పసుపు-కుంకుమ నిధులను ఉపయోగించుకుని 20ఏళ్ల నుంచి ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించుకున్నారు విజయనగరం జిల్లా పాచిపెంట మండలం చాపరాయి వలస గిరిజన గూడేనికి చెందిన 13 మంది మహిళలు. పొలాల్లో కూలీ పనులు చేసుకునే వీరు రెండేళ్ల కిందట పొదుపు సంఘంగా ఏర్పడ్డారు. తాగునీటికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న బోరు నుంచి నీటిని మోసుకు రావాల్సిన దుస్థితికి చరమగీతం పాడాలనుకున్నారు. అధికారులకు ఈ సమస్యపై చెప్పినా పట్టించుకోకపోవడంతో వారే ముందుకు వచ్చారు. రక్షిత మంచినీటి పథకానికి రూ.లక్ష అవసరమని గుర్తించారు. ఇంట్లో భర్తల్ని ఒప్పించి రూ.34వేల విరాళాలు సేకరించారు.

dwacra 18042019

అదే సమయంలో పసుపు-కుంకుమ కింద ఒక్కో సభ్యురాలికి 10వేలు అందడంతో ఒక్కొక్కరూ రూ.6వేల చొప్పున అందించాలని తీర్మానించుకున్నారు. రూ.78వేల వరకూ పోగు చేసి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. బోరుకు మోటారు, పైపు లైన్‌ వేసి, గ్రామంలో 2వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు ఏర్పాటు చేసుకున్నారు. నీటి సమస్య తీరడంతో వీరి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో ఊరిలో నెలకు ఓ రోజు మాత్రమే నీరు వచ్చేదని తెలిపారు. తాగునీటి కోసం తాము కిలోమీటర్ దూరంలో ఉన్న బోరు వద్దకు వెళ్లాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. ఎండాకాలంలో అయితే నీటికి తీవ్రమైన కటకట ఉండేదన్నారు. అయితే తాజాగా ట్యాంకు ఏర్పాటుతో ఊరిలోనే మంచినీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా, చాపరాయవలస మహిళలు తీసుకున్న చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం, ప్రతి ఒక్కరు అసహ్యించుకునేలా, ద్వేషించుకునేలా చేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుకు ఘోర పరాభవం ఎదురైంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుంగా.. ఆయనపై కాన్పూర్‌కు చెందిన డాక్టర్ శక్తి భార్గవ్ చెప్పు విసిరారు. అయితే జీవీఎల్‌కు అది దూరంగా పడింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలుకాలేదు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పార్టీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని.. పోలీసులకు అప్పగించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే బీజేపీ ఆఫీసులోకి భార్గవ ఎలా ప్రవేశించాడనే విషయంపై ఆరాతీస్తున్నారు.

gvl 18042019

పార్టీ కార్యకర్త అయ్యి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. భార్గవను అద్వానీకి వీరాభిమానిగా చెబుతున్నారు. ఆయన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇదే తెలుస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భార్గవ.. మోదీ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ముందున్నాడు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ లాంటి సీనియర్ నేతలకు పార్టీలో వరుసగా ఎదురవుతున్న అవమానాలతోనే ఇలా దాడి చేసి ఉంటాడని చెబుతున్నారు. భోపాల్‌ అభ్యర్థిగా భాజపా తరఫున ప్రజ్ఞాసింగ్‌ను ప్రకటించిన అనంతరం కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు జీవీఎల్‌ గురువారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.

gvl 18042019

ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కాన్పూర్‌కు చెందిన వైద్యుడు శక్తి భార్గవ్‌ జీవీఎల్‌పైకి చెప్పు విసిరాడు. వెంటనే అక్కడే ఉన్న పార్టీ కార్యాలయ సిబ్బంది అతడిని పట్టుకుని బయటకు తరలించారు. ఇలాంటి దాడులకు తాను భయపడబోనని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వాళ్లే ఇలాంటి దాడులు చేస్తారని ఆరోపించారు. చెప్పువేసిన వ్యక్తిపై తీవ్ర స్థాయిలో కార్యాలయ సిబ్బంది దాడిచేశారు. చెప్పు విసరడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో జీవీఎల్‌ గురించి తెలిసిన వాళ్ళు అందరూ, దాడిని ఖండిస్తున్నా , జీవీఎల్ లాంటి ఇరిటేటింగ్ స్పీచ్ లు ఇచ్చే వారికి, ఇలా జరగటం ఆశ్చర్యం లేదు అంటున్నారు. చంద్రబాబు మంచి వాడు కాబట్టి, ఇక్కడ ఇలాంటి దాడులు జరగలేదని, లేదంటే జీవీఎల్ మాట్లాడే తలా తోక లేని వాదనలకి, ఇలాంటివి రోజుకు ఒకటి ఇక్కడ జరిగేవని గుర్తు చేస్తున్నారు.

