ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తరువాత, అధికారుల బదిలీల తరువాత, నిత్యమూ వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఈసీలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. పోటీ చేసిన వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైపోయిందని, దాన్ని ఎవరూ మార్చలేరు, కాని ఆయన పోరాటం జాతీయ స్థాయిలో జరిగే మిగతా ఎన్నికల పై, అందుకే ఢిల్లీ స్థాయిలో తన నిరసనగళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఎన్నికలు మాత్రమే ముగిసి, నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న వేళ, నిన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, ఈసీ అధికారులతో సుదీర్ఘ సమావేశం జరిపిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు ప్రెస్ మీట్ లో , "మీరు ఎందుకిలా విమర్శలు చేస్తున్నారు? ఓడిపోతారనే భయమా?" అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు, ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, వాటి పనితీరుపై ఒక్క మాట కూడా మాట్లాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ సంగతేంటని ఎదురు ప్రశ్నించారు. ఇంతవరకూ జగన్ అసలు స్పందించలేదని గుర్తు చేస్తూ, జగన్ వైఖరికి కారణమేంటని మండిపడ్డారు. ప్రజలు మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు ఓటు వేసారని, ఈ వైఫల్యం ఎవరు ప్రశ్నిస్తారని ? ఇలాగే వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాగే చేస్తారనే ఉద్దేశంతో, జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాని చెప్పారు. ప్రజల సమస్యల పై పోరాడాల్సిన బాధ్యత తన పై ఉందని అన్నారు. జగన్ లాగా ఇంట్లో కుర్చోలేనని అన్నారు.
ప్రజల తీర్పు పై సంపూర్ణ విశ్వాసం ఉందని, ఎన్నికల కమిషన్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసీఆర్ బస్సులు ఆపినా, జగన్ విధ్వంసం చేసినా, ప్రజలు మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు లైన్లలో నుంచుని ఓటు వేసారంటే, ప్రజా స్వామ్యం పై వారికి ఉన్న నమ్మకం అని చంద్రబాబు అన్నారు. అంత కసిగా ఓటింగ్ ఎందుకు జరిగిందో అర్ధం చేసుకుంటే, వీరి కుట్రలను ఎలా తిప్పి కొట్టారో అర్ధమవుతుందని అన్నారు. ఏపిలో నేను గెలవటం ఎలాగూ జరుగుతుందని, కాని అక్కడ జరిగిన లోపాలు, వివిధ దశల్లో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జరగకుండా ఉండటానికే తన పోరాటమని, మోడీ, అమిత్ షా కుట్రలు సాగనివ్వనని చంద్రబాబు అన్నారు. ఓడిపోతానని తెలిస్తే ఇంట్లో కుర్చుంటాను కాని, ఢిల్లీకి వచ్చి మోడీని ఎదిరిస్తానా అని ప్రశ్నించారు.