాఖ కార్య‌ద‌ర్శి శ‌శి భూష‌న్ కుమార్ ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక‌, గురువారం స‌చివాల‌యం వ‌చ్చిన ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తి నిర్మాణం పై సీఆర్‌డిఏ అధికారుల‌తో స‌మీక్షించారు.

ec 19042019

ఆ స‌మీక్ష‌లో మంత్రి నారాయ‌ణ‌తో పాటుగా మున్సిప‌ల్‌, సీఆర్‌డిఏ అధికారులు పాల్గొన్నారు. అప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం కోడ్ ఉల్లంఘ‌న పైన స్పందించ‌టంతో ఆ తరువాత ముఖ్య‌మంత్రి ముందుగా నిర్ణ‌యించుకున్న శాంతి భ‌ద్ర‌త‌ల స‌మీక్ష‌ను ర‌ద్దు చేసుకున్నారు. కేవ‌లం హోం శాఖ కార్య‌ద‌ర్శి అనురాధ సీయంకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన నోటీసుల పై ప్ర‌భుత్వ ప్ర‌ధాక కార్య‌ద‌ర్శి సైతం అధికారుల‌కు మ‌ద్ద‌తుగా కాకుండా..వారి నుండి వివ‌ర‌ణ కోర‌టం పైనా అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. అయితే ప్రభుత్వ వాదన మాత్రం మరో రకంగా ఉంది. చంద్రబాబు సియంగా గడువు జూన్ 8 దాక ఉందని, ఇప్పటికీ చంద్రబాబు ఫుల్ టైం సియం అని, ఆపద్ధర్మ సియం కాదని అంటున్నారు. 43 రోజులు ప్రజలను గాలికి వదిలేయ్యలా ? వేసవిలో నీటి ఎద్దడి ఎవరు పట్టించుకుంటారు ? వర్షాలు పడక ముందే, వేసవిలో పరుగులు పెట్టాల్సిన పోలవరం, అమరావతి గురించి ఎవరు పట్టించుకుంటారు అని ప్రభుత్వ వాదన... పాలసీ డెసిషన్స్ ఏమి తీసుకోకుండా, కేవలం జరుగుతున్న పనులు పై సమీక్షలు చేస్తున్న, ఈసీ ఎందుకు అభ్యంతరం తెలుపుతుందో అర్ధం కావటం లేదని అంటున్నారు.

వైసీపీ అధినేత జగన్.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్‌‌రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఓ గ్రామానికి వెళ్లిన జేసీ స్థానికులతో అరుగుపై కూర్చొని ముచ్చటించారు. ఈ సందర్భంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జేసీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. జగన్‌ తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు జేసీ. లండన్‌లో చదువు కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంపిస్తే.. జగన్ తిరిగొచ్చేశారని చెప్పుకొచ్చారు. తిరిగొచ్చాక పంచాయితీలు ఎక్కువకావడంతో.. జగన్ గురించి వైఎస్ తన దగ్గర చెప్పి బాధపడేవారన్నారు.

jc 19042019

అందుకే ఆయన్ను బెంగళూరు పంపించేశారన్నారు. జగన్‌కు అన్నీ తాత బుద్దులేనన్నారు. తనను రూ. 35 కోట్లు ఇవ్వమని అడిగారని.. జగన్‌కు తనా, మనా భేదం లేదన్నారు. చంద్రబాబుపై వ్యాఖ్యల విషయానికొస్తే.. చంద్రబాబులో కమ్మదనం ఉందని.. వారిపై కొంత ప్రేమ ఉన్నా.. అందరినీ సమానంగా చూసే వ్యక్తే.. కాస్తంత మంచితనం కూడా ఉందన్నారు. ఆ వైఖరి సరైనదే.. అలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆయన నీళ్లు తేకుంటే.. తాను ఎప్పుడో పార్టీకి గుడ్ బై చెప్పేసేవాడ్ని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకుమేలు జరిగిందని.. ప్రతి ఎకరాకు నీరందించేందుకు చంద్రబాబు పడిన తపనను చూశానన్నారు.

jc 19042019

"మీరెన్నైనా చెప్పండి... కమ్మోడు... కమ్మ నా... కొడుకు ఇవన్నీ ఉన్నాయి. నీళ్ల విషయంలో ఆయనకు కమ్మ లేదు కాపు లేదు. కష్టపడి పని చేస్తాడు. వాడు గనుక నీళ్లు తేకుంటే నేను ఎన్నడో గుడ్ బై చెప్పేసేవాడిని. పోయిన ఎలక్షన్స్ లో ఒక్క పైసా ఇవ్వలా. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఆ నా... ఒక్కపైసా ఇవ్వలా. నేనే... చెబితే ఎవరూ నమ్మరు. నేనే ఖర్చు పెట్టా. ఇంతకుముందు పెట్టా. ఇప్పుడూ పెట్టా" అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇటీవల తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన ఆయన, చంద్రబాబులో కమ్మ కులపు వారిపై కొంత ప్రేమ ఉన్నా, అందరినీ సమానంగా చూసే వ్యక్తేనని, కాస్తంత మంచితనం కూడా ఉందని అన్నారు. చంద్రబాబు వైఖరి సరైనదేనని, అలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు. https://youtu.be/K3ZTC02_wxw

కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈనెల 9న చాపర్‌లో వచ్చారు. సభలో మాట్లాడి వెళ్లిపోయారు. అంతకుముందు అదే చాపర్‌ నుంచి ఓ నల్లటి ట్రంకు పెట్టెను భద్రతా అధికారులు బయటకు తీసి ప్రైవేటు కారులో రహస్యంగా తరలించారు. ఇది జరిగి ఐదారు రోజులైంది. అయితే ఇప్పుడా వీడియోను కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. పెట్టెలో ఏముందో దర్యాప్తు చేయాలంటూ ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్‌, జేడీఎస్‌ డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారంపై మోదీ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ సవాలు విసిరారు. పెట్టెలో డబ్బు లేనట్లైతే దర్యాప్తునకు సిద్ధంగా ఉండాలన్నారు.

blackbox 19042019

ప్రధాని, మంత్రులు ఎన్నికల ప్రచారానికి వెళ్లే వాహనాలను ఈసీ పరిశీలించాలని కోరారు. అటు కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా ట్రంకు పెట్టెలో ఏముందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ట్రంకు పెట్టెను తరలించిన ఇన్నోవా ఎవరిది? దీనిపై ఎన్నికల కమిషన్‌కు ప్రధాని వివరణ ఇవ్వాలన్నారు. అయితే దీని పై ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. నల్లటి ట్రంకు పెట్టె కేవలం ప్రధాని భద్రతాపరమైన వస్తువులకు సంబంధించినదిగా గుర్తించామని చిత్రదుర్గ జిల్లా అధికారి వినోద్‌ ప్రియ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు దీనిపై తాము విచారణ చేపట్టామన్నారు.

blackbox 19042019

ప్రధాని మోదీ ఈనెల 9న కర్ణాటకలోని చిత్రదుర్గ పర్యటన సందర్భంగా ఓ నల్లటి పెట్టె తరలింపుపై వివాదం చెలరేగిన విషయం విదితమే. ప్రధాని వచ్చిన హెలికాప్టర్‌ నుంచి ఆ పెట్టెను ఇన్నోవా కారులో చేరవేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. కాంగ్రెస్‌ పార్టీ దానిలో ఏముందో వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి వినోద్‌ ప్రియ వివరణనిస్తూ ‘ప్రధాని దిగిన ప్రాంతంలోని అన్ని వాహనాలను పరిశీలించాం. హెలికాప్టర్‌ను తనిఖీ చేసేందుకు ఎస్పీజీ అనుమతి ఇవ్వలేదు. పెట్టెను తరలించిన ఇన్నోవా కారు, దాని డ్రైవర్‌ను విచారించాం. ఆ డ్రైవర్‌ చెప్పిన ప్రకారం ఈ పెట్టె భద్రతాపరమైన వస్తువులకు సంబంధించింది...’ అని ఆమె వివరించారు.

ఎలక్షన్ కమిషన్ నిర్వాకంతో, ఎంతో మంది ఓట్లు పోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణాలో దాదపుగా 25 లక్షల ఓట్లు లేగిసాయి. ఆంధ్రపదేశ్ ల కూడా 8 లక్షల ఓట్లు లేపెయటానికి చూస్తే, చంద్రబాబు అడ్డుకోవటంతో, ఆ ప్లాన్ అడ్డం తిరిగింది. అయితే, ఇప్పుడు ఏకంగా, మాజీ క్రికెటర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈసారి తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. నిన్న కర్ణాటకలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ద్రవిడ్, ఆయన సతీమణి విజేత ఓటు వేయడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే వీరిద్దరి పేర్లు ఓటరు లిస్టులో లేవు. రాహుల్ ద్రవిడ్ కర్ణాటక ఎన్నికల సంఘానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు.

dravid 19042019 1

ప్రస్తుతం కర్ణాటకలో ‘మీ ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి’ అనే నినాదంతో ద్రవిడ్ ఫొటోతో కూడిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఓటర్లలో చైతన్యం నింపడానికి ముందుకొచ్చిన ద్రవిడ్‌కే ఓటు హక్కు లేకపోవడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనకున్న కారణం గురించి సదరు ఎన్నికల అధికారి వెల్లడించారు. కిందటేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ద్రవిడ్‌ను ఈసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అప్పట్లో ద్రవిడ్ కుటుంబం సెంట్రల్ బెంగళూరులోని ఇందిరానగర్‌లో నివాసం ఉండేది. తన తండ్రి మరణానంతరం ద్రవిడ్ ఇందిరానగర్ నుంచి బెంగళూరు నార్త్‌లోని అశ్వంత్‌నగర్‌కు మకాం మార్చారు.

dravid 19042019 1

దీంతో ఇందిరానగర్‌ ఓటరు జాబితా నుంచి ద్రవిడ్, ఆయన భార్య పేర్లను తొలగించారు. అయితే, అశ్వంత్‌నగర్‌కు వెళ్లిన తరవాత ద్రవిడ్ ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 16 వరకు జరిగిన ఓటరు నమోదు కార్యక్రమంలో ద్రవిడ్ ఫాం 6ను అధికారులకు సమర్పించలేదు. దీంతో ద్రవిడ్, ఆయన భార్య విజేత పేర్లను ఓటరు జాబితాలో చేర్చలేదు. అయితే ప్రస్తుతం ద్రవిడ్ బెంగళూరులో లేరని, స్పెయిన్‌లో ఉన్నారని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఏదేమైనా ఏకంగా బ్రాండ్ అంబాసిడర్‌ కే ఓటు లేకుండా, అతని చేతే ప్రచారం చేపిస్తున్న ఎలక్షన్ కమిషన్ వైఖరి పై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read