పోలింగ్ అక్రమాలను చూసి, పదిమందికి చెప్పిందనే కారణంగా వైసీపీ కార్యకర్తలు ఓ ఇంటిపై దాడిచేసి, నిండు గర్భణిని కొట్టిన ఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లెలో కలవరం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి పోలింగ్ ముగుస్తున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రహ రీ గోడ దూకి పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లడాన్ని ఇస్లావత్ నాగమణి చూసింది. చుట్టుపక్కల వారికి ఆ విషయం చెప్పింది. ఇది జరిగిన కొన్ని గంటలకే కొందరు వైసీపీ కార్యకర్తలు.. నాగమణి ఇంటిపై దాడి చేశారు. ‘మా గురించి అందరికీ చెబుతావా?’ అంటూ వీరంగం సృష్టించారు.
నిండు గర్భిణి అయిన ఆమె కోడలు త్రివేణిపై దౌర్జన్యం చేశారు. ఆమెను కిందపడేసి చేతులతో, కాళ్లతో తన్నారు. ఆమె చేతులెత్తి దణ్ణం పెట్టినా కనికరించలేదు. కోడలుకు రక్షణగా అడ్డునిలిచిన నాగమణినీ, త్రివేణి భర్త వరప్రసాద్‌నూ తీవ్రంగా కొట్టారు. నానా దుర్భాషలు అడుతూ, ఇల్లంతా ధ్వంసం చేశారు. వారిని తీవ్ర పదజాలంతో హెచ్చరించి, అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ దాడిలో సొమ్మసిల్లిపోయిన త్రివేణిని గ్రామస్థులు హుటాహుటిన నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని, కేసు నమోదు చేశారు. ఈ దాడిని ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్ తదితరులు తీవ్రంగా ఖండించారు.
ఇక మరో పక్క, నెల్లూరులో కూడా ఇదే జరిగింది. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర యాదవ్ కి బెదిరింపులు చేస్తున్నాడు, దీంతో ఆందోళన చెందిన రవిచంద్రయాదవ్ తన అనుచరుడు టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడుతో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వెళుతుండగా ఈ విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఎవరో హటాత్తుగా వాహనంలో వచ్చి తిరుమల నాయుడు పై దాడికి దిగార మెరుపు వేగంలో వచ్చిన వాళ్ళు తిరుమల రెడ్డి పై స్టీల్ రాడ్ లతో దారుణంగా దాడి చేశారు. అతని తల పై తీవ్రంగా బాదడంతో అతను స్పృహ కోల్పోయి తీవ్ర రక్తస్రావంతో అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు బాధితుదిని అంబులెన్స్ లో అక్కడినుండి అటు పక్కనే ఉన్న సింహపురి హస్పిటల్ కి తరలించారు. బాధితుడి తలపై తీవ్రంగా దాడి చేయడంతో ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్థుతం వైదులు తిరుమల రెడ్డికి ఎమర్జెన్సీ లో చికిత్స చేస్తున్నారు.