నిర్దేశిత సమయం దాటిన తరువాత జరిగిన పోలింగ్‌ ఎవరికి మేలు చేస్తుందనే అంశంపై ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చర్చిస్తున్నాయి. పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత అనేకచోట్ల పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకూ కొనసాగింది. ఈ కేంద్రాల్లో ఓట్లు వేయడానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం విశేషం. ఆ ఓట్లు ఎవరికి పడ్డాయి? వాటి వల్ల ఎవరు లబ్ధి పొందుతారనే అంశంపై ఇప్పుడు విశ్లేషణలు జరుగుతున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 11న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలలో సాయంత్రం ఆరు గంటల సమయానికి 66.47 శాతం పోలింగ్‌ జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భాస్కర్‌ ప్రకటించారు. అప్పటికే క్యూలో నిల్చొన్నవారికి ఓటింగ్‌ అవకాశం కల్పిస్తామని, ఎంత రాత్రయినా పోలింగ్‌ కేంద్రాలు తెరిచే ఉంచుతామన్నారు.

polling 18042019

ఆ మాట మేరకు రాత్రి 12 గంటలు దాటిన తరువాత కూడా ఓటింగ్‌ అవకాశం ఇచ్చారు. అంతా పూర్తయిన తరువాత జిల్లాలో మొత్తం పోలింగ్‌ శాతం 71.82 శాతంగా అధికారులు లెక్క తేల్చారు. అంటే ఆరు గంటల తరువాత ఓట్లు వేసిన వారు 5.35 శాతం. వాస్తవానికి జిల్లాలో ఓటర్లు 35,78,458 మంది. వారిలో 71.82 శాతం మంది ఓట్లు వేశారని అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం...25,70,830 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ లెక్కల ప్రకారం గడువు మీరిన తరువాత ఓట్లు వేసినవారు 5.35 శాతం కాగా వారి సంఖ్య 1,37,495. వీరిలో అత్యధికులు మహిళలు. వీరు ఏ పార్టీకి మొగ్గుచూపారు?, ఎవరిపై అభిమానంతో ఓటు వేశారనే దానిపై అంచనాలు, విశ్లేషణలు నడుస్తున్నాయి.

polling 18042019

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద రెండు విడతలుగా బ్యాంకుల్లో రూ.20,000 జమ చేశారు. డ్వాక్రా మహిళలు ఆ సొమ్ము తీసుకొని పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు వినియోగించుకున్నారు. మరికొందరైతే బంగారం వస్తువులు కొనుగోలు చేశారు. వారు ఆ ఆనందంలో వుండగానే ఓటు వేసే సమయం వచ్చింది. కృతజ్ఞత ప్రకటించేందుకు ఇదే చక్కని సమయమని, తమ పార్టీకే వారంతా ఓట్లు వేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. సాయంత్రం ఆరు తరువాత రాత్రి జరిగిన ఓటింగ్‌లో అధిక శాతం తమకే పడిందని అంటున్నారు.

ఎన్నికల ముందు వరకూ వైసీపీ, జనసేన పార్టీల ఐటీ సెంటర్లలో ఉద్యోగుల హడావుడి మాములుగా లేదు. ఎన్నికలు ఇలా ముగిశాయో..లేదో.. ఆయా పార్టీల ఐటీ సెంటర్లు మూగబోయాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. ఖర్చుకు భయపడి చాలా పార్టీలు సిబ్బందికి ఉద్వాసన పలుకుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సోషల్‌ మీడియా ప్రచారం, అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల నిర్వహణ కోసం పలు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఐటీ సెంటర్లను అట్టహాసంగా ప్రారంభించాయి. స్థాయి, పనితనం ఆధారంగా సిబ్బందికి భారీగా వేతనాలు ఇచ్చాయి. అయితే, ఎన్నికలు ముగియడంతో ఐటీ సెంటర్లలోని సిబ్బందికి అన్ని పార్టీలు ఉద్వాసన పలుకుతున్నాయి. సగానికి సగం మందిని విధుల నుంచి తొలగించేస్తున్నాయి. దీంతో అర్ధంతరంగా పని కోల్పోయిన వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

janasena 18042019

జనసేన పార్టీ ఐటీ సెంటర్‌ కోసం రాయదుర్గంలోని ఖాజాగూడ సమీపంలో మూడంతుస్థుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. దాదాపు 500పైచిలుకు మందిని నియమించుకున్నారు. దీన్ని పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించగా.. పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలు ముగిసి వారం కూడా గడవకముందే ఐటీ సెంటర్‌లోని మెజార్టీ సిబ్బందికి ఉద్వాసన పలికారు. దాదాపు 350 మందిని విధుల్లోంచి తొలగించారు. మూడంతస్థుల భవనంలో ఒక అంతస్థు మాత్రమే ఉంచుకుని మిగతా రెండింటిని జనసేన ఖాళీ చేయడంతో టు-లెట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో 100-150 మంది ఉద్యోగులతోనే ఐటీ సెంటర్‌ నిర్వహించాలని భావిస్తున్నామని, మళ్లీ ఎన్నికల వరకూ ఈ సెంటర్‌తో అంతగా పని ఉండబోదని జనసేన నేత ఒకరు తెలిపారు.

janasena 18042019

ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఐటీ సెంటర్‌లో అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌ సమీపంలో ఉన్న ఐటీ సెంటర్‌ ద్వారా పార్టీ ప్రచారం కోసం పలు యూట్యూబ్‌ చానళ్లు సైతం నిర్వహించారు. సెంటర్‌కు సంబంధించిన పనులను వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. వైసీపీ సోషల్‌మీడియా ఖాతాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించారు. ఇందుకోసంటెలీకాలర్లు, కంటెంట్‌ రైటర్లు, ఫొటోషాప్‌ డిజైనర్లను అధిక సంఖ్యలో నియమించుకున్నారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ టెలీకాలర్లకు లక్ష్యాలు విధించారు. పార్టీ వార్తలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్లకు... ఎన్నికలు ముగియడంతోనే చేదు వార్త అందింది. ఇక, విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని నిర్వాహకులు చెప్పేశారు.

Advertisements

Latest Articles

Most Read