ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలరోజులపైనే సమయం ఉందని, అలాగని అప్పటివరకు పాలన పక్కన పెట్టి ఖాళీగా కూర్చోనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం-రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించడం తనకు ముఖ్యమని చెప్పారు. బుధవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి 90వ వర్చువల్ రివ్యూ నిర్వహించారు. జులై కల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి నీరిచ్చేలా 60 రోజుల ప్రణాళికతో పనులు వేగవంతం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. మార్చి, ఏప్రిల్‌లో 45 రోజుల పాటు పనులు మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో జరిగిన ఆలస్యాన్ని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచించారు. 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి ఉందని, అయితే జూన్ కల్లా 35 మీటర్ల ఎత్తున నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ ముందుగా నిర్మించి స్పిల్ చానల్ పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చూడాలన్నారు. పోలవరం నిర్వాసితులకు చేపట్టిన పునరావసం పనులు కూడా సమాంతరంగా పూర్తికావాలన్నారు.

జూన్ 20 నుంచి గోదావరి ప్రవాహం సగటున 5 లక్షల క్యూసెక్కులు ఉండొచ్చని అధికారులు వివరించగా, అంతకుమించి వరద పోటెత్తినా పనులకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 69% పూర్తికాగా, తవ్వకం పనులు 84.60%, కాంక్రీట్ పనులు 72.40% పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90.87%, ఎడమ ప్రధాన కాలువ 70.38%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 66.22%, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 40.71%, దిగువ కాఫర్ డ్యామ్ పనులు 25.04% పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు, 1169.56 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులకు గాను 989.16 క్యూబిక్ మీటర్ల వరకు పనులు పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతవారం స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 3.43 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తికాగా, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 31 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం ఇప్పటికి రూ.4,508.35 కోట్లు బకాయి పడిందని అధికారులు చెప్పారు.

గేటెడ్ కమ్యూనిటీల్లా నిర్వాసితుల కాలనీలు... తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని ఇందుకూరులో 660 ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న కాలనీని గేటెడ్ కమ్యూనిటీ తరహాలో తీర్చిదిద్దుతున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా లక్ష రూపాయలు ఇవ్వడంతో కమ్యూనిటీ హాలు, పార్కు, ఆటస్థలం, అంగన్ వాడీ భవనం, న్యూట్రీ గార్డెన్, షాపింగ్ కాంప్లెక్స్, వెటర్నరీ హాస్పటల్ తదితర 24 మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఇళ్లు విశాలంగా నిర్మిస్తున్నామని, 15 రోజులకోసారి పనులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటి చుట్టూ గార్డెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గిరిజనులు కోళ్లు, గేదెలు, ఆవులు వంటివి పెంచుకునేందుకు సామూహిక వసతులు కల్పించడంతో పాటు, విద్యుత్ సదుపాయంతో దోబీ ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవీ రాజమౌళి, పోలవరం ఆర్&ఆర్ కమిషనర్ రేఖారాణి, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్ బ్యాచ్ నుంచి దాడి కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి ఎంత మంది దాడి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు తయారయ్యారు. ఇందులో బీజేపీలో చేరిన ఐవైఆర్, జగన్ ముసుగు వేసుకుని తిరుగుతున్న అజయ్ కల్లం కూడా ఉన్నారు. చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ పై పోరాడుతూ, కేంద్రం ఆడుతున్న ఆటలను బహిరంగ పరుస్తూ, వీళ్ళు ఆడుతున్న నాటకాలు మీడియా ముందు చెప్పే క్రమంలో, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని మార్చిన విధానం గురించి చెప్పుకొచ్చారు., ఆ సమయంలో, ప్రస్తుతం వేసిన చీఫ్ జస్టిస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఆయన జగన కేసుల్లో A10 అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం ప్రస్తావిస్తూ, ఆయన పై కొన్ని వ్యాఖ్యలు చేసారు.

