వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు, టీడీపీ నేతలు తప్ప ప్రజలెవరు ఆరోపించడం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్‌గా ట్విట్టర్‌లో స్పందించారు ఏపీ మంత్రి నారా లోకేశ్. తనకు అనుకూలంగా జరిగితే అంతా సవ్యంగా జరిగిందని... లేదంటే అక్రమం అని వాదించేవాళ్లు స్వార్థపరులు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మీరు లోటస్ రక్షణలో ఉన్నారంటూ... పరోక్షంగా జగన్ బీజేపీ రక్షణలో ఉన్నారంటూ సెటైర్లు వేశారు. కమలం రేకులు కప్పుకున్న జగన్ కళ్లకు ఏపీలో ఎన్నికల వేళ ప్రజలు పడిన ఇబ్బందులను చూపించడం కోసమే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

lokesh 19042019 1

అంతకు ముందు రోజు కూడా జగన్ టార్గెట్ గా లోకేష్ ట్వీట్ చేసారు. పోలింగ్ రోజున తాను పోలింగ్ బూత్ కు వెళ్లడాన్ని నిబంధనలకు విరుద్ధమంటూ జగన్ అన్నారని... పోలింగ్ సవ్యంగా జరుగుతోందో, లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందని ఆయన అన్నారు. ఇంత మాత్రం కనీస పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుండటం మన కర్మ అనుకోవాలని చెప్పారు. ఏపీలో జగన్ ఘన విజయం సాధించబోతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉద్దేశిస్తూ లోకేశ్ సెటైర్లు వేశారు. 'మొన్నెప్పుడో పేపర్లో చదివా. ఒక కోడి తలకాయ లేకుండా కొన్ని నెలల నుంచీ బతికేస్తుందంట. జగన్ లాంటి వ్యక్తి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నెట్టుకొచ్చాడు. ఈ విషయంతో పోలిస్తే కోడి సంగతి పెద్ద విచిత్రమా చెప్పండి' అని ఎద్దేవా చేశారు.

ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయానికి రావచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కొన్ని సమీక్షలు కూడా చేయవచ్చునన్నారు. ఏవి చేయాలి, చేయకూడదు అనే విషయాన్ని పార్టీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల పుస్తకంలో స్పష్టత ఉందని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలపై వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై సీఎస్‌ ద్వారా సంబంధిత శాఖాధికారులను నివేదిక కోరతాం. ఆయా శాఖల సమాధానాలు ఆధారంగా చర్యలు ఉంటాయి’’ అని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.550-600 కోట్ల వరకు ఉండొచ్చని ద్వివేది తెలిపారు. ఇందులో రాష్ట్రం సగం, కేంద్రం సగం భరిస్తాయన్నారు.

cbn 19042019

‘‘ఎన్నికల నిబంధనలకు సంబంధించిన పుస్తకాలను అన్ని రాజకీయ పార్టీలకు, అధికారులకు ఇచ్చాం. కోడ్‌ అమలులో ఉండగా అందరూ పాటించాల్సిందే. సీఎం చంద్రబాబు, మంత్రులు సచివాలయానికి రావొచ్చు. వారి వారి కార్యాలయాల్లో కూర్చోవచ్చు. అయితే రాజకీయ పరమైన పనులు చూడకూడదు’’ అని తెలిపారు. ఇక... పోలింగ్‌ ముందు రోజు, ఈ నెల 10వ తేదీన సీఎం తన కార్యాలయానికి వచ్చి మాట్లాడిన అంశాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిందని... ఆ నివేదిక పంపించామని చెప్పారు. సీఎం ప్రజా వేదికలో నిర్వహించిన సమావేశాలపైనా వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు.

cbn 19042019

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఒక పోలింగ్‌ బూత్‌లో ఉన్న ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యాయని ఫిర్యాదు వచ్చిందని ద్వివేదీ తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ను నివేదిక అడిగామని, టైపింగ్‌లో వచ్చిన తప్పుగా తేలిందని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో కలెక్టర్లు బాగా పని చేశారని కితాబిచ్చారు. కింది స్థాయి సిబ్బంది కూడా బాగా పని చేశారన్నారు. ఎన్నికల సిబ్బంది అందరికీ ఒకే విధంగా రెమ్యునరేషన్‌ ఇవ్వలేదని కొన్ని ఫిర్యాదులొచ్చాయని, దీనిపై కలెక్టర్లను వివరణ కోరామని తెలిపారు. ‘‘ఎన్నికల విధుల్లో 4 లక్షల మంది పాల్గొన్నారు. వారంతా తప్పు చేశారని కాదు. ఎక్కడో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. వాటిలో కొన్ని ఉద్దేశపూర్వకంగా, కొన్ని అవగాహనా లోపం వల్ల జరిగినట్లు నాకు ఫిర్యాదులు వచ్చాయి. తప్పు చేయనివాళ్లను అనవసరంగా ఇబ్బందిపెట్టం. గతంలో కన్నా రాష్ట్రంలో పోలింగ్‌ ఎక్కువ జరిగింది. ఏజెన్సీ ఏరియాల్లో కూడా బాగా జరిగింది. స్ట్రాంగ్‌ రూంల భద్రతపై సీఈసీ నివేదిక కోరింది.. పంపించాం. ’ అని తెలిపారు.

సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శంషాబాద్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో రూపకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. మాగంటి రూప తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మురళీమోహన్ గెలవగా.. ఆయన పోటీకి దూరంగా ఉండటంతో ఆ సీటును ఆయన కోడలికి టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. మురళీమోహన్ తల్లి వసుమతిదేవి (100) గురువారం ఉదయం విశాఖపట్నంలో అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. రూప ఆ కార్యక్రమానికి వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

roopa 19042019 1

మురళీమోహన్ తల్లి మాగంటి వసుమతిదేవి (100) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా.. ఇటీవల మురళీమోహన్ తన తల్లి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వసుమతీదేవి కుటుంబానికి చెందిన సుమారు 100 మందికి పైగా హాజరయ్యారు. కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీసంకరపురం గ్రామంలో వేడుకలు నిర్వహించగా.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఇటీవల మాతృ దినోత్సవ సందర్భంగా.. ‘తన శరీరం నుంచి ఇంకొకశరీరం పుట్టు కొస్తుందనే ఆలోచన అద్భుతంతంగా ఉంటుంది, ఆ అనుభవం ఒకతల్లికీ తప్పవేరెవరికి ఉండదు. అందుకే తల్లికి తన సంతానంపై అంత మమకారం’ అంటూ తన తల్లికి శుభాకాంక్షల్ని తెలియజేశారు మురళీమోహన్.

ఒడిశాలోని సంబల్ పూర్ లో పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న అధికారిని ఎన్నికల సంఘం(ఈసీ) సస్పెండ్ చేసింది. ఎస్పీజీ రక్షణలో ఉన్న నేతలపై తనిఖీలు చేపట్టవద్దనే మార్గదర్శకాల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది. మంగళవారం ప్రధాని మోదీ సంబల్ పూర్ సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన హెలికాప్టర్ లోని లగేజీని కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మొహమ్మద్ మొహసిన్ తనిఖీ చేసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను మొహసిన్ ఉల్లంఘించినట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్పీజీ రక్షణలో ఉన్న వ్యక్తులకు సోదాల నుంచి మినహాయింపు ఉంది.

modi 19042019

సదరు అధికారికి ఒక పరిశీలకుడిగా ఆ ఆదేశాల గురించే తెలిసే ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తెలిసిన వాస్తవాల ఆధారంగా పరిశీలకుడిని సస్పెన్షన్ లో ఉంచడమే కాకుండా, సదరు విధుల నుంచి తప్పించినట్లు ఈసీ అధికారి ఒకరు తెలిపారు. సంబల్ పూర్ ను సందర్శించి విచారణ నిర్వహించి, రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాలని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్రశర్మను ఆదేశించారు. ఇది ఇలా ఉంటే, 48 గంటల వ్యవధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లలో ఎన్నికల అధికారులు దాడులు జరిపారు. మంగళవారం నాడు కర్ణాటక సీఎం కుమారస్వామి చాపర్ లో తనిఖీలు చేసి, ఒట్టి చేతులతో వెళ్లిపోయిన ఫ్లయింగ్ స్క్వాడ్, బుధవారం నాడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో తనిఖీలు చేసి అందులో ఏమీ డబ్బులు లేవని తేల్చి వెళ్లిపోయారు.

modi 19042019

నిన్న నవీన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూర్కేలా ప్రాంతానికి వెళ్లగా, చాపర్ దిగగానే, దూసుకొచ్చిన అధికారులు, తనిఖీలకు తమకు సహకరించాలని కోరారు. అందుకు నవీన్ అంగీకరించగానే, హెలికాప్టర్ ను తనిఖీ చేసి అవాక్కయ్యారు. అందులో వారికి ఏమీ దొరకలేదు. చాపర్ ను మొత్తం తనిఖీ చేసేంతవరకూ నవీన్ పట్నాయక్, అక్కడే వేచి చూశారు. దీనిపై వివరణ ఇచ్చిన ఈసీ, ఎవరినైనా తనిఖీ చేసే అధికారం ఈసీ సిబ్బందికి ఉందని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఒడిశాలోని సంబల్ పూర్ ప్రాంతానికి ప్రచారానికి వెళ్లిన మోదీ చాపర్ ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆఫీసర్ మహ్మద్ మొహిసిన్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం.

Advertisements

Latest Articles

Most Read