సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు 69వ పుట్టిన రోజును టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దఎత్తున జరుపుతున్నారు. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు కీలక నేతలు బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఓ విజనరీగా, ధైర్యవంతుడైన వ్యక్తి అయిన మిమ్మల్ని తండ్రిగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. మీరు ప్రపంచానికి ఓ విజనరీగా మాత్రమే కాదు.. ఓ భర్తగా, తండ్రిగా, తాతగా మాపై అమితమైన ప్రేమ కురిపించారు. దేవాన్ష్ తో నాలుగేళ్ల పిల్లాడిలా పరిగెత్తారు. రాబోయే రోజుల్లో మీరు ఇంతే ఉత్సాహంతో, శక్తిమంతంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

cbn 20042019

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. .. 'చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశం గర్వించేలా, యావత్ భరతజాతి ఏపీవైపు తిరిగిచూసేలా చంద్రబాబు విజన్ త్వరలో సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నటుడు శివాజీ అన్నారు. ఇక ముందు కూడా చంద్రబాబు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని భావిస్తున్నానన్నారు. ‘ధ్యాంక్యూ సీఎం సార్. హ్యావ్ ఏ హ్యాపీ బర్త్ డే’ అని చెప్పారు. ఈ మేరకు శివాజీ ఫేస్ బుక్ లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

cbn 20042019

ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అలుపెరుగని శ్రామికుడు , అపర చాణక్యుడు ,అమరావతీ రాజధాని నిర్మాణ చతురుడు , గౌరవ్యులు శ్రీ నారా చంద్ర బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు ???శతమానం భవతు ??? @ncbn #Happy Birthday CBN’ అని ట్వీట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నేడు రోజంతా ఆయన బిజీగా గడపనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10: 30 గంటల వరకు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలు, అభిమానులతో గడిపారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహానికి హాజరయ్యారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్మించిన బ్లడ్‌బ్యాంకును ప్రారంభిస్తారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే పలువురు నేతలు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముగియడంతో ఫలితాలపై ఎవరికి తోచిన విధంగా అంచనాలు వేసుకుంటున్నారు. తామే మళ్లీ అధికారంలోకి వస్తామని టీడీపీ, ఈసారి తమదే సీఎం పీఠమని వైసీపీ ధీమాగా ఉన్నాయి. జనసేన సైతం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని అంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత, మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జనసేన 88 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

lakshmi 19042019 2

ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన విజయసాయి.. సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో పోటీచేసిన జనసేన 88 చోట్ల గెలుస్తుందని వీవీ లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో.. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్టర్‌లో స్పందించారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై లక్ష్మీనారాయణ ఘాటుగా బదులు ఇచ్చారు. ఈ రోజు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

lakshmi 19042019 3

"గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి. మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి." అంటూ విజయసాయి రెడ్డికి, కౌంటర్ ఇచ్చారు లక్ష్మీనారాయణ.

ఎన్నికలు ముగిసిన తరువాత ఓటింగ్‌ సరళిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దృష్టి సారించారు. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా పోలైన ఓట్లపై ఒక అంచనాకు వచ్చారు. సెగ్మెంట్‌లలో బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలతో కూడిన 17(సీ) ద్వారా సంబంధిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి తీసుకున్నారు. ప్రతి సెగ్మెంట్‌లో బూత్‌ల వారీగా మొత్తం ఓట్లు? పోలైన ఓట్లు? పురుషులు, మహిళలు? ఎవరి శాతమెంత? అనేది ఈ 17(సీ)లో ఉంటుంది. దీని ప్రకారం బూత్‌ల వారీగా టీడీపీకి వచ్చే ఓట్లెన్ని? ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయి? అనేది అంచనా వేశారు. గత ఎన్నికలలో వచ్చిన ఓట్లతో ప్రస్తుత ఎన్నికలలో వచ్చే ఓట్లను పోల్చి లెక్కలు వేశారు. పార్టీకి బలమైన బూత్‌లలో పోల్‌ శాతం పెరిగితే అనుకూలంగా ఉంటుందని అంచనా మేరకు లెక్కలు కట్టారు.