gov 17042019

ఎన్నికల రోజున, హింస చెలరేగి, పోలీసులు అప్రమత్తం అయిన వేళ, ఎల్వీ సుబ్రహ్మణ్యం వెళ్లి డీజీపీ దగ్గర రెండు గంటల కూర్చుని, వాళ్ళని పని చేసుకోకుండా చేసిన విధానాన్ని ప్రశ్నిస్తూ, కోవర్ట్ అనే పదం చంద్రబాబు వాడారు. ఈ విషయం పై, ఐవైఆర్ కృష్ణా రావు, అజయ్ కల్లం, మరి కొంత మంది పాపం బాగా హార్ట్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై చర్య తీసుకోవాలని గవర్నర్‌కు రాజ్‌భవన్‌లో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఏపీ సీఎం వ్యాఖ్యలు ఉద్యోగుల నైతికతను దెబ్బతీశాయన్నారు. ఎన్నికల కమిషన్‌ ముగ్గురు అధికారుల పేర్లలో నుంచి సమర్థుడైన అధికారిగా భావించడం వల్లే సుబ్రహ్మణ్యంను ముఖ్య కార్యదర్శిగా నియమించిందని పేర్కొన్నారు.

gov 17042019

ఇదివరకు ఆయనపై రాజకీయ కుట్రలో భాగంగానే కేసులు బనాయించారని గోపాల్‌రావు తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ముందు బైఠాయించిన సందర్భంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని విచారం వ్యక్తం చేశారు. ఇవే విషయాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఉదంతంపై చంద్రబాబుతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్‌ చేశారు. అయితే ఇదంతా బాగానే ఉంది కాని, ఇదే స్పందన విజయసాయి రెడ్డి, జగన్, ఐఏఎస్, ఐపీఎస్ ల పై ఆరోపణలు చేసినప్పుడు, సాక్షిలో విషయం చిమ్మినప్పుడు ఏమైంది ? ఐపీఎస్ ఆఫీసర్లకు కులాన్ని ఆపాదించి మరీ చేసిన వ్యాఖ్యలు, వీళ్ళకు కనిపించలేదా ? అంటే ఇదంతా ఎదో రాజకీయ పార్టీ చెయ్యమంటే చేస్తున్నారా అనే అనుమనాలు కలుగుతున్నాయి.

దేశంలోని ప్రతిపక్షాల పై మోడీ, అమిత్ షా కక్ష సాధింపు కొనసాగుతూనే ఉంది. మొన్నటి దాక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉండటంతో, ఇక్కడ వరుస పెట్టి ఐటి దాడులు చేపించి, ఇక్కడ ఎన్నికలు అయిపోగానే, వారిని బెంగుళూరు, చెన్నై పంపించి, అక్కడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి కనిమొళి నివాసం, కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. తూత్తుకుడిలోని కురింజి నగర్‌లో ఆమె నివసిస్తున్న ఇల్లు, కార్యాలయంలో మంగళవారం రాత్రి ఐటీ విభాగానికి చెందిన పదిమంది సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు నగదు పంచిపెడుతున్నట్టు సమాచారం ఉందని, అందుకే ఈ సోదాలు జరిగాయని అధికారులు తెలిపారు.

kanimouli 17042019

తలుపులు మూసివేసి తనిఖీలు కొనసాగించారు. డీఎంకే కోశాధికారి దురైమురుగన్‌, ఆయన కుమారుడు వేలూరు అభ్యర్థి కదిర్‌ ఆనంద్‌, డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌, ఎమ్మెల్యే హాస్టల్‌లోని మంత్రులు ఆర్బీ ఉదయకుమార్‌, ఉడుమలై రాధాకృష్ణన్‌ల గదుల్లో ఐటీ సోదాలు చోటుచేసుకున్నాయి. డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు జరుగుతున్నాయని, నెల రోజులుగా మూసి ఉన్న రాష్ట్రమంత్రుల గదుల్లో కంటితుడుపు కోసమే సోదాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను అస్తవ్యస్తం చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఆరోపించారు. డీఎంకేకు మచ్చ తీసుకొచ్చేందుకే ఇలాంటి సోదాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.

kanimouli 17042019

ఇది ఇలా ఉంటే, డీఎంకే నేత కనిమొళి ఇంట్లో జరిగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాల్లో ఏమీ లభించలేదు. తూత్తుక్కుడి లోని ఆమె ఇంట్లో కోట్ల కొద్దీ డబ్బును దాచారని, ఎన్నికల్లో వాడేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులకు సమాచారం అందడంతో అధికారులు దాడి చేశారు. అయితే, సోదాల అనంతరం అధికారులు ఉత్త చేతులతో వెళుతూ, తమకు తప్పుడు సమాచారం అందిందని వ్యాఖ్యానించడం గమనార్హం. దాడి తరువాత కనిమొళిపై ఎటువంటి కేసునూ నమోదు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో ఐటి దాడులు చేసి, కనీసం ఒక రూపాయి కూడా పట్టుకోకుండా, కేసు పెట్టకుండా, వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇదంతా, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి, మోడీ, షా లకు అనుకూలంగా ఉండే, జగన్, కేసీఆర్, అన్నాడీయంకేలకు లబ్ది చేకుర్చటానికి వేసే ఎత్తులు అని ప్రజలు గమనిస్తున్నారు.

దేశంలో ఈవీఎంల పని తీరు పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పనితీరు, టాంపరింగ్‌పై వివాదం నెలకొంది. అనుమానాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ముందుండి ఈ పోరాటం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పెనమలూరు ఈవీఎంల తరలింపు విషయంలో, సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పోలింగ్‌ ముగిసిన 12 గంటల తర్వాతా ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంలకు చేరలేదు. ఈవీఎంలను రిటర్నింగ్‌ అధికారి ఆలస్యంగా తీసుకెళ్లడాన్ని ఎన్నికల పరిశీలకులు గుర్తించి స్వీకరించేందుకు తొలుత నిరాకరించి, తర్వాత తీసుకుని సంతకం చేసినట్లు తెలిసింది. పార్లమెంటు పరిశీలకుడు సంతకం చేయలేదని తెలిసింది. ఈవీఎంల రవాణాకు జాప్యం జరగడంపై ఆ రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన సమాధానం ఉన్నతాధికారులకు దిమ్మ తిరిగింది.

penamaluru 17042019

3 రోజులుగా నిద్ర లేదని, తాను నిద్రపోయి రావడంవల్ల జాప్యం అయిందని ఆ ఆర్వో వివరణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఈవీఎంలు పెద్దగా మొరాయించలేదు. కేవలం 2 కంట్రోల్‌ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌నే మార్చాల్సి వచ్చింది. కానూరు పంచాయతీలో ఒక బూత్‌, యనమలకుదురులో రెండు బూత్‌లు, వణుకూరులో ఒక బూత్‌లో అర్థరాత్రి 12 గంటలవరకు పోలింగ్‌ జరిగింది. పెనమలూరు నియోజకవర్గ పంపిణీ కేంద్రం సమీపంలోని దనేకుల ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్‌ రూంలు మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల్లో ఏర్పాటు చేశారు.

penamaluru 17042019

11 వతేదీ అర్థరాత్రి లోపే పోలింగ్‌ ముగిస్తే.. 12 వతేదీ రాత్రి 9 గంటలకు ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూంకు వెళ్లాయి. ఆలస్యంగా రావడంవల్ల తాము స్వీకరించబోమని ఎన్నికల పరిశీలకులు గణేష్‌కుమార్‌, బినోద్‌ జాన్‌ నిరాకరించారు. ఆ తర్వాత తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే, మచిలీపట్నం స్ట్రాంగ్‌రూంల నుంచి ఈవీఎంల తరలింపు వ్యవహారంలో నూజివీడు సబ్‌కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌కు ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఏఆర్‌వోగా ఉన్న నూజివీడు తహసీల్దార్‌ పి.తేజేశ్వరరావును సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. రిజర్వు ఈవీఎంలను మచిలీపట్నం కేంద్రానికి తీసుకెళ్లి తిరిగి వాటిని వాహనంలో తరలించిన అంశం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ సీరియస్‌ అయింది.

Advertisements

Latest Articles

Most Read