agent 19042019

పార్టీకి పట్టున్న గ్రామాల్లో ఎక్కువగా పోలైన బూత్‌ల వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ప్రత్యర్థికి అనుకూలంగా ఉండే బూత్‌లలో పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రెండింటికీ మధ్య తేడా ఎంత? దాని ప్రకారం గెలుపుపై అంచనాలు వేశారు. అయితే ఈ నెల 11న పోలింగ్‌ సరళి ప్రధానంగా మధ్యాహ్నం తరువాత మహిళలు ఓటింగ్‌కు వచ్చారు. ఎంత రాత్రయినా సరే వుండి, ఓటేసి వచ్చారు. దీనిపై తెలుగుదేశం అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తరువాత ప్రభుత్వం అమలు చేసిన పసుపు కుంకుమ పథకం, పింఛను పెంపు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని గట్టిగా నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే మహిళలు ఓటేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన విషయం గుర్తు చేస్తున్నారు. అదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని బూత్‌లవారీగా పోలైన ఓట్లను విశ్లేషించారు.

agent 19042019

ఇదే సమయంలో అధిష్ఠానం కూడా ఓటింగ్‌ సరళిపై అభ్యర్థుల నుంచి నివేదికలు కోరింది. ఎన్నికలతో సరిపెట్టకుండా పోలైన ఓట్ల శాతం మేరకు పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. అందుకే నియోజకవర్గంలో బూత్‌లవారీగా ఓట్ల వివరాలతో పంపాలని సూచించింది. ప్రతి బూత్‌ ఏజెంట్‌ సంతకం తీసుకుని నివేదిక పంపాలని ఆదేశించింది. అంటే ఆయా బూత్‌లలో టీడీపీకి వచ్చే ఓట్లు ఎన్ని ఉంటాయన్నదానిపై ఏజెంట్లకు అంచనా ఉంటుంది. దాని ప్రకారం బూత్‌లలో ఓట్లు పెరిగాయా? లేదా తగ్గాయా? ఒకవేళ తగ్గితే కారణాలేంటి? అనేది ఏజెంట్లకు తెలుస్తుంది. అందుకు ఏజెంట్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని పంపాలని అభ్యర్థులకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చాయి.

 

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పర్యటించారు. కర్ణాటకలోని రాయచూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ కర్నూలు విమానాశ్రయానికి సీఎంచేరుకున్నారు. రాక్ గార్డెన్స్‌లో జిల్లా ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై నేతలను సీఎం అడిగి తెలుసుకున్నారు. సుమారు 20 నిముషాలపాటు చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నేతలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. బయటనుంచి వస్తున్న పుకార్లను నమ్మవద్దని అన్నారు. భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 120 స్థానాలకు పైగా గెలుస్తామని, టీడీపీనే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.

kurnool 19042019

ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని, పుకార్లు నమ్మవద్దు అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని నేతలకు సూచించారు. కాగా కర్నూలులో సమావేశం అనంతరం సీఎం కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు. అక్కడ రాయచూర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అభ్యర్థి బీవీ నాయక్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. కర్నూల్ జిల్లాలో పార్టీ పరిస్థితి చాలా బాగుందని.. మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని నాయకులు చంద్రబాబుకు చెప్పినట్లు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.

kurnool 19042019

అంతకు ముందు, కడప జిల్లా ఒంటమిట్టలో గురువారం నిర్వహించిన కోదండరామ స్వామి కల్యాణోత్సవానికి సీఎం హాజరయ్యారు. ఈ ఉదయం కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటున్నామని పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కంటే మెరుగైన స్థానాలు గెలుస్తామని జిల్లా నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగానూ తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని.. మరోసారి అధికారం చేపట్టబోతున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Advertisements

Latest Articles

Most Read